హాస్య బ్రహ్మ జంధ్యాల .. .... (వెలుగు నీడలు )

జంధ్యాల అంటే పెదాల చివర నుంచి చిన్నగా మొదలైన నవ్వు ,  బాబూ చిట్టీ అంటూ  పెరిగి  'ఏమిటీ, నీకు  కస్తూరి వారి గురించి తెలియదా'  అంటూ కోప్పడి,  చికెనవా ఉస్తిమోవ్ తినిపించి,  నేను కవయిత్రి ని కాదన్న వాడిని కత్తితో పొడుస్తా అని బెదిరించి, కనిపించిన ప్రియానంద భోజుల ను   (అంటే తెలుసా... ప్రియా పచ్చళ్లను ఆనందంగా భుజించేవాళ్లు)   పలకరిస్తూ, సుత్తి కొడుతూ,  పెద్దదై  పగలబడి నవ్విస్తుంది. 

హాస్య బ్రహ్మ జంధ్యాల తెలుగు సినిమాలో హాస్యానికి కొత్త నిర్వచనం చెప్పారు. చక్కగా కుటుంబ సమేతం గా చూడదగిన హాస్య చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అనేక సినిమాలకు రచయిత గా పని చేశారు. వారిని, వారి చిత్రాలను గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ నవ్వుకోవాలనే సదుద్దేశం తో శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు మరికొంత మంది మిత్రులు కలిసి    'జంధ్యావందనం' అనే వెబ్ సైట్ ప్రారంభించారు. హాయిగా  నవ్వుకోవాలంటే, జంధ్యాల వారి గురించి తెలుసుకోవాలంటే   'జంధ్యావందనం'   దర్శించండి.

జంధ్యాల వారి  గురించి  శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారు  ఆంగ్లం లో  వ్రాసిన వ్యాసానికి నా తెలుగు అనువాదం జంధ్యావందనం  లో ప్రచురించబడింది. ఇది ఆరున్నొక్క భాగాలుగా ఉన్నాయి. వాటిని ఈ కింద లింకు లలో చదవవచ్చు.      


హాస్య బ్రహ్మ జంధ్యాల ...... (వెలుగు నీడలు)


రెండవ భాగం  

మూడవ భాగం  

నాలుగవ భాగం  

ఐదవ భాగం




చివరి భాగం  


మీకందరికి ఇవి నచ్చుతాయని, చదివి ఆనందిస్తారని  భావిస్తాను .  మీ కామెంట్లు ఏమైనా ఉంటే అక్కడే వ్రాస్తే సంతోషిస్తాను.

ఇంత చక్కటి విశ్లేషణతో జంధ్యాల వారి గురించి ఆగ్లం లో వ్రాసిన శ్రీ కంచిభొట్ల శ్రీనివాస్ గారి ని అభినందిస్తున్నాను. అనువాదం లో, భావ వ్యక్తీకరణ లో  పొరపాటు జరిగితే  వారు నన్ను మన్నిస్తారని ఆశిస్తున్నాను.  

తెలుగు లోకి అనువదించిన,  నా వ్యాసం ప్రచురించినందుకు  జంధ్యావందనం  సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాను. 
  

14 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

సార్‌ ఏమనుకోకుణ్డా మీ బ్లాగు కూడలిలో వచ్చేలాగా చేస్తారా? కెలుకుడు బ్లాగుల పుణ్యమా మాలికని చూసే పరిస్థితిలేదు

Disp Name చెప్పారు...

ఇదన్న మాట, స్వామి వారి బహుకాల విరామమునకు కారణము !

చీర్స్

జిలేబి.

కొత్తావకాయ చెప్పారు...

గ్రేట్ జాబ్, సర్!! :)

అజ్ఞాత చెప్పారు...

heya bulususubrahmanyam.blogspot.com owner found your site via Google but it was hard to find and I see you could have more visitors because there are not so many comments yet. I have discovered website which offer to dramatically increase traffic to your blog http://xrumerservice.org they claim they managed to get close to 1000 visitors/day using their services you could also get lot more targeted traffic from search engines as you have now. I used their services and got significantly more visitors to my website. Hope this helps :) They offer affordable link building service about seo backlink service relevant backlinks Take care. Jay

నవజీవన్ చెప్పారు...

హాస్య బ్రహ్మ జంధ్యాల వారి మీద ప్రారంభించిన ఈ వినూత్న వెబ్ సైట్ ను గూర్చి
మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గారికి,
కూడలి లో కూడా నా బ్లాగు వస్తోంది. ధన్యవాదాలు.

జిలేబి గారికి,
ఇది కాదు లెండి. ధన్యవాదాలు.

కొత్తావకాయ గారికి,

అనానిమస్ గారికి,

చైతన్య దీపిక గారికి,

అందరికీ ధన్యవాదాలు.

PALERU చెప్పారు...

బులుసు గారు .....

ఎలా ఉన్నారండి ? మీకే ...బానే ఉంటారు ...ఎటు తిరిగి మాకే కష్టాలు ......నిన్నటి నుండి పొట్ట నరాలు ఎంత నొప్పిగా ఉన్నాయో తెలుసా ....నా టైం బాగోక మీ బ్లాగ్ చదివాను ...అంతే!! నవ్వి నవ్వి .....ఒకటే నొప్పి ....అయినా మరీ ఇంతలా నవ్వించడానికి మీకు హక్కులు లేవు....మీ మీద నేను కంప్లైంట్ చేద్దామని సుప్రీం కోర్టు కి వెళ్తే ..మీ పేరు చెప్పగానే పడి పడి నవ్వాడు ఆ జడ్జి ...అందరికి పాకింది మీ వైరసు ...అందుకే కోపంగా రాస్తున్నా ఈ కామెంటు ...మీకు నిజంగా ధైర్యం ఉంటె నెలకి 10 టపాలు రాయండి ...మీ మీద ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు కాకపొతే అడగండి .ఆ ......

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

RAAFSUN గారికి,

క్షమించాలి. చాలా ఆలస్యం గా జవాబు ఇస్తున్నందుకు.

నెలకి 10 టపాలు వ్రాసే అంత సరుకు నాకు లేదండీ. అయినా అంతపని చేస్తే పాఠకులు సజీవదహనం చేస్తారేమో నని భయం. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

naa comment ee post ki sambandinchindi kaadu kaani tappatledu maro maargam ledu..

nenu telugulo manchi pustakala list okati tayaru cheddamani anukuntunnanu.. induku mee sahaayam kooda kaavali. ippati varaku meeru chadiina,vinna pustakaalalo manchivi/meeku nachinavi ento cheppagalaru.

జయ చెప్పారు...

మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

హాయిగా ..మనఃస్పూర్తిగా నవ్వుకుంటూ.. ఉన్నానండీ.. ధన్యవాదములు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు .

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గారికి,

నాకు సాహిత్యం తో పరిచయం తక్కువ. అందుచే నేను సరి అయిన సలహాలు ఇవ్వలేను. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

జయ గారికి,

వనజ వనమాలి గారికి,

ధన్యవాదాలు.

మీకు, మీ కుటుంబ సభ్యులందరికి,
నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీలలిత చెప్పారు...

నూతన సంవత్సర శుభాకాంక్షలు...

Disp Name చెప్పారు...

గురువు గారూ,

మొత్తం మీద, మిమ్మల్ని మీ బ్లాగ్ టపా ని ఆంధ్రజ్యోతీ వారు హైజాక్ చేసినట్టున్నారండీ !!

శుభాకాంక్షలు ! ప్రింటు మీడియా లో ఎంటర్ అయిపోయారన్నమాట!!!

రాబోయే కాలం లో ప్రింటు మీడియా లో మీరు 'స్ప్రింటు' వేగం తో నవ్వుల పువ్వులు పూయించాలని మనసారా ఆశిస్తూ

చీర్స్
జిలేబి.