భార్యోత్సాహం


భరత వర్షే భరత ఖండే జంబూ ద్వీపే బ్లాగ్లోకే నవ్వితే నవ్వండి బ్లాగాధిపతి శ్రీ బులుసు సుబ్రహ్మణ్య శర్మనాం విరచితః  కధః,  (ఎల్లలు లేని ప్రపంచానికి ఎలక్ట్రానిక్ తెలుగు పత్రిక)  ఈమాట  జూలై 2013 సంచికాయాం  ప్రచురితః.   తమరు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి మదీయార్పిత  కధను అచట  పఠించి  త్వదీయ ముఖారవిందమున  హాస్య చంద్రికలను వెలిగించి తమ వ్యాఖ్యలతో నన్నానందింప చేయ ప్రార్ధన.


ఇట్లు,
త్వదీయాగమనాభిలాషి,
బుధజన విధేయుడు,
బులుసు సుబ్రహ్మణ్యం.   
 
నా కధని వారి పత్రికలో ప్రచురించినందుకు  ఈమాట సంపాదకులకు  ధన్యవాదములు  తెలియ చేసుకుంటున్నాను. 


గమనిక: నాకు రాని నా సంస్కృతపరిజ్ఞానాన్ని మన్నించి తప్పులెన్నవలదని  విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీకందరికి అర్ధం అయిందనే భావిస్తున్నాను.  

9 కామెంట్‌లు:

శారద విభావరి చెప్పారు...

హాహాహా చాలా బాగుంది . ఈ కధ చదివాకా నాకు ఎప్పుడా భట్రోత్సాహం అని ఎదురు చూడాలనిపిస్తోంది.

సూర్య చెప్పారు...

లంకేనాం గణనయంత్రమూషికే దక్షిన బటనె క్లిక్కు కరిష్యాం న ఫలితం. - అనగా మౌస్ తో right click అవ్వటం లేదు మీరిచ్చిన లంకె పైన. ఎందులకు?

రాజ్ కుమార్ చెప్పారు...

చదివొచ్చి చెప్తా గురూజీ

ఫోటాన్ చెప్పారు...

హ హ హ హ హ... వెరీ నైస్ గురూజీ :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శారద గారికి,

ధన్యవాదాలు.కొత్త పదంచెప్పారు మీరు, భట్రోత్సాహం అని.భట్రాజులు పొగిడినప్పుడు కలిగే హృదయం ఉప్పొంగే ఉత్సాహాన్ని భట్రోత్సాహం అంటారా?లేక అచ్చు తప్పా?....దహా.

సూర్య గారికి,

ధన్యవాదాలు.
బాగానే ఓపెన్ అవుతోంది నాకు. మీరు మరీ సున్నితంగా క్లిక్కుతున్నారేమో. సాచి ఓటుచ్చుకోండి. మొత్తం అన్నీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉండ వచ్చు. దీనికి మా బాధ్యత లేదు అని విన్నవించు కుంటున్నాను......దహా.

రాజ్ కుమార్ గారికి,

ధన్యవాదాలు. మీ రాకకై వైటింగు.....దహా.

ఫోటాన్ గారికి,

ధన్యవాదాలు......దహా.

Zilebi చెప్పారు...


ఇట్లాంటి జిలేబీ కథలు రాయటం లో మీకు మీరే సాటి బులుసు గారు !!

జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబీ గారికి,

ధన్యవాదాలు, మీ అందరి అభిమానం, ప్రోత్సాహాలకి.


అహ్మద్ చౌదరి గారికి,

ధన్యవాదాలు. నా బ్లాగును మీ వేదికలో నిరభ్యంతరంగా చేర్చుకోవచ్చు.

హనుమంత రావు చెప్పారు...

where is that Sanskrit post..what is the link to that ee maaTa. pl.guide me guruvugaaru.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంతరావు గారికి,

ధన్యవాదములు. సంస్కృత టపా ఏమీ లేదు.నాకు సంస్కృతం అసలు రాదు. ఒట్టు. మీరెవరైనా సంస్కృతంలో ఓ అంటే నేను ఢామ్మంటాను. అంతే. తెలుగు టపా యే. ఈ మాట లింక్,
http://www.eemaata.com/em/issues/201307/2108.html?allinonepage=1