నా బ్లాగులో ఒక నెల / నెలా పదిహేను రోజులు / రెండు నెలలు శలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు, ఊరు మారుతున్నాను. ఊరెందుకు మారుతున్నావు అని చాలా మంది అడిగారు. ఊరికేనే, సరదాగా, పని పాడు లేక అని జవాబు ఇచ్చాను. మీరు అడక్కండే. మళ్ళీ రిపీట్ చెయ్యాలి పై వాక్యం.
అవునూ నువ్వు ఊరు మారితే దానికి ఒక టపా వ్రాయాలా అని చిరాకు పడకండి. ఒక నెల రోజులు టపాలు వ్రాయక పోతే, గురుడు టపా కట్టేశాడేమోనని, మీరు అపోహ పడి ఆనంద పడిపోతారేమో నని భయం వేసిందన్నమాట. కొంతమంది ఇంకా ఉత్సాహపడి సంబరంగా సానుభూతి సందేశాలు కూడా పంపిస్తారేమోనని కూడా అనుమానం వచ్చేసింది.
ఇంతకీ ఎక్కడకి అంటారా. ఏలూరు కి. మీది భీమవరం కదా ఏలూరు ఏంటీ మళ్ళీ అని ఇంకో ప్రశ్న వద్దు. దుర్భిణీ పెట్టుకొని మరీ చూశాను. భీమవరం, ఆ చుట్టుపక్కల కూడా ఒక్క పరిచయమైన ముఖం కానీ, బీరకాయ పీచు సంబంధం కలవాళ్లు కానీ ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యం వేసింది. సుమారు 32 ఏళ్ళు ఉన్నాం భీమవరంలో. 78 లో మా అమ్మగారు పోయిన తరువాత వదిలేశాము. ఇప్పుడు ఎవరూ లేరు. ఏలూరు, ఆ చుట్టుపక్కల నల్గురైదుగురు కనిపించారు. అంతా మా ఆవిడ వైపు వారే. సరే 16 ఏళ్ళు హైదరాబాదు లో మా వాళ్లందరి మధ్య ఆవిడ ఉంది కదా, ఒక రెండు మూడేళ్లు వాళ్ళ వాళ్ళ మధ్య మనం ఉండలేమా అని ఏలూరు కి మారిపోతున్నాము. అదన్నమాట సంగతి.
సరే నీ గొడవ అంతా మాకు ఎందుకు చెపుతున్నావు అని విసుక్కుంటున్నారా. మావాళ్ళెవరూ ఒప్పుకోవడంలేదు నేను ఏలూరు వెళతానంటే, అందరూ ఇక్కడ ఉంటే అక్కడికి వెళ్ళడం ఎందుకు అని. కనీసం మీ రెవరైనా రైట్ రైట్ అంటారేమో ననే ఆశ తో నన్నమాట . అదీ సంగతి మిత్రులారా.
36 కామెంట్లు:
వెళ్లి రండి ...కొంత కాలం ఈ భాగ్య నగర కాలుష్యానికి దూరం గా ఉంది రండి అక్కడికి వెళ్ళిన తరువాత తొందరగా మా కోసం మళ్లీ రాయండి ......
ఓహ్.. అయితే మీరు త్వరగా సెటిల్ అయ్యి మళ్ళీ రాయాలని ఎదురు చూస్తూ ఉంటాం..
మిమ్మల్ని మీరు ఎక్కడ వెతుక్కుంటారో అక్కడికే వెల్లండి.
సుఖం, సంతోశం, ప్రశాంతత, ’అన్నీ’ వాటంతట అవే మీ వెనకాలే వస్తాయ్.
మీ
సత్య
రైట్.. రైట్.. :)
ఒక నెల రోజులు టపాలు వ్రాయక పోతే, గురుడు టపా కట్టేశాడేమోనని..
ఇందులో ద్వందార్ధం ఉంది కదా..ప్రాసకి ఓకె
ఎటువంటి మార్పు అయినా కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందండి. తప్పకుండా మీరనుకున్నది చేసేయండి. పైగా సిటీ హడావుడికీ, కాలుష్యానికీ దూరంగా ప్రశాంతంగా ఉండగలగటం కూడా అదృష్టమే. మీ తదుపరి టపాల కోసం ఎదురు చూస్తూంటాము...
హాయిగా టైము గడుస్తుంది.జై భజరంగ భళీ అనేసి వెళ్ళండి
బులుసు తాత రైట్ రైట్... :))
వెళ్లి రండి :)
గురూ గారూ.. మీరెళ్లిపోతే మాకు సంతోషమా.???:(
త్వర త్వరగా మీరు ఏలూరులో సెటిల్ అయిపోయి మళ్లీ మాకోసం బోలెడన్ని టపాలు రాస్తారని ఆశిస్తున్నాను:) నేను కూడా రైట్ రైట్ అనేశాను. Take care guruu gaaruu:))
అయ్యో, హైదరాబాదు వదిలివెళ్తున్నారా?
ఎప్పటికైనా మిమ్మల్ని కలిసి మాట్లాడుదామనుకొన్నానే! ఎంతైనా ఆలితరుఫు బంధువులు ఆత్మబంధువులని మా బామ్మ అంటుండేది:) అక్కడ ఉండటమే కరెక్ట్ లేండి. ఏలూరు నుండి ఆరోగ్యంగా కలకాలం బోల్డు టపాలు రాయాలని కోరుకొంటున్నాము.
వెంకట్రామా అండ్ కో వాళ్ళకి ప్రభావతీ ప్రజ్యుమ్నం ప్రింట్ చేసే అవకాశం రావాల్సి ఉందేమో! అందుకే వెళ్తున్నారేమో!
అన్నట్టు సర్, స్వాతంత్ర సమరయోధులు బులుసు సాంబమూర్తి గారు మీకేమన్నా అవుతారా?
బావుందిగానీ మరీ నెలరోజులెందుకండీ ఊరు మారడానికి? ఓ పది రోజులు సెలవు తీసుకోండి చాలు...లేకపోతే మీ టపాలను మేము మిస్ అవుతాం...తొందరగా అన్నీ సర్దేసుకుని మాకోసం మీ ఏలూరు అనుభవాలన్నీ రాసేయండి. ఏలూరికెళ్ళగానే ప్రభావతిగారికి, ప్రద్యుమ్నులవారికి కొత్త గొడవలు వస్తాయి కదా, వాటి గురించి రాసేయండి.
we miss you sir,
come back (to blogs;)) soon..
asalu ee vuru matatam yenti sir...
meekantu oka profession leda ? leka rtd na ?
గురూజీ.... అంతేనా, తప్పదా? ఆ దిక్కుమాలిన హైదరాబాదు కంటే ఏలూరు చాలా బెటర్. కాలుష్యం ఉండదు, నన్ను కూడా ఇక్కడి నుంచి తరిమేసేట్టునారు, ఒక నెల రోజుల్లో నేను కూడా మా పుట్టిల్లు రాజమండ్రికి వెళ్ళిపోతున్నా... టపాలు రాయడం మాత్రం మర్చిపోవద్దు గురువు గారూ......
గోదావరి జిల్లాలకు స్వాగతం...ఆదరా బాదరా ...ఎందుకండి హైదరాబాదు...
హాయిగా ప్రశాంతంగా ప్రవహించే గోదావరి తీరంలో మీ కలంతో వ్యవసాయం
సాగించండి...బ్లాగు దూరం నుండి కూతవేటు దూరానికి వచ్చారు....
ఇప్పట్లో కలవమేమో అనుకునేవారు త్వరలో కలవచ్చు అనేంత దూరానికి
వచ్చారు...సంతోషం...కలుద్దాము త్వరలో....
రైట్ రైట్, టికెట్..టికెట్...వాకే టికెట్ తీసుకున్నారు గదా..అయ్యా యీ సామానెవరిదీ..దీనికి కూడా టికెట్ తీసుకొవాలండయా..యీ కతల పుస్తకమెవరిదీ..కతలు వ్రాసేవారికి టికెట్ లేదండయా...అంతా బానే ..ఓకే ఒకే..రైట్ రైట్..అయ్యా ఏలూరు వచ్చిందండీ,దిగండి దిగండి..సామాన్లు జాగర్త..సర్దుకున్నాక టపా రాయండే!!!రై రై.....
సాయి కృష్ణ గార్కి,
ధన్యవాదాలు. అల్లాగే సారూ వీలైనంత త్వరగా మొదలుపెట్టుతాను వ్రాయడం.
కృష్ణప్రియ గార్కి,
ధన్యవాదాలు. పెద్దగా పరిచయం లేని ఊరు. త్వరగానే అలవాటు చేసుకొనే ప్రయత్నం చేస్తాను.
సత్య గార్కి,
67 ఏళ్లగా వెతుక్కుంటూనే ఉన్నాను. చిక్కడు దొరకడు అన్నట్టుగానే ఉంది. ధన్యవాదాలు.
గిరీష్ గార్కి,
థాంక్యూ థాంక్యూ. టపా కట్టేయడం అంటే ఒకటే అర్ధం సార్ :)
తృష్ణ గార్కి,
Change is the law of life అన్నారు. నేను ఈ విధంగా మార్పు వెతుకుతున్నాను. ధన్యవాదాలు
హరేఫాల గార్కి,
జై సీతారాం అంటాను సార్ (మా ఆవిడ కూడా ఉంది నాతోటి). ధన్యవాదాలు.
కిషన్ రెడ్డి గార్కి,
థాంక్యూ మనవడా.
మనసు పలికే గార్కి,
థాంక్యూ థాంక్యూ. సెటిల్ అయిన వెంటనే వ్రాసేస్తాను. టపాలు వ్రాసినప్పుడే సెటిల్ అయినట్టు అన్నమాట.:)
మైత్రేయి గార్కి,
ప్రతి రెండు నెలలకి ఒకమాటు వస్తూనే ఉంటాను హైదారాబాద్ కి. మీకు వీలైనప్పుడు కలుసుకోవచ్చు. మీ బామ్మ గారు కరక్ట్ గానే చెప్పారు.:) ధన్యవాదాలు.
ఆ. సౌమ్య గార్కి,
మీరు మా బాసు ని మించి పోయారే. పెళ్ళికి 10 రోజులు శలవా అని కింద పడిపోయాడు ఆయన.
ప్రభావతీ ప్రద్యుమ్నులకి గొడవలు మొదలయిన వెంటనే వ్రాయడం మొదలుపెట్టేస్తాను కొత్త టపాలు. వ్రాయకపోతే గొడవలు మొదలు కాలేదని అర్ధం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
కార్తీక్ గార్కి,
ధన్యవాదాలు. వీలైనంత త్వరగా వచ్చేస్తాను.
వెంకట్.సరయూ గార్కి,
ఇప్పుడు నాకు ఉన్న ఒకే ఒక్క profession ఇళ్ళు, ఊర్లు మారడం. రిటైర్ అయి పుష్కరానికి 5ఏళ్ళే తక్కువ. ధన్యవాదాలు.
సునీల్ గార్కి,
ఏలూరు లో కాలుష్యం లేదనే వెళ్ళుతున్నాను. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను కాలుష్యం పెంచడానికి. Welcome back to India. రాజమండ్రి వచ్చినతరువాత కలుద్దాం. ధన్యవాదాలు.
హనుమంత రావు గార్కి,
థాంక్యూ మీ స్వాగతానికి. తప్పకుండా కలుద్దాం మాష్టారూ. రాజమండ్రి వచ్చినప్పుడు మీకు తెలియపరుస్తాను. ఈ లోపు మీరు ఏలూరు వస్తే వెల్కమ్. ధన్యవాదాలు.
ఎన్నెల గార్కి,
మీరు ఇన్ని రైట్ లు అనేటప్పటికి confuse అయి ఏలూరు బదులు రాజమండ్రి లో దిగుతానేమో నని భయం వేస్తోంది. ధన్యవాదాలు.
పోన్లెండి, మా హైద్రాబాద్ నుంచి వెళ్ళిపోతున్నా...మిమ్మల్నందరూ అటువైపు ఆహ్వానిస్తున్నారుగా. సరే వెళ్ళిరండి మరి. కొత్త కబుర్లు చెప్పటానికి ఎక్కువ టైం మాత్రం ఇవ్వం. అన్నీ మీ ఇష్టమే అంటే ఎలా ఒప్పుకుంటాం:)
టపాలు వ్రాసినప్పుడే సెటిల్ అయినట్టు అన్నమాట.:)
super
బలే బలే మా జిల్లాకి వచ్చేస్తున్నారు . మా ఊరు ఎప్పుడు వస్తారు?
దీన్ని నేను ఖండిస్తున్నాను.
మీరు వెళ్ళడం గురించి కాదు రెన్నెలలు టపాలు వేయకపోవడాన్ని
:(
జయ గార్కి,
ధన్యవాదాలు. మీ అందరి శుభాకాంక్షలతో వెళుతున్నాం. అక్కడ అలవాటు పడిన తరువాత వ్రాయడం మొదలు పెట్టుతాను.
గిరీష్ గార్కి,
అంతే కదండి మరి :) ధన్యవాదాలు.
రాధిక (నాని) గార్కి,
మీ జిల్లా యే కాదండోయ్, మాది కూడా. అక్కడికి వస్తున్నాం కదా వచ్చేస్తాం మీ ఊరుకి . ధన్యవాదాలు.
వాసు గార్కి,
ధన్యవాదాలు. సరే ఒక నాలుగు రోజులు తగ్గిస్తాను టపా కి.
Eluru? Great. It is a town full of Tobocco smell and railway gates. My brother lived in Eluru for about 10 years and I visited him often. Wherever you want to go you will find that at least one railway gate is CLOSED. You will get used to it and laugh. I would think you are going closer to Powerpet than Eluru itself.
Nevertheless any place is a better one than Hyderabad. Good luck!
మంచి నిర్ణయం తీసుకున్నారు వెళ్లి రండి సర్ .
అనానిమస్ గార్కి,
ధన్యవాదాలు. మీ సలహాలకి. టుబాకో వాసన తో నాకు సమస్య లేదు. నేను సిగరెట్లు బాగానే కాలుస్తాను.:):)
రాజ్ సృజన్ గార్కి,
ధన్యవాదాలు.
Bulusu Subrahmanyam gariki,
Mee postalnini entoshradda gaa chaduvutunna mouna-reader ni nenu. Mounam gane vundi-podamani anukunna gaani, ee vere valla postulu choosinanka mounamga vunda leka, raatunna. Meeru ekkada vundadamanedi mee-istam sir, gaani, mee postingulato, andari tO paatu maa telangana prajalani kooda eppati laagane alaristaani aasistu. Eppatikaina tirigi mana bhagya-nagaram naku malli relocate avutaarani kamkshithu - all the best sir
KSHEMANGA VELLI RANDI.. VEELUNTE AA PAKKANE MAA VOORU PAALAKOLLU VELLI KSHEERARAAMALINGESWARUNI DARSANAM CHESUKOND SIR..THONDARAGA MEERU TAPAALU RAAYAALANI
KSHEMANGA VELLI RANDI.. VEELUNTE AA PAKKANE MAA VOORU PAALAKOLLU VELLI KSHEERARAAMALINGESWARUNI DARSANAM CHESUKOND SIR..THONDARAGA MEERU TAPAALU RAAYAALANI
uuru mArinaa uniki mArunaaa?
mIru Uru mAraTAni ki POstinglu mAnaTAniki link EmiTO? India lO uMDi AmerikA company ki udyOgam cEstunnarOjulivi. EmainA maarpu anEdi AhvAnimchAlsiMdE? ika ElUUro bhAsha ruci cUpistaarEmO?
All the best
sarma k g k
కొంచెం ఆలస్యం గా జవాబు ఇస్తున్నందుకు క్షమించెయ్యండి.
జై తెలంగాణా గార్కి,
నా టపాలు చదువుతున్నందుకు, మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. ఏలూరు లో రెండు మూడేళ్లు ఉందామని అనుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాదు కే వస్తాను. థాంక్యూ.
బాలు గార్కి,
ధన్యవాదాలు. తప్పకుండా పాలకొల్లు వెళతాను క్షీర రామలింగేశ్వర స్వామి గారి దర్శనం కూడా చేసుకుంటాను. థాంక్యూ.
కే. జి. కే. శర్మ గార్కి,
ధన్యవాదాలు. ఊరు మారినప్పుడు ఒక నెలరోజులైనా సెలవు పెట్టకపోతే బాగుండదని పెట్టేనన్నమాట. అంతకు మించి కారణాలు ఏమి లేవు.:):)
రైట్..రైట్...అప్పుడప్పుడు వస్తూ ఉండండి మా భాగ్యనగరానికి....ఏంటి అందరు మా నగరాన్ని అలా తిడుతున్నారు..మీకు సెల్టర్ ఇచ్చిన పాపానికి ఇదా మీరు (బ్లాగ్ మిత్రులు) మా నగరానికి ఇచ్చే బహుమతి. జెస్ట్ కిడ్డింగ్
hi
sir........
sir miru intaki yeluru vellaraaa...?
http://rajachandraakkireddi.blogspot.com/2009/11/interduce.html
chala baga rasaru sir...i like tis post..
http://kallurisailabala.blogspot.com/
డేవిడ్ గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
రాజచంద్ర గార్కి,
అవునండి ఏలూరు వచ్చేశాం. కిందటి నెలాఖరులో. ప్రస్తుతానికి అంతా బాగానే ఉంది. ధన్యవాదాలు.
కల్లూరి శైలబాల గార్కి,
ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి