బులుసు సుబ్రహ్మణ్యం కధలు, eబుక్


నా పుస్తకం "బులుసు సుబ్రహ్మణ్యం కధలు"  eబుక్ కినిగె ద్వారా నిన్న  విడుదల అయింది. పుస్తకం ప్రివ్యూ



ప్రముఖ బ్లాగరు ఆలమూరు సౌమ్యగారు నా పుస్తకానికి  తొలిపలుకులు వ్రాసారు. వారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

నా కధలు పుస్తక రూపంలో రావడానికి చాలామంది సహాయం చేసారు. సాంకేతిక సహాయం కొందరు, మాట సహాయం కొందరు, ప్రూఫ్ రీడింగ్ లో కొందరు నావెంట ఉండి నన్ను నడిపించారు. వారందరికి ధన్యవాదాలు. 

కొన్ని కొన్ని బలహీన క్షణాల్లో ఒక్క మాట ఉత్సాహం నింపుతుంది. అటువంటి క్షణాలు కొన్నిటిని అధిగమించటానికి మిత్రులు సహకరించారు.

బ్లాగ్మిత్రులు, శ్రీ పంతుల గోపాలకృష్ణ, శ్రీమతి సుధారాణి, శ్రీ వేణు శ్రీకాంత్ దార్ల , శ్రీ రహ్మానుద్దిన్ షేక్ , శ్రీ అనిల్ అట్లూరి, శ్రీ బుద్ధ మురళి, మిత్రులు, జోర్హాట్లో నా సహద్యోగి డా. యస్. కొండలరావు, మిత్రులు శ్రీ బి. సూర్యనారాయణ మూర్తి,  గార్లకు బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.  

బ్లాగులో పరిచయమైన మా చిన్నమ్మాయి (ఈమె పేరు నాకు ఇప్పటికీ తెలియదు...దహా.), నా బ్లాగు పయనంలో నన్ను ఆదరించి, అభిమానించి, ప్రోత్సహించిన అనేక మంది పాఠకులకు, మిత్రులకు ధన్యవాదాలు.

నేను తెలుగులో వ్రాయగలను అనే నమ్మకం కలిగించి, నా చేత మొదట కధ వ్రాయించిన, సౌత్ ఎండ్ పార్క్ మిత్రులు శ్రీ యస్.వి.యం.శాస్త్రి గారికి, శ్రీ యం.వి.సుబ్బారావు గారికి బ్లాగ్ముఖంగా  ధన్యవాదాలు.

ఒక పుస్తకం ప్రచురించడానికి రచయిత ముఖ్యమైనా,  అతని వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా నిలబడే వారు చాలా మంది ఉంటారని ఈ నా ప్రయత్నంలో మరోమారు అర్ధం అయింది.

ప్రింట్ పుస్తకం ఇంకో పది రోజుల్లో వస్తుంది అని అనుకుంటున్నాను. రాగానే బ్లాగులో తెలియచేస్తాను.

ప్రింటర్,  "చరిత ఇంప్రెషన్స్,"  అజామాబాద్, హైదరాబాదు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ eబుక్ కి వారు ఇచ్చిన పి.డి.యఫ్. ఫైల్స్ ఉపయోగించాను.

ప్రింటెడ్ బుక్ ధర Rs.150/ గా నిర్ణయించాం.                  

కినిగె వారి ధర Rs.135/ మాత్రమే. 

నా  పుస్తకం eబుక్ గా ప్రచురించిన కినేగె వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

పాఠకులందరూ చదివి, వారి అభిప్రాయాలను తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. 

అభిప్రాయాలు, పుస్తకం రేటింగ్ కినిగె లో (పై లింక్) తెలియ జేస్తే సంతోషిస్తాను. 

మీ అభిప్రాయాలు నాకు అమూల్యం, నన్ను, నా పుస్తకాన్ని మెరుగు పరుచుకోడానికి ఎంతో సహాయం చేస్తాయి.  

4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...



పుస్తకం పై ఫోటో కవర్ బాగుందండీ !!

శుభాకాంక్షల తో

జిలేబి

మధురవాణి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
మధురవాణి చెప్పారు...

​గొప్ప శుభవార్త చెప్పారండీ బులుసు గారూ.. e-పుస్తకంతో పాటుగా ప్రింటులో కూడా పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు హృదయపూర్వక శుభాభినందనలు. పుస్తకం ముఖచిత్రం బ్రహ్మాండంగా ఉందండీ. మీ కలం నుంచి ఒలికిన నవ్వుల్ని పట్టి తెచ్చి మా పుస్తకాల అరలో దాచుకుంటాం. :-)

Sudha చెప్పారు...

హమ్మయ్య. ఒక బృహత్కార్యాన్ని పూర్తి చేసారన్నమాట. చాలా చాలా సంతోషం. ముఖ చిత్రం చాలా బావుంది. పాఠకులకు చక్కని కానుక...నవ్వితే నవ్వండి అని మీరు మొహమాటంగా అన్నా నవ్వకుండా ఎవరుంటారో పందెం వేసి చూద్దామా. టైటిల్ చాలా బావుంది. చేసినదేమీ లేకపోయినా టపాలో నా పేరు కూడా రాయడం మీ ఔదార్యం అంతే.