ఇంటి మొగుడు

ఈమాట  సెప్టెంబర్ 2013 సంచికలో  నా కధ  
 
ప్రచురితమైనది. మీ రందరూ ఈ కధ చదివి నన్నాదింప చేయ గోరుచున్నాను.

అన్నట్టు ఈ కధకు ఓ టాగ్ లైన్ కూడా ఉంది, ‘రైలు ప్రయాణంలో మరో కధ’  అని.

ఇదివరలో వ్రాసిన ‘రైలు ప్రయాణంలో ఒక కధ’ కి  V. శ్రావ్య గారు వ్రాసిన కామెంటు లో రెండవ సూచనకి అనుగుణంగా ప్రస్థుత కధ.    కధ,  ఇంకో కధ ల  లింకులు ఈమాట లో ఉన్నాయి.

కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు, ఐడియాలు ఇచ్చిన శ్రావ్య గారికి కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.  
7 కామెంట్‌లు:

Sravya V చెప్పారు...

హ హ బావుంది గురువు గారు !
మీరు మంచి స్టొరీ టెల్లర్ అనేది ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ బట్ స్టిల్ ఐ సే చాలా బావుంది నేరేషన్ అండ్ కొత్తగా చేర్చిన పొడిగింపు కూడా ! మీరు నాకు మరీ ఎక్కువ క్రెడిట్స్ ఇచ్చేస్తున్నారు :-)

Zilebi చెప్పారు...


బులుసు వారు,

ఇంటి మొగుడై సంసార పక్షం గా ఉన్నట్టు ఉన్నారు ! ఈ మధ్య బ్లాగు లోకం లో అస్సలు కని పించడం లేదు ! కామెంటు లలో విని పించడం లేదు ! కుశలమా !

ఈ సీరీస్ లో ఇది మూడవ టపా అన్న మాట ఈ ఈ మాట కథానిక ! ఎవర్ గ్రీన్ టాపిక్ !

హాలికులూ కుశలమా !

టపా పెట్టి పన్నెండు గంట లాయే బులుసు వారి టపా కి ఒక్క కామెంటేనే ఇంత సేపటికి ! (హాశ్చర్యం !, కొచ్చేను మార్కు కూడాను )!

చీర్స్
జిలేబి

అజ్ఞాత చెప్పారు...

ఇంటి మొగుడు బలే మాట కాయిన్ చేసేరు. అన్నట్టు మనలో మనమాటా కట్రాటంటే ఏంటండీ? :)

జ్యోతిర్మయి చెప్పారు...

హహహ బావుందండి కథ. చదువుతున్న౦తసేపూ నవ్వుల జల్లులే.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రావ్య గారికి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
“పని బాగా సాగుతోందా? ఏదైనా అవసరమైతే అడుగు” అన్న వారి దగ్గరకు ఎప్పుడూ వెళ్ళకపోయినా, ప్రోత్సాహించిన ఫలానా వారికి ధన్యవాదాలు అనే సాంప్రదాయం నేర్పింది మా జోర్హాట్, రీజినల్ రీసెర్చ్ లబొరేటరీ. సరదాగా సూచనలు ఇచ్చిన మీకు చెప్పకుండా ఎలా ఉండగలను.......దహా.

జిలేబి గారికి,

ధన్యవాదాలు.
ఈ మధ్యన బ్లాగ్స్ లోకి ఎక్కువుగా రావటం లేదు. ప్రత్యేకించి కారణాలు అంటూ ఏమీ లేవు, బద్ధకం, నిరాసక్తత తప్ప.
కామెంట్లు లేవు అంటే నేను వ్రాసింది పాఠకులకు నచ్చటం లేదనే అర్ధం. రచనలు మాని విశ్రాంతి తీసుకొమ్మని కూడా అర్ధం అనుకుంటాను.........దహా.
హాలికుల హలం మిస్సింగ్ అన్నమాట.......దహా.

కష్టేఫలే గారికి,

ధన్యవాదాలు.
చేష్టలుడిగి స్థాణువుగా నిలబడినప్పుడు కట్రాట అయ్యాడని అనడం పరిపాటి. కట్రాడ అంటే పశువుల కొట్టంలో పాతే కొయ్య గుంజ అని నిఘంటువు అర్ధం చెపుతోంది. మిగతా భాష్యం మీలాంటి వారు చెపితే నేర్చుకుంటాం.....దహా.

జ్యోతిర్మయి గారికి,

మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

Priyadarshini చెప్పారు...

ma tammudu okasari flight lo vastunnappudu pakkanunnayana em chestuntav ani adigitey tadumkokunda pure it company lo salesman ni ani cheppadata. ayana apanammakam ga chusi marinkem matladaledata. ee post chaduvutuntey nakadey gurtochindi.
post chala bagundandi.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ప్రియదర్శిని గారికి,

ధన్యవాదాలు.విమాన ప్రయాణం లో కధలు కూడా ఒక సీరీస్ మొదలు పెట్టాలేమో నేను......దహా.