లాక్ డౌన్ లో ప్రద్యుమ్నుడు అనే ఈ కధను ఈమాట జాల పత్రిక వారు, వారి జూన్ 2020 సంచికలో ప్రచురించారు.
ఇక్కడ
https://eemaata.com/em/issues/202006/22787.html
ఇక్కడ
https://eemaata.com/em/issues/202006/22787.html
గత రెండేళ్లగా కొత్తగా కధలు ఏమీ వ్రాయలేదు. మిత్రులు విన్నకోట నరసింహా రావు గారి ప్రోద్బలంతో రెండు కధలు వ్రాసినా వాటిని ఇక్కడ ప్రచురించే సాహసం చేయలేదు. ఆ క్రమంలో వ్రాసిన ఈ కధ మూడోది. ఈ కధను పూర్తి చేయడంలో విన్నకోట వారి సహకారం చాలానే ఉంది. ఈ మాటకు పంపడంలో వారి ప్రోత్సాహం ఉంది. విన్నకోట గారికి అనేక ధన్యవాదాలు.
కధను ప్రచురించిన ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
ఈ కధను చదివి మీ
అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.
6 కామెంట్లు:
సర్, నేను చేసినదేమన్నా ఉంటే అది పిసరంత, మీరు దాన్ని గురించి పొగుడుతున్నదేమో కొండంత, ఇదేం బాగా లేదు.
“ఈమాట”లో ప్రచురితమైన మీ కథ ... మీరు lighter vein లో వ్రాసినా .... చాలా సమకాలీనంగా ఉంది. మీరు మీ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాలని మా మనవి.
భలే రాసారు గురువుగారు... అంతా బాగుందికాని మీ మీద కంప్లైంట్ ఇచ్చిన వారెవరో తెలుసుకున్నారా... ఎంత సామాజిక స్పృహ :)
విన్నకోట నరసింహా రావు గారికి, ........ ధన్యవాదాలు. చేసిన సాయం మరచిపోకూడదని, ప్రోత్సహించిన వారిని గుర్తు ఉంచుకోవాలని పెద్దలు నేర్పారు. సాయానికి కొలబద్దలు ఉండవని కూడా చెప్పారు. అదన్నమాట సంగతి.
రచనా వ్యాసంగాన్ని కొన సాగించాలనే ఉంది.కానీ పాఠకుల సంఖ్య బాగా తగ్గిపోవడం కొంత నిరుత్సాహంగా ఉంది. బహుశా సరిగ్గా వ్రాయలేకపోతున్నానేమో నని సందేహం. చూద్దాం ఇంకొంత కాలం. ......... మహా
నేస్తం గారికి, ....... ధన్యవాదాలు. ప్రద్యుమ్నుడు తన మీద ఫిర్యాదు ఇచ్చిన వారి ఆచూకీ కోసం ప్రయత్నించాడు కానీ దొరకలేదు. ఈ మధ్యన వీధి మొగలో చర్చలు, కిళ్ళి కోట్ల వద్ద అభిప్రాయ వేదికలు లేవు కదా కరోనా పుణ్యంగా. దొరక్కపోతాడా, వాడిమీద ఒక కధ వ్రాయక పోతానా అనే చూస్తున్నాడు ప్రద్యుమ్నుడు. ......... మహా
మీ అభిమానం 🙏
ఈ బ్లాగర్ గారు “ఈమాట” వెబ్-పత్రికలో వ్రాసిన కథ మీద పాఠకులు తమ అభిప్రాయాలను “ఈమాట” లోనే వ్రాస్తే సముచితంగా ఉంటుందేమోనని నా అభిప్రాయం 🙏.
కామెంట్‌ను పోస్ట్ చేయండి