నా జీవిత చరిత్ర – తొలిపలుకులు

ఊరికే కూర్చుని  గోళ్ళు కొరుక్కుంటుంటే, ఒక అద్భుత మైన అవుడియా వచ్చేసింది. అదేమిటో నాకు వచ్చే అవుడియాలు అన్నీ గోళ్ళు కొరుక్కుంటుంటేనే వస్తాయి.  అందుకనే నాకు గోళ్ళు ఆట్టే పెరగవు. పక్కవాళ్ళ గోళ్ళు కూడా కొరుకుదామని ప్రయత్నించాను కానీ, వాళ్ళ ఇంట్లో చేసిన వంకాయ కూర నచ్చక వదిలేశాను.  నాకు వచ్చిన అవుడియా ఏమిటంటే నా జీవిత చరిత్ర నేనే వ్రాసేద్దామని.  లేడి లేవకుండానే పరుగులు పెట్టినట్టు, నా చేతిలోని మార్జాల శత్రువు  టేబులు మీద  12.00 AM/PM కి  వాకింగ్  మొదలు పెట్టేసింది. (చూసారా కొత్త ప్రయోగం, నా జీవిత చరిత్ర లో ఇల్లాంటి ప్రయోగాలు చాలా ఉంటాయని సగర్వం గాను, వినమ్రం గాను తెలియ చేసుకుంటున్నాను).  ఇల్లాంటి ఆలోచనులు అన్నీ నాకు బారా బజే వస్తాయని చెప్పకనే చెప్పేశాను. నాకు ఇద్దరు పంజాబీ మిత్రు లున్నారని కూడా మీకు అర్ధం అయిపోయిందని కూడా నాకు తెలిసిపోయింది.  కంప్యూటర్ తెర మీద చూసేటప్పటికి


శ్రీశ్రీశ్రీ  మహారాజ రాజశ్రీ  బ్రహ్మశ్రీ  వేదమూర్తులైన  

బులుసు సుబ్రహ్మణ్యం గారి ఆత్మ ఘోష . కధ
                                                                                                                          
అని కనిపించింది. యధావిధిగా నాకు మండుకొచ్చింది. ఓ వినాయక వాహనమా  ఘోష  కాదు కధ, కధ అని ఉండాలని చెప్పితిని. గోట్టాం గాడిది ఘోష కాదుట, కధ అని పెట్టాలిట అని గొణుక్కుంటూ సరిచేసింది.  గణేశాయ నమః  అయింది కాబట్టి ఎల్లా వ్రాయాలా అని ఆలోచించాను. ముందుగా తొలిపలుకులు ఉండాలి. ఇవి మనం వ్రాయడం కన్నా మన వాళ్ళ తో వ్రాయిస్తే బాగుంటుందనిపించింది. తొలిపలుకులు వ్రాసే అర్హత ఎవరికి ఉందా అని ఆలోచించాను.

మొదటగా నా బాసుల మీదకి దృష్టి సారించాను. మొదటి బాసుడు నరకానికి వెళ్ళి చాలా రోజులయింది. అవునండీ, తిట్టిన తిట్టు తిట్టకుండా, రోజుకొక కొత్త తిట్టుతో , ఐదు  ఏళ్ళు నన్ను తిట్టి ఆనందించిన వాడు మరెక్కడికి వెళతాడు.  అనగా  నరకమునకే పోవు నని భావం. రెండో బాసుడు ఎక్కడ ఉన్నాడో తెలియలేదు. మూడవ బాసుడి దగ్గరికే వెళదామని నిర్ణయించుకున్నాను. వీరు నాకు అత్యంత సన్నిహితులు. మిగతా బాసులు కనిపిస్తే తిట్టేవారు. ఈయన ఏమి తోచక పోతే టెలిఫోన్ చేసి మరీ  తిట్టేవాడు. అమెరికా, ఆస్ట్రేలియా చివరికి అంటార్టికా వెళ్ళినా నన్ను తిట్టందే ఆయనకి రోజు గడిచేది కాదు. నామీద శత సహస్ర తిట్ల దండకం రచియించిన ఖ్యాతి ఆయనకే దక్కింది.  అయిననూ నేనన్న ఆయనికి అత్యంత అభిమానం. మేము మందు మిత్రులం. నేను మందు mix  చేస్తే తాగి ధబెల్మని పడి పోయే వాడు మా క్లబ్బు ఎదుట కాలువలో.   ఆయన దగ్గిరికి వెళ్ళి “బాసోత్తమా ఇదీ విషయం. నా ఆత్మ కధకు మీరే తొలిపలుకులు వ్రాయాలి.” అని విన్నవించు కున్నాను.  చెప్పిన వెంటనే కింద పడిపోయాడు. దొర్లి దొర్లి నవ్వడం మొదలు పెట్టాడు. పడి నవ్వాడా లేక నవ్వుతూ పడ్డాడా అన్నది నాకు అర్ధం కాలేదు. దొర్లుతూ దొర్లుతూ  డ్రాయింగ్ రూము లోని తివాచీ ని ఇస్త్రీ చేసేస్తూ  సతీమణిని పిలిచాడు. ఓ ఓ షుమా స్సుమోయ్ ఇలా లా  హిహిహి   వీడు ఆత్మ కధ హహోయ్  వ్రాస్తాడుట అంటూ. సుమ గారు ఒకటిన్నర శరీరం కదుపుకుంటూ(అంటే ఈయన శరీరం లో అర్ధ భాగం ఆవిడదే కాబట్టి తీసేసుకుందని చెప్పుకుంటారు. ఈయన సన్నబడడం ఆవిడ లావెక్కడం  ఒకేమాటు జరగడం మొదలు పెట్టాయట. ఆవిడ వాల్యుము తో చూస్తే  ఈయనిది ఎప్పుడూ 3 వ భాగమే ఉంటుందట)   చేతితో చీర తుడుచుకుంటూ,   నోట్లో మింగుతున్నది బయటకు కనిపించకుండా  వచ్చేసి, విషయం తెలుసుకొని కిసుక్కున, కసుక్కున నవ్వి, నోట్లోది పూర్తిగా పొట్టలోకి పంపిన తరువాత, ఘొల్లుమని నవ్వింది. కొంచెం నవ్వోద్రేకం తగ్గిన తరువాత  ఆయన అన్నాడు “నువ్వేం ఘన కార్యాలు చేసావనీ ఆత్మ కధ అంటున్నావు. ఎల్లెళ్లు” అని కసిరాడు.

ప్రధమ ప్రయత్నం బెడిసి కొట్టినా నేను నిరుత్సాహ పడకుండా ద్వితీయ ప్రయత్నం మొదలు పెట్టాను. మిత్రుల మీదకు చూపు పాడేసాను. నలుగురికి మైల్ పంపాను. ఈ మైల్ లో  ఇక్కడ      అటువంటి మనుషులు లేరు అని సంతకం పెట్టి మరీ జవాబు ఇచ్చారు.  చివరి ప్రయత్నం గా మా ఆవిడ కేసి చూశాను. ఛీ ఛీ చా చ్చా మొదటగా అడిగితే వ్రాసేదాన్నేమో,  ఎవరూ దొరక్క,  నన్ను వ్రాయమంటే అవమానం నేను వ్రాయను, అనేసింది.

దుర్భరావమాన మయసభా దుర్యోధనా ధురీణుడ నై (అర్ధం అడిగితే మీ బ్లాగు మీదొట్టు, కొత్త ప్రయోగాలు నేర్చుకోండి )  నేనేమి సాయవలే,  ఆత్మకధా విరమణ యా, బ్లాగులో ప్రాయోపవాసమా అని  విచారించుచూ, శునక వైరి వైరి ని భుజమున గదవోలే ధరించి పచారులు చేయుచుండ, నా కంప్యూటర్  లోని గూగులు  టాకు నుండి ఒక Msg. పుసుక్కున పైకి లేచెను. రౌడీ రాజ్యం బ్లాగులో చూడుము అని మిత్రులు పంపిన Msg. వచ్చింది.   అచ్చటకు నరిగి  

 “బులుసు గారూ మీకిది తగునా” 
 
అన్న టపా చూసి అమందానంద  కందళిత హృదయారవిందుడనై  అడవుల సంకట స్థలుల  నాజి ముఖంబుల నగ్నికీలల   మధ్యన చిక్కుకొని  దిక్కు తోచక  విచారించుచున్న నన్ను కావగా వచ్చి నట్టనిపించి  హే ఆశ్రిత మందార, దీనబాంధవా , కరుణాలవాలా, దేవదేవ ధవళా చల మందిర, మహేశా పాపవినాశా అని యా  దేవదేవుని  స్థుతించి,  డిసైడ్ అయిపోయాను,  నా ఆత్మకధ కి తొలిపలుకులు  ఇవే,  ఇవే అని.  రౌడీ గారొప్పుకున్నా,  కోక పోయినా, నా మీద గ్రంధ చౌర్యం కేసు పెట్టినా సరే  నా బృహదాత్మ కధకు తొలిపలుకులు  వచ్చేశాయి.

వేచి చూడుడు. రెండవ భాగం  “నా జీవిత కధ—నా బాల్యం” కొఱకు.  వీలైనప్పుడు విడుదల.   

39 కామెంట్‌లు:

SHANKAR.S చెప్పారు...

బెమ్మాండం. మీరిలా కానిచ్చేయండి అంతే. వెధవ బాసులు చరిత్ర పుటల్లో కెక్కబోయే మహా గ్రంధానికి ముందు మాట రాసే అవకాశం కాలదన్నుకుని చారిత్రాత్మక తప్పిదం చేశారు. అవునూ ఇంతకీ మీ ఆత్మకధకు టైటిల్ ఏం పెడుతున్నారూ?

sai krishna alapati చెప్పారు...

Sir,
మీ ఆత్మ కధ కోసం వేయి కన్నులతో ఎదురు చూస్తున్నాము ...
రిలీజ్ రోజు ఎప్పుడో చెబితే ఆ రోజు ఆఫీసు మానేసి ఇంట్లోనే ఉంటాం ఎందుకు అంటే ఆఫీసు లో ఎక్కువ నవ్వితే బావుండదు కదా

Sujata M చెప్పారు...

మీకో గొప్ఫ ఆఫర్ ఇస్తున్నాను. మీకిష్టవైతే, మీ ఆత్మకధ చదివాకా, ముందుమాట రాస్తాను. ఈ లోగా మీరు వీలు చేసుకుని రాసీండి.

ప్రవీణ చెప్పారు...

రాసెయ్యండి..రాసెయ్యండి...చదవటానికి మేమందరమూ తయారు..ముందు మాట సంగతి తర్వాత ఆలోచించుకుందాము లెండి

ఆ.సౌమ్య చెప్పారు...

అసలు మీ బ్లాగులని చాలా మందికి పరిచయం చేసింది నేను. పప్పు శ్రీనివాసరావు గారికి, రాజ్ కుమార్ కి, మనోజ్ఞ ఇలా వీళ్లందరికీ నేనే పరిచయం చేసాను ( ఇంకా చాలమంచి ఉన్నారు లిస్టులో). మీరేమో ఒక్కసారి కూడా నన్ను పొగడలేదు :(..అయినా సరే మీ జీవిత కథలో బ్లాగాధ్యాయం వచ్చినప్పుడు చెప్పండి, నేను నాలుగు మాటలు రాస్తా...ఎందుకంటే నాది విశాల హృదయం. :D

సుమలత చెప్పారు...

బాగుందండీ మీ నవ్వులు .....
ఇంతకీ ఆత్మకధ ఎప్పుడు రిలీజ్ చేస్తారు కొంచెం చెప్పండి

మనసు పలికే చెప్పారు...

గురూ గారూ... అంతేనండీ అంతేనండీ. మీ బాసాసురులని, స్నేహితులని అందర్నీ అడుగుతారు కానీ, మీ ఆస్థాన శిష్యురాలిని మాత్రం అడగరు కదూ..;)
సరేలే పాపం, రౌడీ గారికి అయినా ఇచ్చారు కదా ఆ అవకాశం అని అటు తొంగి చూశాను.పాపం ఆయన కష్టలు చూడలేక కిసుక్కున నవ్వుకుని మళ్లీ ఇటొచ్చా.. నిజానికి నావీ సుమారుగా అవే కష్టాలు. కానీ నాకున్న ఒక అదృష్టం ఏమిటంటే, నా క్యూబికల్ ఆఫీసులో జనాలందరూ కలిసి వెలివేసినట్లుగా ఎక్కడో మూలకి ఉంటుంది కాట్టి కాస్త బ్రతికి పోయాననమాట..

veera murthy (satya) చెప్పారు...

ఉపోత్"ఘాతం" అందిన వెంటనే,
ఆ "మూడు శ్రీ ల (శ్రీ శ్రీ శ్రీ) బులుసుగారి అభ్యుదయ ఆత్మ కథా సాగర ఘోషా శబ్ధ సమ్మిలిత మృదుమంజీర నాదామృత ధారా జనిత పద సంచయ గధ్య గ్రంథం "

దిక్కులని ధిక్కరిసూ,
పాఠకులని వెక్కిరిస్తూ ,
అయోమయాన్ని తొలుస్తూ,
అంధకారాలని చీలుస్తూ ,
అప్రతిహతంగా సాగిపోయే ఆ కథాసాగర వరదని,
మామీదకు వదిలెముందు ఎరుక పరచగల మనవి !! . . .
మా లాప్‌టాప్ లని మాతో తీసుకు పోయి, అరణ్య మధ్యమున, తీవ్ర ఏకాంత ధీక్షతో,
"కడుపుచెక్కలయ్యె వ్రతాన్ని", కానలలో కనబడకుండా ఆచరిస్తాం! ....

ఇక ఇంటికి తిరిగి రాగలిగితే సంతోషిస్తాం!!

-satya

జేబి - JB చెప్పారు...

వీలైనంత త్వరగా రాసేయండి - మీలాంటి పెద్దవారి అనుభవాలు నాకు చాలా అవసరం.

Ennela చెప్పారు...

//శ్రీశ్రీశ్రీ మహారాజ రాజశ్రీ బ్రహ్మశ్రీ వేదమూర్తులైన

బులుసు సుబ్రహ్మణ్యం గారి ఆత్మ (ఘోష ) కధ.//

ఇది అచ్చంగా మీ ఆత్మ కథేనా మాస్టారూ..ప్రద్యుమ్నుడు ప్రవేశించడా?యీ కావ్యమునకు నామధేయమెట్టిది? తొలిపలుకు ఎక్కడ లభ్యమగును? ఎన్ని అంకములు? ఎన్ని భాగములు? ఎన్ని పర్వములు? ఎన్ని రోజులకొకసారి అచ్చగును? ఇత్యాది ప్రశ్నలకు జవాబులు చెప్పవలసిందిగా శౌనకాది మునులు సవినయముగా సూతుని కోరడమైనది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శంకర్ గార్కి,

అంతేనంటారా . సరే . ‘మనుషులందు బాసులు వేరయా’ అన్నాడు చరిత్రకారుడు. శీర్షిక గురించి ఇంకా ఆలోచించ లేదండీ. మీ అందరిసహకారం తోటి పుస్తకం వ్రాసిన తరువాత, ఏమాత్రమూ సంబంధం లేని శీర్షిక పెట్టీద్దాము.
ధన్యవాదాలు.

సాయి కృష్ణ గార్కి,

ధన్యవాదాలు, మీ వ్యాఖ్యలకి. అయ్యో ఆఫీసు కెళ్లడం నిద్రపోవటానికి, కబుర్లు చెప్పుకోవటానికి అనే అనుకుంటున్నాను. మీ ఆఫీసు లో పని కూడా చేయిస్తారా . అన్యాయం.

సుజాత గార్కి,
మీలాంటి వారు ముందు మాట వ్రాస్తానంటే నా ఆత్మ కధ ధన్యమైనట్టే. కానీ ఇంద్రుడు, చంద్రుడు అని పొగడవద్దు. నాకు పొగడ్తలంటే అసలు ఇష్టం ఉండదు. ఏదో కంతుడు, జయంతుడు తోటి సరిపెట్టెయ్యండి.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ప్రవీణ గార్కి,

రాసేద్దామనే సంకల్పం అండి. అదేమిటి మీరు ముందు మాట చివర వ్రాయమంటున్నారు.
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య గార్కి,

నా చెయ్యి పట్టుకొని బ్లాగులో నడిపించి నన్ను అందరికీ పరిచయం చేసింది మీరేనని మత్త వేదండము నెక్కి చాటుతూనే ఉన్నాను. మీ భాషా ప్రావీణ్యత, భార్యా మణోపాఖ్యానం, మాసికోల్లాసం గురించి నా బ్లాగులో ‘ఏమని పాడెదనో’ అని కీర్తించాను. అయినా పొగడలేదని అభాండం వేసినందుకు ఆక్రోశించుచున్నవాడ. నా చరిత్ర లో బ్లాగు కాండను కిష్కింధ కాండ గా చేసే గురుతర భాధ్యత మీ పైనే ఉంచుతానని నా బ్లాగు మీద ప్రమాణంబు చేయుచున్నాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

సుమలత గార్కి,

ధన్యవాదాలు. అదేమిటి మీరు అప్పుడే కొడుకు పేరు అడిగేస్తున్నారు. కధ లో ఏమి వ్రాయాలా అని చర్చ మొదలవుతోంది ఇప్పుడే. ఇవన్నీ పూర్తి అయిన తరువాత విడుదల. సలహాలివ్వడం మరిచిపోకండి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

హేంత మాట, హేంత మాట. శిష్యు రాలిని మరిచిపోవడమా. నా చరిత్ర కి చివరి మాట మీదే. గురువు గారి చరిత్ర సత్య హై అని పాడే అవకాశం శిష్యులందరిది. ఆఫీసులో హాయిగా నిద్ర పోవడానికి చివరి కాబినే మంచిది.
ధన్యవాదాలు.

సత్య గార్కి,

మీరు నన్నయ్య గారి గద్యం, తిక్కన్న గారి పద్యం కలిపి రాసేస్తే నాలాంటి పామరుడి కి అర్ధం కాదు కదా. ఏమైనా మీరు కానన వాసం చేసే టంతటి సీను ఉండదని చెప్పగలను.
ధన్యవాదాలు.

జేబి-JB గార్కి,

ధన్యవాదాలు. అందరూ నేర్చుకొనే టంతటి అనుభవాలు ఏమి ఉండవండి.

ఎన్నెల గార్కి,

ఇది నా ఆత్మ కధ అని మొదలు పెట్టేను. ఇంకా ఎన్ని ఆత్మలు వచ్చి చేరుతాయో చెప్పలేను. కధ రసవత్తరం గా నడవాలంటే కొన్ని అనివార్యమేమో గదా. వీలైతే మీ బెట్టిని పంపితే సంతోషిస్తాను. అని సూతుడు ఉవాచ.
ధన్యవాదాలు.

kiran చెప్పారు...

హహహ...రాయండి....మీ లాంటి పెద్ద వాళ్ళు రాస్తే చదవడానికి బోలెడు మంది ఉన్నాం కదా.. :)

@ఎన్నెల గారు ..:D:D

Sunil చెప్పారు...

గురువుగారూ ఎప్పటిలానే సూపర్బ్. మీకింకా అవుడియాలు కావాలంటే కొరకటానికి గోళ్ళు నేను ఏర్పాటు చేస్తాను. మా లేబ్ లో చాలా మంది అమ్మాయిలకు నాజూకైన వేళ్ళు, వాటికి గోళ్ళు ఉన్నాయి (ప్రభావతి గారికి చెప్పను లెండి). అవసరమైతే నేను కూడా గోళ్ళు పెంచుకుంటా.
వీలైనప్పుడు విడుదల కాకుండా కాస్త త్వరగా రిలీజ్ అయ్యెట్టు చూడండి.
ఇట్లు మీ శిష్య పరమాణువు
సునీల్

రాజ్ కుమార్ చెప్పారు...

కేక పోస్ట్ గురూ గారు..
మీ ఆత్మకధ కోసం మేము ఎదురుచూస్తూ ఉంటాం.

కానీ మరీ ఇంత చిన్న పోస్ట్ రాసారేమిటండీ? ఇంకొంచెం రాస్తే మరికాస్త నవ్వుకునే వాళ్ళంకదా?

ఇందు చెప్పారు...

గురువుగారూ....సూపరు మీ ఆత్మకథ వివరాలు! :)))) ముందు మాట సంగతి సరే....మీకు కాస్త సాయం కావలంటే మా సకూచిని ఏమన్నా పంపించమటారా? సకూచి కూడ అర్ధరాత్రి పన్నెండింటికే నిద్ర లేస్తుంది :)) కావున..మీరు ఎంచక్క సకూచిగారి సహాయసహకారములతో మీ గ్రంధరచన గావించుకొనవచ్చు! ఏమందురు??

మైత్రేయి చెప్పారు...

మీరు నన్ను క్రితం పోస్ట్ లో పొగడక పొయ్యేటప్పటికి సౌమ్యగారి లాగే నేనూ అలిగి కామెట కూడదనుకొన్నా! అయినా మెచ్చుకోక తప్పటల్లేదు.
అన్నట్టు, మార్జాల శత్రువు లాంటి పదాలు మీరు పేటెంట్ చెయ్యాలి సారూ!
మరో విషయం, జ్యోతి గారు, కొత్తపాళీ గారు లాంటి సీనియర్స్ గూగులమ్మ అని డిసైడ్ చేసి వాడుతుంటే, మీరు గూగులయ్య అంటారేంటండి. ఇంత పక్షపాతమా. వేంఠనే ప్రభావతి గారికి చెప్పాలి మీ స్త్రీ ద్వేషం గూర్చి. అసలు అన్ని విషయాలు తెలియచెప్పే తెలివి ఆడవారికే సొంతం కదా మరి గూగులమ్మే అవుతుంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కిరణ్ గార్కి,

ధన్యవాదాలు. కనీసం బ్లాగుల్లో ఉన్న వాళ్ళైనా చదువుతారని నమ్మకం తోటి మొదలు పెట్టాను నా ఆత్మ కధ. మీరంతా చదువుతామని కంకణం కట్టుకున్నందుకు మళ్ళీ ఒక మాటు థాంక్యూ.

సునీల్ గార్కి,

శిష్య రత్నమా ధన్యవాదాలు. గోళ్ళు సప్ప్లై చేస్తే చాలదు, గోళ్ళతోటి వేళ్ళు, వేళ్ళతోటి అమ్మాయిలు ఉండాలి. ఇండియన్ అమ్మాయిలా, జర్మన్ అమ్మాయిలా. ఇండియన్ అయితే చికెన్ మటన్ అవశేషాలు గోళ్ళమధ్య భరించవచ్చు. కానీ జర్మన్ అయితే బీఫ్ మనకి సరిపడదు. ఎప్పుడు రమ్మంటారు జర్మని. జర్మనీ నించి తిరిగి వచ్చిన తరువాత విడుదల చేస్తాను తరువాయి భాగం.

వేణూ రాం గార్కి,

ధన్యవాదాలు. వ్రాసేద్దాం అని సంకల్పం, చూడాలి ఎంత వరకు వ్రాయగలుగుతామో. చిన్న పోస్ట్ అని మీరొక్కరే గుర్తించారు. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇందు గార్కి,

నా ఆత్మ కధలో ఇంకా చాలా ఆత్మలు ఉంటాయి. సకూచి ని వెంటనే పంపిచెయ్యండి. అమ్మయ్యా, సకూచి ఎక్కడా అని వెతుకుతున్నాను. మీదగ్గరే ఉందన్నమాట. పాపం రాజ్ కుమార్ గారు, నాగార్జున గారు కూడా వెతుకుతున్నారు. తిరుగు email లో పంపించేయ్యండి.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మైత్రేయి గార్కి,

లెంపలేసుకుంటున్నాను. క్షమించేయ్యండి. నా ఆత్మకధలో పొగడ్తల పర్వం లో మీకో రెండు పేజీలు కేటాయిస్తున్నాను.
మార్జాల శత్రువు, శునక వైరి వైరి ఇల్లాంటివన్నీ ఫ్రీ గానే మీ అందరూ ఉపయోగించుకోవటానికి వదిలేస్తున్నాను.
నేను గూగులయ్య అనే అంటాను. అందరిదీ ఒక దారి ఉలికి పిట్ట దొకదారి కదా మరి.
ధన్య వాదాలు మీ వ్యాఖ్యలకి

Sunil చెప్పారు...

పూజ్యులైన గురువుగారికి
మీరు "కో" అంటే కోటి మందిని పంపించగలను (వారి ఖర్చులు మీరే భరించవలసిందని మనవి)...కానీ "కో" అనవద్దు. గురుపత్నికి ద్రోహం చేయదలచుకోలేదు. ఇక్కడ మీకొక చిన్న విన్నపం. రోలు వచ్చి మద్దెలకు చెప్పుకున్నట్టు ఉంది. 5 సం..ల నుండి ప్రయత్నిస్తున్న నాకే ఒక్క జెర్మన్ అమ్మాయి కూడా దొరకలేదు. మరొక విషయం... జెర్మనులు పళ్ళ చెంచా మరియు చాకుల (fork & knife) తో భోంచేస్తారని మనవి. కాబట్టి బీఫ్ యొక్క అవశేషాలు ఉండవేమో.....

మీ విధేయుడు
సునీల్

ఇందు చెప్పారు...

కెవ్వ్వ్వ్! సకూచి నాదగ్గర ఉండటమేమిటి గురువుగారూ! ఇంకా నయం! ఏ రాత్రిపూటో ఈ కామెంటు చదవలేదు...దడుచుకునేదాన్ని! :)) అది ఇక్కడే..ఎక్కడో తిరుగాడుతోంది! నా దగ్గరకు ఏమన్న వస్తే మీ దగ్గరకి పొమ్మని చెబుతా :) అక్కడ మంచిమంచి ఆత్మలున్నాయట ఫ్రెండ్షిప్ చేసుకోమని చెబుతా :))

Unknown చెప్పారు...

గురుజి మీరు వాళ్ళని వెళ్ళని అడగకండి అంతే .. మేమంతరం చెరో పెన్ను ఇచ్చుకుని రాసేస్తం మీ గురించి ఇంట్రోడక్షన్ ..

అది ఎలా ఉంటుంది అంటే .. ఇంట్రోడక్షన్ ఏ ఒక నవల లాగ ఉంటుంది మరి ..

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సునీల్ గార్కి,

ఉట్టి కెక్కలేని వాడు స్వర్గానికి ఎక్కడమంటే ఇదే. 5 ఏళ్లగా ప్రయత్నం చేసినా పప్పులు ఉడికించలేని వారు కోటిమందిని పంపిస్తారట. హతవిధీ, ప్రేమించబడడానికి 10 సులభ సూత్రాలు నేర్పాలనుకుంటాను మీకు.:):)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

ఇందు గార్కి,

ధన్యవాదాలు. అయ్యో ఇంకా సకూచి మీ తోటే మీ కొత్త కారులో షికారు చేస్తోందేమో అనుకున్నాను. అయితే పోలీసు కి ఫిర్యాదు చేస్తాను. "సకూచి తప్పిపోయింది వెతికి పెట్టండి" అని. :):)

కావ్య గార్కి,

అల్లాగే వెంటనే వ్రాసేయండి. మీరు తొలిపలుకులే ఒక నవల గా వ్రాస్తే, ఇక నేను వ్రాయాల్సింది ఏమి ఉండదు.శ్రమ తగ్గించిన వారవుతారు.:)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మనసు పలికే చెప్పారు...

ఎవరిక్కడ మా సకూచి తప్పి పోయిందని అంటున్నారు..? అయ్..
సకూచి తప్పిపోలేదు. ఛార్మి నుండి వెళ్లిపోయిన తరువాత నమిత గురించి వెతుకుతూ తిరుగుతుంది.. ఆ వెదుకులాట కోసం, ఇందు రూబీనే వాడుకుంటుందని అభిఙ్ఞ వర్గాల భోగట్టా..

సో మా ర్క చెప్పారు...

మీ ఆత్మకధ చక్కని" జోక్చాతుర్యాన్ని " ప్రదర్శిస్తూ, నవ్వోద్రేకాన్ని పెంచేస్తొంది.ఆపకండి బాబోయ్...కొన.............సాగించండి.శునక వైరి వైరి వంటి పదాలు....ఆలోచనల్ని రేకెత్తిస్తాయి.ఊహల్లో విహరింప చేస్తాయి.

ఇందు చెప్పారు...

వామ్మో!వామ్మో! మా రూబీ గాడిలో తిరుగుతోందా?? నో,నెవర్!!! మ సకుచీ అప్పు దగ్గరే ఉంది అని నా అనుమానం ;)అప్పు ఆఫీసులో చిట్టచివరి డెస్కు కింద దాక్కుని ఉంది అని విశ్వసనీయవర్గాల సమాచారం :)))

..nagarjuna.. చెప్పారు...

సకూచి అభిమానులు చింతించనవసరం లేదు....సకూచి క్షేమమే. పూనుకోడానికి మరోక దేహంకోసం వెతుకుచున్నది. అశరీరమైనది కావున విహరించడానికి రూబీలు రుబ్బురోళ్లు అవసరం రాకపోవచ్చు.... పైగా చిన్న ఆత్మ కావున గురువుగారి ఆత్మకథ వచ్చేంతవరకు విశ్రాంతి యోచన జరుగుతున్నది....

>>గురువు గారి చరిత్ర సత్య హై అని పాడే అవకాశం శిష్యులందరిది. ఆఫీసులో హాయిగా నిద్ర పోవడానికి చివరి కాబినే మంచిది.

kevvvvvvvv ఏమి సత్యం చెప్పారు గురువుగారు.... ఇక మీ కథ వచ్చిన తరువాయి నేనుసైతం గాత్రము చేసెద...నేనుసైతం శయనించెద ఆఖరు కాబినులొ....

Sunil చెప్పారు...

ఆ పని చేయండి గురూజీ, సులభం అని కూడా అంటున్నారు. Work Out అవుతుందేమో చూద్దాం. మీ ఆత్మ కథ తో పాటూ ఒక మంచి ప్రేమ కథ కూడా రాసెయ్యండి...హీరో గా మా ప్రద్యుమ్నుడు గారు మాత్రమే ఉండాలండోయ్.

SHANKAR.S చెప్పారు...

గురువు గారూ
కాస్త దీని మీద ఓ లుక్కేసి ఎలా ఉందో చెప్పండి
http://blogavadgeetha.blogspot.com/2011/03/blog-post_6544.html

Ennela చెప్పారు...

Betty is present,Sir

Ennela చెప్పారు...

maa betty ni meeku saayam pampichesaa...meeru ika modalettaachu maastaaru!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

ఇందు గార్కి,

నాగార్జున గార్కి,

దేముడా నేనేమీ చేతు. అపర్ణ గారు ఇందు గారి కారు లో అంటారు. ఇందు గారు అపర్ణ గారి ఆఫీసు లో చివరి కాబిన్ డెస్కు కింద అంటారు. మీరు వెతకద్దు సకూచి క్షేమం గానే ఉందని నాగార్జున గారు భరోసా ఇస్తున్నారు. పైగా నాగార్జున గారు చివరి కాబిన్ లో డెస్కు కింద పడక సీను ప్రోగ్రామ్ పెట్టారు. అంతా అయోమయం గా ఉంది. నాగార్జున గారు సకూచి ని, న..... శరీరంలో ప్రవేశ పెట్టీ రహస్య కార్యక్రమం చేపట్టేరేమోనని అనుమానం వ్యక్తం అవుతోంది. ఈ విషయం కూలంకషం గా నిగ్గు తేల్చటానికి ఒక కమిటీ వేయాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ తీర్మానాన్ని బ్లాగ్లోక సభలో చర్చిం చిన తరువాత తదుపరి కార్య క్రమం నిర్ణయించబడుతుంది.

మీ అందరికీ ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సోమార్క గార్కి,

ధన్యవాదాలు. ఆత్మ కధ లో ఆత్మ లోపించిందని ఆత్మ కోసం వెతుకుతున్నాను. దొరికిన వెంటనే మళ్ళీ మొదలుపెట్టీస్తాను. థాంక్యూ.

సునీల్ గార్కి,

ధన్యవాదాలు. అల్లాగే నండి ఒక ప్రేమ కధ వ్రాసేస్తాను, ముగ్గురు హీరోయిన్సు , ఒక విలన్, ఒక సునీల్. OK నా.

శంకర్ గార్కి,
ధన్యవాదాలు. మీ టపా చూసానండి. బాగుంది. మీకు నేను ఒక మైల్ పంపుతాను.

ఎన్నెల గార్కి,

ధన్యవాదాలు. బెట్టి వచ్చి హాజరు వేయించుకుంది. ఇక మొదలు పెట్టేస్తాను.

Nagaraju చెప్పారు...

plz read for information on following blogs
gsystime.blogspot.com - telugu
galaxystimeblogspot.com - english
galaxystartime.blogspot.com - animation engines

Thanks

అజ్ఞాత చెప్పారు...

wonderful ,it's great to find you here and read your blogs , will keep checking back from time to time --- Bhaskar Bulusu (USA)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగరాజు గార్కి,

ధన్యవాదాలు. తప్పకుండా చూస్తామండి. All the best.

అనానిమస్ (భాస్కర్ బులుసు)గార్కి,

ఇంత కాలం గా వ్రాస్తున్నా ఒక్క బులుసు కూడా ఇటు రాలేదేమా అని బెంగ పడిపోయాను. పెట్టేయి ఒక పెద్ద కేక. థాంక్యూ.

PR@K@SH చెప్పారు...

great you r sir ,mee vayasu yata masteru garu

Unknown చెప్పారు...

గురువుగారు ముందు మాటలోనే నవ్వించారు.
టపా చాలా బావుంది.