నేను ఎందుకు వ్రాస్తున్నాను ... మూడు

సూత మహర్షి చుట్టూ పరికించెను. మేఘాలలో సమాంతరంగా దూరంగా తమిళ రాష్టంలో  శ్రీవినాయగన్, శ్రీవ్యాసన్ కూర్చునున్నారు. ఈయన చెపుతున్నాడు, ఆయన వ్రాస్తున్నాడు. ఈశాన్య దిక్కుగా బొంగ రాష్ట్రంలో మేఘాల పైన బహు దూరంలో బొసిస్ట బ్రొమ్మరిసి యోగ బాసిస్టం చదుబుకుంటూ ఏగుచుండెను. ఇంకా  పైన స్వర్గానికి దగ్గరగా సప్త ఋషులు వేదపఠనం చేసుకుంటూ అనంతంలోకి వెళ్ళిపోతున్నారు.
దగ్గరగా ఉన్న వ్యాసమహర్షి దగ్గరికి  వెళ్ళి చింతన్ బైఠక్  చేద్దామని నిశ్చయించినవాడై, సూతమహర్షి, శౌనక మహా మునిని పిలిచాడు.
సూతమహర్షి   నాయనా శౌనకా, నేనొక దేవ రహస్యాన్ని తెలుసు కొనుటకై వ్యాస మహర్షి దగ్గరకు  వెళ్ళుతున్నాను. నువ్వు ఇక్కడ ఉన్న ఆది మహా మునులను, మునులను, సాధ్వీ మణులను, సాధ్వీ లలామలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు. ఆ చివరాఖరున పది మంది యమ కింకరి లను కాపలా పెట్టితిని. వారలను కూడా చూచు చుండుము.
శౌనకుడు:  అల్లాగే గురూ గారూ, మొదట వారిని వదలి, చివరాఖరి వారిని బహు జాగ్రత్తగా పరికించెదను. ఇవ్విధంబుగా యమ కింకరి లను కాపలా పెట్టుట బహు రమ్యముగా నున్నది. పొదుపుగా దుస్తులు ధరించిన భూలోక  సినీమా నటీ మణుల వలె సుందరము గా నగుపించు చున్నారు. ఈ జాగ్రత్త ఏలనో?
సూతమహర్షి:   క్రిందటి మారు నేను సత్య లోకమున కేగినప్పుడు, ఆ చివర పంక్తుల లోని చాలా మంది,  మహా మునులు  కాలేని,  పురాణ  కధలు విన నిచ్చగించని, ముని సత్తములు, భూలోకము నకు పారి పోయారు.   అచట స్వామీజీలు, బాబాలు, అమ్మలు, అమ్మాజీలు గా అవతరించారు.  వారికేం తెలియక పోయినా, కధలు చెప్పుతూ, జనులను మభ్య పెట్టుచూ, మేడలూ మిద్దెలూ కట్టించు కొనుచూ, ఖరీదైన వాహనములలో తిరుగుచూ స్వర్గలోక భాగ్యాలను భవించుచున్నారు. కలియుగ ప్రభావమున మనుజులు ఆలోచించ జాలక, మోసగింప బడుతున్నారు.
శౌనకుడు:  అవును మహర్షి పుంగమోత్తమా, రెండు శ్లోకాలు, మూడు పద్యాలు, నాలుగు పాటలూ నేర్చుకొన్న వారందరూ  ఆంధ్ర దేశమున బాబాలు, అమ్మాజీలు గానూ మారుచున్నారని నారద మహర్షి చెప్పినారు.
 సూతమహర్షి:  శౌనకా,  పుంగవా చాలును, దానిని మొత్తనవసరం లేదు.
శౌనకుడు:  అటులనే పుంగవా క్షమించుడు మహర్షి పుంగవా

సూతమహర్షి,  అక్కడ ఉన్న సాధ్వీ  లలామలు,  మునులు కిందకు,  భూలోకమునకు  పారిపోకుండా, శౌనకునకు  తగు  జాగ్రత్తలు సూచించిన వాడై,  దక్షిణాభి ముఖంగా  ప్రయాణానికి  ఉద్యుక్తుడయ్యాడు. ఇక్కడ  అంతర్ధానమై  అక్కడ ప్రత్యక్షమగు సౌకర్యము కలవాడైననూ, సరదాగా మేఘముల లోని ఐసు మీద  స్కేటింగు చేయుచూ, మేఘమునకూ,  మేఘమునకూ కల మధ్య దూరమును అతి  చతురతతో దూకుచూ, ఆనందించుచూ,  సాగి  పోవు చుండగా, పక్కనే  ప్రత్యక్ష మయ్యాడు నారద మహర్షి.
ప్రణామ,  ప్రతి వందన కార్య క్రమాలు జయ ప్రదంగా ముగించిన తర్వాత,

నారద:  నాయనా, సూతా ఎచటికేగుచుంటివి?
సూతుడు:  మహర్షీ,  సర్వాంతర్యామికి ఆంతరంగిక  భక్తులు. తమకు తెలియని విషయము కలదా?
నారద:  విధి విలాసం బహు విచిత్రమైనది సూతా
సూతుడు:  అది ఏమి నారద మహర్షీ?
నారద:  సర్వాంతర్యామి తిరుపతి లో బందీ అయినాడు. అలిమేలు మంగకు కూడా దర్శనం దుర్లభమై పోయినది.  నా లాంటి వారికి  శ్రీవారి దర్శన భాగ్యం కలి యుగాంతమున నేమో.
సూతుడు:  స్వామీ మీరు నారాయణ అని పిలిచిన వారు పలుకుదురని కదా ప్రతీతి.
నారద:  శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు సూతా.  రాత్రి  12.30 గం//  నిద్రపుచ్చి నట్లే పుచ్చి,   1.30 గం// లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ,  దేవేంద్రాది  దేవతలు  పెద్ద పెద్ద  గొంతుకలతో  స్తోత్రము  చేసిననూ వారికి  వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా తుంబుర నాదమెంత?.
సూతుడు:  మరి దీనికి ఉపాయమేదైనా ఆలోచించ లేదా బ్రహ్మా బృహస్పతాది జ్ఞానులు.
నారద:  అదియును అయినది. ఉపాయము బెడిసి కొట్టినది. మరొక అపాయము సంభవించినది
సూతుడు:  అది ఏమి, ఏమాకధా?
నారదన్:  నాయనా సూతన్ నన్ను సతాయించకుము. శ్రీవ్యాసన్ ను అడుగుము.
సూతన్:  అటులనే స్వామిన్, తమిళనాట ప్రవేశించితి మన్నమాట.

అంత దూరమున నారదన్, సూతన్ లను చూచిన  శ్రీఏకదంతన్  అత్యవసర పని మీద వెళ్ళుతున్నానని  వ్యాసన్ తో చెఫ్ఫి మేఘాలలో అంతర్ధాన మయ్యాడు. వ్యాసన్ గారు నారదన్, సూతన్ లను ఆహ్వానించెను.

సూతన్:  మహర్షి వ్యాసన్, మీరు,  విఘ్నేశ్వరన్ ఇచట మేఘాలలో మకాం పెట్టుటకు కారణం బెట్టిది?  మీ కధా కాలక్షేపం సత్య లోకమున గదా జరుగ వలసినది.
వ్యాసన్:  అవును నాయనా, కానీ సత్యలోకమున జలము నిండు కొనుట వలన ఇచట ఉంటిమి.
సూతన్:  మహర్షీ వివరముగా సొల్లుడీ
వ్యాసన్:  వినాయక చవితి జయ ప్రదంగా ముగిసిందని భక్తులందరూ సంతసించితిరి. కానీ, కలుష భూయిష్టమైన లడ్డూలు, కుడుములూ ఆరగించిన పార్వతీనందనన్ కు అజీర్తి చేసినది. సత్య లోకమున నీటి కరవు వలననూ, ఇచట మేఘాలలో నీరు సమృద్ధిగా నుండుట వలననూ, మాటి మాటికి నీటి అవసరం తీరు నందాక , వారు ఇచట వసించుటకు నిశ్చయించారు.
సూతన్:  సత్య లోకమున నీరు లేకుండుట నాశ్చర్యముగ నున్నది.
నారదన్:   సూతా కొన్ని దేవ రహస్యము లుండును. అవి పురాణాలలో చెప్ప బడవు. సమయం, సందర్భం కలసి వచ్చినందున నే నీ కెరుక పరిచెద గాక. సావధానుడవై ఆలకించుము. పూర్వ బ్రహ్మల కాలములో మునులు, రాక్షసులు, పని లేని వారు, ఘోర తపం బాచరించెడి వారు. వారి తపాగ్ని సత్య లోకమున వ్యాపించి నీరు నావిరి చేసెను. నీరు లేక పోవుట వలన నవబ్రహ్మ విష్ణువు నాభి కమలమున జన్మించ వలసి వచ్చెను కదా.
సూతన్:  అది ఎట్లు స్వామిన్.?
నారదన్: సూతా నీవొక సందేహాల పుట్టవి. కమలము పుట్టుటకు నీరు కావలెను గదా. సత్యలోకమున నీరు ఇల్లె.  కైలాసమున మంచు గడ్డలలో కమల ముద్భవించదు కదా. అందువలన విష్ణు లోకమున జన్మించవలసి వచ్చెను.
సూతన్:  వైకుంఠము పాల  సముద్రమున నున్నది కదా. అచట నీరెట్టుల వచ్చెను?
నారదన్:  ఆహా సూతన్, తెలివైన ప్రశ్న వేసితివి.
సూతన్:   అవును, స్వామిన్, నేనెపుడునూ అంతే.
 నారదన్: పాల సముద్రం  శ్రీమన్మహాలక్ష్మికి  వారి తండ్రి గారు అరణము గా నిచ్చితిరి. ఒకానొక సమయము న శ్రీహరి కి శ్రీలక్ష్మి కి కలహము సంభవించెను. అపుడు శ్రీసతి తాను పాలు తాగి, పాలలోని నీరు శ్రీపతి చే తాగించెను. ఆ విధంగా శ్రీనాధుడి ఉదరమున మంచినీటి సరస్సు వెలసెను. కమలము జనియించెను. కమలం పుట్టగానే చటుక్కున నవబ్రహ్మ అందులోకూర్చుండి పోయెను  
సూతన్:   ఆహా, బ్రహ్మ నాభి కమలమున పుట్టుటకు ఇంత వృత్తాంతము గలదా. సరే మరి సత్య లోకమున నీటి కొఱత తీరుటెట్లు?
నారదన్:  నేనుంటిని గదా త్రిలోక సంచారిని. కైలాసం నించి వారాని కొక మారు రెండు టన్నుల ఐసు తెచ్చి పడవేయుచున్నవాడ. దానితో వారు సరిపెట్టు కుందురు.

ఇంతలో శ్రీగణేశన్ అత్యవసర పని ని పూర్తి చేసుకొని వచ్చెను.
శ్రీవినాయగన్: అందరూ కుశలమేనా, ఎచట నుండి రాక ఇటకున్ సూతా ఆఆఆఆ, సుఖులే శిష్యగణముల్, సాధ్వీలలామలున్ , ఆఆఅఆఆఆఅఆఆ
సూతన్:  స్వామీ మీరు రాగ మాపినచో ప్రత్యుత్తర మిచ్చెదను.
శ్రీవినాయగన్:  అది సరే, ఇచటకు నారద సహితులై  మీ రాక లోని అంతరార్ధ మేమి?
సూతన్:  తమకు తెలియని బ్రహ్మ రహస్యము లుండునా లంబోదరన్.
లంబోదరన్:   అంతయూ గ్రహించితిని. భూలోకమున ఆ ఎనానిమస్ యోగాభ్యాసం, త్రిలోకముల నలజడి ఇదియే గదా.
సూతన్:  అవును స్వామిన్, ఈ ఉపద్రవము నాపుటెట్లు?.
వ్యాసన్: అసలు ఈ కధ  ఏమి మలుపులు తిరగనున్నది. నేను మరల నొక పురాణము రాయ వలసిన అగత్యము దాపురించుచున్నదా?
నారదన్:  లేదు వ్యాసన్ నీవు రాయ నఖ్ఖర లేదు. వాడే రాయుచున్నాడు.
గజాననన్:  వాడు బ్లాగులో బరుకుచుండును. వాడు యోగాభ్యాసమొనర్చిన, వాని శరీరమున జ్యోతి ప్రజ్వలించును. ఆ  జ్యోతి  ప్రభావమున  సూక్ష్మ రూపుడై   త్రిలోక సంచారము   చేయగలడు.  త్రిలోకములలో పనీ పాడు లేని వారందరికి బ్లాగోపనిషత్తు నుపదేశించును. ముఖ్యముగా సూతమహర్షి యాశ్రమము న జొచ్చి, వినుటయే గాని మరి యొక పని లేని,    సూతుని కధలు వినుటకు నిచ్చగించని వారికి కూడ బ్లాగోపనిషత్తు నుపదేశించును. సాధ్వీమణులు కాలేని సాధ్వీ లలామలు, మహామునులు కాలేని మునులు వీని ప్రభావమునకు లోనై , వీడు ఉచితముగా నిచ్చు లప్పుటప్పు లను పట్టుకొని భూలోకమున బ్లాగులలో జొరబడుదురు. భూలోకమల్ల కల్లోల మగును.
వ్యాసన్:  అది ఎట్లు స్వామిన్?
గజకర్ణన్:  శ్రీ శ్రీ అని యొక మహాకవి యుండెడివాడు. ఆయన కవిత్వము రాయు వారల కొక ఉపదేశము  చేసెను,
తలుపు గొళ్ళెం
హారతి పళ్ళెం
గుఱ్ఱపు కళ్ళెం
కాదేది కవిత కనర్హం

దీనిని ఆదర్శంగా తీసుకొని బ్లాగులలో వ్రాయు కొందరు,
అరటి తొక్కా   కందముక్కా
కాలీఫ్లవరూ   కాకరకాయా
పాలవాడూ   నీళ్ళవాడూ
కూరలోడూ   కరెంటోడూ
ముద్దపప్పూ  ఆవకాయ
ఉప్మాకూరా    ఉప్పేలేని కూరా
మాడిన వేపుడు   ఉడకని అన్నం
మింగే మొగుడు   తినని పెళ్ళాం
అంటూ
ఏది చూస్తే   అదే రాస్తూ
ఏది తోస్తే    అదే రాస్తూ
అదే రాస్తూ  అదే రాస్తూ
బ్లాగు పాఠకుల
బుఱ్ఱే తింటూ  బుఱ్ఱే తింటూ
రాసేస్తున్నార్  బరికేస్తున్నార్
ఏమిటిదంటే
ఎందుకంటే  ఎందుకంటూ
రాసేసాడు   రాసేసాడూ
వీడో   మహా  పురాణం

ఈవిధంగా విజృంభించి రాసేస్తున్న భూలోక బ్లాగర్ల కి త్రిలోక వాసులు కూడా తోడైతే బ్లాగు పాఠకుల పని
శ్రీమద్రమారమణ గోవిందో హరి:   

ఇతి బ్లాగోపనిషత్తే  నేనెందుకు వ్రాస్తున్నాను  మహా పురాణ:  సమాప్త:

బృహస్పతి ఏమి ఉపాయం చేసాడు?
వీసా వెంకటేశ్వర స్వామి చిలుకూరు లో వెలియడానికి గల కారణాలు ఏమిటి?
విదేశీ కాన్సలేటు వాళ్ళు V V రికమండేషను ఎందుకు ఒప్పుకుంటారు?   T V S ను ఎందుకు ఒప్పుకోరు?
ఇంతకీ ఎనానిమస్ యోగా చేసాడా?
ఇల్లాంటి ప్రశ్న లన్నీ వచ్చేస్తున్నాయా మీకు?
వేద శాస్త్రములు చదివిన వారికే తెలియని బ్రహ్మ రహస్యం ఎనానిమస్ కి ఎలా తెలుస్తుంది? 

పి.యస్.: బ్లాగు లో పరిచయమైన మా చిన్నమ్మాయికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు. నేను ఎందుకు వ్రాస్తున్నానుమూడు భాగాలు  ఓపిక గా చదివి అవసరమైన చోట మార్పులు చేసి నందుకు.

32 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హ్హా.. ఇక చాలు బాబోయ్ మీ బ్లాగోపనిషత్తు..:) ఇక్కడ నవ్వలేక నేను టపా కట్టుకుపోయేటట్లు ఉన్నాను కైలాసానికి..:)) ముఖ్యం గా ఇవి చదివినప్పుడు నా కళ్లలో నుండి అన్ని రకాల నదులూ ప్రవహించేశాయి ఆనంద బాష్పాలుగా..
>>>
శ్రీవెంకటేశ్వర స్వామి ఒక విధమైన నిద్ర మత్తు లో ఉంటున్నారు సూతా. రాత్రి 12.30 గం// నిద్రపుచ్చి నట్లే పుచ్చి, 1.30 గం// లకు సుప్రభాతం పాడుతున్నారు. వారికి విశ్రాంతి, నిద్ర రెండు నూ లేవు. వారి వంటిమీద, వారి ఖజానాలోనూ యున్న ఆభరణములు మాయమైననూ వారికి తెలియ లేదు. బ్రహ్మ, శివ, దేవేంద్రాది దేవతలు పెద్ద పెద్ద గొంతుకలతో స్తోత్రము చేసిననూ వారికి వినిపించుట లేదు. నేనెంత, నాగొంతు కెంత, నా తుంబుర నాదమెంత?.
వాడు బ్లాగులో బరుకుచుండును. వాడు యోగాభ్యాసమొనర్చిన, వాని శరీరమున జ్యోతి ప్రజ్వలించును. ఆ జ్యోతి ప్రభావమున సూక్ష్మ రూపుడై త్రిలోక సంచారము చేయగలడు. త్రిలోకములలో పనీ పాడు లేని వారందరికి బ్లాగోపనిషత్తు నుపదేశించును. ముఖ్యముగా సూతమహర్షి యాశ్రమము న జొచ్చి, వినుటయే గాని మరి యొక పని లేని, సూతుని కధలు వినుటకు నిచ్చగించని వారికి కూడ బ్లాగోపనిషత్తు నుపదేశించును. సాధ్వీమణులు కాలేని సాధ్వీ లలామలు, మహామునులు కాలేని మునులు వీని ప్రభావమునకు లోనై , వీడు ఉచితముగా నిచ్చు లప్పుటప్పు లను పట్టుకొని భూలోకమున బ్లాగులలో జొరబడుదురు. భూలోకమల్ల కల్లోల మగును.

ఆ.సౌమ్య చెప్పారు...

మహానుభావా ఎక్కడి నుండి ఎక్కడికి లాక్కొస్తున్నారు,తమరికే చెల్లింది స్వామీ.
అన్నిటికన్నా హైలైట్ "పుంగమోత్తమా"...మూడు సార్లు చదివితేగానీ అర్థం కాలేదు ఆ మొత్తడమేమిటో. :D

ఇంతకీ తమకు దొరికిన చిన్నమ్మాయి ఎవరో??????????

జ్యోతి చెప్పారు...

Simply Superb... ఇంతకంటే పెద్ద పదం దొరకలేదు. తెలుగు రాదురాదంటూనే ఇంతా బాగా ఎలా రాస్తున్నారండి. నవ్వించి చంపేస్తున్నారు..:)..

astrojoyd చెప్పారు...

బులుసువారి వంశంలో మీరొక కాకరకాయలా ఉన్నారే?హాస్యానికైనా పురాణాలను అందులోని పాత్రలను విమర్శించడం వల్ల,మీరేతువంటి అవస్థలు పడాలో'బ్రమ్హ వ్య్వర్తన-ప్రకృతి ఖండంలో ఉంది చదివి ధన్యులుకండి సర్

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

చక్కగా రాయగలిగిన శక్తి మీకు ఉంది. ఆ విషయంలో మీకు అభినందనలు.
పెద్దవారు, మీకు చెప్పగలిగేదాన్ని కాదు. పురాణాలని ఈవిధంగా అపహాస్యం చేయటం బాధగా ఉంది.

అజ్ఞాత చెప్పారు...

Your writings are good. But what you are writing is not good. You would not had written like this.

ఆ.సౌమ్య చెప్పారు...

సరదాగా రాసినదానికి కూడా కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతారా....హేవిటో వింత!

అజ్ఞాత చెప్పారు...

అబ్బ, మొదలైందండీ, తొక్కలో గోల! హాస్యాన్ని హాస్యంగా చూడలేరు. ఎప్పుడు ఏ గోల లేపుదామా అనే చూస్తారు! సూతుడు, శౌనకుడూ వీళ్ళ చుట్టాలైనట్టు!

అజ్ఞాత చెప్పారు...

kids do mistakes without knowing anything and elder people are insulting epic just please select someother topic or write the same topic without insulting maha rishi

అజ్ఞాత చెప్పారు...

they are not our relatives,dont respect them atleast dont insult them

అజ్ఞాత చెప్పారు...

పెద్దరికం వయసుతో రాదు.

astrojoyd చెప్పారు...

@ఆ.సౌమ్య/Anonymous--మనిషన్నవాడు పోరాపాతునైనాగాని,హస్యానికిగాని వినకూడనివి,రాయకూడనివి,చెప్పకూడనివి,చదవకూడనివి కొన్ని ఉన్నాయి.అవి ౧.దేవ/గురు/మాత్రు/వేద/పురాణ దూషణలు.వీటిని ఆచరించినవారి నేత్ర/కర్ణ/గలముల్లో ,సీసాన్ని కరిగించి పోయామన్నారు మహారుషులు.ఇట్టివారికి,వారు చేసిన దూషణల ప్రకారం నరకంలో ఎటువంటి యాతనలున్తాయో చెప్పబడి ఉన్నాయి మరి.వారిని విమర్శించే హక్కు.అర్హతలు మనకి లేవని గ్రహించాలి.ఈ పోస్ట్ రాసింది ఒక రేటిఎర్డ్ ఇంజనీర్..అని మరువకండి మిత్రులారా.మార్గనిర్దేశం చేయవలసినవారు కామెడీలు చేయరాదు+రాయరాదు.

astrojoyd చెప్పారు...

@Anonymous said.../చుట్టాలకన్నా చాలా ఎక్కువ గౌరవనీయులు కనుకనే సర్

అజ్ఞాత చెప్పారు...

akkadekkado jaatakam cheptaanu ane saakuto kotlamandi jatipitaga gauravinche gandhiji ni ekutunte chakalu guddukunna "peddalaku " anipinchaledaa kaasto koosto unna desabhakti kooda igiripoyela chinnalanu tappu dova pattistunna vratalu vrastunna aa" peddavadiki" buddi cheppaalani. tagudunammaa antu edo hasyaniki saitair raasukunte meeda padi potunnaaaru.

Idiotic double standards " ante ive mari. Don't respect but don't insult ane annichotla applicable kada..

kevalam dvesha bhavam to vrase aa raatalu goppa vi ayinapudu hasyaaniki vrase ee raatalu tappayyaayaa jayadevayya garu.

..nagarjuna.. చెప్పారు...

>>శ్రీవారికి నిద్రాలేదు, విశ్రాంతిలేదు
>>శ్రీవ్యాసన్, వ్యాసన్, శ్రీవినాయగన్

హహ్హహ్హహ్హహ.....సూపరు గురువుగారు
ఇవన్నీ బాగున్నాయిగాని మధ్యలో మా బ్రొమ్మరిసిని ఎందుకు ఇరికించారు అంట..??

@ఆ.సౌమ్య:గురువుగారు ఇలానే వ్యాహ్యాళికి వెళ్తుంటే దారిలో వాళ్ల చిన్నమ్మాయి కనడిందిలెండి..పేరు అదేదో ఉందే...ఆ..షోమ్-య అంట.. :)

jaggampeta చెప్పారు...

orinayino ilaaga kooda rayavachcha

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి, ఆ. సౌమ్య గార్కి, జ్యోతి గార్కి, కొంతమంది అనానిమస్ లకు,

మీకు ధన్యవాదాలు. థాంక్యూ మీ కామెంట్ల కి
హాస్యాన్ని హాస్యం గానే ఆనందించిన మీకు మరొక్క మారు ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మందాకిని గార్కి, మిగతా కొందరు అనానిమస్ గార్ల కి,

నేను రాయగలను అన్నందుకు ధన్యవాదాలు. ఇది నేను హాస్యంగానే వ్రాసాను. నా ఈ రచన మీకు అపహాస్యం అనిపిస్తే, మీ మనోభావాలు గాయపడితే I am sorry.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Astrojoyd gaarki,


థాంక్యూ మాష్టారు మీ కామెంట్ల కి. ఇంతకన్న ఏంచెప్పగలను.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇంకో అనానిమస్ గార్కి,
నిజమే సారూ, పెద్దరికం వయసు తో రాదు. జుట్టు నెరిసినా, లేని పెద్దరికం మీద వేసుకున్నాకూడా రాదనుకుంటాను. ధన్యవాదాలు మీ కామెంట్లకి.

ఇంకో అనానిమస్ గార్కి,
నన్ను మీరేమైనా అన్నా ఫరవాలేదు. మీరు సరదాగానే రాసుండవచ్చు. కాని ఒక కామెంటు రాసిన వారి గురించి అల్లా రాయడం బాగా లేదనిపించింది. Sorry for deleting the comment. And thank you for the comment

కొత్త పాళీ చెప్పారు...

brilliant!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇంకో విషయం మా చిన్నమ్మాయి ఎవరో నాకు కూడా తెలియదు. ఒక అనానిమస్ పేరుతో పరిచయం చేసుకుంది. ఆమె ఆ.సౌమ్య గారు కాదు.


ఇంకో ఎనిమిది కామెంట్లు వచ్చాయి. ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వారు బాగానే ఉందని రాసారు. కాని ఈ చర్చ ఇంతటి తో ఆపేస్తే బాగుంటుందనిపించింది. సరదాగా రాసిన ఈ టపా ఇటువంటి చర్చకు దారి తీస్తుందని ఊహించలేదు.
కామెంట్లు రాసిన వారందరికి, జవాబు ఇవ్వలేక పోతున్నందుకు క్షమించమని కోరుతున్నాను.
ఇంక కామెంట్లు ఈ టపాకి వ్రాయవద్దని కోరుతున్నాను

జేబి - JB చెప్పారు...

మీరు వ్రాయవద్దన్నా, చదివి ఆనందించినందుకు నా స్పందన, నా ఆనందం తెలియజేయుట నాకు సంతోషం, నా ధర్మం. ప్రచురించడమా లేదా మీ ఇష్టం.

మూడు భాగాల్లోనే ముగించడం నాకు నచ్చలేదండి.

వినాయకుడిపై, అతని చిట్టెలుకపై వ్యంగ్యం రాయడం, సంక్రాంతిముగ్గులు, ఉగాది పచ్చడిపై కార్టూన్లు చాలామంది వేసి/చదివి ఆనందిస్తారు కదండీ, ఇదీ అలాంటిదే.

~జేబి.

అజ్ఞాత చెప్పారు...

మాస్టారూ, మీ బ్లాగు లో కామెంటు పెట్టిన ఆమె మీద కామెడీ కామెంట్ ని రెజెక్ట్ చేసారు, మరి మేమంతా దేవుల్లుగా భావించే వాల్ల మీద ఇలాంటి వెకిలి హాస్యాన్ని సమర్ధించుకోవడం హాస్యాస్పదం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈవేళ ఉదయం కామెంట్స్ ఫర్ మోడరేషన్ చూస్తుంటే పొరపాటున ఒక కామెంటు పబ్లిష్ అయింది. అది ఇప్పుడే గమనించాను. ఒకటి పబ్లిష్ అయిన తర్వాత, మిగతావి ఆపడం భావ్యం కాదనిపించింది. అందుకని పబ్లిష్ చేస్తున్నాను. డిలీట్ చేసిన కామెంటు కి సంబందించిన కామెంటు డిలీట్ చేస్తున్నాను. వారు సహృదయంతో అర్ధం చేసుకొని క్షమిస్తారని ఆశిస్తున్నాను.

ఈనాటె బ్లాగు పోకడల గురించి సరదాగా, నవ్వుకోవడం కోసం వ్యంగంగా రాసిన వ్యాఖ్యానం “నే నెందుకు వ్రాస్తున్నాను” అన్న నా రచన. ఇందు కోసం అలనాటి పురాణ రచయితలని, కధలు చెప్పిన వారిని , గురించి కొంచెం సరదాగా, హాస్యం కోసం రాయడం జరిగింది. అంతే తప్ప వారిని, తద్వారా పురాణాలని కించపరచడం నాఉద్దేశ్యం కాదు. ఒక వేళ ఎవరైనా అల్లా అభిప్రాయపడితే వారికి నా క్షమార్పణలు చెప్పుతున్నాను.

పురాణాల గురించి, మతం గురించి కాని చర్చించే టంతటి జ్ఞానం నాకు లేదు. అది ఈ బ్లాగులో నా ఉద్దేశ్యం కాదు. సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నాను.

ధన్యవాదాలు. థాంక్స్.

RNP చెప్పారు...

@astrojoyd గారూ,

మనిషన్నవాడు పోరాపాతునైనాగాని,హస్యానికిగాని వినకూడనివి,రాయకూడనివి,చెప్పకూడనివి,చదవకూడనివి కొన్ని ఉన్నాయి.అవి ౧.దేవ/గురు/మాత్రు/వేద/పురాణ దూషణలు.వీటిని ఆచరించినవారి నేత్ర/కర్ణ/గలముల్లో ,సీసాన్ని కరిగించి పోయామన్నారు మహారుషులు.

బాగా చెప్పారు !

ఇన్ని విషయాలు తెలిసిన మీకు - ఈ బ్లాగ్ పేరు " నవ్వితే నవ్వండి" కాబట్టి ఇందులో కామెడీలు ఉంటాయని మీకు తెలియకపోటం ఆశ్చర్యంగా ఉంది.

ఈ విషయం కూడా తెలుసుకోలేనిది ఒక టీ.వీ. జర్నలిస్ట్ అని మరువకండి మిత్రులారా.

ఈ టపాలో మొదటి పదమే సూత మహర్షి అని ఉంది.కాబట్టి పొరపాటున గానీ, హాస్యానికి గానీ ( ఇదసలే నవ్వుల బ్లాగ్ ) ఇందులో దేవ/గురు/మాత్రు/వేద/పురాణ దూషణలు ఉన్నాయేమో అనే అనుమానం మీకు వచ్చి, భయంతో అప్పుడే చదవకుండా పారిపోవలసింది.

ఎందుకంటే, మనిషన్న వాడు చదవకూడనివి, వినకూడనివి చదివితే ఏమవుతుందో మీకు తెలుసు గనక.

దీన్ని బట్టి మీకు కూడా నరకంలో మీరు చెప్పిన సన్మానాలు ఎదురు చూస్తున్నాయి అన్నమాట ( మనిషి అన్న వాడు చదవకూడనివి చదివారు కదా ). మరి మీతో పాటు కొంత మంది చదివేశారు కదా, మరి ఇప్పుడెలా ? మీకు ( + ఈ బ్లాగ్ చదివిన వారు ) చేసిన ఘోర పాతకానికి పరిహారం ఉన్నట్టు నాకు అనిపించట్లేదు.

కాబట్టి నరకంలో మీ వంటి మహా మనీషికి కూడా? ( ఇక మిగితా వారెంత ?) బోల్డు సన్మానాలు( మీరు చెప్పినవి అన్నీ ) జరుగుతాయి అనిపిస్తోంది. మీకు నా ప్రగాఢ సానుభూతి.

>>మీరేతువంటి ,పోరాపాతునైనాగాని,గలముల్లో,యాతనలున్తాయో ,రేటిఎర్డ్

జర్నలిస్టుల వంశంలో మీరొక కాకరకాయ లా ఉన్నారే ? తెలుగు తెలిసిన వారు చదివి నొచ్చుకోకుండా ఉండలేనన్ని అచ్చు తప్పుల తెలుగు రాస్తున్నారు మీరు.

ఇలాంటి అప్పుతచ్చులు రాస్తున్నది ఒక జర్నలిస్ట్ అని మరువకండి మిత్రులారా.

భావి జర్నలిస్టులకి మార్గనిర్దేశం చేయవలసిన తమ వంటి వారే ఇలాంటి పంటి కింద రాళ్ళ లాంటి అప్పుతచ్చులు రాయరాదు + మాట్లాడరాదు అని మనవి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఒక ఎనానిమస్ గార్కి,
ధన్యవాదాలు మాష్టారు మీకామెంట్లకి. థాంక్యూ.

నాగార్జున గార్కి,
ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి. మీ గెస్ తప్పు అని చెప్పుటకు విచారించుచున్నవాడన్. థాంక్యూ.

జగ్గంపేట గార్కి,
థాంక్యూ మీ వ్యాఖ్యలకి. నేను ఇల్లాగే వ్రాస్తాను మీరు చదువుతానంటే. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తపాళీ గార్కి,

ధన్యవాదాలు. మీకామెంటు కి. థాంక్యూ

J B-జే బి గార్కి,
మీ వ్య్ఖాఖ్యలు చదివి కడుంగడు నానంద భరితుడ నైతిని. ఇంకోటి రాద్దామనే ఉత్సాహం కలుగుతోంది. థాంక్యూ, ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

RNP గార్కి,

ధన్యవాదాలు. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Astrojoyd గార్కి,

మీకు జవాబు వ్రాద్దామని అనుకోలేదు, ఎందుకంటే మీస్థితికి దిగజారి, మాట్లాడే అలవాటు నాకు లేదు, చాతా కాదు. మీరో టి.వి జర్నలిస్ట్ అని తెలిసింది. సద్విమర్శకి కువిమర్శకి మీకు తేడా తెలియక పోవడం చాలా దురదృష్టకరం.

మీకు ఒకందుకు థాంక్స్ చెప్పుకోవాలి. విషం కక్కడం అంటే ఇదివరకు నాకు తెలియదు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఒక ఎనానిమస్ గార్కి,

Thank you for your kind advice. నేను సంయమనం పాటిస్తున్నాను. వారు వ్యక్తిగత దూషణకి దిగినా నేను పట్టించుకోలేదు. కానీ సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. అది వారు తెలుసు కుంటారనే ఆశిస్తున్నాను. మీ సలహాలకు సదా కృతజ్ఞుణ్ణి. ధన్యవాదాలు.
నా రచనలు మీకు నచ్చినందుకు ధన్యవాదాలు.

నేను అన్ని కామెంట్లు పబ్లిష్ చేసాను. ఒక్కటి తప్ప. ఒక మాటు చూడగలరు. ఈ మీ కామెంటు నేను పబ్లిష్ చేయటంలేదు. మీరు నాకిచ్చిన సలహా కాబట్టి. నా జవాబు ఇక్కడ పెట్టుతున్నాను. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇంకో ఎనానిమస్ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. నేను పురాణాలు ఆట్టే చదవలేదు. కాబట్టి వాటి గురించి చెప్పే అర్హత నాకు లేదు. ఏపురాణమైనా, మతమైనా మనిషి ని సన్మార్గంలో నడిపించడానికి, సత్ప్రవర్తన అలవర్చుకోవాలని బోధిస్తాయి. అది అందరూ చెపుతున్నారు. మళ్ళీ ఈ విషయం మీద నాబ్లాగులో చెప్పాల్సిన అవసరమూ లేదు.

మీరు చెప్పిన రెండొ విషయం మీద నేను వ్యాఖ్యానించను. ఇది అనవసర చర్చకు దారి తీసే అవకాశం ఉంది. అందు చేత మీ కామెంటు పబ్లిష్ చేయటంలేదు.