నాకు పనీ పాడూ లేదు


                                


ఈ విషయం మాఆవిడకు మాత్రమే తెలుసుననుకొన్నాను. కాని ఇది అందరికి తెలిసిపోయిందని నాకు అర్ధం అవటానికి ఆలస్యం అయింది.  మాపక్కింటి పంకజాక్షిగార్కి, ఎదురింటి ఎంకట లక్ష్మిగార్కి, వెనకున్న వనజమ్మగార్కి ఇంకా అక్కడెక్కడో ఉన్న జ్యోతి గార్కి, ఇంకెక్కడో ఉన్న శ్రీలలితగార్కి, కూడా ఇదే అభిప్రాయం ఉందని తెలిసి కడుంగడు నానందించితిని. అమందానంద కందళిత హృదయార విందుడనైతిని.  మాఆవిడ అప్పుడప్పుడు నామీద జాలి పడినా, అమ్మలక్కల సమితి వాళ్ళూ, అఖిలాంధ్ర పెళ్ళాల సభ వాళ్ళు నామీద విరుచుకు పడిపోతున్నారు.  నేనేం  చేసినా అది పనికింద రాదు. నా ఉద్యోగం, నా కష్టం,  ఇవన్నీ హుళక్కు, మిధ్య, పనీ పాడు లేకుండా చేసే కాలక్షేపం బఠాణీలన్నమాట.  పైగా  సూదిలో దారం ఎక్కించడం కూడా చేతకాని వాడు, ఇంకే పని చెయ్యలేడు అని కూడా తీర్మానించేసారు.

వీళ్ళందరూ (మన అంటే మొగుళ్ళ జీవితాల్లో వెలుగు నింపడానికి కష్టపడి) ఇంట్లో మేమెంత పని చేస్తున్నామో మీకు తెలుసా ఆయ్ అని కోప్పడ్డారు. ఇంట్లో ఎంత పని ఉంటుందో మీకు తెలుసా అని హాచ్చెర్యపడిపోయారు. ఇళ్ళు కడిగి ఊడ్చేస్తాం, గిన్నెలు చిల్లులు పడేలాగ ఉతికేస్తాం, బట్టలు చిరిగిపోయేదాకా తోమేస్తాం, వంట చేసి పాడేస్తాం తెలుసా అని డబాయించేసారు. మీరు విడిచిన లుంగీ తీసేది మేమే, మీ పక్క బట్టలు సర్దేది మేమే, మీరు తాగిన కాఫీ కప్పు కడిగేది మేమే, మామీద అజమాయషీ చెయ్యడానికి, నెలకి వెయ్యిరూపాయలు ఇచ్చి  మీరు పెట్టిన పనిమనిషికి కాఫీ టిఫెన్లు కూడా పెట్టేది మేమే, మేమే, మేమే అని మూడు మాట్లు నొక్కి మరీ ఉద్ఘాటించారు.  మీకేం, హాయిగా ఆఫీసు కెళ్ళిపోయి పనీ పాడు లేకుండా, టీ లో బిస్కెట్లు నంచుకుని తింటూ, ఎ.సి రూములో విశ్రాంతి తీసుకొని మధ్య మధ్య లో పక్కసీటు కాజల్ తోనో, ఎదుటి సీటు ఇలియానా తోనో  పోచికోలు కబుర్లు చెప్పుకొని నవ్వుకుంటూ  ఇంటికి తిరిగొచ్చే మీకు మాఅగచాట్లు అర్ధం చేసుకొనే మనసు లేదని కూడా దులిపేసారు. ఇంట్లో ఉన్న అనుష్క మీకు సూర్యాకాంతంలాగా, బయట ఛాయాదేవి నయనతారలాగా ఎందుకు కనిపిస్తుందో ఎప్పటికి మాకు అర్ధంకాదు అని  కర్కశంగా కడిగేసారు. పని చేసి, చేసి అలసి సొలసి పోయి కాస్త విశ్రాంతి కోసమని, మా చిన్నప్పటినించీ చూస్తున్న ఆడ వాళ్ళ కేనా అగచాట్లు అనే టి.వి సీరియల్ చూద్దామని కూర్చుంటే  కాఫీ అని అరుస్తాడా మొగుడు అని ఆవేశపడిపోయారు.

 నాజీవితంలో ముఖ్యమైన రెండో మనిషి, ఎప్పుడూ నన్ను విమర్శించే  మా బాసు గారు,  ఏపనీ సరిగ్గా చేయవేమోయి శంభులింగం అనీ, అసలు నీకు చేతనైన పని ఏదైనా ఉందా శంకరనారాయణా అనీ, నాకు అధికారాలు లేవుకానీ, ఉంటే నీకెప్పుడో ఉద్వాసన చెప్పేసేవాడిని సింహాచలం అనీ, అనేవాడు.  నా ప్రమోషను కాగితం పట్టుకొని, పదిహేనేళ్ళు ఒకే సీట్లో కూర్చున్నవాళ్ళందరికి ఇవ్వాలని రూలుండబట్టి నీకు ఇవ్వాల్సివచ్చింది  భజగోవిందం అని విచారించాడు. నన్ను ఎవరూ ఆదర్శంగా తీసుకోకూడదని మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్ధించి, రెండు నిముషాలు మౌనం పాటించి మరీ ప్రమోషను ఆర్డరు చేతికి ఇచ్చాడు.  అంతేకానీ  పనీ పాడు లేకుండా కూర్చున్నాడు అని ఎప్పుడూ అనలేదు.  ఎందుకో మరి మాకాలనీ  AAS  and APS  వాళ్ళు నా మీద ఇల్లా విరుచుకు పడిపోతున్నారు.  పనీపాడూ లేనివాడనని.

నేను రిటైరయిన నాల్గో రోజున మా ఇంట్లో సంతాపసభ జరిగింది. పాపం లీలావతమ్మగార్కి ఎంత కష్టం వచ్చింది, ఆ హిరణ్యకశిపుడు ఇంక ఇంట్లోనే ఉంటే ఈమె పాట్లు, వర్ణింపనలవి  కాదు కదా అని నిర్వేదము తో కూడిన విచారముతో దు:ఖించి, నేను నా రిటైర్మెంటు తో వచ్చిన డబ్బుతో కొన్న స్వీట్లు, హాట్లూ, ఇవీ అవీ అన్నీ ముదమార, కడుపారగా భుజించి,  నన్నాడిపోసుకొని, మా ఆవిడను ఓదార్చి, ధైర్యం చెప్పి, నాపైన ఉసి గొల్పి తమ తమ స్వగృహముల కేగినారు. 

సంతాప సభ జరిగిన మరునాడు ఉదయం సరిగ్గా పదకొండు గంటలకు, నేను మృదు మధుర శాంత స్వనంతో దేవీ శ్రీదేవి, ఆర్యపుత్రీ, ఓ కప్పు కాఫీ కావాలి అని దీనంగా అభ్యర్ధించాను. మాఆవిడ విందో లేదో నాకు తెలియదు కాని పంకజాక్షి వినేసింది. ఆవిడ కు ఉన్న ఏకైక పని మాఇంట్లో దూరదర్శన్, దూరశ్రవణ్ ప్రసారాలను monitor   చేసి పున:ప్రసారం చేయడం.  నామాట వినడం, వాటికి ఇంకో రెండు విశేషణాలు జోడించి,  వాటిని తన మొబైల్ లో SMS చేసెయ్యడం జరిగిపోయింది. అదేదో వల పని(Net working) ట ఒక నొక్కుతో పాతిక మందికి పంపవచ్చుట. ఈవిడ మూడు నాలుగు నొక్కులు నొక్కిందనుకుంటాను. అంతేకాదు లాండ్ లైను, మొబైలు ఉపయోగించి  ఇంకో అంతమంది కి అడక్కుండానే సమాచారం మీచెవిలో స్కీము లో ప్రసారం చేసేసింది.  ఒక పావు గంటలో ఆల్ నెట్ వర్క్స్ ఆర్ బిజి అయిపోయాయి. మా ఆవిడ మొబైలు వెరీబిజి. SMS లు శరవేగంతో వచ్చేసాయి. మచ్చుకు కొన్ని అణిముత్యాలు,

ఈ దాష్టీకాన్ని ఖండిస్తున్నాము
దేవి శ్రీదేవి అని నిందించడాన్ని సహించరాదు
ఆర్యపుత్రీ అని తిట్టినందుకు క్షమార్పణ చెప్పాలి
రిటైరయిన వాడికి కూడా కాఫీనా అందునా మిట్టమధ్యాహ్నం
సీరియల్ టైములో కాఫీ అడిగితే ప్రభుత్వం ఏంచేస్తోంది 
రావణాసురుడి రాజ్యంలో మండోదరి కి రక్షణ లేదా

ఇంతలో  ఆడవారికే ప్రత్యేకమైన ఛానల్ పడతీ ఓ పడతీ లో బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, బద్దలవుతున్న వార్త, అంటూ వచ్చేసింది. యాంకరమ్మ గారు భళ్ళున నవ్వి, ఇపుడే అమ్దిన వారత, సూడండి స్సూడండి. మాపెత్తేక ఇలేకరి చెబుతున్నారు. ఇలేకరిగారూ  ఇలేకరిగారూ ఇనిపిస్తోందా ఏం జెరుగుతోంది అకడ. 

విలేఖరి గారు అందుకున్నారు: ఇక్కడ పరిస్తితి అదుపు తప్పేటట్టుగా ఉంది. తాటకాసురుడి ఇంటివద్ద ఉన్నాం. ఇంటి తలుపులు వేసే ఉన్నాయి. అలికిడి వినిపించటంలేదు. బహుశా మహిషాసురుడు ఈ ఇంట్లో పతివ్రతా శిరోమణి అయిన తన సతీమణి ని చెరపట్టాడనీ, కాఫీ ఇమ్మని బలాత్కారం చేస్తున్నాడని చెప్పుతున్నారు. AAS  మరియూ APS సభ్యులు ఇంటిని చుట్టుముట్టారు.

యాంకరమ్మ: ఆ ఇంట్లో ఎవరునారు? తాతకాసుర్ కి మహిసాసుర్ కి హేమితీ రిలేసన్. ఇందాక రావనాసుర్ అని అనారు. ఈన ఎవరు?  AAS, APS  ఏమ్తి?

ఇలేకరి: ఇంట్లో ఉన్న మొగుడాసురుడిని ఎవరి కిష్టమైన పేరుతో వారు పిలుస్తున్నారు. అందరూ ఒకటే. అమ్మల అక్కల సమితి, అఖిలాంధ్ర పెళ్ళాల సభ.  ఇప్పుడే మగ పోలీసులు వచ్చారు. ఆడ పోలీసులు వచ్చేదాకా మేమేం చెయ్యం అని అంటున్నారు. పంకజాక్షి గారిని అడుగుదాం.  పంకజాక్షిగారూ ఏంజరుగుతోంది ఇక్కడ.

పంకజాక్షి:  ఏంజరుగుతోందా? అనాదిగా ఈదేశంలో జరుగుతున్నదే. ఇక్కడ పునరావృతం అవుతోంది. కడుపునొప్పితో, శిరోవేదనతో, బాధపడుతున్న సతీమణి ని,  61ఏళ్ళ స్త్రీరత్నాన్ని కాఫీ  ఇమ్మని  పొద్దున్నించి  మొగుడు నానాహింసలు  పెడుతుంటే  కడుపు రగిలిపోవట్లేదా నీకు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పురుషాహంకారం.  ఈ హింసకు కారణమైన వారిని అరెస్టు చేసేదాకా మేము నిరశన కొనసాగిస్తాము.  జై AAS జైజై  APS.

బద్దలవుతున్నవార్త,  బద్దలవుతున్నవార్త,  బద్దలైపోయిన  వ్ ఆ ర్ త్ అ.

మొగుడు దొడ్డితలుపు తెరుచుకొని దొడ్డిదారిని గోడ దూకి కాలు విరగకొట్టుకొని కుంటుకుంటూ పరిగెడుతూ, పరిగెడుతూ పారిపోయాడు.  మామూలుగానే పోలీసులు దొడ్డదారిని ఇంట్లో ప్రవేశించారు.  పతివ్రతాసతీశిరోమణి  గాఢనిద్రలో ఉన్నట్టు అభిజ్ఞవర్గాల భోగట్టా.  ఏమిచెయ్యాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారని, ఏం జరుగుతోందో తెలియక ప్రభుత్వం ఉత్తరదిశగా చూస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి.

నేను:  ఏంచేసానో అర్ధంకాక, ఇప్పుడు ఏంచెయ్యాలో తోచక, పోలీసుల భయంతో పారిపోయి, మళ్ళీ వారిచేతికి చిక్కడం ఇష్టంలేక, ఆత్మహత్య చేసుకుందామని డిసైడయిపోయాను.  జేబులో ఓ సంతకం చేసిన తెల్లకాగితం పెట్టుకుంటున్నాను.  నా ఆత్మహత్య ఏరాజకీయ పార్టీకో,  ఏ రాజకీయ నాయకుడికో పనికి వస్తే, ఆవిధంగా రాసుకొని, పాపం మా ఆవిడ కి ఒకటొ రెండో లక్షలు వస్తాయేమో చూడండి.

ఇకపై నా గతేమి,   లేదా గోదారి,   అంతదూరం కష్టమేమో,   ఉందిగా  మూసీ,    అని పాడుకుంటూ  

జై భజరంగ  భళీ  దూకేస్తున్నాను  దూకేస్తున్నాను మూసీలోకి.  నన్నెవరూ పట్టుకోరా ప్లీజ్.








34 కామెంట్‌లు:

Unknown చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

Sorry, I have seen your blog for the first time and I thought that this was your first post.

Later, I realized.

జ్యోతి చెప్పారు...

పాపం.. మీ ఆవిడకు చెప్తాలెండి మీ కష్టాలు,కన్నీళ్లు... అసలు మీ యావిడ ఈ బ్లాగు చూస్తున్నారా? తనని ఎంత డేమేజింగ్ గా చూపిస్తున్నారో తెలుసా అంట??

krishna చెప్పారు...

hillarious :)

కృష్ణప్రియ చెప్పారు...

Super.. ఇంత చక్కటి కామెడీ చాలా కాలానికి చదివాను. టూ గుడ్!

కృష్ణప్రియ చెప్పారు...

ఎండింగ్ అయితే ఇంక తిరుగు లేదు.. :-) జగన్ అభిమానులకి ఎవరైనా ఈ పోస్ట్ లింక్ ఇస్తారేమో.. జాగ్రత్త..

మేధ చెప్పారు...

సూపర్.. డూపర్ :)
మీ ఓదార్పు యాత్రలో నేను తప్పకుండా పాల్గొంటా ;)

అజ్ఞాత చెప్పారు...

Ultimate comedy.Carry on.

ఆ.సౌమ్య చెప్పారు...

ఆహా భార్యావిధేయుడనని చెప్పుకుంటూ, ఆవిడ మీద ఇలాంటి టపాలు రాస్తారా..ఎంత మోసం, ఎంత మోసం?

మీకు ఉన్న రిటైర్మెంటు ఆవిడకు లేదా పాపం. కాఫీ అనగానే పరిగెత్తుకు రావాలా.....హమ్మ హమ్మ ఇవన్నీ పురుషహంకార ఆభిజాత్య కుట్రలు.

క్రితంసారి చెప్పినట్టు మీకు రోకలి, రుబ్బురోలే గతి :)

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హాహ్హా.. చదివినంత సేపూ ఎంతగా నవ్వానో చెప్పలేను.. కడుపు నొప్పి వచ్చేసింది..:)))
సూ...పర్.. బాబోయ్ ఇంత బాగా ఎలా రాయగలరండీ..?

నేస్తం చెప్పారు...

అయ్యబాబోయ్ ఏం రాసారండి ....చాలా నవ్వేసా..నాదీ సౌమ్య మాటే..భార్యా విధేయుడిని అని ఇలాకుట్ర పన్నుతారా ఆయ్

అజ్ఞాత చెప్పారు...

:))))) Super Comedy maastaaruuuuuuuuu

3g చెప్పారు...

super.....hilarious.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కామెంట్లు రాసిన వారందరికి ధన్యవాదాలు.కృతజ్ఞతలు.
అప్పుడప్పుడు అనిపిస్తుంది. కధ రాయడం ఈజీ కాని కామెంట్లకి జవాబు వ్రాయడం కొంచెం కష్టమని.
Sri. vimal- thank you for your comment.

జ్యోతిగార్కి,
ప్లీజ్ మాఅత్తగారికి, మాఆవిడకి అసలు చెప్పకండి. పెద్దవాడిని ఉపవాసాలు ఉండలేను.
కృష్ణగార్కి,
మీ కామెంటుకి ధన్యవాదాలు. థాంక్యూ.
కృష్ణప్రియగార్కి,
మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు. ఏమిటో అనుకోకుండా ఎండిగు అల్లా కుదిరిపోయింది. ఆత్మహత్య అనగానే అందరికి ఈడ్రామాలే గుర్తుకొస్తున్నాయనుకుంటాను.థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మేధగార్కి,
ఏంచేస్తాం. నా ఓదార్పు యాత్రలో పాల్గొనాలంటే ఓ లచ్చ ఖర్చు అవుతుంది. ప్రిపేరవండి. థాంక్యూ.

మై డియర్ ఫ్రెండు గార్కి,
మీ కామెంటు కి ధన్యవాదాలు

ఆ.సౌమ్య గార్కి,
అమ్మయ్య. మీరు ఇంకా రాలేదేమిటా అనుకుంటున్నాను. వచ్చి పెట్టేసారు కదా. ఇంక నిద్ర పట్టేస్తుంది. ఎంత కి కొన్నారు? ఎక్కడ కొన్నారు? బాగుంది. గడ్డి.
థాంక్యూ. మీవాఖ్యలకి ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

హ్మ్, కామెంట్లకి జవాబులు కుడా ముందే వ్రాశిపెట్టుకోండి, ఒక పదో పదిహేనో, అవే లైన్లో వాడుకోండి, అన్నీ ఐపోయాక మళ్ళీ అవే తిరిగి రాయండి సరిపోతుంది కదా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,
కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు.అప్పుడప్పుడు అల్లా పాకం కుదిరి పోతుందనుకుంటాను.థాంక్యూ.

నేస్తం గార్కి,
మీ వ్యాఖ్యలకి థాంక్యూ. మీరు కూడా సౌమ్యగారి తో జత కలిపితే నాకు కష్టం. రోజుకి ఒక కే.జి. కన్నా ఎక్కువ తినలేను. ధన్యవాదాలు.

ఎనానిమస్ గార్కి, 3g.గార్కి,
ధన్యవాదాలు. థాంక్యూ.

హరే కృష్ణ చెప్పారు...

LOL
బాగా మిక్స్ చేసారు

very well written
keep it up!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

తార గార్కి,
అదే అనుకున్నాను. ధన్యవాదాలు, థాంక్యూ, కాకుండా ఇంకా ఏమైనా దొరుకుతాయేమొ నని వెతికేను. నాకు బహుశా వెతకడం చేతకాలేదు. నెనర్లు అని వాడుకలో ఉంది కాని అర్ధం తెలియకుండా వాడితే ఏం తంటా వస్తుందో అని భయం. ఛాయస్ మీదే. ఏదో ఒకటి మీరే రాసేసు కోండి మీకామెంటు కి. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరే కృష్ణ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

ఆ.సౌమ్య చెప్పారు...

ఆ ఆ వచ్చేసా....మరీ రోజూ మీకు పెడితే అజీర్తి చేస్తుందేమో అని కాస్త గేప్ ఇచ్చాను...ఎంత పచ్చనిది, లేతది అయినా మీ వయసుకి కష్టం కదా, పాపం :)

కామేశ్వరరావు చెప్పారు...

అయ్యా! మీ యీ టపా చదివిన అత్యుత్సాహాతిరేకంలో ఉండబట్ట లేక దీన్ని మా ఆవిడకి చదివి వినిపించాను. ఆ తర్వాత ఏమయ్యుంటుందో నేను చెప్పక్కరలేదు... అదీ విషయం.
కాబట్టి ఈమాటునుండీ ఇలాంటి టపాల్లో కాస్త పెద్దపెద్ద హెచ్చరికలు పెడుతూ ఉండడం మాలాంటి పాఠకులకి ఆరోగ్యదాయకం అని సవినయంగా విన్నవించుకుంటున్నాను :-)

Malakpet Rowdy చెప్పారు...

LOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOL :)))))


TOOO GOOD ... Thank god, my wife cant read Telugu :))

మంచు చెప్పారు...

హ హ హ ... ఎమి రాసారండి... సూపర్ మాస్టారు :-)))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

భైరవభట్ల కామేశ్వరరావు గార్కి,
స్వయంకృతాపరాధాలు అనగా ఇవియే అని గ్రహించారన్న మాట. ఇచట లేబుల్స్, కీవర్డ్స్ లాంటివి పనిచేయవు మాష్టారు.మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు. థాంక్యూ.

మలక్ పేట రౌడీ గార్కి,
రౌడీ లే భయపడీతే మాలాంటి సామాన్యులకి రక్షణ ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాను. థాంక్యూ మీకామెంటుకి, ధన్యవాదాలు.

మంచు గార్కి,
ధన్యవాదాలు, థాంక్యూ.

Malakpet Rowdy చెప్పారు...

"ఎంత పోరినా, హత్యలు చేసినా, ఎంత రౌడీ అయినా, భార్యా బాధితుడే" :))

మంచు చెప్పారు...

మలక్ .. నీ పై కామెంట్ ఇంగ్లిష్ లొ పెట్టవా :-))

Malakpet Rowdy చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Malakpet Rowdy చెప్పారు...

Sure!

The song "ఎంత పోరినా, హత్యలు చేసినా, ఎంత రౌడీ అయినా, భార్యా బాధితుడే"

gets translated into English as

"My wife is the best woman ever born on this planet"

:)))))))))))))))))))))))))))

కొండముది సాయికిరణ్ కుమార్ చెప్పారు...

SUPER

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొండముది సాయికిరణ్ కుమార్ గార్కి,
ధన్యవాదాలు, థాంక్యూ.

మలక్ పేట రౌడీగార్కి,
హహాహహ్హా.

అంతా రామ "మాయ"ము , ఈ జగమంతా ... చెప్పారు...

Very Hilarious Sir, enjoyed reading. Apt reply for AAS and APS. :-)

Though some of these like your posts are hilarious, I'm a bit tired of reading about gender wars in blogs though.( I'm not writing this comment in AAS/APS blogs, 'coz I know they've loads of grass, which I think, they should eat first for maintaining good health, before giving to others, so others will be motivated too !!! ).It's tough with my wife, it's tough with my husband ( like someone cares ! ) - if there's any family counseller in blogs, I wish they can solve all these disputes once and for all !

Please keep writing more Sir. Your hilarity is very much enjoyed !

అంతా రామ "మాయ"ము , ఈ జగమంతా ... చెప్పారు...

ఇంతకీ మీరు AaS, AMS ( AaS == అఖిల భారత అయ్యలన్నల సంఘం ) స్థాపించబోతున్నారా ? ఇక్కడే కామెంట్స్ లో , చాలా మంది మద్దతు పలుకుతారేమో.

ఇంటి గుట్టు ఈశ్వరుడైనా పట్టలేడు అనేది పాత మాట.బ్లాగ్స్ చూస్తె, అందరి ఇంటి గుట్టులు( APS, AMS వల్ల ) తెలిసిపోతుంటాయి, ఏమి బ్లాగు మహిమ !

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అంతా రామమయం.....గార్కి,
ధన్యవాదాలు మీకామెంట్సుకి. నాకు AAS కాని AMS కాని పెట్టే ఆలోచన,అభిరుచి,ఓపిక లేవు. ఇక్కడ నేను సరదాగా, కాలక్షేపం కోసం వ్రాస్తున్న కధలు.ఇందులో ఎవరిని కించపరచడం నా ఉద్దేశ్యం కాదు. ఇంకో విషయం ఇది నా స్వీయచరిత్ర అసలు కాదు. కొంతమంది అల్లా అనుకుంటున్నారేమో నని కూడా నాకు అనుమానం వచ్చింది.ఇది నాకు అర్ధంకావటంలేదు. బ్లాగులో స్వీయ అనుభవాలే రాయాలని నేను అను కోవటం లేదు. కధలు కమామీషులు కూడా రాయచ్చనే అనుకుంటున్నాను. బహుశా నే్ను చేస్తున్న పొరపాటు 1st. person లో వ్రాయడం అవవచ్చు. ఇక మీద 1st. person లో వ్రాయను. I may miss some humour but does it matter?

నేను హాస్యం రాస్తున్నాను అని అనుకుంటున్నాను. కొంత మంది కామెంట్స్ హాస్యంగానే రాస్తారు.నేనూ జవాబుగా హాస్యం ఒలకబోయటానికి ప్రయత్నిస్తాను. ఇవి హాస్యంగానే తీసుకోవాలి తప్ప అర్ధాలు వెతకటానికి ప్రయత్నించవద్దు.

మీరు ఏదో అడిగారు నేను మరేదో రాసినట్టున్నాను.
ఇంకొక మారు థాంక్యూ.