పదనిధి శ్రీ వేటూరి

అద్భుత సాహిత్య సృష్టిని అతి సామాన్య గీతంతో సరితూస్తూ, సరదాగా సాగిపోయే పాటకు దీటుగా గంభీర  గీతాలు వ్రాస్తూ,  విషాద గీతాల సరసన ప్రణయ గీతాలు చేరుస్తూ,   సినిమాలలో సాహిత్యానికి ఉన్నత స్థానం కల్పించిన మహా కవి శ్రీ వేటూరి సుందర రామమూర్తి.  తన రచనలలో శ్రీ వేటూరి పలికించని భావం కానీ, రసం కానీ, మానవీయ కోణం కానీ,  లేవు అంటే అతిశయోక్తి కాదు. తన మాట మీద నిలబడే,  పదనిధి శ్రీవేటూరి వారి సాహిత్య సామర్ధ్యాన్ని వర్ణించడానికి పదాలు లేవు. 
  
వ్యాపారాత్మక సినిమాలలో  సాహిత్యాన్ని కళ గానూ , కళాత్మక సినిమాలలో సాహిత్యం లోని సరసతను మేళవించి వ్రాయడంలో తనదైన శైలిని, జనరంజకంగా  సృష్టించుకున్నారు. 

‘ఓంకార నాదాను సంధానమౌ గానమే’  వ్రాసిన కలం తోనే ‘ఓలమ్మి తిక్క రేగిందా’ అంటూ వ్రాసారు. 

భాషా వైవిధ్యాల మీద తన సాధికారతను చాటుతూ, జటిలమైన ప్రయోగాలను సామాన్య సంభాషణల లాగ కూరుస్తూ , సినీ రంగ అవసరాలకు తన అసమాన ప్రతిభను సరి తూస్తూ  శ్రీ వేటూరి వ్రాసిన పాటలు విమర్శకుల ప్రశంసలను, ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నాయి.

శ్రీ వేటూరి వారి సినీ సాహిత్యాన్ని విశ్లేషిస్తూ శ్రీ కంచిభొట్ల   శ్రీనివాస్ గారు  ఆంగ్లంలో వ్రాసిన  వ్యాసాలు, శ్రీపప్పు శ్రీనివాస్ గారి ప్రోత్సాహం తో నేను తెలుగు లోకి స్వేచ్చానువాదం చేసాను. పై వాక్యాలు ఆ అనువాదం లోనివే.

ఈ వ్యాసాలు http://veturi.in/ లో ఇదివరకే ప్రచురించబడ్డాయి. దొంగ పడ్డ ఆరు నెలలకి కుక్క మొరిగింది అన్నట్టు ఇప్పుడు  నేను నా బ్లాగులో  వీటి లింకులు ఇస్తున్నాను,  అక్కడ చదవని  వారందరూ చదివి ఆనందించాలని.





శ్రీవేటూరి - వేణువై వచ్చాను



ఇంత చక్కటి విశ్లేషణతో శ్రీవేటూరి  గారి గురించి ఆంగ్లం లో వ్రాసిన శ్రీకంచిభొట్ల  శ్రీనివాస్  గారిని  అభినందిస్తున్నాను. అనువాదంలో, భావ వ్యక్తీకరణ లో  పొరపాటు జరిగితే  వారు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.  

తెలుగు లోకి అనువదించిన,   ఈ వ్యాసాలు ప్రచురించినందుకు  వేటూరి.ఇన్’  సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను.