ఒకచేతిలో సూటు కేసు, భుజానికి ఒక బాగు తగిలించుకొని, ఇంకో చేతిలో తెలుగు పత్రికల తోటి హౌరా లో మద్రాస్ మెయిల్ ఎక్కాను. బెర్తు వెతుక్కొని సీటులో కూర్చున్నాను. ఎదురుగుండా ఒక తెలుగు కుటుంబం, పక్కన తమిళ తంబులు ఇద్దరు. తెలుగాయన, భార్య , ఒక అమ్మాయి 10-11 ఏళ్ళు ఉంటాయి. ఆయనకి సుమారు 45 ఏళ్ళు ఉంటాయి. పక్క బెర్తు లో కూడా ఇద్దరు తెలుగు వాళ్ళు, భార్యా, భర్త అనుకుంటాను. చాలా సీరియస్సు గా ఇంటి విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఒక పదినిముషాలు గడిచాయి. రైలు బయల్దేరింది. ఎదురబెర్తు ఆయన మొదలుపెట్టాడు
నాయనా నీ పేరు ఏమిటి
జంబులింగం అంటారండి
ఆయన ఒకింత ఆశ్చర్య పడ్డాడు.
అదేమిటి చార్ట్ లో ప్రద్యుమ్నుడు అని ఉంది.
ఆయన దగ్గర టికెట్ కొనుక్కున్నానండి. 200 ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది.
200 అని మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. నేనో చిరునవ్వు నవ్వాను.
తప్పదు కదండీ ఆర్జంటు గా వచ్చి వెళ్లాల్సిన అవసరం పడింది.
మళ్ళీ ఇంకో 5 నిముషాలు నిశ్శబ్దం మా మధ్య. తమిళ తంబిలు లొడ లొడ మని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు మన కధ కి అప్రస్తుతం కాబట్టి వదిలేద్దాం వాళ్ళని.
200 ట భార్యకి చెప్పి మళ్ళీ ఆశ్చర్య పడ్డాడు ఆయన. ఆవిడ ఏమి మాట్లాడలేదు.
పెళ్లయిందా బాబూ ఈ మాటు ఆవిడ అడిగింది.
అయిందండి. ఇద్దరు పిల్లలు కూడా.
చిన్న పిల్లలు అనుకుంటాను. అంది ఆవిడ
చిన్న అంటే అమ్మాయికి 15 ఏళ్ళు అబ్బాయికి 12 ఏళ్ళు
15 ఏళ్ళా ఈ మాటు ఇద్దరు కలిసి ఆశ్చర్య పడ్డారు.
నీ వయసు ఎంత బాబూ ఆయన అడిగాడు.
32 అండి జుట్టుకు రంగు వేస్తాను కాబట్టి చిన్నగా కనిపిస్తానండి
జుట్టుకు రంగు వేస్తావా? డబుల్ ఆశ్చర్యపడ్డాడు ఆయన
16 వ ఏట పెళ్లి అయితే 25 ఏళ్ళకి జుట్టు తెల్లబడిపోతుంది కదండీ అని నవ్వాను.
16 వ ఏట పెళ్ళా ? మీ ఆవిడ వయసు ఎంత బాబు, ఈ మాటు ఆవిడ ఆశ్చర్య పడి అడిగింది
34 అండి నా కన్నా రెండేళ్ళు పెద్ద.
ఈ మాటు ఇద్దరూ తేరుకోవటానికి ఒక పదినిముషాలు పట్టింది.
అబ్బాయి జోక్ చేస్తున్నాడు అంది ఆవిడ నీరసం గా నవ్వటానికి ప్రయత్నిస్తూ.
జోక్ చెయ్యాల్సిన అవసరం నాకేమిటి, మీరెవరో నేనెవరో, మీ తోటి జోక్ ఎందుకు చేస్తాను, చాలా సీరియస్ గా అన్నాను.
అంటే రెండేళ్ళు పెద్ద అంటున్నావు, 15 ఏళ్ల కూతురు అంటున్నావు, కొద్దిగా ఆశ్చర్యం గా ఉంది బాబూ అంతే, నమ్మక పోవడం కాదు, అని నొచ్చుకున్నట్టుగా అంది ఆవిడ.
మాది ప్రేమ వివాహం అండి.
16 ఏళ్ళకి ప్రేమ వివాహమా ? ఏం చదువుకున్నావు బాబూ నువ్వు, ఆయన అడిగాడు.
నేను పెద్దగా చదువుకోలేదండి. 4th. ఫామ్ తప్పగానే మా నాన్న నన్ను వాళ్ళ కొట్లో పనికి కుదిర్చాడండి. వాళ్ళ ఇంట్లో కింద కొట్టు, పైన వాళ్ళు ఉండేవారండి. ఆ విధం గా ఒక రెండేళ్ళు గడిచేటప్పటికి మా ప్రేమ సంగతి తెలిసి పోయిందండి వాళ్ళ ఇంట్లో. నన్ను పనిలోంచి తీసేశారండి. కొట్టించారండి. ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేసిందండి.
నీకు 14 ఏళ్లకే ఫ్రేమించడం తెలిసిపోయిందన్నమాట.
14 ఏళ్ల కి కాదండి. నేను వాళ్ళ కొట్లో చేరిన ఒక 7,8 నెలలకి మొదలయ్యింది ఇష్టం, ఆ తరువాత ప్రేమ, అలా జరిగిపోయిందండి. 1965 లో పెళ్లి చేసుకున్నామండి.
ఆ అమ్మాయి ఇంట్లోంచి వచ్చేస్తే వాళ్ళు ఊరుకున్నారా, ఆవిడ అనుమానం గా అడిగింది.
ఎందుకు ఊరుకుంటారండి. నానా గొడవ చేశారండి. మమ్మలని చంపైనా వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లిపోదామని ప్లాను చేశారండి. కానీ అమ్మాయి కడుపుతో ఉందని తెలిసి ఆగిపోయారండి. పరువు పోతుందని భయపడ్డారనుకుంటానండి, కడుపుతో ఉందని నలుగురికి తెలిస్తే .
కడుపు తోటా అంటూ ఈ మాటు మళ్ళీ ఇద్దరూ ఆశ్చర్యపడి కింద పడి పోయారు. ఇంతలో వింటున్న పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా ఇటు వైపు చర్చకు వచ్చేశారు .
ఏమిటో అల్లా జరిగిపోయిందండి మాకు తెలియకుండానే, అమాయకత్వం ధ్వనించింది నా గొంతులో.
ఇంతకీ అమ్మాయి ఏం చదివిందో, కొంచెం వెటకారం గా పక్క బెర్తు తెలుగావిడ.
SSLC తప్పిందండి. తప్పడం, ఆ కాలం లో ఆవిడకు అలవాటు అనుకుంటానండి . రెండు మాట్లు SSLC తప్పిందండి. ఒక మాటు హింది ప్రాధమిక కూడా తప్పిందండి. పెళ్లి కాకుండానే నెల కూడా తప్పిందండి.
మళ్ళీ కొన్ని నిముషాలు నిశ్శబ్దం. ఏం మాట్లాడాలో ఎవరికి తెలియ లేదు అనుకుంటాను. నేను కొంచెం ఎక్కువ మాట్లాడేనేమోనని నాకే అనుమానం వచ్చింది.
ఇంతకీ ఏం చేస్తుంటావు నాయనా, నువ్వు, పక్క బెర్తు ఆయన.
మా కొక, ప్లాస్టిక్ సామాను, రబ్బర్ వస్తువులు, ఆటవస్తువులు, ఫాన్సీ వస్తువులు మొదలైన హోలు సేలు అండ్ రిటైలు షాపు ఉందండి. బాగానే నడుస్తోందండి. ఇక్కడ అంటే కలకత్తా లోనూ, బొంబాయిలోనూ కొని అమ్ముతామండి మా ఊళ్ళో. ప్రతి నెలా ఇక్కడికి, బొంబాయికి వెళ్ళి వస్తూ ఉంటానండి. నెలకి ఒక 30 – 40 వేలు మిగులుతాయండి ఖర్చులు పోను. ఏదో సాగిపోతోందండి సంసారం .
ఇంతకీ మీ అత్తగారింట్లో ఒప్పుకున్నారా ఇప్పుడైనా, పక్క బెర్తు ఆవిడ. నువ్వు కాస్తా మీరు కి వచ్చింది ఆవిడ. 30-40 వేల ఆదాయం మహిమ అనుకుంటాను.
నాల్గు ఏళ్ల తరువాత మా మామగారు వచ్చారండి మా ఇంటికి మా అబ్బాయి పుట్టినప్పుడు. మా అత్తగారు మా అమ్మాయి పుట్టినప్పుడే వచ్చారు.
తల్లి ప్రాణం కదా అంది ఎదురు బెర్తు ఆవిడ.
అవునండి ఆవిడ పేరే పెట్టామండి మా అమ్మాయికి కామేశ్వరి అని.
అబ్బాయికి అని అడిగింది గడుసుగా పక్క బెర్తు ఆవిడ.
అబ్బాయికి మా మామగారి పేరు పెట్టామండి నారాయణ మూర్తి అని.
మీ అమ్మగారి పేరు కానీ నాన్న గారి పేరు కానీ పెట్టలేదన్నమాట మీ పిల్లలకి, అడిగాడు పక్క బెర్తు ఆయన. ఆయనకి నామీద కోపమెందుకో అర్ధం కాలేదు నాకు.
మా అత్తగారు చెబితే వాళ్ళ నాన్న గారు అంటే మా ఆవిడ తాతగారు, సహాయం చేశారండి మాకు మొదటినించి. కాపురం పెట్టడానికి, ఆ పైన వ్యాపారం పెట్టడానికి. రెండు మూడేళ్ళ తరువాత మా మామగారు కూడా వాళ్ళ మామ గారి ద్వారా సహాయం చేశారండి వ్యాపారం పెరగడానికి . అందుకని వాళ్ళ పేర్లు పెట్టడం నా ధర్మం అనుకున్నానండి. మా షాపు పేరు కూడా జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా అనే పెట్టానండి.
ఈ మాటు పక్క బెర్తుల తెలుగువాళ్లు కూడా కింద పడిపోయారు. వాళ్ళు లేవడానికి కొంచెం టైమ్ పట్టింది.
ఫలానా అండ్ సన్స్ విన్నాం , ఫలానా అండ్ బ్రదర్స్ విన్నాం కానీ ఫాదర్ ఇన్ లా అని షాపు పేరు ఎప్పుడూ వినలేదు నాయనా అని ఆక్రోశించాడు పక్కబెర్తు ఆయన.
కొత్త వరవడి సృష్టించాడు మంచిదే కదా. విశ్వాసం చూపించాడు మామ గార్కి అని సమాధాన పరచింది పక్క బెర్తు ఆవిడ మొగుడిని. తల్లి తండ్రుల మీద కూడా ఇంత విశ్వాసం ఉందో లేదో తెలుసుకోవాలనుకున్నాడు ఆయన.
మరి మీ అమ్మా నాన్న మీతోటే ఉంటారా, అడిగేశాడు తెగించి పక్క బెర్తు ఆయన.
లేదండీ వాళ్ళు మా అన్నయ్య వాళ్ల తోటి ఉంటారు. అప్పుడప్పుడు నేనూ కొంత సహాయం చేస్తానండి . అంతే అంతకు మించి ఏమీలేదండీ. ఇప్పుడు నేను వీళ్లమీదే ఆధార పడ్డాను కదండీ. వీళ్ళు చెప్పినట్టే వినాలి కదండీ.
పోనీ నాయనా నిజం ఒప్పుకున్నావు. అయినా అమ్మా నాన్నలని ఎవరు చూస్తున్నారు ఈ రోజులలో, పక్క బెర్తుకి నామీద కోపం పెరుగుతోంది ఎందుకో.
ఇంక పడుకుందామా తెల్లారి మాట్లాడుకోవచ్చు అంటూ ఎదురు బెర్తు ఆయన, కుటుంబం నిద్రకు ఉపక్రమించారు . నేనూ కొంచెం సేపు పత్రికలు చూసి నిద్ర పోయాను.
తెల్లారి నేను లేచేటప్పటికి వేడి వేడి గా రాజకీయాల మీద చర్చ జరుగుతోంది. నా సంగతి అందరూ మర్చిపోయినట్టు కనిపించారు. కానీ వారి చూపుల్లో నేనంటే అయిష్టత కనిపించింది. నా తోటి మళ్ళీ ఎవరూ కల్పించుకొని మాట్లాడలేదు. నేను పలకరిస్తే అవసరమైనంత వరకే సమాధానం చెప్పారు. పక్క బెర్తు వాళ్ళు రాజమండ్రి లో దిగిపోయారు, నేను విజయవాడ లో దిగిపోయాను . వీళ్లలో మళ్ళీ ఎవరిని కలుసు కుంటానని నేను అనుకోలేదు. వాళ్ళు ఎప్పుడూ మళ్ళీ తారస పడలేదు. నేను ఆ సంగతి మర్చిపోయాను.
నా మాట : కొద్ది రోజుల క్రితం కావ్య గారి బ్లాగు 'నా పరిధి దాటి' లో ఆవిడ వ్రాసిన టపా
వయసు - జీతం అక్కడ కామెంట్లు చదివాను . రైల్లో పక్కవాళ్ళ ప్రశ్నలు కొన్ని మనకి చిరాకు, కొండోకచో ఇబ్బంది కలిగిస్తుంటాయి. మనమే వాళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగే కధ అల్లితే ఎల్లా ఉంటుందా అనిపించింది . సో కావ్య గార్కి థాంక్స్. కావ్య గారి కధకి ఇది నా కామెంటు అన్నమాట.
అప్పుడప్పుడు రైలు ప్రయాణాలలో కధలల్లడం కూడా సరదా గానే ఉంటుందేమో . కొంచెం అసహజంగాను, నమ్మలేనిది గాను ఉంటే పక్క వాళ్ళ రియాక్షన్స్ కొట్ట వచ్చినట్టు కనబడవచ్చు. ఈ కధ లో వాళ్ళ స్పందన ఆశ్చర్యం కలిగించిందా? ఎదురు బెర్తు వాళ్ళు ముందర నమ్మినట్టు లేదు కానీ ఆతరువాత నమ్మారో, నమ్మినట్టు నటించారో కానీ జంబులింగం వ్యవహారం వారికి నచ్చలేదు అని అర్ధం అయింది. కానీ ముక్కు మొహం తెలియని అతని మీద కోపం వచ్చిందని అనుకోలేము . సగటు మనిషి బహుశా అంతే నేమో. పక్క బెర్తు ఆయనికి జంబులింగం మీద కోపం, కోపమే కాదు కొంచెం అసహ్యం అని కూడా అనిపించవచ్చు . బహుశా తప్పు చేసినా బాగు పడ్డాడేమో అన్న అసహనం వల్ల కావచ్చు.
ఇంతకీ ఎల్లా ఉంది నమ్మ శక్యం గా ఉందా? లేకపోతే నీ జిమ్మడా , దొంగకోళ్ళ మొహం గాడా అంటారా ?
గమనిక :- ఈ టపా మొదటి సారిగా ఈ బ్లాగులో 10/05/2011 న ప్రచురించబడింది.
గమనిక :- ఈ టపా మొదటి సారిగా ఈ బ్లాగులో 10/05/2011 న ప్రచురించబడింది.
47 కామెంట్లు:
కథ బాగుంది సార్ !తరచూ ఇలా రైలు ప్రయాణాలు,చేస్తూ ఉండాలని నా కోరిక.
ఎందుకంటే!ఎప్పుడో!నాకూ తగలక పోతా రా!
మీ మెదడు ఫోర్క్ వేసుకుని తినక పోతానా !
ధన్యోస్మి గురుజి ధన్యోస్మి .. కెవ్వ్ :) నేను సీరియస్ గా చదివేస్తున్ననా .. కింద నా పేరు డాం అని కింద పడిపోయా ..
మీ బ్లాగులో నా పెరేంటా అని .. కేక పోస్ట్ .. నవ్వలేక చచ్చా ..
SSLC తప్పిందండి. తప్పడం, ఆ కాలం లో ఆవిడకు అలవాటు అనుకుంటానండి . రెండు మాట్లు SSLC తప్పిందండి. ఒక మాటు హింది ప్రాధమిక కూడా తప్పిందండి. పెళ్లి కాకుండానే నెల కూడా తప్పిందండి. కేక
జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా ఇది పోలి కేకా ..
కొత్త వరవడి సృష్టించాడు మంచిదే కదా ఆవిడ టూ మచ్ ..
ఇంకో సారి ధన్యోస్మి .. పోస్ట్ చాలా చాలా బాగుంది .. మీరు ఉన్నారే .. అసలు .. అంతే
>>జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా>>
సూపర్..
చాలా బాగుంది కథ.
సూపర్ పోస్ట్ గురువుగారూ.. కూసింత పెద్ద పోస్ట్‌లు రాయొచ్చుకదా..? ఇట్టే అయిపోయిందండీ..
16 వ ఏట పెళ్లి అయితే 25 ఏళ్ళకి జుట్టు తెల్లబడిపోతుంది కదండీ అని నవ్వాను.
రెండు మాట్లు SSLC తప్పిందండి. ఒక మాటు హింది ప్రాధమిక కూడా తప్పిందండి. పెళ్లి కాకుండానే నెల కూడా తప్పిందండి.
జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా
ఇవి కేకా.. అరాచకం...అంతే...
nice post
హాహాహహ.....మీ బ్లాగ్ నవ్వితే నవ్వండి అని కాదు...నవ్వక చస్తారా అని ఉండాలేమో...సూపర్ డూపర్ గా ఉంది...
రైల్లో పరిచయాలు..రైలుతోనే ఆగిపోతాయి కదా..వాళ్ళను మరీ ఇంతలా ఏడిపించాలా..?ఇష్టముంటే చెప్పచ్చు లేకపోతే లేదు మీ వివరాలు..నేనైతే ఎంచక్కా..పక్క వాళ్ళతో స్నేహం చేసి ఎంజాయ్ చేస్తా..
గురూ గారూఊఊఊ... మీకు గునపాలు, ఱంపాలు, కత్తులు, కొడవళ్లు సరిపోవండీ.. ఇంకా పదునైనవి ఏవైనా కావాలి;);)
కెవ్వుమనిపించేసారు అంతే.. నిజమేనేమో అనేసుకున్నాను నేను కూడా. మీ టపా చదివాక, ఈ సారి ఖచ్చితంగా నాకు కూడా ఇలా ఏదైనా ట్రై చెయ్యాలనిపిస్తుంది ట్రెయిన్లో, మీ ఆశీస్సులతో ..;) నన్ను దీవించండి గురూగారూ..;);)
Haaa Haaaa post modalinappti nudi ayipoyedaka navvule naavvle.....keka baabi
"జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా"... :)
జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా...హహహహ ఇదే టాప్. మొదట సీరియస్ గానే చదివా...కానీ మెల్లిమెల్లిగా అర్థమయిపోయింది...బలే కథ అల్లారుగా. ఈ కథ నిజమే అనుకుంటే ఆ ట్రైన్లో వాళ్ళ మొహాలు ఊహించుకుంటూంటే నాకు నవ్వాగలేదు. ఎలా ఉంది, నమ్మశక్యంగా ఉందా అంటూ చివర్లో మాకు క్విజ్జులు కూడానా :)
అసలేం సృష్టించారండీ బాబూ.. 16 యేళ్ళు, 34 యేళ్ళు. మీకన్నా రెండేళ్ళు పెద్ద తప్పడం అలవాటు, 16 యేటకి పెళ్ళయితే 25 వ యేటికి తెల్లజుట్టు. 4th ఫార్మ్ తప్పడం..బాబోయ్...ఏమి క్రియేటివిటీ...ఎలా వస్తాయో మీకు ఇలాటి ఐడియాలు...ఎన్నిసార్లు చవిది నవ్వుకున్నానో నాకే తెలీదు. :D :D :D
good one.
There was a novel August English or English August. The protagonist, an IAS trainee tells stories about himself like this just for kicks
Sravya V - మీ బ్లాగులో ఈ కామెంట్ పెడదామంటే error వస్తుందండీ , కొంచెం అక్కడ పేస్టు చేస్తారా ప్లీజ్
బులుసు గారు బావుంది ! నవ్వలేక చస్తున్నా ...
మీ కథ కి కొంచెం నా imaginations
1 . ఆ తరవాత మీఊర్లో మీరు ట్రైన్ దిగి ఇంటికి వెళ్లారు (మీరు ఇంటికి వెళుతుంది పెళ్ళిచూపులకి ) . ఇంటికి వెళ్ళాకా కొంచెం రెస్టు తీసుకొని పెద్ద వాళ్ళతో కలిసి పెళ్ళిచూపులకి వెళ్లారు . అక్క ఆశ్చర్యం గా పెళ్లి కూతరు తండ్రి , ట్రైన్ లో మీతో కలసి ప్రయాణం చేసిన ఆయన్ని ఆయన తమ్ముడు గా మీకు పరిచయం చేసారు .
2. ఒకవేళ మీకు అప్పటికే మీకు పెళ్ళయి ఉంటె మీరు వెళుతుంది , మీ అత్త గారింటికి మేడం గారిని ఇంటికి తీసుకువెళ్ళటానికి వెళ్లారు . ఆశ్చర్యం గా మీరు మీ ఆత్త గారింటి వెళ్ళేటప్పటికి మీ ఆవిడ గారు ఆ ట్రైన్ కలిసిన వాళ్ళిద్దరితో తనివి తీరా ఎన్నో రోజుల తరవాత చూసన ఆనందం లో ముచ్చట పెడుతున్నారు . ఆ తరవాత నాకు తెలియదు :)5:06 pm
బులుసు గారూ....భలే టపా అండీ! ఎంత నవ్వొచ్చిందో చదువుతుంటే...
>>మా షాపు పేరు కూడా జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా అనే పెట్టానండి
హ్హహ్హహ్హా! ఇది మాత్రం సూపర్ గురువుగారు :) మీకు మీరే సాటి :))
:)))...soooper..:)
హహ్హ
ఎప్పటిలానే బావుంది
శ్రావ్య గారు అనుమానాలు అన్నీ నిజాలు అయిపోతున్నాయి ఈ మధ్యన అక్కడ నా బ్లాగ్ లో అడ్డంగా బుక్ చేసేసారు :)
సోమార్క గార్కి,
ధన్యవాదాలు. ఇప్పుడు రైలు ప్రయాణాలు లేవండి. అయినా మీరు పోర్కు తో కలిపి తినడానికి నామెదడు తప్ప ఇంకేమీ దొరకలేదా? :):)
కావ్య గార్కి,
ధన్యవాదాలు. మీ కధ చదివిన తర్వాతే ఈ ఐడియా వచ్చింది. నేనే మీకు థాంక్యూ అన్నమాట. జంబులింగము అండ్ ఫాదర్ –ఇన్-లా అన్నది అనుకోకుండా చివరి డ్రాఫ్ట్ లో చేరింది. అందరికీ అదే నచ్చిందనుకుంటాను.
గిరీష్ గార్కి,
ధన్యవాదాలు. మీకు నచ్చినందుకు థాంక్యూ.
వేణూ రాం గార్కి,
పెళ్లైతే ఆటోమేటిక్ గా మొహం నల్లబడడం, జుట్టు తెల్లబడడం, మన మైండ్ ఇంకోళ్ళు ప్రోగ్రామ్ చేయడం అన్నీ జరిగిపోతాయి. అంతే డౌట్ లేదు. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
తులసీరాం గార్కి,
ధన్యవాదాలు.
ప్రవీణ గార్కి,
ధన్యవాదాలు. నవ్విపోనంత కాలం ఏ పేరైనా ఫరవాలేదండీ.:):)
పుట్టపర్తి అనూరాధ గార్కి,
కొంత మంది మనని ఇబ్బంది పెట్టి ఆనందించే వారు ఉంటారండి. అల్లాంటి వారిని ఉద్దేశించి వ్రాసిందే ఇది. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
మనసు పలికే గార్కి,
మీరు రైలు ఎక్కిన వెంటనే మీ మైండ్ లో మూడు కేకలు ఆరు కెవ్వులు లాంటి ఐడియా లు వర్ధిల్లు గాక. ఈ ఆశీర్వచనం సరిపోతుందా. ధన్యవాదాలు.
వెంకట్ గార్కి,
మీరంతా అల్లా నవ్వుతూండాలనే నా తాపత్రయం. ధన్యవాదాలు.
రాఘవ గార్కి,
ధన్యవాదాలు. ఇంకొంచెం ఘట్టిగా నవ్వండి సారూ.
ఆ. సౌమ్య గార్కి,
>> మొదట సీరియస్ గానే చదివా..
నేనెప్పుడైనా సీరియస్ గా వ్రాసానా లేకపోతే నవ్వకూడదని సీరియస్ గా చదివారా :):)
అంతా రాసిన తరువాత కొంచెం అతిగా వ్రాసానేమో ననిపించింది. అందుకనే చివర వ్రాసాను. మోతాదు మించితే నిరభ్యంతరంగా తిట్టేయండి అని. తూకం తప్పితే హాస్యం వెగటు గా ఉంటుంది. వ్రాసేవాడు అప్పుడప్పుడు గమనించలేకపోవచ్చు. (ఇప్పుడు కొంచెం సీరియస్ గా వ్రాసానా ) ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
అనానిమస్ గార్కి,
ధన్యవాదాలు. ఆ నవల నేను చూడలేదండీ. ప్రయత్నిస్తాను చదవడానికి.
వి. శ్రావ్య గార్కి,
>> ఆ తరవాత నాకు తెలియదు :)
ఇంకా తెలియడానికి ఏముంటుంది లెండి. నేను ఓ రెండు అప్పడాల కర్రలు నాలుగు చీపుళ్ళు కొనుక్కోవలసి ఉంటుంది.:)
మీ ఐడియా లు బాగున్నాయి. మొదటి ఐడియా మీద ఒక కధ వ్రాద్దామనుకుంటున్నాను. మీరు పేటెంట్ రైట్స్ అనకుండా ఉంటే. ఇది కుదిరితే రెండవిది కూడా ప్రయత్నిద్దాము. ఒకటి వ్రాసిన తరువాత రెండవ ది కష్టం అవుతుందేమో. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
ఇందు గార్కి,
ధన్యవాదాలు. అంతా ఆ మామ గారి మాయ.:):)
కిరణ్ గార్కి,
ధన్యవాదాలు.
హరే కృష్ణ గార్కి,
>> శ్రావ్య గారు అనుమానాలు అన్నీ నిజాలు అయిపోతున్నాయి
అంటే మీరు ప్రతీక్ నని ఒప్పేసుకున్నారా. హాహాహ్హ
ధన్యవాదాలు.
మాయా శశిరేఖ చాటింపేసింది." ఈ పోస్టు చదవండహో" అని. చదివి నేను ఎన్ని ముసి నవ్వులు, దరహాసాలు, వికటాట్టహాసాలు, తలుచుకు తలుచుకు ఇక ఇకలూ ఎన్ని చిందించానో చెప్తే, నవ్వుకి పదో పరకో కప్పం కట్టకపోతే నా పీక ఉత్తరిచేస్తుంది. నేను చెప్పను. హహ్హహ్హ్హహ్హహో... మీరూ చెప్పకండేం!
ఓయ్ కొత్తవకాయ...నువ్వెంత నవ్వుంటాయో ఊహించలేనిదాన్ని కాదు, చిన్నప్పటినుండీ చూస్తున్నాగా..మార్యాదగా నాకు కప్పం కట్టు. బులుసు వారు ఇందులో నీకు తోడ్పడేది లేనేలేదు. ప్రభావతిగారు మా పక్షం. :D
గురుగారు, ఇలాంటీ స్వరక్షణ పద్దతులు నేర్పించడానికి ఓ కోచింగ్ సెంటర్ ఏదైనా పెట్టకూడదూ...
>> జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా
:))
ఇంతకీ ప్రభావతి గారంటే 34 యేళ్ళావిడా?
కట్టే కప్పమేదో బులుసు వారికే కట్టేస్తే పోలా?
మాయా శశి ని దాటి, హిడింబ ని శరణన్నట్టు. :D
అసలే కామెంట్లకి కరువు కాలం. వచ్చిన మూడు కామెంట్లు బ్లాగాసురుడు భోజనం చేసేశాడు. అందుకని అవి మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను. హాహాహః
sowmya has left a new comment on your post "రైలు ప్రయాణం లో ఒక కధ":
ఓయ్ కొత్తవకాయ...నువ్వెంత నవ్వుంటాయో ఊహించలేనిదాన్ని కాదు, చిన్నప్పటినుండీ చూస్తున్నాగా..మార్యాదగా నాకు కప్పం కట్టు. బులుసు వారు ఇందులో నీకు తోడ్పడేది లేనేలేదు. ప్రభావతిగారు మా పక్షం. :D
..nagarjuna.. has left a new comment on your post "రైలు ప్రయాణం లో ఒక కధ":
గురుగారు, ఇలాంటీ స్వరక్షణ పద్దతులు నేర్పించడానికి ఓ కోచింగ్ సెంటర్ ఏదైనా పెట్టకూడదూ...
>> జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా
:))
కొత్తావకాయ has left a new comment on your post "రైలు ప్రయాణం లో ఒక కధ":
ఇంతకీ ప్రభావతి గారంటే 34 యేళ్ళావిడా?
కట్టే కప్పమేదో బులుసు వారికే కట్టేస్తే పోలా?
మాయా శశి ని దాటి, హిడింబ ని శరణన్నట్టు. :D
కొత్తావకాయ గార్కి,
ధన్యవాదాలు. మీ చిరునవ్వులు, అట్టహాసాలు మాకు కనిపించాయి మరియూ వినిపించాయి. లెఖ్ఖ కట్టేశాము. ఆ. సౌమ్య గార్కి అబద్ధం చెప్పలేము. :):)
>>>మాయా శశి ని దాటి, హిడింబ ని శరణన్నట్టు. :D
ఇంతకీ మీ ఉద్దేశ్యం హిడింబ అంటే బులుసు వారా లేక ప్రభావతి గారా. కప్పం కట్టాలంటే ముందు ఇది తేలాలి.:):)
ఆ.సౌమ్య గార్కి,
ధన్యవాదాలు. ఇందులో నేను కలగచేసుకోను. మీరు వసూలు చేసిన కప్పం లో నాకు రాయల్టీ ఇచ్చేయండి మరి. మీ పక్షం వారిని హిడింబ అన్నారు కొత్తావకాయ గారు. అది కూడా కనుక్కోండి.:)
నాగార్జున గార్కి,
అల్లాగల్లాగే. కోర్సు ఫీజు ఒక పదివేలు వసూలు చేద్దామా. ఒక 20 మందిని తోలుకురండి. మీకు పదిశాతం కమిషను ఇచ్చుకుంటాను. :) ధన్యవాదాలు.
మాస్టారు గారూ, మీరు నిజంగా మా'స్టార్. పోస్టు మొత్తం సీరియస్ గా చదివా. ప్రద్యుమ్నుడి బదులు జంబులింగం వచ్చాడేంట్రా అనుకున్నా. చివరాఖరుకంటే కుంచెం ముందు తెలిసింది ఫూల్ అయ్యానని. మళ్ళీ చదివి బాగా నవ్వుకున్నా.
గురువు గారు ....... మీకు ఎన్ని ఎన్ని వీరతాళ్ళు వేసిన తక్కవేనండి.........ఏమి నవ్విస్తారు మీరు ..... మా కోసం మళ్లీ ప్రద్యుమ్నుడు ని తీసుకు వచ్చారు ....కృతజ్ఞతలు
మాయా శశిని అందం లోను, అట్టహాసాలలోనూ తలదన్నే "హిడింబ" పోస్టు కోసం బులుసు వారు, ప్రభావతి గారు పోటీ పడుతున్నట్టు తోచింది నాకు. హాహ్హాహా.. బులుసు వారిని పుంభావ హిడింబ గా పరిగణించడానికి నాకేం అభ్యంతరం లేదోచ్.. "ఏం శశీ.. నువ్వేమంటావ్?"
కప్పం కట్టే మాటే ఉంటే పిల్లకెందుకు, తల్లికే కట్టేద్దాం. ఆ. సౌమ్య మా సౌమ్యే. ఏం పర్లేద్ ! :p
రాకిమో గార్కి,
ధన్యవాదాలు. పేరుతో కన్ఫ్యూస్ అయారా:):)
సాయి కృష్ణ గార్కి,
డిఫరెంట్ గా వ్రాద్దామని డిఫరెంట్ పేర్లతో ట్రై చేసి చేతులు కాలి మళ్ళీ ప్రద్యుమ్నుడి ని, ప్రభావతి ని తీసుకొచ్చేశాను. ధన్యవాదాలు
కొత్తావకాయ గార్కి,
కప్పం కడతానంటే మీరే పేరుతో పిలిచినా అభ్యంతరం లేదు. వెంటనే కట్టేయండి లేకపోతే జరిమానా కూడా కట్టాల్సివస్తుంది. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
అయ్యా బాబోయ్ ఈ పోస్ట్ ఎలా మిస్సయ్యానో తెలియదు కాని నిజం గా చాలా బాగుందండి ....... నేను కూడా మీ పద్ధతినే ఫాలో అవుతా
ప్రద్యుమ్నుడుగారి గొంతు వినిపిస్తోంది...కాని జంబులింగ అంటారేమిటని చూసా...కథ మంచి థ్రిల్లింగా సాగుతోంది మధ్యలో ఆపుదామంటే రసపట్టులో తర్కించకూడదు కదా... జంబులింగంగారా, ప్రభావతీ ప్రాణనాథుడా అని ఆలోచించేలోపు మా ఊరొచ్చేసింది...మీ ప్రక్క బర్తాయనతో పాటు నేనూ దిగిపోయా?
అక్కడదాకా బానే వుందండీ...ఆ ప్రక్క బర్తాయన నన్ను గుర్తు పెట్టుకున్నాడు...కున్నాడా?..కుని కనపడినప్పుడల్లా అడుగుతాడు....పద్నాలుగేళ్ళకి ప్రేమా...పదహారేళ్ళకి పెళ్ళా....పెళ్ళికొడుకు రెండేళ్ళు చిన్నా...ఆవీడ రెండేళ్ళు పెద్దా .......వాళ్ళకి పదిహేనేళ్ళ కూతురా....ఈ కథ ఆయన చెప్తుంటే ఒక్కొక్కళ్ళే కంపార్టుమెంట్ లో అలా పడిపోవడమా....ఇదంతా నిజమంటారా ? నమ్మమంటారా?///మీ కథ ఇంత సంచలనం సృష్టిస్తుంటే మీరలా హేలాపురిలో కాలుమీద కాలేసుక్కూర్చోడం నాకు నచ్చలేదు ప్రద్యుమ్నుడుగారూ !...కాలు తీసేస్తున్నాననకండి...రాజమండ్రిలో దిగిన మీ ప్రక్క బర్త్ మీద వున్న మా ఊరాయన్ని..ఇందుమూలంగా పార్శిల్ చేసేస్తున్నాను....మీ రెలా చెప్పుకుంటారో చెప్పుకోండి.... అందిన వైనం తెలియజేయగలరు.....
చాలా చాలా బాగుంది : )
శివరంజని గార్కి,
ధన్యవాదాలు. వెంటనే రైలు టికెట్ కొనుక్కొని మొదలు పెట్టేయండి.:):)
హనుమంత రావు గార్కి,
పక్క బెర్తు ఆయనికి నామీద పీకల దాకా కోపముంది. ఆయన్ని మళ్ళీ పార్సెల్ చేస్తానంటే ఎలా గురువుగారూ. నేను హేలాపురి వదలి ఏ అండమానో పారిపోవాలి. అంతా మిధ్య నాయనా అని చెప్పండి ఆయనకి. ధన్యవాదాలు.
పరచూరి వంశీ కృష్ణ గార్కి,
ధన్యవాదాలు.
భలే ఉంది మాస్టారు.
శ్రీ గార్కి,
ధన్యవాదాలు.
బావుందండీ...
మా అమ్మా వాళ్ళ cousines ఉత్తరాది నుంచి ఎండాకాలం సెలవలకి మా వూరు వస్తూ ఏవో దొంగపేర్లు, తప్పుడు వూళ్ళు చెప్పేసి చుట్టూ వున్న వాళ్ళతో బోల్డు కబుర్లు చెప్పేసి Time pass చేస్కుని దిగి పోయేవారు. వచ్చాక మాకు అవన్నీ చెప్పి తెగ నవ్వించేవాళ్ళు. అవన్నీ గుర్తు చేశారు...
స్ఫురిత గారికి,
క్షమించండి. ఇంత ఆలస్యం గా జవాబు ఇస్తున్నందుకు.
ఇది పూర్తిగా కల్పితం అండి. మీ వాళ్ళు చెప్పిన కధలు చెప్పండి. ఇక్కడ పెట్టేద్దాము. ధన్యవాదాలు.
చాల బాగుంది గురువు గారు,మీరు నా పోస్ట్స్ కి రిప్లై ఇవ్వట్లేదు ???
మరో మహాప్రస్థానం గారికి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఈ మధ్య రెండు మూడు నెలల నుంచి బ్లాగు ల్లోకి రావడం లేదు. ఆ మధ్య కళ్ళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళితే Dry Eyes అన్నాడు. టివి లు గట్రా చూడకు అని సలహా ఇచ్చాడు. అందువల్ల జవాబు ఆలస్యం అయింది.
eyes కదండీ జాగ్రత్త ,???అసలే avi ప్రధానం అని మా తాతురులు వారు చెప్పేవారు (తాతురులు అంటే మా టాటా లెండి)
హహహ! "జంబులింగం అండ్ ఫాదర్ ఇన్ లా..." కిం.ప.దొ.న
నేను కొత్తగా బ్లాగు మొదలు పెట్టినప్పటి నుండి అందులో ఏమీ రాయాలో ఇప్పటికీ అర్ధం కాలేదు. కానీ ఈ టపా చూశాక కనీసం డజను కి తక్కువ కాకుండా టపా లు రాయగలను అని అనుకుంటున్నాను. Ofcource, inpired by your posts. క్షమించాలి కాన్సెప్ట్ దొంగిలిస్తున్నందుకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి