పత్రిక.మాలిక లో నా కధ - నాదీ ఓ సినిమా కధే

మాలిక పత్రిక లో నాకధ   నాదీ ఓ సినిమా కధే  పడింది. అంటే వేసారు అన్నమాట. కాబట్టి  చదివి మీ అమూల్యమైన అబిప్రాయాలు తెలియ జేయ వలసిందిగా కోరుచున్నాను.

మాలిక సంపాదకులకు నా కధ వారి పత్రికలో పడవేసినందుకు sorry వేసినందుకు   ధన్యవాదాలు.

13 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

హహ్హహ్హా.. సుబ్రహ్మణ్యం గారు, మీకు ఇట్టాంటి అయిడియాలు ఎల్లా వస్తాయి..? నాకు కాస్త ట్యూషన్ చెబుదురూ.. నేర్చుకుంటాను. గురుదక్షిణ కింద ఏం ఇవమంటారు..;)
క(ల)థ మాత్రం సూ...పర్:) సిమ్హాసనం పవిత్రత, మీ చేతులు కాల్చుకోడం వెనుక లాజిక్కు.. హహ్హహ్హా..కేక. చివరికి పభావతి గారి తిట్ల దండకం భరించలేక యక్షిగాడు వచ్చేసి... పాపం.. హహ్హహ్హా...

Mauli చెప్పారు...

ఆడవాళ్ళ౦టే ఒక్క మ౦చి సలహా కూడా ఇవ్వలేరు అని పొగిడారా ..లాభ౦ లేదు ..ప్రభావతి గారు మీకు ప్రయివేటు చెప్పాల్సి౦దే :)

voleti చెప్పారు...

మీ కధ చాలా చాలా... చాలా బావుంది. ఇంచు మా ఆవిడా అదే టైపు లెండి. తనేదో పెద్ద తెలివైనట్లు, మనకి చాతకాదన్నట్లు అన్నిటికీ బాక్ గ్రౌండ్ లోంచి ప్రాంప్టింగ్ ఇస్తూ వుంటుంది (అయితే కొన్ని విషయాల్లో మనం పూర్ లెండి) ఆటో వాళ్ళతో బేరం ఆడ్డం, ఇంటి కొచ్చిన పేపరు అమ్మే వాళ్ళూ, బట్టలు ఇస్త్రీ చేసిన వాళ్ళతో బేరాలు వగైరా... అప్పుడిక సుప్రీమ్ కోర్టుదే తుది తీర్పు... మధ్యలో మనం కలుగ చేసుకున్నామా మటాష్... వాళ్ళు అలా వుండ బట్టి, naa లాంటి వాళ్ళకి రోజులు గడుస్తున్నాయి..

Ennela చెప్పారు...

congratulations andee...simply superb....mari alaa pagati kalalu kantoooooo unte...prabhavati gaaru tittara yentee!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

ఏమిటో మీరు నామీద జోకులేస్తున్నారు. మీకు నేను నేర్పడమా. ఎంత మాట మిమ్మల్ని జీనియస్ అని ఒప్పేసుకున్నాం. నిజంగానే, సరస్వతి తోడు.
ధన్యవాదాలు మీ వ్యాఖలకి.

మౌళి గార్కి,

ప్రభావతీ గారి ప్రైవేటు తో ప్రద్యుమ్నుడి నిఘంటువు లోంచి,లేదు,కాదు అన్న పదాలెగిరి పోయాయి. ఇంకేం మిగిలింది ప్రైవేటుకి.
ధన్యవాదాలు

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఓలేటి గార్కి,

ఏ మొగుడి చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం
ఆ మగాడి బానిసత్వం, సతీపద దాసోహం :)
చివరి వాఖ్యంతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. వాళ్ళు అల్లా ఉండబట్టే మనం చీకు చింతా లేకుండా బతికేస్తున్నాము.
ధన్యవాదాలు

ఎన్నెల గార్కి,

ధన్యవాదాలు మీ కామెంట్సుకి. మగాడి బతుకంతా అంతే నండి. 'కలనైనా నీ తలపే, కలవరమందైన నీ పిలుపే' అని భయపడి పోతుంటాడు. :)

Ennela చెప్పారు...

meeru super..maa seetayya kante ekkuva...ye comment nainaa mee vaipu tippukuntaaru..nenu poorvam cheppinattu...mr. pellaam lo laaga pose maarutundi kaanee position maaradu...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఎన్నెల గార్కి,

హాహాహ్హా అన్నమాట. అంటే ఘట్టిగా మనస్ఫూర్తి గా నవ్వుకున్నా నన్న మాట. అంటే ఇప్పుడు నేను "మౌనమె నీ భాష ఓ మూగ మనసా" అని పాడుకోవాలేమో నని ఆలోచిస్తున్నానన్న మాట.(అప్పుడైనా pose, position రెండూ మారుతాయేమో?)

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరే కృష్ణ చెప్పారు...

హ హ్హ..keka:))
ఆభినందనలు :)

మనసు పలికే చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ.. నేనా..? జోకులా..?
మీరు నాకు గురువు గారని నేను ఫిక్స్ అయిపోయాను అంతే :) ఎప్పటి నుండి క్లాసులు మొదలెడదామో చెప్పెయ్యండి గురువు గారూ.. పలకా బలపం పట్టుకుని వచ్చేస్తాను:))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరే కృష్ణ గార్కి,

ధన్యవాదాలు.

మనసుపలికే గార్కి,

మొన్నీ మద్యన 4వ క్లాసు చదువుతున్న మా మనవరాలి హోం వర్కు చేసాను. అంతే, అది చూసి ఇంటర్ నేషనల్ స్కూలు లోని నేషనల్ మాస్టారు కళ్ళుతిరిగి కింద పడిపోయాడుట. ఆ పైన మీ ఇష్టం.
అయినా పలకా బలపం ఏమిటండీ ఇంకాను. నన్ను పంచ కట్టుకొని, దాని మీద బెల్టు బిగించి,నెత్తి మీద ఓ పిలక పెట్టుకొని రమ్మంటారా ఏమిటి మీకు పాఠాలు చెప్పటానికి ?
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మనసు పలికే చెప్పారు...

అయ్యయ్యో.. అంత పని జరిగిందా గురువు గారూ..:(
ఓ పని చేద్దాం అయితే. కాస్త మోడ్రెన్‌గా నా ల్యాప్‌టాప్ తెచ్చుకుంటాను. పనిలో పని కాస్త నా ఆఫీసు పని చేసి పెట్టండి మాస్టారూ, ప్లీజ్.. దెబ్బకి మా మల్టి నేషనల్ మేనేజరు కళ్లు తిరిగి పడి పోవాలి..;)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

అల్లాగే, నాలుగు రోజులు మీపని నేను చేశానంటే, కంపనీ మూసుకొని పారిపోతారు. గేరంటీ ఇస్తాను.

ధన్యవాదాలు.