నా జీవిత చరిత్ర - నా బాల్యం


నా జీవిత చరిత్ర - తొలిపలుకులు   చదివిన తరువాత  సహృదయులైన  ముగ్గురు మిత్రులు తొలి పలుకులు వ్రాసి ఇస్తామని ముందుకు వచ్చారు.  వీటిని మొదటి తొలి పలుకులు, మధ్య తొలి పలుకులు మరియూ తుది తొలి పలుకులు గా  పెట్టేద్దామని నిర్ణయించుకున్నాను.  ఇన్ని తొలి పలుకులు ఉన్న  ఆత్మకధ పుస్తకం బహుశా నాదే మొదటిదనుకుంటాను. శిష్యులు కొంతమంది   తొలి పలుకులకు అనుబంధం గా  నా గురించి వారి వారి అభిప్రాయాలు  ఒక చిన్న నవలా రూపం లో ఇస్తామని ఉత్సాహ పడుతున్నారు. పెద్దపుస్తకానికి చిన్న పుస్తకం ఉచితం,  స్కీము కూడా తయారయి పోయింది. ఇక  ఆలస్యం చేయకుండా నేను వ్రాయడమే మిగిలింది. మొదటి పర్వం లో నా బాల్యం గురించి అంటే పుట్టినప్పటినించి నాకు పది ఏళ్ళ వయసు దాకా,   వ్రాద్దామని మొదలు పెట్టాను.

పుట్టినప్పటినుంచి  కూడా పనీ పాడు లేకుండా ఉండడం నాకు అలవాటుట. రెండేళ్ళ దాకా పనీపాడు లేకుండా ఏడ్చేవాడినట. పనీ  పాడు ఉన్నవాళ్ళు  పనులు మానుకొని నన్ను ఊరుకోబెట్టేవారుట.   రెండేళ్ల నుంచి నడక బాగా అలవాటు అయి అటూ  ఇటు తిరుగుతూ అల్లరి చేస్తుంటే పని ఉన్నవాళ్ళు పని పాడుచేసుకొని నాతోటి ఆడుకొనేవారుట. ఇంకో ఏడాది గడిచేటప్పటికి నాలోని జ్ఞానజ్యోతి ప్రకాశించడం మొదలు పెట్టిందిట.  ఇంట్లో గ్లాసులు, గరిటెలు, చెంచాలు మొదలైనవి వీధిలోకి విసిరేస్తే అవి మళ్ళీ ఎలా ఇంట్లోకి వచ్చేవో పరిశోధించే వాడినట. ఇంకొంచెం పెరిగేటప్పటికి బొమ్మలు అవి విరగకొట్టి  వాటిలో ఏమున్నాయో  తెలుసుకొనే ప్రయత్నాలు చేసేవాడినట.

ఇల్లాగే ఇంకొంత కాలం గడిచేటప్పటికి  మా నాన్నగారు కంగారు పడి, పనీ పాడు లేకుండా ఉంటే వీడి జ్ఞానపిపాస భయంకరం గా తయారవుతుందని భీతి చెందినవారై, 4 ఏళ్ల వయసులో ఓ పలకా బలపం చేతికి ఇచ్చి, తీసుకెళ్లి స్కూల్లో వేశారుట.  అప్పటికే అక్కడ ఉన్న జ్ఞాను లతో కలసి నేను కూడా మా మాష్టారుకి జ్ఞానబోధ చేసేవాడినట. అ, ఆ లు అనేక కొత్త రకాలు గా వ్రాసి ఆయన కంట నీరు తెప్పించేవాడినట.  పలక మీద దిద్దించి, పలక విరిగినప్పుడు లేక బలపం నేను ఫలహారం చేసినప్పుడు  ఇసుకలో దిద్దిస్తూ,  రెండు నెలల ప్రయత్నం  తరువాత ఓ రోజు సాయంకాలం వీరేశం మాష్టారు మా నాన్నగారిని కలిశారుట.

శాస్త్రిగారూ మీ అబ్బాయి ఏ పికాసో యో అయే సూచనలు కనిపిస్తున్నాయి. సందేహం లేదు అని మొఱ పెట్టుకున్నారట.
మా నాన్నగారు తీవ్రంగా ఆలోచించి దీర్ఘం గా నిట్టూర్చి
వీరేశం మాష్టారు గారూ వీడిని రవివర్మ లా మార్చే గురుతర బాధ్యత మీ మీదే పెడుతున్నాను. అవసరం అనుకుంటే పేకా వారి అమ్మాయితో పెళ్లి జరిపిస్తుండండి. అని అనుమతి ఇచ్చేశారు.

అప్పుడే పెళ్ళా, నాల్గైదు క్లాసులకి రానీయండి అని అభ్యంతరం చెప్పిందిట మా అమ్మగారు.

అమ్మాయీ,  వీడు నాల్గైదు క్లాసులకి రావాలంటే ఇప్పటినుంచి అప్పుడప్పుడు పెళ్లి తప్పదమ్మా అన్నారుట వీరేశం మాష్టారు.

తప్పక మా అమ్మగారు కూడా అంగీకరించారుట.

రెట్టించిన ఉత్సాహంతో మా మాష్టారు , నా చెవులు మెలేస్తూ, వీపు మీద తబలా, మృదంగం వాయిస్తూ, అవసరం అనుకున్నప్పుడు భయంకరం గా ఆఫ్రికా డ్రమ్ములు కూడా వాయిస్తూ అ ఆ లు అంకెలు అవీ నేర్పేశారుట. అంకెల్లో నేను ఒకట్లు, రెళ్ళు ఎక్కువుగా ఉపయోగించేవాడినట.  మేష్టారూ ఒకటికి, మేష్టారూ రెంటికి అంటూ క్లాసులోంచి పరిగెత్తేవాడినట.  

ఇల్లా నేను ఒకటో క్లాసు వెలగబెడుతున్నానని  విని మా బాబయ్య గారు ఆనంద భరితుడై మా ఇంటికి వచ్చినప్పుడు,  అల, తల, వల, పలక ల బొమ్మల పుస్తకం నాకు బహుమతి గా తెచ్చారుట. బహుమతి ఇచ్చిన బాబయ్య ఊరుకోకుండా అందులో బొమ్మలు చూపించి ఇదేమిటిరా బుజ్జీ అంటూ విసిగించేవాడు. నాకు చిరాకేసి చెప్పాను బాబయ్యతో.

బాబయ్యా ఇది నాకు నువ్వు నేను చదువుకోడానికి ఇచ్చావు. నువ్వు చదువకూడదు అని.

అయినా వినిపించుకోకుండా మొట్టికాయలు, తొడపాశాలు కూడా బహుమతి ఇచ్చి అవి అన్నీ నాచేత పలికించాడు. మా బాబయ్య వెళ్ళింతరువాత మా అక్కయ్యలు కూడా ప్రయత్నించేవారు. అప్పుడే నా జ్ఞానచక్షువులు విచ్చుకున్నాయి. పుస్తకం లోని పేజీలు పడవలై  అల,వల,తలలు నీటిలో కొట్టుకుపోయాయి. ఆ తరువాత నా వీపు మీద విమానాలు ఎగిరాయి.

మా మాష్టారు చేతులు లావుగా వాయడం వల్లనూ, నలుగురైదుగురు పేకా వారమ్మాయిలు నా శరీరం మీద భరత నాట్యం చేయడం వల్లనూ ఒకటి రెండు క్లాసులు గట్టెక్కించేసాను. 

పాపం మా పితాశ్రీ గారు పుస్తకాలు కొనడం, అట్టలు వేయడం, దబ్బనం తో లావుపాటి దారం తో వాటిని కుట్టి, నేను పేజీలు చింపడం క్లిష్టతరం చేసేవారు. కానీ హనుమంతుని ముందా కుప్పిగంతులు.  నాలుగు నెలలయ్యేటప్పటికి మళ్ళీ పుస్తకాలు కొనడం, అట్టలు వెయ్యడం కుట్టడం వంటి నాలుగు నెలల ప్రణాళికలు మా నాన్న గారు చేసుకునేవారు.

ఈ విధం గా నేను పుస్తకాలు చింపడం లో కొత్త మార్గాలు కనిపెడుతూ, పక్కవాళ్ళ పుస్తకాల్లోంచి తీసివేతలు చేస్తూ, మా స్కూలు ఎదురుగా ఉన్న చెరువులో పడవల  కూడికలు వేస్తూ, మాష్టారు కొట్టిన దెబ్బలని నాన్న గారు తిట్టిన తిట్లతో బాగహారం చేస్తూ; 

ముక్కులోని ద్రవం ఎప్పుడూ కిందకే వెళ్ళుతుందన్న న్యూటన్ గారి సిద్ధాంతం తో బాటు, చింతా మాష్టారి  చింత బరిక కన్నా రాయప్రోలు వారి  వెదురు బద్ద వీపు మీద ఎందుకు ఎక్కువ మంట పుట్టిస్తుందో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేస్తూ; 

అశోకుడు నాటించిన చెట్ల వల్ల ఎంతమందికి ఎన్ని పళ్ళు దొరికాయో తెలియకపోయినా, హరి వారి ఇంట్లో జామచెట్టు కన్నా మల్లాది వారి ఇంట్లో బాదం చెట్టుకు ఎన్ని రాళ్ళు ఎక్కువ కావాలో లెఖ్ఖబెట్టుకుంటూ; 
 
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరగడం వల్ల రాత్రులు పగలు వస్తాయని తెలుసుకున్న తరువాత, ఇంటికొచ్చిన చుట్టం చుట్టూ ఎన్ని మాట్లు తిరిగితే ఎన్ని కానులు రాలుతాయని అంచనా వేసుకుంటూ;  
ప్రైమరీ స్కూలులో చదువు పూర్తి చేసేశాను. 

అప్పుడు మా నాన్నగారు నా చదువు గురించి పునరాలోచనలో పడ్డారు. ప్రైమరీ స్కూలు చదువుకే అరఎకరం ఖర్చయితే ఎలా అని విచారించారు. విచారించి లాభం లేదు, వీడికి పుస్తకాల అవసరం లేకుండా, మెళ్ళో ఓ దారం పోగు వేసి వేదాధ్యయనం చేయడానికి మా తండ్రిగారి గురువు గారి దగ్గరికి పంపుదామని నిర్ణయించుకున్నారు.

ఈ కఠోర నిర్ణయం విన్నతరువాత మా అమ్మగారు నిరసన తెలియచేసారు. ఆ తరువాత తీవ్రం గా వ్యతిరేకించారు. 

మన వంశం లో వేదాలు చదివిన ఘనాపాటి ఒక్కడైనా ఉండాలని మా నాన్నగారు  పట్టుబట్టారు.

మా అమ్మగారు మహాత్మా గాంధీ గారి అడుగు జాడల్లో సత్యాగ్రహం చేశారు. 
  
వేదాలు చదివి మీరేం ఉద్ధరించారు. ఉన్న ఆస్థి కరగపెట్టడం తప్ప. వీడు ఇంగ్లీష్ చదువులు చదవాల్సిందే అని నాలుగు రోజులు అభోజనం ఉన్నారు. 

మా మేనమామలు, మా మాతా మహులు కూడా రంగంలోకి దిగారు.   ( మా పితామహులు అప్పటికే కాలం చేశారు). మా నాన్న గారు పని  చేస్తున్న స్కూలు లోని తోటి మాష్టార్లని కూడా రంగం లోకి దింపి  మా తాత గారు మా నాన్నగారిని ఒప్పించి తమ పుత్రికా రత్నం అభీష్టం నెరవేరడానికి సహకరించారు.  

సరిగ్గా ఇక్కడకు వచ్చిన తరువాత కలం అటకాయించింది. నాకు గుర్తు ఉన్నంతవరకు కాకపోయినా,  నేను మా ఇంట్లో నా గురించి మా పెద్దలు మాట్లాడుకోగా  విన్నది అంతా వ్రాసాను.  కానీ  నా బాల్యం ఇంతేనా అని అనుమానం వచ్చింది. నేనేమీ ఘనకార్యాలు చేయలేదా? అనే సందేహం వచ్చింది.  ఏ ఆత్మ కధ చదివినా పూవు పుట్టగానే పరిమళిస్తుంది  అన్న విధం గా  చిన్నప్పుడే అనేక ఘన కార్యాలు చేశామని వ్రాసుకుంటారు. ఘనకార్యాలు లేకపోతే నా ఆత్మకధ చిన్నబుచ్చుకుంటుంది .

ఆఖరికి  బ్లాగుల్లోనూ,  బజ్జుల్లోనూ, + ల్లోనూ  కూడా చాలా గొప్పగా చెప్పుకుంటారు.  ఒకటవ ఏడు రాకుండానే పరిగెత్తేశాను,  పరుగు పందెంలో మొదటి బహుమతి వచ్చింది, అని చెప్పే వాళ్లని చూశాను. 3 వ ఏటే నేను భగవద్గీత  కంఠతా పట్టేశాను అని ఒకరంటే 6వ. ఏట Gone with the wind  చదివేశా,  7వ. ఏట  Old man and the sea గురించి ఉపన్యాసాలు ఇచ్చాను  అని  ఇంకొకరు చెపుతున్నారు.  ఇంకో ఆవిడ  అయితే,  ఇంకా నడక రాకుండానే భరత నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టేసిందట, 4వ ఏట ఆరంగేట్రం చేసి 6వ ఏట కల్లా ప్రదర్శనలు  ఇవ్వడం ప్రారంభించిదిట.  ఒక భజగోవిందం గారు  4వ ఏటికల్లా గీత గోవిందం కంఠతా పట్టేసి గుళ్ళో పాడే వాడట. ఆవిడ ఎవరో 4 వ ఏట గోదారి గట్టున ఆల్చిప్పలు, శంఖాలు, గవ్వలు రకరకాలు రకరకాల రంగులవి, ఏరేసుకుంది ట. ఏరంగు వి ఎన్నో,  ఏ ఆకారానివి ఎన్నో కూడా గుర్తు పెట్టేసుకుందిట.

మరి ఇదేమిటి నేను  6 వ ఏట  కాకపోయినా 10 ఏళ్ల దాకా  కూడా ఏమి చేయలేదా. 10 ఏళ్ల దాకా భోంచేసి బజ్జోడం తప్ప ఏమి లేదా నా జీవితం లో. ఒఖ్ఖటంటే ఒఖ్ఖ చెప్పుకోదగ్గ సంఘటన ఏమీ జరగలేదా? లేక నాకు గుర్తుకు రావటం లేదా.  రింగులు రింగులు తెప్పించుకొని వాటిలో చూసినా, శూన్యం లోకి చూసి కడు  దీర్ఘంగా నిట్టూర్చినా ఏమి గుర్తు రాలేదు. ఏంచెయ్యాలో తోచక శీర్షాసనం వేసి కూడా చింతించాను. అబ్బే ఫలితం లేకపోయింది. ఏమి ఈ వైపరీత్యము. నాకేల గుర్తు రాకుండే  అని గ్రాంధికం లో కూడా విచారించాను.  

చివరి ప్రయత్నంగా ఒక  సుత్తి తీసుకొని నా నెత్తి మీద నేనే ఒకటి ఇచ్చుకున్నాను. అదేమిటో సుత్తి తో ఒకటుచ్చుకొంటె తప్ప నా బుఱ్ఱ లో దీపం వెలగదు. యధా శక్తి తధా బల్బు  అన్న మాట. అంటే ప్రయోగించే ప్రహారాన్ని బట్టి 10 W నించి 100 W దాకా బల్బు వెలుగుతుంది.  నేను మూడు ప్రయత్నాలు చేశాను. హాస్పిటలు కెళ్ళి కట్టు కట్టించుకోవడం తప్ప మరే ప్రయోజనం కలగలేదు.  పదిరోజుల్లో   రెండు మాట్లు వచ్చాడు కట్టు కట్టించుకుందుకు పాపం అని వైద్య శిఖామణి గారు జాలి పడ్డారు. 

అప్పడాల కఱ్ఱ ఉపయోగించు విధి విధానములు నేర్చు కొనేందుకు మా అపార్టుమెంటు   లేడీసు మా ఆవిడ దగ్గర క్యూ కట్టారు కానీ విషయం తెలిసి విచారించి వెళ్ళిపోయారు.                  

ఆపైన మా ఆవిడ సలహా తో మా సోదరీమణులను, సోదరుడిని అడిగాను నా బాల్యం గురించి వారికి ఏమైనా గుర్తుకొస్తే చెప్పమని. వారు కూడా తమ అశక్తత వెలిబుచ్చారు. తరచి తరచి అడగగా మా అగ్రజుడు దీర్ఘం గా నిట్టూర్చి,  

ఏమోరా చిన్నప్పుడు నువ్వు మోకాళ్ళకిందకు చొక్కావేసుకొని  ఓ చేత్తో  తాళ్ళ లాగు  పైకి లాక్కుంటూ,  రెండో చేత్తో ముక్కు తుడుచుకుంటూ  తిరుగుతున్న రూపమే గుర్తుకొస్తోంది తప్ప మరేమీ  జ్ఞాపకం రావటం లేదు, అని అన్నాడు.

మా చిన్నతనం లో లాగులు అంటే నిక్కర్లు అలానే ఉండేవి. నో బొత్తామ్స్ ఆర్ నో జిప్స్ అన్నమాట. నిక్కరుకు నడుం దగ్గర రెండు వైపులా మూడు నాలుగు అంగుళాల తాళ్ళు ఉండేవి. కిందనించి నిక్కరు పైకి లాక్కొని రెండు తాళ్ళు వెనకాల కి  ముడివేసేవారం. అది జారిపోకుండా మళ్ళీ మళ్ళీ బిగించడం,  పైకి లాక్కోవడం ఇవన్నీ సాధారణంగా నే ఉండేవి ఆ కాలం లో. మోకాళ్ళ కిందకు కుట్టించిన చొక్కా  పొట్టమీదకు వెళ్ళినా చిరిగేదికాదు. బలవంతాన చింపుకొని తన్నులు తినేవారం.  కొత్త చొక్కా కుట్టించుకుంటే  వేసుకున్న లాగు కనిపించేది కాదు.  

అదేమిటో ఆకాలంలో 10 ఏళ్ళు వచ్చేదాకా అంతా కుఱ్ఱ కుంకల కిందే లెఖ్ఖ. స్వతంత్రంగా ఏమి చెయ్యనిచ్చేవారు కాదు. ఎండలో ఆడితే మొట్టికాయలు, మొండికేస్తే  చెంప దెబ్బలు విరివిగా దొరికేవి. మా మనోభావాలు దెబ్బతింటాయేమో నని ఆలోచించేవారు కాదు. మనోభావాలు ఉంటాయని కూడా గుర్తించేవారు కాదు. ఎంతసేపు దొంగా పోలీసు, చెడుగుడు, గోటిబిళ్ళ, బచ్చాల ఆట, బొంగరాలు   తప్పితే మరో ఆటకూడ ఉండేదికాదు. నీకేం కావాలి అని కూడా  ఎవరూ ఎప్పుడూ అడిగిన గుర్తు లేదు. 10 ఏళ్ళు వచ్చేదాకా కూడా ఎప్పుడైనా సినిమా కెళ్ళితే ఆడ మలయాళం తోనే వెళ్లాల్సివచ్చేది. మగ పిల్లలం అని కూడా గుర్తించేవారు కాదు. దిస్సమొలల తో టింగురంగా అని కూడా తిరిగేసే వారం. నూతి దగ్గర గోచికూడా లేకుండా  విశృంఖలంగా స్నానాలు చేసేసే వాళ్ళం. ఇవన్నీ గుర్తు వస్తున్నాయి కానీ చేసిన ఘనకార్యాలు ఏమి గుర్తు రావటం లేదు.

అయినా ఇల్లాంటివి ఆత్మ కధలో వ్రాసుకుంటే బాగుండదు కదా. అందుకని పైన వ్రాసింది మీరు చదవకండి. చదివితే నా ఆత్మ కధ మీద ఒట్టే. ఒకవేళ పొరపాటున చదివినా వెంటనే మరచిపొండి.    

అందువల్ల ఓ నా ప్రియ పాఠకుల్లారా  నా బాల్య అధ్యాయం ఇంతటితో ఇక్కడ ఆపేస్తున్నాను.    మీరు  నాకేమైనా సలహాలు ఇవ్వగలరా? మీ బాల్యం లో మీరేమైనా ఘనకార్యాలు  చేస్తే నా చెవిలో చెప్పండి. మీ బాల్యకధలు  చౌర్యం చేసి నేను వ్రాసేసుకుంటాను.   లేకపోతే బాల్యం మరిచి పోయిన ప్రద్యుమ్నుడు అని మీరంతా వేళాకోళం చేసే అవకాశం ఉంది. ప్రతిఫలాపేక్ష లేకుండా,  మీరు  నా జీవిత కధ కొనసాగించడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నాను.  


38 కామెంట్‌లు:

మనసు పలికే చెప్పారు...

గురూగారూ....
మా బాల్యంలో ఘనకార్యాలని చౌర్యం చేసి మీ ఆత్మకథలో రాసుకుంటారా?? అయినా, మీరు అంత చిన్న వయసులోనే బోలెడన్ని Ph.D. లు చేసేశారుగా:)


టపా మాత్రం ఎప్పటి లాగానే నవ్వు తెప్పించింది:)

రసజ్ఞ చెప్పారు...

హహహ! నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి పెట్టి, కళ్ళ నుంచి నీళ్ళు కారుతున్నాయి (ఆనందభాష్పాలు). నాకు నచ్చినవన్నీ రాస్తూ పోతే మీ టపా వచ్చేస్తుందేమో మొత్తం!
నా బాల్యంలో నేను చేసిన ఘనకార్యాలు నాకయితే ఏమీ గుర్తులేవు కాని మా వాళ్ళు చెప్పి చెప్పి నవ్వి నవ్వి నా పరువు తీస్తూ ఉంటారు అందరిముందూను. ఇప్పుడు మీకెందుకు చెప్తున్నా అంటే మన పరువు మనమే తీసేసుకోవటం మంచిది అన్న సహృదయముతో!!!
సైకిలు మీద రేకు డబ్బాలు పెట్టుకుని గంగరాజు పాలకోవాలు (మా ఊరి స్పెషలు) అమ్ముకుంటూ రోజూ సాయంత్రం ఒకతను వచ్చేవాడుట మా వీధిలోకి. అతను "రండి బాబూ రండి! అందమయిన, రుచికరమయిన పాలకోవాలు ఒక్క పాలకోవా మూడు రూపాయలు రెండు పాలకోవాలు అయిదు రూపాయలు రండి బాబూ రండి" అని అరిచేవాడుట అమ్ముకోవడానికి. నేను మా వీధి అరు(గు మీదకి వెళ్లి స్థంభం వెనకాల దాక్కుని అతని కన్నా గట్టిగా "రండి బాబూ రండి! రండి కొనండి తినండి కింద పడి దొర్లండి" అని అరిచేదాన్నిట.

Zilebi చెప్పారు...

అయ్యా బులుసు వారు,

నేను పుట్టీ న ఐదో సవత్సరం తోటే రెండో ప్రపంచ యుద్ధం తెప్పించి, మరో రెండేళ్లలో భారద్దేశానికి స్వాతంత్రం తెప్పించానండీ ! ఎంత ఘన కార్యం చేసానో చూడండి మరి !


చేష్టల
జిలేబి !

SHANKAR.S చెప్పారు...

గురూజీ మీ బాల్యంలో చేసిన పనుల గురించే కదా మీకు కావాలి. ఒక్కసారి రింగులు రింగులు తిప్పుతూ వెనక్కి వెళ్లి మీ ఇంటి చుట్టుపక్కలగానీ, బళ్ళోగానీ ఇప్పటి రంగమ్మగారి లాంటి చిన్న,బుల్లి బాలికలు /లేదా మీరు చిన్నప్పుడు చూసిన సినిమాల్లో మీ మనసు దోచిన వీరోవిన్లు ఉన్నారేమో ఆలోచించండి.ఒక్కసారి మీరు ఆ రీలేసుకుంటే హీనపక్షం డజను మంది తేలకపోరని నా ప్రగాఢ నమ్మకం. ఒక్కరు గుర్తొస్తే చాలు మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా గుర్తోచ్చేస్తారు. ఇహ ఆ తర్వాత మీ బాల్యం గురించే రెండు మూడు పుస్తకాలకి సరిపడా జ్ఞాపకాలు తన్నుకొచ్చేస్తాయి. నా మాట విని ఇలా ప్రయత్నించి చూడండి.

అలాగే మీ ఆత్మకధలో తొలి,మధ్య, తుది తొలిపలుకులు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాయి కాబట్టి మీ మిగిలిన అభిమానులకి ప్రతి పేజీలో ఫుటర్ స్పేస్ లో ఒక్క పేరా తొలి పలుకులు రాసే అవకాశం కల్పించమని మనవి. అప్పుడు ఎంచక్కా ప్రతి పేజీలో తొలి పలుకులు ఉన్న ఏకైక ఆత్మకథ మీదే అవుతుంది.

అన్నట్టు మీ చిన్నప్పుడు తీర్థాలకి వెళ్లి ఉంటారుగా. అక్కడి జ్ఞాపకాలు రాసేయండి.

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నవ్వి నవ్వి ...నవ్వి.. చచ్చి పోయామండి. మీరేమో..సింపుల్గా నవ్వితే నవ్వండి అంటారు ఎలాగండీ మాస్టారు? రింగులు రింగులు ఎప్పుడు మొదలెట్టారో..కూడా వ్రాయండి.

ఆ.సౌమ్య చెప్పారు...

హహహ ప్రతీ వాక్యానికీ నవ్వించారండీ. :))

మీరు పుట్టడమే ఓ పెద్ద ఘనకార్యం...ఇంకా కొత్తగా చెయ్యాలిటండీ! ఈ కోణంలో నుండీ ఆలోచిస్తే మీరు ఏమి చేసినా అది ఘనకార్యమే...కాదనేవారెవరు! అలా ఎవరైనా అంటే ఓ కేకెయ్యండి మీ శిష్యగణం ప్రతాపమేమిటో చూపిస్తాం!

గుణసుందరి కథ సినిమాలో రేలంగి వాళ్ళలా "మేమేం చేస్తే అది ఘనకార్యం, మేమేం చేస్తే అది ఘనకార్యం " అని పాడుకుంటూ ప్రొసీడ్ అయిపోండి.

Kalasagar చెప్పారు...

బావుంది, సార్....

sai krishna alapati చెప్పారు...

మీరు ఏమి చేసిన ఘనకార్యమే

చాణక్య చెప్పారు...

గురువుగారు టపా అదిరింది(ఎప్పట్లాగే).. మీకు ప్రశంసలు కొత్త కాదు, మాకు మీ పోస్ట్‌లు చదివి పగలబడి నవ్వుకోవడమూ కొత్త కాదు. మా బాల్యం కంటే మీదే బావుంది. ఇది ఇలాగే రాసేస్తే మీ జీవితచరిత్ర భగవద్గీత కంటే ఎక్కువ కాపీలు అమ్ముడైపోతుంది. అ.హా.

Sudha Rani Pantula చెప్పారు...

బులుసుగారూ
ఆత్మకథలో ఘనాపాటీ, ఎందులోనో లేరు మీకు సాటీ..

బాబయ్యా ఇది నాకు నువ్వు నేను చదువుకోడానికి ఇచ్చావు. నువ్వు చదువకూడదు అని...భలే చెప్పారు.
ఇంటికొచ్చిన చుట్టం చుట్టూ ఎన్ని మాట్లు తిరిగితే ఎన్ని కానులు రాలుతాయని అంచనా వేసుకుంటూ;...మళ్ళీ చిన్నపిల్లలయిపోతే తప్ప గుర్తురాని విషయాలివి..
మీకేంటి సార్..అన్నీ బాగానే గుర్తున్నాయి కానీ
శంకర్ గారన్నట్టు ఈ కథకి వీరోయిన్ లేకపోవడం పేద్ద లోపమే..ఎందుకో మొహమాటమో ఏదో సందేహమో మిమ్మల్ని బాధిస్తోంది కానీ రాసేద్దురూ..వాటిని వదిలేసి.

శ్యామలీయం చెప్పారు...

ఇప్పుడింక అర్జెంటుగా నా బాల్యం వగైరాలగురించి రాసేసుకోవాలనుంది. కాని ప్రస్తుతం చెయ్యి ఖాళీ లేదు గిలకటానికి.
ఒక్కటి చెబుతాను.
మా యింటికి కూరల కావడి వాడు వచ్చాడు. 'అమ్మగారూ' అని పొలికేక పెట్టగానే ఆరిందాలా మా పెద్ద చెల్లెలు వచ్చింది.
సంభాషణలోకి తిన్నగా వచ్చేస్తాను.
'వంకాయ లున్నాయా'
'ఉన్నా యమ్మాయిగారూ'
'వీ శెంత'
'అర్ధరూపా యండి'
'ముప్పావలా కిస్తావా'
పాపం వాడు కావడిపడేసి పావుగంటదాకా నవ్వుతూనే ఉన్నాడు.

అజ్ఞాత చెప్పారు...

కోతికొమ్మచ్చులు,చెట్లు, పుట్టలు ఎక్కడం, అమ్మాయిల్ని ఏడిపించడం, వీపు విమానంమోతలు పలికించుకోడం, స్కూల్లో, మళ్ళీ ఇంటి దగ్గర, సశేషంలోనా? నవ్వు ఆపుకో లేక పోయనంటే నమ్మండి

మాలా కుమార్ చెప్పారు...

అబ్బ మీ బాల్యం ఇంతిటి దా ? కిం . దొ .న

rajasekhar Dasari చెప్పారు...

యథా అద్భుతం తధా నవ్వులు.
మీకొక హింట్ ఇస్తున్నాను , మేము స్కూల్ నుండి వచ్చి ఏట్లో ఆడి, బట్టలు తడుపుకుని వీపు విమానం మోత మోయించుకునే వాళ్ళం. మీ ఏటి అనుభవాలు గుర్తు తెచుకోండి. ( మేము ఏటిగట్టు వాసులము, అశోక్ నగర్ , ఆర్.ఆర్ .పేట్ ఏటికి దూరం )

kota చెప్పారు...

highly funny

జ్యోతిర్మయి చెప్పారు...

బాల్యమే ఇలా ఉంటే ఇక తర్వాత్తర్వాత ఇంకెంత బావుంటుందో..త్వరగా రాసేయండి మరి...

ఫోటాన్ చెప్పారు...

గురువు గారు..!!
సూపర్ పోస్ట్,... :))

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హహహహ ఆత్మకథ బాగుంది గురూజీ.. తరువాయి భాగం కోసం ఎదురుచూస్తున్నా :)

Sravya V చెప్పారు...

హ హ హ super గా ఉందండి మీ జీవిత చరిత్ర - బాల్యం :)))

రాజ్ కుమార్ చెప్పారు...

ఆహా...ఓహో.. ఏమ్ చెప్పమంటారు గురువు గారూ..

ఈ పోస్ట్ కి తిన్నదంతా అరిగిపోయింది.;( ;(
ఏంట్రా నీలో నువ్వే ఆ ముసి ముసి నవ్వులూ అని మా శశిగాడు తేడా గా చూస్తున్నాడు నన్ను ;(
ప్రతీ లైన్ కీ, ప్రతీ పదానికీ నవ్వుకున్నా. బిగినింగ్ నుండీ ఎండింగ్ వరకూ రచ్చో రచ్చ.కేక, అరుపులు, మంటలు.
ఒక్కో పేరా కీ ఒక్కో జ్నాపకం గుర్తొచ్చిందండీ నాకు.

జీవిత చరిత్ర లో తరువాయి భాగం గురించి నాలుగు కళ్ళతో ఎదురు చూస్తూ..

PALERU చెప్పారు...

గురూగారూ....
నవ్వి నవ్వి చచ్చి పోయామండి...అన్నట్టు తికొమ్మచ్చులు,చెట్లు, పుట్టలు ఎక్కడం, అమ్మాయిల్ని ఏడిపించడం, వీపు విమానంమోతలు పలికించుకోడం, స్కూల్లో, మళ్ళీ ఇంటి దగ్గర.....బావుంది, సార్....బాల్యమే ఇలా ఉంటే ఇక తర్వాత్తర్వాత ఇంకెంత బావుంటుందో??

జీవిత చరిత్ర లో తరువాయి భాగం గురించి నాలుగు కళ్ళతో ఎదురు చూస్తూ..///

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గారికి,

ధన్యవాదాలు. మీరు కూడా ఏమి ఘనకార్యాలు చేయలేదా ? గురువు కు తగ్గ శిష్యులన్నమాట..... దహా.

రసజ్ఞ గారికి,
చూసారా, నిజాలు చెప్పేస్తున్నారు. ఆ పాలకోవాల వాడు మళ్ళీ మీ వీధిలోకి వచ్చాడా ? ... దహా.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

జిలేబి గారికి,

అమ్మో, 5 వ. సంవత్సరం నుంచే నారదాయ నమః అనడం మొదలు పెట్టారన్నమాట... దహా
ధన్యవాదాలు.

శంకర్ గారికి,

ఇప్పటిలాగే చిన్నప్పుడు కూడా నేను చాలా అమాయకుడిని. చుట్టూ అంతా అక్కయ్యలు, చెల్లెళ్ళు, పిన్నులు ఉండేవారు. పిన్నులు అంటే పిన్నులు కాదు పిన్ను లు అంటే పిన్ని లు అన్నమాట.
నా జీవిత కధ ని తొలిపలుకులు దాటి ముందుకు వెళ్లనిచ్చే ఉద్దేశ్యం మీకు లేదా?
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వనజా వనమాలి గారికి,

ధన్యవాదాలు. పెళ్ళైన తరువాతే ఫ్లాష్ బాక్ ల అవసరం వస్తుందండి మగాడికి. ఎల్లా ఉండేవాడిని ఇల్లా అయిపోయానా అని విచారించటానికి. ..... దహా.

ఆ.సౌమ్య గారికి,

అంతేనంటారా. నేను పుట్టినప్పుడు ప్రకృతే వణికి పోయిందట. ఉరుములు మెరుపులతో వర్షం. గోదావరి పొంగడం అన్నీ జరిగిపోయాయిట. ఇవి కూడా ఘన కార్యాలేనా? మా వాళ్ళు మరోలా అంటారే ????.
ధన్యవాదాలు.

కళాసాగర్ గారికి,

ధన్యవాదాలు.

సాయికృష్ణ గారికి,

మీరు అల్లాగే అంటారా. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

చాణక్య గారికి,

మీ వ్యాఖ్యలు ఎప్పటిలాగానే నన్నానంద పరవశుడిని చేస్తున్నాయి. కానీ

అర్జునా, నా జీవిత భాగవత్చరిత్ర ను అచ్చు వేసిన పబ్లిషర్ గీత చెరిగి పోవును. ఇది తధ్యము. నమ్ముము.
ధన్యవాదాలు.

సుధ గారికి,

అవునండి నేను ఘనా మాటీ నే. (కబుర్లు చెప్పేవాళ్లని అల్లాగే పిలిచేవాళ్లం).
మీరింతగా ప్రోత్సహిస్తుంటే నాకూ ఉత్సాహం వచ్చేస్తోంది. నా ప్రేమ పురాణం గురించి ఒక టపా వేసేస్తా. నేనొక్కండనే పెక్కు వీరోయిన్లు. ధన్యవాదాలు.

శ్యామలీయం గారికి,

పావలా కన్నా రూపాయే ఎక్కువ అని మీ చెల్లెలు ధర్మ సూక్ష్మం గ్రహించేశారు. ఆలశ్యము చేయకుండా రాసేయ్యండి మీ బాల్యం గురించి. ధన్యవాదాలు.

కష్టేఫలి గారికి,

చిన్నప్పుడే ఢక్కా మొక్కీలు తిన్నవాడిని ఇంట్లోనూ స్కూల్ లోనూ కూడానూ. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మాలా కుమార్ గారికి,

నా బాల్యం అంతా అంతేనండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రాజశేఖర్ దాసరి గారికి,

ఇప్పుడైతే ఏలూరు కానీ చిన్నప్పుడు భీమవరమండి మాది. ఏర్లు లేవు అక్కడ ఒక మురుగు కాలవ తప్ప. దాని గురించి చెపితే కష్టం కదండి మరి. ధన్యవాదాలు.

శీను గారికి,

ధన్యవాదాలు.

జ్యోతిర్మయి గారికి,

బాల్యమే బాగుంటుందండి. ఆపైన అంతా టి‌వి సీరియలే. ధన్యవాదాలు.

ఫోటాన్ గారికి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణూ శ్రీకాంత్ గారికి,

ధన్యవాదాలు. తరువాయి భాగం విడుదల ఎప్పుడో, చెప్పలేము.

శ్రావ్య గారికి,

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,

శ్రవణానందకరం గా ఉన్నాయి మీ వ్యాఖ్యలు. మీ జ్ఙాపకాలు కూడా వినిపించేయండి మాకు.
బాల్యం దాకానే మన చేతిలో ఉంది. తరువాయి భాగం ఏమో ఏమి చెప్పలేము..... దహా.
ధన్యవాదాలు.

రఫ్ రాఫ్సున్ గారికి,

ధన్యవాదాలు. బాల్యం తరువాత జీవితం పరాధీనమే కదా.... దహా

Nandu చెప్పారు...

గురువుగారు..
టపా అదుర్స్.. నాకు విపరీతమైన నవ్వుతోపాటు నేను నాగురించి, 3వ,4వ 5వ,6వయేట చేసిన ఘనకార్యాల గురించి రాద్దామనుకుందంత ఇంతకుముందే ఎవరో అచ్చు అలాగే రాసేసారని చదివి ఏడుపొచ్చేసిచచ్చిందంది..
నేను మరిచి పోగ మిగిలిందాంట్లో 100w బల్బులా వెలిగిన అవుడియ ఏంటంటే.. విమానలని వెనక్కి పిలవడం ఈ వయసులో కుదరదు కాబట్టి,అలాంటి లాగులు out of fashion అయిపోయి ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి,మరీ..మరీ..
ఇప్పుడు విశృంఖలంగ మరోసారి ఏ నూతి పక్కనో స్నానంచెస్తే ఏమన్న ప్రయోజనం ఉంటుదంటారా?గుర్తుకు రావచ్చేమో..!జనం శ్రేయస్సు కోసం మీరు త్యాగం చేయడం భరించలేని- ఓ కొత్త శిష్యుడు..

శశి కళ చెప్పారు...

ha...ha...alalu,talalu,..peka ammayi..aahaa..inta chakkati aatma kadha chadavatam...maa poorva janma sukrutam...panilo pani nenu koodaa toli palukulu raastanu..bulusugaaru...

రామ చెప్పారు...

చాలా బాగుందండి. చిన్నప్పుడు ఇసక పుంతల్లో తవ్వుతూ పోతే "కుక్కమూతుల వాళ్ళు" కనిపిస్తారు అని మొగల్తూరు హై స్కూల్ వెనకాల గ్రౌండ్ లో చేతులతో తవ్వుతూ ఉండేవాళ్ళం. అలాంటివి మీకూ ఉండే ఉంటాయిగా.. మరి రాసెయ్యండి :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నంద కిషోర్ గారికి,

ధన్యవాదాలు మీ సలహాకీ. కానీ ఈ కాలం లో నూతులు కూడా కనిపించడం లేదు.... దహా

శశికళ గారికి,
మీరు రాసేయ్యండి. మీ తొలిపలుకులు ఎక్కడో ఒక చోట ఇరికిద్దాము. ధన్యవాదాలు.

రామ గారికి,

ధన్యవాదాలు. మీ అందరి సహాయం తో ఏదో విధం గా పూర్తి చేద్దామనే అనుకుంటున్నాను.

Unknown చెప్పారు...

బులుసు గారు ! తర్వాతి టపా కోసం ఎదురుచూస్తున్నాను.
ఏ పోస్ట్ రాసిన చాలా అలవోకగా బోలెడన్ని నవ్వులు ఆ పోస్ట్ నిండా కూరి మాకు మిఠాయి పోట్లంలా అందిస్తారు.
ఇంత గొప్ప టాలెంట్ మీకు బాల్యంలోనే ఉందా?
ఆ వివరాలు కూడా కొంచం రాయండి.

హనుమంత రావు చెప్పారు...

మీ ఆత్మకథ ... బాగుందండీ... అది చదివాక నాకోటి అనిపిస్తోంది.. నా ఆత్మకథ కూడా మీరే వ్రాస్తే బాగుంటుందేమో అని.. మీకేం అది బ్రహ్మవిద్యో, సరస్వతివిద్యో కాదు.. తొలి తొలిపలుకు, మలి తొలి పలుకు, తుదితొలిపలుకు అంటూ నామకరణాలు చేసారుగా.. ఆత్మకథ ఆత్మే వ్రాయాలని రూలేంలేదుగా?తీవ్రంగా ఆలోచించగలరు....
బాగుంది మాష్టారూ.. హోల్ సేల్ గా మీరు ఏంవ్రాసినా బాగా ఉండి తీరుతుంది.. అది అంతే

Country Fellow చెప్పారు...

Oh God! How did you write like this?

ఏల్చూరి మురళీధరరావు చెప్పారు...

మాన్యులు శ్రీ బులుసు సుబ్రహ్మణ్యం గారికి
సప్రశ్రయనమస్కారం.

పని ఒత్తిడివల్ల మనస్సు అలసి ఉంటే - మీ గుఱించి మా చెల్లెలు చెప్పినదని గుర్తుకు తెచ్చుకొని ఈ రోజు ఆత్మవినోదంకరణార్హ్తం మీ రచనలను హాయిగా చదువుకొన్నాను.

హాస్యం కూడా సర్వరసాశ్రయమన్న అభినవభారతి నిరుక్తికి ఉదాహరణలు పూర్వుల రచనలలో వలె మీ రచనలలోనూ గోచరిస్తున్నాయి. ఆత్మసముత్థమైన ఆనందాన్ని ఇతరుల మనస్సులలోకి సంక్రమింపజేయ గలగటమే హాస్యవిజయమని పెద్దలన్న మాటను - మిమ్మల్ని అనుసరిస్తూ ఆహ్లాదకరంగా స్పందిస్తూ చమత్కృతంగా వ్యాఖ్యానిస్తున్న మీ అభిమానుల వాక్యాలే నిరూపిస్తున్నాయి.

నోరారా నవ్వటం మఱచిపోయిన జీవితాలలోకి అడుగుపెట్టి ముఖవికాసాన్ని, సుఖవిలాసాన్ని అందించిన పుణ్యఫలం మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని నా ఆకాంక్ష.

బాల్యస్మృతుల జీవనవాహినిలోకి మీరిలా పసిపిల్లవాడిలా అందమైన కాగితం పడవలను విడిచిపెడుతుండాలి!

ధన్యవాదాలతో,
ఏల్చూరి మురళీధరరావు

అజ్ఞాత చెప్పారు...

ఎవలైనా ఏదైనా కాపీ కొత్తాలంతే ముందు వాల్లు లాయాలి. కానీ మలి అది ఏంతోగానీ మా బులుతు బావగాలు మాత్లం లాయక ముందే కాపీ కొత్తేత్తాలు. అందుకే లచయితలూ లచయిత్లులూ లాసే ముందు ఎవలికైనా చెప్పండి కానీ బులుతు బావగాలికి మాత్లం చెప్పకండి. చెప్పాలో మా సీగాన పెసూనాంబా సమేత బులుగ్గాలి సాచ్చిగా నీకు.., నీకు.., మీ అక్క లామలచ్మికీ.., మీ బాబాయ్ చుబ్బులచ్మికీ.., మీ అన్నాయ్ లచ్మీ నాలాయనకీ.., మీ తాత లామవలప్పాడు స్లీసీతాలామలాజలంగాలావుగాలికీ అందలికీ చెప్పినా పలవాలేదులా కానీ బావగాలికి మాత్లం చెప్పకండి లాజాలామ్మోహన్ లావుగాలూ.................
ఇత్లు
మీ వీల విక్లమ పలాక్లమ జడ భలత పుత్ల బిలుదాంకితులైన ...,
తెలుగు ప్లేక్సక మానస నస చోలుదైన ..,
నతకితోల...నత బీకల...నత చూకల...నత వీలాదివీల...నత కీచక...
కత
స్క్లీన్ ప్లే
మాతలు
పాతలు
తిత్లాలు
తంగీతం
దల్సకత్వం
దల్సకత్వ పల్యవేక్సన


మీ ప్లియాతి ప్లియమైన
తుమన్..!...!!....!!!.....!!!!......!!!!!.......!!!!!!........!!!!!!.........!!!!!!!........!!!!!!!!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కల్లూరి శైల బాల గారికి,
హనుమంత రావు గారికి,
కంట్రి ఫెలో గారికి,
అనానిమస్ గారికి,

క్షమించండి. మీ కామెంట్లకి ఆలశ్యంగా స్పందిస్తున్నందుకు. గత కొద్ది కాలం గా కొన్ని అనివార్య కారణాల వల్ల బ్లాగుల్లోకి రావడం కుదర లేదు.
మీ అందరికి ధన్యవాదాలు.


మురళీధర రావు ఏల్చూరి గారికి,

మా బ్లాగుకి స్వాగతం. మీ లాంటి పండితులు మా బ్లాగు లోకి రావడం నా అదృష్టం గా భావిస్తున్నాను. మీ వ్యాఖ్యలు నాకు కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. ధన్యవాదాలు.

Harsha చెప్పారు...

నేనిదే మొదటిసారి మీ బ్లాగ్ చదవటం .ఈ టపా అదిరింది.మీ సెన్స్ అఫ్ హుమౌర్ కి 100 /100 మార్కులు వేయాలి.
హర్ష.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మరో మహాప్రస్థానం గారికి.

ధన్యవాదాలు. మిగతా టపాలు కూడా చదివేసేయ్యండి త్వరగా.