పాపం ప్రద్యుమ్నుడు

మళ్ళీ ఇంకో కధ వ్రాశాను. వ్రాశాను కదా అని “తెలుగు తల్లి , కెనడా”  మాస పత్రిక కు పంపించాను. వారు దయతో వారి ఫిబ్రవరి 2017,  మాస సంచిక లో ప్రచురించారు. ఈ కధకి లింక్ ఇవ్వడం నాకు కుదర లేదు. 
మిత్రులు  శ్రీ కిరణ్ కుమార్. కే  గారు ఈ లింక్ ఎలా ఇవ్వాలో చెప్పారు. వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చదవండి కింద లింకు లో.    

 http://www.telugutalli.ca/uploads/Magazine%202.pdf#page=19

 “పాపం ప్రద్యుమ్నుడు” అను నా కధ కనిపిస్తుంది. కనిపించిందా,  మరింకేం చదవడం మొదలు పెట్టండి.  
చదివి మీ అభిప్రాయాలు తెలియ జేయడం మరిచి పోకండి. మీ కామెంట్లే నన్ను ముందుకు నడిపి మరో కధ వ్రాయిస్తాయి.  చాల్లే వ్రాసింది అంటారా సరే ఏం చేస్తాం ఇంతే సంగతులు ............ దహా. 

నా కధ ప్రచురించిన “తెలుగు తల్లి, కెనడా” మాస పత్రిక సంపాదకులకు నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.        

Comments

Zilebi said…


ఆ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకుని చదవటమ్ బెటర్ :)

Zilebi said…

కథ బాగుందండీ

పీడీ ఎఫ్ ఎలా " చేయకూడదో" కూడా అర్థం అయిందండి ఆయ్ :)

జిలేబి
Ennela said…
Maastaaru mee moodu metlu superu. Any suggestions on this problem would be greatly appreciated zilebi gaaru
నేను మీ కథ చదివానండి. మీ కథ తరువాత నా కథ "అలారం మ్రోగింది" ఉంది. ఆ లింక్ ఇవ్వటం నాకూ తెలీలేదు ద.హా.
ఇప్పుడు పోస్ట్ ఎడిట్ చేశాను. కొత్త లింక్ బాగానే పని చేస్తోంది. ఇబ్బంది లేకుండా చదువుకోవచ్చు. ధన్యవాదాలు.......దహా
పెళ్ళిలో నెత్తిమీద చెయ్యి పెట్టించుకునే ముందు ఆలోచించుకోవాలి మాస్టారూ 😀😀.
anyagaami said…
బులుసువారు, హాస్యంతో వ్రాయగలిగిన అతికొద్ది మందిలో మీరొకరు.

"అంతే, ప్రద్యుమ్నుడికి పెళ్లి చేసి పాడేశారు."

ఇది typo అనుకొంటున్నాను. కానీ తల్లితండ్రులు పెళ్లి చేసి పాడేశారు. ఇది కూడ భలే కుదిరింది. సహజంగా ఈశ్వరుడు స్త్రీ పక్షపాతి. అందువల్ల ప్రద్యుమ్నుడు యుద్దాలు ఎంత త్వరగా మానేస్తే అంత మంచిది.
sarma said…
పాపం ప్రద్యుమ్నుడు!
అంతే! అంతే! ఇంతులతో పోరిగెలిచినవారెవరు? :)
నిన్నటినుంచి పట్టువదలని విక్రమార్కునిలా చదవడానికి ప్రయత్నం చేస్తే ఇదిగో ఈ వేళ ఉదయానికి కుదిరింది
Lalitha TS said…
కెనడా చేరిన తెలుగుతల్లి తో మీరు పంచుకున్న ప్రద్యుమ్నుడిగారి కథ మహ బాగు :)
జిలేబీ గారికి,
ధన్యవాదములు. కధ బాగుందన్నందుకు సంతోషం...........దహా
తెలుగు తల్లి కెనడా కిందటి నెలలోనే మొదలయ్యింది. ఆరంభంలో కొన్ని సమస్యలు ఉండడం సహజమే. వాటిని వారు త్వరలో అధిగమించాలని ఆశిస్తూ, పత్రిక సర్వతోముఖాభి వృద్ధి చెందాలని కోరుకుందాం...........దహా

ఎన్నెల గారికి,
ధన్యవాదములు............దహా

మాలాకుమార్ గారికి,
ధన్యవాదములు. మీ కధ నేనూ చదివానండి. బాగుంది..........దహా
నరసింహా రావు గారికి,
ధన్యవాదములు. “జోరు వానలో హోరు గాలిలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం” అన్నారెవరో. అంతే కదండీ..............దహా

అన్యగామి గారికి,
ధన్యవాదములు. అది టైపో కాదండీ. కావాలనే వ్రాశాను. ప్రద్యుమ్నుడు యుద్ధాలు అప్పుడే మానేసాడు. బహు శాంతమూర్తి ఇప్పుడు............దహా.
శర్మ గారికి,
ధన్యవాదములు. అవునవును. ఆ ముక్కంటే అర్ధ శరీరం ఇచ్చాడుట. పాపం ప్రద్యుమ్నుడు ఎంత?...............దహా

లలిత గారికి,
ధన్యవాదములు. తెలుగు తల్లి కెనడా వారికి కూడా ధన్యవాదాలు..........దహా
Zilebi said…

కానడా తెలుగుతల్లి పబ్లిషర్స్ కి మా జేజేలు కూడాను

బులుసు వారి టపాతో కానడా కానదా నవ్వుల పువ్వుల్ :)

చీర్స్
జిలేబి