జంధ్యాల అంటే పెదాల చివర నుంచి చిన్నగా మొదలైన నవ్వు , ‘బాబూ చిట్టీ’ అంటూ పెరిగి 'ఏమిటీ, నీకు కస్తూరి వారి గురించి తెలియదా' అంటూ కోప్పడి, ‘చికెనవా ఉస్తిమోవ్’ తినిపించి, ‘నేను కవయిత్రి ని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా’ అని బెదిరించి, కనిపించిన ‘ప్రియానంద భోజుల’ ను (అంటే తెలుసా... ప్రియా పచ్చళ్లను ఆనందంగా భుజించేవాళ్లు) పలకరిస్తూ, సుత్తి కొడుతూ, పెద్దదై పగలబడి నవ్విస్తుంది.
హాస్య బ్రహ్మ జంధ్యాల ...... (వెలుగు నీడలు)
రెండవ భాగం
మూడవ భాగం
నాలుగవ భాగం
ఐదవ భాగం
చివరి భాగం
మీకందరికి ఇవి నచ్చుతాయని, చదివి ఆనందిస్తారని భావిస్తాను . మీ కామెంట్లు ఏమైనా ఉంటే అక్కడే వ్రాస్తే సంతోషిస్తాను.
హాస్య బ్రహ్మ జంధ్యాల తెలుగు సినిమాలో హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పారు. చక్కగా కుటుంబ సమేతం గా చూడదగిన హాస్య చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనేక సినిమాలకు రచయిత గా పని చేశారు. వారిని, వారి చిత్రాలను గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకోవాలనే సదుద్దేశం తో శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు మరికొంత మంది మిత్రులు కలిసి 'జంధ్యావందనం' అనే వెబ్ సైట్ ప్రారంభించారు. హాయిగా నవ్వుకోవాలంటే, జంధ్యాల వారి గురించి తెలుసుకోవాలంటే 'జంధ్యావందనం' దర్శించండి.
జంధ్యాల వారి గురించి శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారు ఆంగ్లం లో వ్రాసిన వ్యాసానికి నా తెలుగు అనువాదం ‘జంధ్యావందనం’ లో ప్రచురించబడింది. ఇది ఆరున్నొక్క భాగాలుగా ఉన్నాయి. వాటిని ఈ కింద లింకు లలో చదవవచ్చు.
రెండవ భాగం
మూడవ భాగం
నాలుగవ భాగం
ఐదవ భాగం
చివరి భాగం
మీకందరికి ఇవి నచ్చుతాయని, చదివి ఆనందిస్తారని భావిస్తాను . మీ కామెంట్లు ఏమైనా ఉంటే అక్కడే వ్రాస్తే సంతోషిస్తాను.
ఇంత చక్కటి విశ్లేషణతో జంధ్యాల వారి గురించి ఆగ్లం లో వ్రాసిన శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారి ని అభినందిస్తున్నాను. అనువాదం లో, భావ వ్యక్తీకరణ లో పొరపాటు జరిగితే వారు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.
తెలుగు లోకి అనువదించిన, నా వ్యాసం ప్రచురించినందుకు ‘జంధ్యావందనం’ సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.