మా ఆవిడ- నా పెళ్లి చూపుల ప్రహసనము

నాపేరు ప్రద్యుమ్నుడు. నేను మాఊరు భీమవరానికి సుమారు 3000 kms  దూరంలో అస్సాం లో  ఓ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో సైంటిస్టు గా పనిచేస్తూ హాయిగా బతికేస్తున్నాను.  

మా నాన్న గార్కి ఉన్నట్టుండి ఒక అనుమానం వచ్చింది. అక్కడెక్కడో నేను అస్సాంలోని జోర్హాట్ లో సుఖపడిపోతున్నానేమోనని.   జీవితం అంటే సుఖాలే కాదు కష్టాలు కూడా ఉంటాయి, కాదు ఉండాలి అని తీర్మానించుకొన్నవారై నాకు ఒక ఉత్తరం వ్రాసారు. 

“నాయనా పుత్రరత్నమా నీకు సంబంధాలు చూస్తున్నాను. వీలు చూసికొని వచ్చి పెళ్ళి చేసుకొని సంసార సాగరంలో దూకు” అని. నేను వెంటనే యమర్జంటుగా తిరుగు టపాలో జవాబు వ్రాసాను. 

“నా ప్రియ జనకా, నా క్షేమం కోరు మీరు ఇటువంటి పని చేయ తగునా మీకిది తగదు తగదు. ఏదో నాలుగిళ్ళలో వారాలు చెప్పుకొని హాయిగా బతుకు తున్నాను. నన్నిటుల ఒక గూటి పక్షిని చేయ తగదు.” అని. 

 “ నేను పడుతున్నాను, మీ అన్నగారు పడుతున్నారు కష్టాలు. నువ్వు తప్పించు కుంటానంటే కుదరదు కాక కుదరదు.” అని మళ్ళీ వారు ఉత్తరంలో గంభీరంగా ఉద్ఘాటించారు.  

అయినా ఈ తల్లిదండ్రులకు,  ఇల్లా పిల్లలని ముఖ్యంగా మగపిల్లలని సంసార కూపంలో పడవేసి వాళ్ళు మునగలేక, తేలలేక  హే కృష్ణా, ముకుందా, మురారీ   అని పాడుతుంటే విని ఆనందించాలనే  బలీయమైన కోరిక ఎందుకు కలుగుతుందో నాకు అర్ధం కాదు. ఆడ పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా  ఈ అణుబాంబును  ఎవరింట్లో నైనా పడవేసి బాధ్యత తప్పించుకోవాలనే కోరిక, వాళ్ళకి ఉండడంలో తప్పు లేదు. మగ పిల్లల తల్లిదండ్రులు,  సంసార సాగరాన కష్టాలు  అనంతమని, మునిగేవాడు మగాడే అని తెలిసి కూడా ముక్కు పచ్చలారని పసి బాబును పెళ్లి అనే బంధంలో ఎందుకు ఇరికిస్తారో?   విధి బలీయమని చెప్పి, నన్ను విధి వంచితుడను చేసి యావజ్జీవ శిక్ష కు నన్ను ఒప్పించారు మా వాళ్ళు అందరూ కలసి.

నేను సైంటిస్టు ని అవడంవల్ల ప్రతిదీ ప్రణాళికా బద్ధంగా చేయాలని అనుకుంటాను. ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్న తరువాత వాట్ నెక్స్ట్ అని ఆలోచించాను. పెళ్ళిచూపులు అనే ఒక మహత్తర  పరీక్షా కార్యక్రమం ఉంటుందని గ్రహించాను. ఈ విషయమై చర్చించుటకై  నా మిత్ర మండలి సమావేశం ఏర్పాటు చేశాను. మిత్రమండలిలో  నేను కాక, ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామీ) మరియు పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం) వరుసగా విజయవాడ, హైదరాబాదు లలో పెరిగిన  మలయాళీ, తమిళ సోదరులు,  సభ్యులు. 

అసలు ఈ పెళ్లి అనగా ఏమి అని పృచ్చించాడు ఉకృనామీ.  నేను ఉగ్ర నరసింహ మూర్తి నై  పోయాను.  వాట్ ఈజ్ దిస్? జిస్ దేశ్ మే గంగా బెహతీ హై  లో పుట్టి,  పవిత్ర గోదావరి, కృష్ణా ల జలం `పీ తూ ,  ఇల్లాంటి ప్రశ్న వేయడానికి నీ బుద్ధి కేమి రోగమొచ్చింది అని కోప్పడ్డాను. పెళ్లి అనగా వివాహం అనగా నూరేళ్ళ పంట.  మూడు ముళ్ళ బంధం అనగా  రెండు మనసులు,  రెండు తనువులు, రెండు కుటుంబాలు, రెండు వంశాలు, ఇంకా ఇంకా బోలెడు రెండులు ఒకటయ్యే వ్యవస్థ . సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం అని పురాణాలు ఘోషిస్తున్నాయి. మేరా భారత్ మహాన్ లో ఈ వివాహ వ్యవస్థకు సమున్నత స్థానం కలదు. ఈ యొక్క  వివాహ వ్యవస్థను అమెరికా అను దేశం లోనూ, జర్మని దేశం లోనూ మరియు అయిస్లాండ్ దేశస్థులున్నూ చాలా ఇష్టపడెదరు. వారందరూ జంటగా మన దేశమునకు విచ్చేసి ఈ విధానమును కూలంకషము గా నభ్యసించి వివాహ భోజనమ్ము లారగించి స్వదేశముల కేగి విడాకులు తీసుకొనిరని ఎరుగవా అని క్రోధముగా  నుపన్యసించితిని.  

పశినీకం  నన్ను శాంతపరచి, ఉకృనామీ ని సమాధానపరచి,   మా తక్షణ కర్తవ్యమును ప్రభోదించుము అని అడుగుకొనెను. నేనప్పుడు శాంత స్వరూపుడనై ఈ కింది విధముగా వచియించితిని.  మిత్రులారా వివాహము అను బృహత్కార్యములో పెళ్లి చూపులు అనగా మారేజి లుక్సు అనునది ప్రధమ సోపానం. పెళ్ళిచూపులు అనగా పరస్పర ప్రశ్నోత్తర కార్యక్రమము. వాట్ టు పూచ్? అండ్ హౌ టు ఆన్సర్? అను విషయమై మీ సలహాలను అర్ధించుచున్నవాడను, అని విశదీకరించితిని. 

నా మిత్రులిరువురు దీర్ఘముగా నిశ్వసించి, ఇది గంభీర సమస్య యగుటచే, దీర్ఘము గా నాలోచించ వలయును కాబట్టి, హిందూస్థాన్ ఇయర్ బుక్, హూ ఈజ్ హూ అండ్ జెనరల్  నాలెడ్జి  గ్రంధములు చదివి మూడురోజుల తరువాత మరలా సమావేశమై చర్చించెదము అని నుడివిరి. 

తదుపరి సమావేశం లో ఉకృనామీ “నేనొక 10 ప్రశ్నలను తయారు చేసితిని” అని చెప్పగానే “నేనొక 10 జవాబులను తయారు చేసితిని” అని  పశినీకం  తెలియపర్చెను. అమెరికా అధ్యక్షుని పేరేమి? భారత ఆర్ధిక మంత్రి పేరు చెప్పగలవా? భారత రాజధానికి నేపాలు రాజధానికి మధ్య దూరమెంత? గుడ్డులోని పచ్చసొన లోని పోషక పదార్ధములను వివరింపుము? ఇల్లాంటి ప్రశ్నలు ఉకృనామీ చదవగానే  వాటికి జవాబులు పశినీకం చెప్పేడు. 

నాకు అరికాలి మంట నెత్తికి ఎక్కింది. అన్నీ ఇటువంటి ప్రశ్నలు కాదు. వారి వారి  అభిరుచులు, రుచులు, భావములు తెలుసుకొను ప్రశ్నలు కావలెను. అయినా ప్రశ్నలు లా కాకుండా అభిప్రాయములు పంచుకొను విధముగా నుండవలెను, అని  వివరించితిని. 

పరస్పర అవగాహనా కార్యక్రమం,  గ్రూప్ డిస్కషను ఇత్యాదులలో అనుభవా రాహిత్యము వల్ల నీకు అవసరమగు ప్రశ్నావళి తయారుచేయుటకు మేము అశక్తులము అని శోకతప్త హృదయులై  భోరు మని వారు విలపించిరి.

నేనునూ విచార గ్రస్తుడనై, చింతాక్రాంతుడనై ఈ పెళ్లి చూపులు అను నదిని దాటి వివాహము  అను సాగరము చేరుట ఎట్లు అని చింతించుచూ రావు గారి గృహంబునకు నరిగితిని. నా వెనకాలే మిత్రులిరువురు అరుగుదెంచిరి. 

నే  నరుగునప్పటికే  అచట రావు గారు, భావన అక్కయ్య, శాస్త్రి అంకులు, కామేశ్వరి ఆంటీ, Dr. రఘుపతి, మిసెస్ సుధా రఘుపతి కూర్చొని అడ్డాట ఆడుకుంటున్నారు. 

భావనా అక్కయ్య కోపంగా అంటున్నారు ”రావు మహాశయా తురఫు జాకీ బయట ఉండగా మణేలా ఎవరైనా వేస్తారా?  నాయనా ప్రద్యుమ్నా మీ ఆంధ్రా యూనివర్సిటీ లో అడ్డాట ఆడడం రాని వాళ్ళకు M.Sc, Ph.D లు కూడా ఇచ్చేస్తారా. మీ యూనివర్సిటీ లో మరీ ఇంత స్టాండర్డ్స్ దిగజారిపోయాయా"  అని ప్రశ్నించారు. 

నేను సమాధానం చెప్పేలోపలే,  “అడ్డాట దాకా ఎందుకు అక్కయ్య గారూ, పెళ్ళిచూపుల్లో  ఏమి చెయ్యాలో, అడగాలో కూడా తెలియని అమాయక జీవులు వారు” అని వ్రాక్కుచ్చాడు ఉకృనామీ.  

ఎవరికి పెళ్ళిచూపులు, ఏమా కధ అని అడిగారు శాస్త్రి గారు . ఆయన వయసులో పెద్దవారు కాబట్టి మా అందరికీ గురుతుల్యులు. ఎవరికి  ఏ సమస్య వచ్చినా ఆయన సలహాలు మాకు శిరోధార్యం అన్నమాట. 

ఉకృనామీ గాడు సంగతి సందర్భాలు వివరించాడు. అప్పుడు నేను అవనత మస్తకుడనై,  వినమ్రుడనై, ముకుళిత హస్తుడనై  వారిని,  వారి వారి పెళ్ళిచూపుల అనుభవములను సోదాహరణముగా వర్ణింపుమని   అర్ధించితిని.  మగవారు దీర్ఘముగా నిశ్వసించిరి  మరియూ ఆడించేవారు చిరునవ్వులు ఒలక బోసిరి.  

శ్రీ శాస్త్రి గారు లేచి కనులు తుడుచుకొని, ముక్కు చీదుకొని ఇటుల ఉపన్యసించిరి. “నాయనా ప్రద్యుమ్నా, నాదొక విషాద గాధ. నాకు పెళ్లి చూపుల అనుభవం లేదు నాయనా లేదు. ఒకరోజు మా తాతగారు  వీధి అరుగు మీద కూర్చొని  విద్యార్ధులచే  వేదాభ్యాసము  చేయించు చుండగా, వీధిలో నడుచుచూ వెళుతున్న ఓ ఘనాపాటి గారు ఆగి వేద పఠనం లో గొంతు కలిపారుట.  పాఠం అయిన తరువాత మా తాతగారు, ఆ ఘనాపాటి  గారూ కుశల ప్రశ్నలు వేసుకొని, ఒకరి వివరములు మరొకరు తెలుసుకొని , వారికి పెళ్లీడు కొచ్చిన మనవరాలు ఉందని, వీరికి వయసుకొచ్చిన మనవడు ఉన్నాడని తెలుసుకొని కడుంగడు ముదావహులై శుభం అనుకొన్నారట. అంతే మా పెళ్లి  1935 లో జరిగిపోయింది.” అని కూర్చున్నారు.   

అప్పుడు శ్రీ రావు గారు లేచి విషణ్ణ వదనముతో, దు:ఖముచే గద్గదికమైన గొంతు సవరించుకొని “మిత్రమా ఇప్పటికి  సుమారుగా 32 ఏళ్ల  క్రితము మా మేనమామ గారింట నొక ఆడ శిశువు జన్మించెను. జన్మించిన రోజునే మా మేనమామ గారు, చేతిలో చెయ్యేసి  చెప్పు అక్కా,  నా కూతురే నీ కోడలని, అని పాడితే, మా అమ్మగారు ఉత్సాహభరితులై , మాట ఇచ్చితిరా, మాట తప్పనురా అని పాడేరు ట. అంతే.  మా మామ కూతురికి  యుక్త వయసు రాగానే, అంటే ఆమె SSLCని పెఢెల్ ఫేడెల్ మని హ్యాట్రిక్కు తన్నులు తన్నిన తర్వాత, నాకు పెళ్లి చేసేశారు. ఇదిగో ఇల్లా అయింది నా బతుకు” అని విచారించి కూర్చున్నారు.

చివరగా Dr. రఘుపతి గారు నుంచోని  గంభీర వదనుడై, మాట్లాడ బోవుతుండగా, మిసెస్ సుధా రఘుపతి లేచెను. అప్పుడు Dr. రఘుపతి కూర్చున్నాడు.  మిసెస్ సుధా రఘుపతి  చిరునవ్వు నవ్వి “You see when Dr. రఘుపతి  Delhi లో  Ph.D   చేస్తుండగా, one day నన్ను చూశాడు. Next day కూడా మళ్ళీ same place  లో మళ్ళీ చూశాడు.  Then, he fell in love నా తోటి. Then after ఒక year మేము marriage చేసుకున్నాము.”  అని మళ్ళీ ఘట్టిగా నవ్వి కూర్చొనెను. అందరూ జాలిగా  Dr. రఘుపతి కేసి చూశారు.  ఆయన  మెల్లగా  “రెండో మాటు చూసి ఉండకుండా ఉండాల్సింది”  అని విచారించెను.  

ఔరా నాకు సలహాలు ఇచ్చువారే  లేరా అని విచారించితిని.  కానీ  విధి విధానము తప్పింప నెవరి తరము. తానొకటి తలచిన దైవము వేరొండు తలచును గదా.    

ఇది  జరిగిన సరిగ్గా  పదిహేను  రోజులకు నాకు మా అన్న  గారి దగ్గరి నించి నాలుగు వైపులా పసుపు పూయబడి మధ్యలో కుంకుమ రాగ రంజితమైన ఒక ఉత్తరం వచ్చింది.  ఈ ఉత్తరం లో మావదిన గారు మృదు మధుర స్వనంతో వ్రాక్కుచ్చారు. 

“ నాయనా ప్రద్యుమ్నా నీ వివాహం నిశ్చయించబడింది.  వధువు, కృష్ణా తీర విజయవాడ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ సోమయాజులు  గారి జ్యేష్ట పుత్రిక  చి. ల. సౌ. ప్రభావతి.  అమ్మాయి ఇంటర్ లో ఇంగ్లీష్ లో జారి పడిందిట. అందుకని తుచ్చ మ్లేచ్ఛ భాష నేల నేర్పించ వలెనని తండ్రి గారు కినుక వహించి తెలుగు విద్వాన్, మరియూ ఉ. భా. ప్ర. (ఉభయ భాషా ప్రవీణ) పరీక్షలు పాసు చేయించారట. పెళ్లి చూపులలో  మీ నాన్నగారు ఆమెతో తెలుగు లోనూ, సంస్కృతం లోనూ నాలుగు పద్యాలు, రెండు శ్లోకాలు పాడించి ముగ్దులై పోయారు. మీ అమ్మగారు  నీకు అత్యంత ప్రీతిపాత్రమైన పనసకాయ ఆవ పెట్టిన కూర  చేయు విధానము  గురించి  విశదముగా చర్చించి కడుంగడు ముదాహవులయినారు.  మేము ఇంకేమన్నా అడుగుదామని ప్రయత్నించినను,  వారు వీటో చేసేశారు.  అయిననూ పనసకాయ ఆవ పెట్టిచేయు  కూర విధి విధానములు తెలియని నామాట వారేల వినుదురు. అమ్మాయి  చూచుటకు బాగానే ఉంది. ఈ వివాహము జరుగుట నిశ్చయము, తధ్యము మరియూ శిరోధార్యమని మీ జనకులు నొక్కి వక్కాణించారు. కాబట్టి బుద్ధిగా వచ్చి పెళ్లి చేసుకొని వెళ్లమని నీకు వ్రాయవలిసిందిగా మీ తండ్రిగారు మీ అగ్రజుని ఆదేశించగా, వారి ఆజ్ఞా నుసారము నేను నీకు తెలియ పరచు చుంటిని.  మిగతా వివరములతో మీ నాన్నగారు త్వరలోనే నీకు జాబు వ్రాసెదరు.  మంగళం మహత్.”   

మా వదినగారు శలవిచ్చినట్టు ఇంకొక 10 రోజుల తర్వాత మానాన్నగారు  ఉత్తరం రాశారు.  "జూన్ 28, 1970  తారీఖున వివాహ మహోత్సవం నిర్ణయింపబడినది. కాబట్టి నువ్వు వచ్చి ఆ మూడు ముళ్ళూ వేసి కృతార్ధుడవు కమ్ము. కనీసం ఓ నాలుగు రోజుల ముందు అఘోరిస్తే కార్యక్రమములు అన్నీ సక్రమంగా జరుపుకొంటాము. అమ్మాయి ఫోటో పంపుతున్నాను. చూసి ఆనందించు" అని సారాంశము.  

అమ్మాయి ఫోటో లో బాగానే ఉంది. పెళ్ళిచూపులు లేకుండా  అంటే అమ్మాయిని నేను చూడకుండా నాపెళ్ళి నిశ్చయం అవటం బాధిస్తున్నా, మా నాన్న గారు కొంచెం అగ్నిహోత్రావధాన్లు టైపు కాబట్టి, నేనేమన్నా చెల్లదు కాబట్టి , గత్యంతరం లేక ఒప్పుకున్నాను. ఒప్పుకోక పోతే జరిగేది కూడా నాకు తెలుసు. 

ఆ అమ్మాయి చేత ఏ కమండలానికో తాళి కట్టించేసి, జోర్హాట్ తీసుకొచ్చి ఆ కమండలాన్ని  నామెడలో వేసి , ఆ అమ్మాయిని నానెత్తి  మీద  కూర్చోపెట్టి భీమవరం వెళ్లిపోతారు. కాదనే ధైర్యం నేను చేయలేను కాబట్టి ఓ వారం రోజుల ముందుగా నేను భీమవరం చేరిపోయాను, అవునండీ పెళ్లి చేసుకోవటానికే


(ఇది మొదటి మాటు 11/01/2011 న ప్రచురించ బడింది.)          

59 కామెంట్‌లు:

కృష్ణప్రియ చెప్పారు...

:))

నీహారిక చెప్పారు...

అడ్డాట అంటే ఏమిటో చెప్పలేదు?

తుంటరి చెప్పారు...

Excellent Narration. Good Sense of Humour.

sivaprasad చెప్పారు...

nice narration

Rams చెప్పారు...

mee blogu anni blogula kantenu vibinnamu ga , atyanta hasyam kaligichuchu ,sundara telugu bashanu

prakasinchu chunnadi mee vysa yukti ki na abinandana mandara mala

మైత్రేయి చెప్పారు...

Super.
:))

నేస్తం చెప్పారు...

బాబోయ్ మీరు సామాన్యులు కాదు ఏం నవ్వించారండి బాబు లాస్ట్ పేరా మరీను.. సూపరు

మనసు పలికే చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ, అసలు మీ క్రియేటివిటీ ఉంది చూసారూ..అద్భుతం..:)) అసలు మీకు ఇట్టాంటి అయిడియాలు ఎలా వస్తాయండీ.
>>భీమవరానికి సుమారు 3000 కంస్ దూరంలో అస్సాం లో
>>నేను పడుతున్నాను, మీ అన్నగారు పడుతున్నారు కష్టాలు. నువ్వు తప్పించు కుంటానంటే కుదరదు కాక కుదరదు
>>ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామీ) మరియు పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం), Suuuuuuuuuuuuuuper:)

ఇక పెళ్లి చూపులకి తయారు చేసిన ప్రశ్నోత్తరాల పట్టిక, వివాహం గురించిన సుదీర్ఘ ఉపన్యాస ఘట్టం.. అద్భుతం.. నవ్వీ నవ్వీ చచ్చా..
ఇక శాస్త్రి గారు, రావు గారు, రఘుపతి గార్ల అనుభవాలు..హహ్హహ్హా..
ఇక మీ వదిన గారి ఉత్తరం ఉంది చూసారూ.. సూ...పర్ ట్విస్ట్.. ఆ ఉత్తరం మళ్లీ మళ్లీ చదివి నవ్వుకున్నా..

అయినా మీరు ఆ పెళ్లి చూపుల ఘట్టం కోసం ఇంతలా కష్టపడి, అసలు ఆ ఘట్టమే లేకుండా మీ పెళ్లి జరిగిపోవడం కడు విచారకరం..:(

ఇదంతా ఒకెత్తు.
>>మగవారు దీర్ఘముగా నిశ్వసించిరి మరియూ ఆడించేవారు చిరునవ్వులు ఒలక బోసిరి.
అసలేమిటిటా.. ఆడువారు, ఆడించువారా..!!
>>ఆడ పిల్లల తల్లిదండ్రుల మనస్తత్వం అర్ధం చేసుకోవచ్చు. ఎంత త్వరగా ఈ అణుబాంబును ఎవరింట్లో నైనా పడవేసి బాధ్యత తప్పించుకోవాలనే కోరిక, వాళ్ళకి ఉండడంలో తప్పు లేదు.
అమ్మో అమ్మో.. ఎన్నేసి మాటలో.. దీన్ని నేను తీవ్రాతి తీవ్రంగా ఖండిస్తున్నాను..:D:D

నైమిష్ చెప్పారు...

ఆహా గురు వర్యా ఏమి సెలవిచ్చితిరి..మీ వివాహ ప్రహసనం బాగుగా నున్నది..
"సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం"
బ్ర . చా .లు వింటున్నరా???

budugu చెప్పారు...

>"తురఫు జాకీ బయట ఉండగా మణేలా ఎవరైనా వేస్తారా? నాయనా ప్రద్యుమ్నా మీ ఆంధ్రా యూనివర్సిటీ లో అడ్డాట ఆడడం రాని వాళ్ళకు M.Sc, Ph.D లు కూడా ఇచ్చేస్తారా"

వార్నీ... ఈ అడ్డాట ఆంధ్రలో కూడా ఆడతారా? ఇంకా ఇదేదో మా ఊరికే సొంతమనుకుంటున్నా.. నాకు మా తాతగారు నేర్పించారీ ఆట. మణేలాను సరదాగ మణిమాల అంటారు మా ఇంట్లో.
ఎవరైనా అడ్డాట పీసీ గేం తయారు చేస్తే బాగుండు.

అజ్ఞాత చెప్పారు...

ఇప్పటికీ ఆవపెట్టి పనసపొట్టుకూర చేసిపెడుతూఉంటే, శుభ్రంగా తిని కూర్చోక, ఎందుకొచ్చిన గోల?

mirchbajji చెప్పారు...

aahaa... konchem allam,inguva vesina pulihora vaasana vachchi notlo laalaajalam oorindi...

Durga Hemadribhatla చెప్పారు...

మహాప్రభో అడ్డాట వచ్హు అని చెప్పిన వాళ్ళని ఇన్నాల్లకి చూసేను. ఆ ఆట మీద ఒక బ్లొగ్ రాసి కొంచెం పుణ్యం కట్టుకుందురు. మా కాకినాడ వళ్ళకే వచ్హు అనుకున్నాను ఇన్నళ్ళూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కృష్ణప్రియ గార్కి,

ధన్యవాదాలు

నీహారిక గార్కి,
ధన్యవాదాలు . అడ్డాట అనునది పేకల తో ఆడు ఆట. కాలక్షేపం కోసం ఆడే ఆట. సాధారణంగా డబ్బులు లేనప్పుడు ఆడుకొనే ఆట.

తుంటరి గార్కి,

ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఙుడిని

శివప్రసాద్ గార్కి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Rams గార్కి,

ధన్యవాదాలు. మీరు కొంచెం అతిశయోక్తి ఉపయోగించారని అనుకుంటున్నాను. Thanks

మైత్రేయి గార్కి,

ధన్యవాదాలు.

నేస్తం గార్కి,

ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఙుడిని.

మనసు పలికే గార్కి,

ధన్యవాదాలు. ఆహా ఆహాహా ఎంత బాగా అనిపిస్తున్నాయో మీ వ్యాఖ్యలు. కానీ అదేమిటండీ చివరగా ఖండిస్తున్నాను అన్నారు. అణుబాంబు ని భద్రంగా అట్టే పెట్టుకోవడం కూడా ఎంత కష్టమో మీకు అర్ధం కాదు లెండి. ఏం చేస్తాం మరి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నెమిష్ గార్కి,

ధన్యవాదాలు. మీరు కూడా బ్రహ్మచారులను సాగరం లోకి దూకమంటున్నారా .

Budugu గార్కి,

అడ్డాట తెలుగు వారి అభిమాన ఆట. డబ్బులున్నప్పుడు రమ్మీ, లేనప్పుడు అడ్డాట, లిటరేచరు ఆడుతాం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరేఫాల గార్కి,

సుష్టుగా తిని కూర్చుంటేనే మెదడు లో పురుగు దొలుస్తుంది. అందుకనే గోల. అదన్నమాట సంగతి. ధన్యవాదాలు.

Mirchbajji గార్కి,

ధన్యవాదాలు. ప్రద్యుమ్నుడి పెళ్లి లో చేసిన పులిహోర వాసన మీదాకా కూడా వచ్చిందా. శుభం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

దుర్గ హేమాద్రిభట్ల గార్కి,

ధన్యవాదాలు. ఏమిటోనండి తెలుగు నాగరికత, సంస్కృతి ఇల్లా మరుగున పడిపోతోంది. అడ్డాట, లిటరేచరు, నో టృంపు, ఓకులేలం (ఓకుల వేలం) ఇత్యాది మహత్తరమైన తెలుగు వాడి పేక ఆటలు మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి వక్కాణిస్తున్నాను. ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ తెలుగు పేకాటలు స్థాపించి సేవ చేద్దామని అనుకుంటున్నాను. అప్పటిదాకా వెయిట్ చేయాలి మీరు.

నీహారిక చెప్పారు...

ప్రద్యుమ్నుడు, సుబ్రహ్మణ్యం అయిన విధంబెట్టిదో తెలుపుదురా?

రాధిక(నాని ) చెప్పారు...

హహ్హహ్హ:)))చాలా..చాలా బాగుంది మీ టపా.
మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి

సుజాత వేల్పూరి చెప్పారు...

అబ్బ, ఈ అడ్డాట గోల మా ఇంట్లోనూ ఉందండీ! నాకేమో అది ఎంత నేర్పినా రాదు. అంటే అసలు అదంటే ఆసక్తి లేదన్నమాట. మా అత్తగారి వూరు భీమవరమే లెండి. అందుకే అటువైపు కజిన్సూ వగైరాలు అంతా కల్సినపుడు "అడ్డాట ఆడదామర్రా"అని పేక సెట్లు తీస్తారు. ఆ జట్లు కట్టడాలు,తురుఫు చెప్పడాలు, జాకీ మనేలాలు...అదొక పద్మవ్యూహం!

నేను రమ్మీ అయితే ఆడతాను అని వాళ్ళకి కాఫీలవీ అందిస్తూ ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ కూచుంటాను.

హనుమంత రావు చెప్పారు...

సుబ్రహ్మణ్యం గార్కి...అడవులలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగులని పట్టుకోడానికి శిక్షణ పొందిన ఏనుగులను పంపుతారట.అవిఅడవులలో వాటితో జతకట్టి వాటిని నెమ్మదిగా బయటికి లాక్కొస్తాయట.
దానిని ఖెడ్డా అంటారని ఏదో కథలో చదివా..పెళ్ళైనవారు
పెళ్ళవనివారిని పాపం.. అలాగే గృహవ్రతులచేస్తారు... సో ప్రభావతీప్రద్యుమ్నం అదన్నమాట...బ్లాగు బ్లాగు బాగు బాగు.

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ సుబ్రహ్మణ్యం గారు ఎప్పటిలానే బాగుంది :-)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నీహారిక గార్కి,

సుబ్రహ్మణ్యం మరియూ ప్రద్యుమ్నుడు నరనారాయణులు , శివకేశవులు, రాముడు అండ్ భీముడు లాగా అన్నమాట. కొంచెం ఎక్కువయిందా డబ్బా కొట్టుకోవడం. సుబ్రహ్మణ్యం ప్రద్యుమ్నుడుగా ఎల్లామారాడు అంటే మీరు పాత టపాలు చూడాలి. ధన్యవాదాలు.

రాధిక (నాని) గార్కి,

ధన్యవాదాలు. మీకు, మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

సుజాత గార్కి,

ఎంత మాట అన్నారండి. అడ్డాట గోల అని. నో గోల ఆర్ గొడవ, ఓన్లీ యుద్ధమ్శ్ అన్నమాట. ఒక్క పేకముక్క తప్పు వేస్తే మాయింట్లో మహా భారత యుద్ధాలు జరిగేవి. భార్యా భర్తల మధ్య విడాకులు దాకా వెళ్లిపోయేవి. ఏ ఆటలోను లేని సౌలభ్యం గుడ్డాడు అని, ఒక్క అడ్డాట లోనే ఉంది. భీమవరం ఊరి కోడలు నేర్చుకోక పోవడం భీమవరానికే అవమానం. వెంటనే నేర్చేసుకోండి.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంతరావు గార్కి,

ధన్యవాదాలు. ఏం చేస్తాం సార్ , ‘ఆశలే అల లాగా, ఊగెనే సరదాగా’ అని పాడుకొంటున్న ప్రద్యుమ్నుడికి నేపధ్యంలో, ‘అనుకున్నది ఒక్కటి, అయినది మరొక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా’ అని వినిపించింది.

వేణూ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు.

నీహారిక చెప్పారు...

సంక్రాంతి శుభాకాంక్షలు సుబ్రహ్మణ్యం గారు.

Sunil చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ
టపా చాలా బాగుందండి. కడుపుబ్బా నవ్వించారు. సహజీవనం సౌభాగ్యం ఏక జీవనం దౌర్భాగ్యం అని వివాహం గురించి అంత చక్కగా ఉపన్యసించి మళ్ళీ మునిగేవాడు మగాడే అని అంటున్నారే.. బ్రహ్మచారులను ఈ విధంగా భయపెట్టడం మీకేమైనా రివాజు గా ఉందా అని అడుగుతున్నాను? ఏదేమైనా ఆడించేవారి మీద మీ ఛెణుకులు ఉన్నాయి చూశారూ !! నా ఈగొ satisfy అయిపోతుంది.
మీకు హాస్య కిరీటి, హాస్య వల్లభ, హాస్యావధాని లాంటి బిరుదులు ఇవ్వాలని మా బ్రహ్మచారుల సంఘం తీర్మానించుకున్నాం.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నీహారిక గార్కి,

ధన్యవాదాలు. మీకు మీకుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

సునీల్ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. నేను బెదిరించటం లేదండీ. బొమ్మా, బోరుసు, మంచి చెడు అని చెప్పటానికి ప్రయత్నిస్తున్నాను. జూనియర్ శ్రీరంజని లే కాదు సూర్యాకాంతాలు కూడా ఉంటారు అని తస్మాత్ జాగ్రత్త అంటున్నానన్నమాట. కాదూ కూడదు గోదా లో దిగుతాం అంటే మీ ఇష్టం.

హాస్య కిరీటి కి అభ్యంతరం లేదు. కానీ కిరీటం బంగారం ది కావాలి. థాంక్యూ.
మీకు సంక్రాంతి శుభాకాంక్షలు.

విరిబోణి చెప్పారు...

ముందుగా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

పోస్ట్ అదిరిపోయింది అండి.narration చాలా బావుంది :)

Ennela చెప్పారు...

hahahah....hamma, hamma paapam alaa paddaaraa maa prabhavati gaaru mee valalo!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విరిబోణి గార్కి,

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

ఎన్నెల గార్కి,

మీ కామెంట్లకి థాంక్యూ. ఎవరి వలలో ఎవరు పడ్డారో ఇప్పటికీ అర్ధం కాలేదంటే నమ్మండి.

Mauli చెప్పారు...

మణేలా అంటే అర్ధము వివరింపుడు . సరే ఇప్పుడైనా చెప్పండి మారేజి లుక్స్ అదేనండి, పెళ్లి చూపులకి వెళ్ళే అబ్బాయి ల కోసం ప్రశ్నోత్తరాల జాబితా :)
బాగుంది వివరము.

అజ్ఞాత చెప్పారు...

Ayyaa! Subramanyam gaaruU!

Emi vrAsAraMDi. chAlA kAlam tarvAta oka paravastu cinnaya sUrini, oka mollapATi narasimhA rAo garini, oka PanugaMTi vArini , oka mullapuAdi varii gurtuku teppimcAru. telugulo iMta hAsyamgaa vrAsi navvimci namduku dhanyavAdamulu.
vrAsthU uMdamDi.
(Keep it up)
mEmu AnamdasthU umtAmu.

mamchi adrshtam (Good Luck)
K G K Sarma.

Sunil చెప్పారు...

ప్రద్యుమ్నుడు గారూ
నాదొక సందేహం, మీ రచనలన్నీ ప్రభావతి గారు చూస్తున్నారా? ఎందుకైనా మంచిది, అప్పడాల కర్రలూ అవీ కంటపడకుండా జాగ్రత్త పడండి. belated సంక్రాంతి శుభాకాంక్షలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మౌళి గార్కి,

మణేలా అనగా 9. అడ్డాట లో తురఫు జాకీ అన్నిటికన్నా పెద్దది. ఆ తరువాత తురఫు మణేలా . ఆ తరువాత వరుసగా ఆసు, రాజు, మదాం (రాణి),10. అన్నమాట. మిగతా వాటిలో మాములుగానే ఆసు,రాజు, మదాం,జాకీ,10,9. తురఫు జాకీ కి 20 ఓకులు, మణేలాకి 14 ఓకులు అన్నమాట. ఆసు కి11, రాజుకి 3, మదాం కి 2, జాకీ కి 1, 10 కి 10 9 కి 0 ఓకులు అన్నమాట. మొత్తం ఓకులు 141. ఆట చెప్పిన వారి ప్రత్యర్ధులు కనీసం 47(అంటే 1/3 ఓకులు) సంపాదిస్తే ప్రత్యర్ధులు గెలిచినట్లు లెఖ్ఖ. అయ్యా అదీ నాకు గుర్తున్నంత వరకు అడ్డాట లెఖ్ఖలు. ఆడేవారు ఎక్కువగా ఉంటే రెండు, మూడు పేకలు కలుపుతారు.

పెళ్లికొడుకులకి ప్రశ్నాపత్రం leak చెయ్యడం కుదరదు. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు .

దుర్గ హేమాద్రిభట్ల గారు కూడా పై వివరణ గమనించ ప్రార్ధన.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ / K.G.K. శర్మ గార్కి,

మీ వ్యాఖ్యలకి బోల్డు బోల్డు ధన్యవాదాలు. మనసు పరవశించెనే అన్న పాట అర్జెంట్ గా పాడేసుకొని ఇంకా ఆనంద డోలికలలో ఊగుతూనే ఉన్నానన్నమాట. మరీ ఎక్కువగా చెప్పేశారు మీరు. అంత అర్హత నాకు లేదు. ఈ జన్మలో అది సాధ్యం కాదు. మళ్ళీ ఇంకో మారు థాంక్యూ.

సునీల్ గార్కి,

అయ్యా అప్పడాల కర్ర అంటే ఏమిటండీ? ఎల్లా ఉంటుంది? మా ఇంట్లో అల్లాంటివి ఉండవు. నాకు జీవితం మీద ఇంకా ఆశ చావలేదు. కాబట్టి ప్రభావతి గారు ప్రద్యుమ్నుడు వ్రాసేవి ఏవి చదవకుండా జాగ్రత్త పడుతారు. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

Mauli చెప్పారు...

ఓపిక గా వివరించినందుకు ధన్యవాదములు అండీ..ఇంతకన్నా ఎక్కువ తెలుసుకొనినను నేను ఏమి చేయగలను ...మా గుంటూరు,విజయవాడ వారి తో చెప్పిన అడ్డాట లేదూ ,తెడ్డాట లేదూ అని నిరుత్సాహ పరచెదరు.

మీరు ఇలా ప్రతిదీ ఇంతగా విడమరిచి చెప్పుట వలన ప్రభావతి గారు మిమ్ములను మిక్కిలిగా అర్ధము చేసికొని వుంటారు కదా అనిపించు చున్నది ...

కానీ ఇంట్లో ఉన్న అప్పడాల కర్రను ఎప్పుడు వాడి(విసిరి ) పారేసితిరి వారు ?

ఆ.సౌమ్య చెప్పారు...

అబ్బబ్బబ్బా ఏమిటీ పేకాట గోల...అదంటేనే చిరాకు నాకు. ఎన్నిసార్లు రమ్మి నేర్చుకుందామని ప్రయత్నించినా పట్టుబడితేగా....పిచ్చి పేకాట!

బావున్నాది మీ పెళ్ళి చూపుల సంబరం...ఇంకా మీరు ప్రభావతిగారిని ఏవేవో ప్రశ్నలడిగుంటారని, వాటికి ఆవిడ ఘాటుగా, దిమ్మ తిరిగిపోయెల ఆ సమాధానం చెప్పిఉంటారని ఆశ పడ్డాను...చివరికి అలా అయిందన్నమాట! :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మౌళి గార్కి,

ధన్యవాదాలు. శ్రీమతి ప్రభావతి గారు కృష్ణా జిల్లా వారు. అయిననూ అడ్డాట నేర్చుకొన్నారు. రామాయణం అంతా విని రాముడు అండ్ సీత హూ అంటే ఎలా? ప్రభావతి ప్రద్యుమ్నుడి ని అర్ధం చేసుకోదు. ప్రద్యుమ్నుడే ప్రభావతిని అర్ధం చేసుకుంటాడు. అందుచే అప్పడాల కర్ర అవసరం ఉండకపోవచ్చు.

ఆ.సౌమ్య గార్కి,

>>>ఎన్నిసార్లు రమ్మి నేర్చుకుందామని ప్రయత్నించినా పట్టుబడితేగా....పిచ్చి పేకాట!
పాపం. అందని ద్రాక్ష పళ్ళు......
నేను పెళ్లి చూపుల కంటూ వెళ్ళితే నాకు అసలు పెళ్లి అయిఉండేది కాదని మా ఆవిడ నిశ్చితాభిప్రాయం.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

budugu చెప్పారు...

బులుసు గారు ఓకుల లెఖ్ఖ కరెక్టే చెప్పారు. తూరుపు చెప్పడంలో మాత్రం ఊరికీ ఊరికీ తేడాలుంటాయని విన్నాను. మా వైపు మొదట అందరికి మూడు ముక్కలు పంచుతారు. జాకీ ముక్క వచ్చినవాడు ఖచ్చితంగా తూరుపు చెప్పాలి. మళ్ళీ మార్చడానికి ఉండదు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బుడుగు గార్కి,
ధన్యవాదాలు.కొన్ని పద్ధతులు మారుతాయండి. మావైపు సాధారణంగా పేక కలిపినవారి ఎడమవైపు ఆటగాడి దగ్గరనించి మొదలవుతుంది ఆట అని.డీలరు ది పై చేయి అన్నమాట. జాకీ ఉన్నా లేకపోయినా ఆట చెప్పచ్చు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగుంది మీ హాస్యచతురత ...

Ramani Rao చెప్పారు...

పెళ్ళి చూపుల టపా అదిరింది. పేకాట అంటారా.నాకు మళ్ళీ మా పాతరోజులు ఆ బాల్యం అవీ బాగా గుర్తొచ్చాయి. వేసవి సెలవలకి అమాలపురం, తాళ్ళరేవులలో పిల్లలందరం పెద్దాళ్ళతో కలిసి ఆడుకునేవాళ్ళం. మూడుముక్కలాట అనేవాళ్ళు మరి ఈ అడ్డాట , మూడు ముక్కలాట ఒకేటేనా. ఎందుకంటే అందులోను తురఫు అంటూ అనేవాళ్ళము. రమ్మీ జోరుగా ఉండేది లెంది, కార్షో అని ఇంకో ఆట.

చాలా బాగా నవ్వించారు. స్వఛ్చమైన తెలుగు పదాలు చెవుల్లో పన్నీరు పోసినట్లుగా అనిపించింది.

ముఖ్యంగా పనసపొట్టు ఆవపెట్టిన కూర అనగానే మా నాన్నగారు గుర్తొచ్చారు. అప్పట్లో ప్రతి ఆదివారం మా ఇంట్లో ఇదే కూర నాన్నగారికి పనసకాయ పొట్టు తీయడం పని. మొత్తానికి చక్కటి తెలుగు వాతావరణాన్ని మరిపించి మురిపించారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

My Dear Friend గార్కి,

క్షమించండి. Somehow i missed your comment.
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

రమణి గార్కి,

మూడుముక్కల ఆట, అడ్డాట వేరు వేరు అండి. పనసకాయ ఆవ పెట్టిన కూర అన్నారు దాని రుచే వేరు.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

kota చెప్పారు...

hhhahhhahahha

Sri[dharAni]tha చెప్పారు...

అయ్యా.. బులుసు వారు.. ఈ ఉకృనామి, పశినీకం అనేవి వారి వారి నామధేయాలా.. ఇంకా నేనేమనుకున్నానంటే ఏ మేనేజేరియల్ ఎకానమిక్స్ లో పీహెచ్ డీ సంబంధిత కోర్స్ వారి గ్రూప్ లేదా కమిటి పేరేమోననుకున్నాను. భరణికం లా బహుశ ఆ తర్వాతి పేరి సంకోచమో వ్యాకోచమో స్థానభ్రంషమో అదేదో జోర్హాట్ మాదిరి ఊరేమో అని అసోం జిల్లాల చిట్టా పరీకించాను.. తిన్సుకియా, డిబ్రిగఢ్, ధేమాఝి, చరాయిదేబ్, సిబ్సాగర్, లఖిమ్పూర్, మజూలి, బిస్వనాథ్, గోలాఘాట్, కార్బి ఆంగ్లాంగ్, సోనిత్పూర్, నగాఁవ్, హోజాయి, దిమా హసౌ, చాచర్, హైలాకాండి, కరీమ్ గంజ్, మోరిగాఁవ్, ఉదల్గుడి, దర్రాంగ్, కామ్రూప్, బక్సా, నల్బాడి, బార్పేట్, చిరంగ్, బోఁగాయిగాఁవ్, గోల్పాడా, కోఖ్రాఝార్, దుబ్రి, సల్మడా మన్కాచార్ లలో వెతికేను సుమండి. (కన.. మీ భషలో కడుపుబ్బ నవ్వు)

అజ్ఞాత చెప్పారు...

దయచేసి మీరు కోరా ( quora ) కి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను . మీలాంటి నిపుణులు , రచయతలు అవసరం చాలా ఉంది . మీరు రావడం వలన, తెలుగు కోరా ఇంకా ఎక్కువ అభివృద్ధి చెందుతుంది . అక్కడ కొంచెం అర్ధవంతమైన చర్చలు కూడా జరుగుతాయి . ఇప్పుడిప్పుడే తెలుగు కోరా ఎదుగుతుంది .
:Venki

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ(ధరణి)త గారికి. .......... ధన్యవాదములు. ఉన్నికృష్ణన్ నారాయణ మీనన్ (ఉకృనామి) పరమ శివన్ నీల కంఠన్ (పశినీకం) అని స్పష్టంగా కధలో వ్రాసాను. బహుశా మీరు గమనించలేదేమో. సరే తెలియలేదు. ఇక్కడ అడిగితే నేను చెప్పేవాడిని కదా మీరు అస్సాం అంతా తిరగాల్సిన అవసరం ఏమిటి? దీని భావమేమి తిరుమలేశా అని నేను తిరుపతి వెళ్లాలా?. ..........మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వెంకి గారికి. .......... ధన్యవాదములు. నేను కోరా లో ఉన్నానండి. ఇంగ్లీష్ కోరా అనుకుంటాను. తెలుగు లోకి మారే ప్రయత్నం చేస్తాను. నేను సాధారణంగా బహిరంగ చర్చల్లో పాలు పంచుకొను. అప్పుడప్పుడు ఆవేశ కావేశాలు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదీకాక నా తెలివితక్కువ తనం బయట పడే అవకాశాలు కూడా ఉంటాయి కదా. ........ మహా

Sri[dharAni]tha చెప్పారు...

(ముసిముసి నవ్వు).. ఆచార్య.. (పగలబడి నవ్వుతు).. నేను.. (క్రిందమీద పడుతు దోర్లుకుంటు నవ్వును ఆపుకుంటు).. ఆయా పేర్ల షారాట్ ఫామ్ మాత్రమే గమనించి వ్యాఖ్యానించాను.. ఇక మీ సిసలైన కథానాయకుడిని ప్రధ్యుమ్న కు బదులు ప్రమిద అందామనుకున్నా (కాసేపు ఆలోచనలో మునుగుతు) కాని ౧౯౬౮ అన్నారు.. పెద్దవారి పట్ల వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడేమిటని.. ఇంత మునుపు పెళ్ళి చూపుల్లో రామనాధం (పేరదేనా ఏంటని మరోమారు పరీకించి) గారిలా ఎవరైనా పుసుక్కునా అన్నారనుకోండి.. అపుడు మొదటికే మోసం కదా అని.. (గంభీరంగా ఒకింత).. భగవంతుణ్ణి వెతకటానికి బయలుదేరే మునుపు ఎవరి మనసులో వారే ఆయా భగవంతుణ్ణి తలుచుకున్నా లేదా భగవన్నామ స్మరణ గావిస్తే ఛాలు భక్తి ప్రపత్తులతో అని వివేకానంద గురువుగారైన రాకృపహం గారు చెప్పిన మాట వాస్తవమేగా ఆచార్య. ఏది భగవంతుని ఆజ్ఞ, అనుజ్ఞ లేకుండ జరగదంటారు.. ఏమో.. ఏ రాత్రి వేళ స్వామియే సాక్షాత్కరించి భక్త నన్ను దర్శనం చేయాలనుకునే నీ కోరిక మేరకు ఏ జాన్వరో, చైత్రమో, రమాదాన్ కో దర్శనానికి అనుమతి అందితే పెట్టే సర్దుకుని తీర్థయాత్రలకని పుణ్య స్థలాల దర్శనం గావింపగ జూస్తం కదేటి ఆచార్య.. గడచిన ముప్పై నాలుగేళ్ళలో స్వామి వారి తొలి దర్శనం ౧౯౯౪ మే లో, తరువాయి ౨౦౦౦ మే లో, ౨౦౦౩ ఆగస్ట్ లో అనక ౨౦౦౬ మే లో, అటు పిమ్మట ౨౦౧౬ మే లో నేత్రపర్వంగా జరిగింది. (తన్మయత్వం నిండిన చెమ్మగిల్లిన కన్నులను తుడుచుకుంటు).. ఆపదమొక్కుల వాడ ఆపద్బాంధవ గోవిందా..! (తదేకంగా చూస్తు.. కామింటుని ముగిస్తు) కవకవఆ (కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదు) అంటారు చూడండి (మౌనమే నీ భాష ఓ మూగ మనసా.. కెవ్వు)

శ్యామలీయం చెప్పారు...

ఆడితే అడ్డాట ఆడాలండీ. అబ్బా ఏం‌మజా వస్తుందీ. అరడజను మంది కూర్చుని ఇది గోలగోలగా అడుకుంటూ గంటలుగంటలు నిముషాల్లాగా దొర్లించేయచ్చును.

దానితరువాత నాకు బాగా ఉండేది బ్రిడ్జ్ మాత్రమే. దానికి పోటి ఒక్క చదరంగం మాత్రమే. బ్రిడ్జ్ ఒక అంతర్జాతీయస్థాయి పేకాట! ప్రపంచ ఛాంపియన్ షిప్ పోటీలూ ఉంటాయిందులో. చదరంగంలాగా, దీనికి బోలెడంత థియరీ నేర్చుకోవాలి. బాగా బుర్రపెట్టి ఆడాలి. ఒక్క తప్పుచేసామో పాతాళానికి పడిపోతాం అన్నమాట. గొప్ప టీమ్‌గేమ్‌ ఇది.

అన్నింట్లోనూ దిక్కుమాలిన పేకాట రమ్మీ. దానికంటే ప్రమాదకరం అటంబాంబు ఢంకాపలాసు అనబడే మూడుముక్కలాట.

అవునింతకీ ఎవరన్నా అడ్డాటమీద కనీసం బ్లాగన్నా వ్రాసారా లేదా అని నా అనుమానం. ఎవరికన్నా తెలిస్తే చెప్పండి. చిరుపరిచయం వ్రాసిన బులుసు గారికి ధన్యవాదాలు. అయ్యో ఆడ్డాట ఆడేయ్యాలనుంది కాని అది తెలిసినవారు ఎవరూ‌ దగ్గర్లో కనబడటం‌ లేదే ఎలాగూ!!

శ్యామలీయం చెప్పారు...

పేకాట మీద జాషువా గారి పద్యాలు: http://kathamanjari.blogspot.com/2010/11/blog-post_05.html

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్యామలీయం గారికి. ........ ధన్యవాదాలు.

అడ్డాట లో ఒకప్పుడు నేను ఎక్స్పర్ట్ గా గుర్తింపబడ్డాను. ఆంధ్రా యూనివర్సిటీ లో దీనికి ఒక రూం ఉండేది ఆ కాలంలో. 12 మంది దాకా కూర్చునే వాళ్ళం. 4 పేకలు. మహా భారత యుద్ధాలు జరిగేవి.

అడ్డాట కన్నా నాకు లిటరేచర్ ఎక్కువ ఆసక్తి దాయకంగా ఉండేది. ఇది నాకు బ్రిడ్జ్ కన్నా ఎక్కువ ఇష్టం. అడ్డాట, లిటరేచర్ చిన్నప్పుడే నేర్చుకున్నాం. బ్రిడ్జ్ జోర్హట్ లో నేర్చుకున్నాను. ఒకప్పుడు అడిక్టెడ్ బ్రిడ్జ్ కి, 1984 దాకా. ఆ తరువాత తగ్గించేశాను. ఇప్పుడు పూర్తిగా మానేశాను. ............ దహా

ధన్యవాదాలు జాషువా గారి పద్యాలు పంచుకున్నందుకు. తీరుబడిగా చదువుతాను. ......... దహా

Sri[dharAni]tha చెప్పారు...

ఔనా ఆచార్య.. వైజాగాపటం తో నా అనుబంధం ముప్పై రెండేళ్ళు.. బాల్యం, కౌమార్యం అంతా కంచరపాలెం, ఏడుమెట్ల మర్రిపాలెం, రామ్మూర్తి పంతులు పేట, శ్రీవిజఙయనగర్ లలో, ఆపై నా పుట్టూరు (నేను పుట్టిన ఊరు) ఒకే ఒక రాయి అనగ ఏకశిలనగరం అనబడే ఓరుగల్లు లో నక్కలగుట్ట, సుబేదారి, అదాలత్, హంటర్ రోడ్ నలుదిక్కులైన హనుమకొండ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ(ధరణి )త గార్కి.......... ధన్యవాదాలు. నేను వైజాగ్ లో 1959 నుండి 1964 దాకా 5 ఏళ్ళు చదివాను. నా మొదటి ఉద్యోగం మీ వరంగల్లోనే. ................ దహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీ(ధరణి )త గార్కి.......... ధన్యవాదాలు. నేను వైజాగ్ లో 1959 నుండి 1964 దాకా 5 ఏళ్ళు చదివాను. నా మొదటి ఉద్యోగం మీ వరంగల్లోనే. ................ దహా

hari.S.babu చెప్పారు...

ఒక్క బ్రాహ్మల ఇంటిపేర్లలోనే వడియాల,దనియాల,పప్పు,ఉప్పు అని తిండిని గుర్తు చేసే ఇంటిపేర్లు ఎక్కువ ఉంటాయి.అలాగని బ్రాహ్మలు తిండిపోతులా అంటే ఎక్కడో తప్ప సన్నగా పీలగా గాలొస్తే ఎగిరిపోయేలా ఉంటారు - భలే క్యామిడీ, కదూ!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరి. S. బాబు గార్కి. ........ మీ కామెంటుకి జవాబు చెప్పలేను.

hari.S.babu చెప్పారు...

బ్లాగులన్నీ యమా సీరియస్సు అయిపోయాయి.కాస్త మనలో మనం జోకులు వేసుకుని నవ్వుకుందామని వేశాను.ఒఖప్పుడు అన్ని కులాల మీద ఇలాంటి సెటైర్లూ స్వతైర్లూ పేలేవి.ఇప్పుడు కాస్తకీ కూస్తకీ మనోభావాలు దెబ్బతినే రోగం వచ్చాక ఏ కొంచెం సరదా మాట వేసినా బాంబులా పేలడంతో జనాలు జోకు లెయ్యడానికే దడుచుకు ఛస్తున్నారు.పోన్లెండి,సైలెంటయిపోతాను - హ్మ్!

అజ్ఞాత చెప్పారు...

హరి బాబు వ్యాఖ్య బాగా లేదు. అర్థం లేని పనికిమాలిన వ్యాఖ్య.