యమ పాశాన్ని అడుగు దూరంలో ఆపేసిన మా ఆవిడ

చచ్చి బతకడం అంటే ఏమిటో తెలుసుకున్నాను ఈ రోజు.  నరకానికి,  ఏ నరకమో తెలియదు కానీ కొద్ది దూరంలో ఆపి సతీ సావిత్రి లాగా మా ఆవిడ  నా ప్రాణాలు కాపాడి నన్ను పునర్జీవితుడిని  చేసింది.  నాకింత కష్టం వస్తుందని ఆవిడ కనిపెట్టి  తగు చర్యలు తీసుకొని ఉండకపోతే నేను మళ్ళీ ఇక్కడ కనిపించేవాడిని కాదు. ఇల్లా మీ అందరి మస్తిష్కాలు ఫలహారం చేసేవాడిని కాదు.  మా ఆవిడకి, నా భార్యా మణికి, పతివ్రతా శిరోమణికి నా శేష జీవితమంతా ఋణపడి ఉంటానని ఈ బ్లాగు ముఖంగా ప్రతిజ్ఙ చేస్తున్నాను. ఆ కధ ఏమిటంటే.

ఉదయం రోజులాగానే తెల్లవారింది.  సూర్య భగవానుడు రోజు లాగానే  మా ఇంటి వెనకాల రెండు చెట్ల మధ్యనించి పైకి లేస్తున్నాడు.  టైమ్ చూస్తే రోజులాగానే 7.00 AM అంటోంది. రోజులాగానే సిగరెట్టు వెలిగించి మంచం మీదనించి లేచాను. రోజు లాగానే కాఫీ అని అరిచాను. వస్తున్నా అని మా ఆవిడ అంది రోజులాగానే. అయ్యో ఈ వేళ కూడా ఏమి మార్పులేదు అంతా నిన్నటికి మల్లె, మొన్నటికి మల్లె రోజులాగానే మొదలవుతోంది అని విచారించాను రోజులాగానే.  నాకు జీవితం మీద విరక్తి పుట్టింది రోజులాగానే.  ఏదో ఒకటి చెయ్యాలి ఈ మోనోటోనస్  బతుకు మార్చాలి అనుకున్నాను. ఛీ ఎధవ బతుకు అనుకున్నాను. మళ్ళీ ఒక ఆత్మహత్య ప్రయత్నం చేద్దామా వినూత్నంగా, అని  అనుకున్నాను . ఒక బ్రహ్మాండమైన ఐడియా వచ్చేసింది.  రెండు రోజులుగా ఒక TV  చానెల్ లోనూ, ఒక పత్రిక లోనూ ఒక ప్రకటన చూస్తున్నాను.  ఒక మహత్తర సాంఘిక టి‌వి చిత్రరాజము ఈ రోజున బ్రహ్మాండమైన విడుదల కాబోతోందని.  ఆలసించిన ఆశాభంగం, త్వరపడండి. చూసేయండి అని. ఆ సినిమా  పేరు ఐ లవ్ యు డాడీ.  కాబట్టి ఈ సినిమా నేను చూస్తాను అని,   ఉదయము  ప్రకాశముగా ప్రకటించినాను. ఆత్మహత్య చేసుకుంటాను అని ప్రకటించడం, చేసుకోక పోవడం నాకు అలవాటే.   అసలు నేను సినిమాలు చూడడం చాలా తక్కువ. అటువంటిది నేను సినిమా చూస్తానంటే ఎవరు నమ్మలేదు. అయినా అదే టైమ్ లో క్రికెట్టు మ్యాచ్ కూడా ఉంది కాబట్టి సినిమా చూడను అనే నిర్ధారణకు  వచ్చేసారు మా ఇంట్లో వాళ్ళంతా. కానీ వారొకటి తలచిన నేనొకటి తలచుదును గదా. 

ది 13-2-2011, 2-30. PM.
మధ్యాహ్నం 2-30 గంటలకి నేను క్రికెట్ చూడ్డం మొదలు పెట్టాను.  మా ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు. సుమారు 5 గంటలకి నేను మా మిత్రుడు శంకరానికి ఫోను చేశాను. బాల్య మిత్రమా  ఒక వేళ నాకేమైనా అయితే నువ్వు పూనుకొని మా ఆవిడకి ఫ్యామిలి పెన్షన్ త్వరగా వచ్చేటట్టు చూడు. జోర్హాట్ లో డైరక్టరు బాగా తెలిసినవాడే. వారికి ఒక మైల్ పంపు. ఇక్కడ కూడా మా ఆఫీసు కెళ్ళి వాళ్ళకి తెలియపర్చి ఎకౌంట్స్ ఆఫీసరు ని కలిసి మాట్లాడు. ఆయన కూడా తెలిసినవాడే కాబట్టి అన్నీ ఆయనే చూస్తాడు.

వచ్చిన సంతాప సందేశాలు జాగ్రత్తగా భద్రపరచు.  పంపించని వాళ్ళకి గుర్తు చేసి వచ్చేటట్టు చూడు. నా బ్లాగులో కూడా నా అస్తమయ వార్త ప్రకటించి,  కామెంట్స్ అవి జాగ్రత్త చేయి. బ్లాగులో కామెంటు పెట్టని వారిని నేను దెయ్యమై పీడిస్తాను. అమ్మయ్య పీడా విరగడైంది అని కామెంటు పెట్టిన వాళ్లెవరైనా ఉంటే (అసలు వాళ్ళే ఎక్కువ ఉంటారేమో) వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. 

 ఆ తరువాత తెలిసిన స్వీట్ షాపు కి టెలిఫోన్ చేసి ఒక కే‌జి. మినపసున్నుండలు
, ఒక పది పూతరేకులు, ఒక అర కే‌జి. జీడిపప్పు పాకం , ఒక పావు కే‌జి బందరు లడ్డూలు వెంటనే పంపింఛమని చెప్పాను. చక్కెర వ్యాధి వల్ల ఇవి నాకు నిషిద్ధం మా ఇంట్లో. చివరి సారిగా తినేసి,  గోవింద కొట్టేద్దాము అని  నిశ్చయించుకున్నాను . 

 మా ఆవిడ విని కంగారు పడింది.  “తగునా ఇటు చేయ మీకు తగునా “ అని పాడింది. ఆవిడ కూడా తగు నివారణ చర్యలు మొదలు పెట్టింది.  మా పురోహితుడిని కాల్చేసింది.    అర్జెంటు గా వచ్చి  మృత్యుంజయ మంత్రం జపించమని అభ్యర్ధించింది. ఆయన ఇంకా యమర్జెంటు గా ఇంకెక్కడికో వెళ్లాల్సివచ్చి,  వాళ్ళ అబ్బాయి 12 ఏళ్ల కుర్రాడిని పంపిస్తానన్నాడు.  ఆవిడ స్నేహితులని నలుగురుని కూడా పిలిచింది. అఖండ కీర్తన చేయించడానికి. తను అభ్యంగన స్నానం ఆచరించి నిష్ఠ తో పట్టు చీర కట్టుకొని  పూజలు చేయటానికి ఉపక్రమించింది. ఎందుకేనా మంచిదని వాళ్ళ బంధువు ఒక RMP డాక్టరు కి  విషయం తెలియపర్చి రమ్మని కోరింది. 
 
13-2-2011, 5-45 PM. 

నేను కుర్చీలో నన్ను కట్టేసుకున్నాను. ఒక చెయ్యి విడిగా కట్టుకోకుండా వదిలేశాను. స్వీట్ లన్ని ఆ చేతికి అందేటట్టు పెట్టుకున్నాను.  RMP  డాక్టరు నా చేతికి  BP మిషను కట్టేశాడు. పాపం వాడి ECG. మిషను పాడైపోయిందిట. అందుకని మా ఆవిడకి సారీ కూడా చెప్పేశాడు.  నా గ్లూకో మీటరు దగ్గర పెట్టుకుని కూర్చున్నాడు.  శాస్త్రిగారబ్బాయి  పూజా సామాగ్రి రెడీ చేసి పెట్టుకున్నారు. అల్లాగే మా ఆవిడ కూడా. అఖండ కీర్తన టీమ్ హార్మోని, చిడతలు పట్టుకుని రెడీ గా కూర్చున్నారు.

సరిగ్గా 6-00 PM.
నేను ఒకపూతరేకు నమిలి మింగి TV చానెల్ మార్చాను. ఇది నా వ్రతం, ఎవరూ భంగం చేయవద్దు”  అని జనాంతికం గా ఉద్ఘాటించాను. 
 
 శాస్త్రిగారబ్బాయి  మంత్రాలు చదవడం మొదలు పెట్టారు.
భజన బృందం కరుణించు మా కామేశ్వరి అని మొదలుపెట్టేరు.
మా ఆవిడ మా ఇష్ట దైవం  భువనేశ్వరీ దేవి ని తలుచుకొని, “ఉద్యద్దినకర ద్యుతిమిందు కిరీటామ్, తుంగ కుచామ్, నయనత్రయ యుక్తామ్”  అంటూ ప్రార్ధనా శ్లోకాలు మొదలు పెట్టింది.
 మా అమ్మాయి నా ఒక్కడికి మాత్రమే టి‌వి కనిపించేటట్టు ఆరెంజ్ చేసింది. 

సినిమా మొదలయింది. హీరో గంభీరం గా నడుచుకుంటూ వస్తుంటాడు. నడుచుకుంటూ, నడుచుకుంటూ  వస్తున్న హీరో  పేరు పెద్ద అక్ష రా లతో తెర మీద.

BP  నార్మల్  80/130  అని అరిచాడు RMP. కట్టేసిన చేతి మీద చురుక్కు మంది. సుగర్ 150 ఓ‌కే. అని మళ్ళీ అరిచాడు ఆర్‌ఎం‌పి.
నమశ్శివాయః అంటూ శా. ఆ.  గొంతు మధురం గా వినిపిస్తోంది.
 కామేశ్వరీ అంటూ భజన బృందం,
 ప్రభజే భువనేశ్వరీమ్ అంటూ మా ఆవిడ. 

 హీరో ఆఫీసు లోకి అడుగు పెడుతాడు. నవ్వుతూ స్టాఫ్ వందన స్వీకారం చేస్తాడు. 

అప్పుడు నాకు అనుమానం వచ్చింది. నవ్వుతున్నాడా లేక పెదాలు విడదీసి పళ్ళు బయట పెట్టాడా   అని. 

BP 90/140   సుగర్ 160 అని ఆర్‌ఎం‌పి అరుపు.
 పాటలు, పూజల సౌండ్  రెండు డెసీబుల్స్ పెరిగాయి. 
నేనో మినపసున్నుండ ఆరగించాను.
ఎవరికైనా కాఫీ కావాలా అని  మా ఆమ్మాయి.

సినిమాలో “అద్భుతం ఫంటాస్టిక్ ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది” అంటాడు హీరో.  “తండ్రి చేయి పట్టుకుని నడుస్తున్న కుర్రాడు, నడిపిస్తున్న తండ్రి, గమ్యం చేరుతానంటున్న కొడుకు. వహ్వా వహ్వా గొప్ప ఐడియా”  అంటాడు హీరో.  ఈ కాన్సెప్ట్ గీసిన చిన్న హీరో ని పిలువ మంటాడు. 
 
చిన్న హీరో కి     హీరో అసలు హీరో  అంటే హీరో నే హీరో గా పూజిస్తుంటాడు. అర్ధం కాలేదా,  అదంతే, అల్లాగే ఉంటుంది. చిన్న హీరో తల్లి ఫోటోవు దగ్గర దీనాలాపనలు.  చిన్నతనం లోనే వదిలేసి వెళ్ళిన తండ్రి మీద కోపం, కసి, ఉక్రోషం  అన్నీ కక్కేస్తుంటాడు. 

వెంటనే కనిపెట్టేశాను నేను, వీడే వాడి కొడుకు అని. 

చిన్న హీరో అసలు హీరో సమావేశం.  రెండు ఇంక్రిమెంట్లతో ఉద్యోగం చిన్న హీరో కి హీరో దగ్గర.

 క్షమించాలి కలంలో కలకలం రేగుతోంది. పదాలు అటు ఇటూ అవుతున్నాయి. అర్ధం చేసుకోండీ. అచ్చు తుప్పులు, స్పెల్లింగ్ మిస్టేకులు పట్టించుకోకండి.   

నమో వెంకటేశా నమో తిరుమలేశా అని భజన బృందం పాట మార్చింది. 

అర్జెంటుగా మా ఆవిడా,  అమ్మాయి మంతనాలు. భజన బృందం బదులు ఘంటసాల బృందం వచ్చింది ట . భక్తి పాటలు మాత్రమే పాడే ఒప్పందం కుదిరిపోయింది.

మా ఆవిడ జనని శివకామినీ లోకి మారింది.
శా. అ. నమశ్శివాయః అంటూ జపిస్తున్నాడు.  

నేనో మినపసున్నీ, బందరు లడ్డూ ఒకే మాటు నోట్లోకి తోసేశాను.
 బి‌పి 140/210 సుగర్ 230   అని అరిచాడు ఆర్‌ఎం‌పి. 
మా ఆవిడ మంగళ సూత్రం తీసి ఫెడిల్ ఫెడెల్ మని కళ్ళకేసి  కొట్టేస్కుంది. కళ్లపైన కాయలు కాచాయి.

 “వద్దంటే విన్నావు కాదు. రెండు తులాల సూత్రం 4  తులాల గొలుసు. అంత ఘట్టిగా ఉన్నాయి కాబట్టి కళ్ళు వాచిపోయాయి. ఏదో ఒక  అరతులంతో చేయించుకొంటే వాచేవి కాదు కదా” అని జాలి పడ్డాను.

 “నయం అంత ఘట్టిగా  చేయించాను కాబట్టే మీ గుండె రెండు  ఎట్టాక్ లు  రెండు స్టెంటు లు తట్టుకుంది. ఇంకా ఘట్టిగా చేయిస్తే అసలు మీకు గుండె ఎట్టాక్,  సుగరు ఇల్లాంటివి వచ్చేవే కాదు.” అంటూ మా ఆవిడ టపా టపా మళ్ళీ కొట్టుకుంది. 
 
ఇన్సులిన్ ఎక్కించాలెమో అని మా అమ్మాయి అంది.
I am the doctor, ఏం చెయ్యాలో నాకు తెలుసు. నీ పని నువ్వు చూసుకో అని కోప్పడ్డాడు ఆర్‌ఎం‌పి.  
మా అమ్మాయి కాఫీ కాఫీ అంటూ వెళ్లిపోయింది.
        
తెరమీద హీరో కి చచ్చేంత జొరమ్ వెంటనే వచ్చేసింది. చిన్న హీరో,  హీరో కి రాత్రంతా కూర్చుని సేవలు చేసేస్తాడు.  హీరో మొహంలో ఆనందం, కృతజ్జత, ప్రేమ, అభిమానం , గుమ్మడి, నాగయ్య, పెరుమాళ్ళు అందరూ కనిపించేశారు. చిన్న హీరో మొహంలో  ఆనందం, ప్రేమ, అభిమానం, శోభన్ బాబు, రేలంగి, చదలవాడ కనిపించేశారు.

 చిన్న హీరోకి లవ్, చిన్న హీరోయిన్, ఆమె తల్లి,  తండ్రి.  
తండ్రి టాట్ అంటాడు.
తల్లి మాట్లాడకుండా చూస్తూ ఉంటుంది.
చి.హీరోయిన్  జాలిగా చి. హీ కేసి, కోపంగా తండ్రికేసి చూస్తుంటుంది.
తండ్రి  హూ ఇస్ మదర్,  హూ ఇస్ ఫాదర్ అంటూ ???.
చి. హీ. మొహం లో కోపం, క్రోధం, ఆవేశం, ఆక్రోశం, బాధ,కసి, ఎస్‌వి‌ఆర్ , రాజనాల,రమణా రెడ్డి,రావు గోపాల రావు అందరూ కలిసి వచ్చేశారు. చి. హీ. చేతులు బిగించి బిగించి వదిలేసి బిగించి వదిలేసి, వెళ్ళిపోతాడు.

బి‌పి 200/300 రౌండ్ ఫిగర్ డేంజర్, డేంజర్, సుగర్ 350 అని అరిచాడు ఆర్‌ఎం‌పి . 

కానరారా కైలాస నివాసా, భజన బృందం,
ఆగర్వ సర్వ మంగళా కళా కదంబ మంజరీ అంటూ శా. అ.,
మాంగల్యము నిలుపుమా మంగళ గౌరీ హారతి గైకొనుమా అంటూ మా ఆవిడ,
కాఫీ అండీ కాఫీ అంటూ మా అమ్మాయి ఘట్టిగా.

నా మోకాలి మీద చురుక్కు మంది. ఇన్సులిన్ ఎక్కించాను అన్నాడు ఆర్‌ఎం‌పి.
నేనింకో జీడిపప్పు పాకం కుక్కుకున్నాను నోట్లో.
ఈ జబ్బమీద మళ్ళీ చురుక్, బి‌పి కి ఇంకో ఇంజెక్షన్ అని ఆర్‌ఎం‌పి ఉవాచ. 

తెరమీద  చి. హీ మొహంలో మళ్ళీ అన్నీ ఫీలింగ్స్. I hate you డాడీ  అంటూ  కాగితాల మీద రాసి పడేస్తుంటాడు. 
హీరో కి తను చి. హీ. కి తండ్రి ని  అని తెలిసిపోతుంది.
సన్ను ని చూడడానికి కారులో వచ్చేస్తుంటాడు.
చి. హీ. కాగితాలు పడేస్తుంటాడు.
హీరో కారులో వచ్చేస్తుంటాడు. మొహం నిండా ఫీలింగ్లు, నోటినిండా డైలాగులు. 
 
నాలో ఉద్రేకం, ఉద్వేగం, ఆవేదన, కడుపు నొప్పి, మంట,  బాధ, ఏడుపు, దుఖ్ఖం, ఎన్‌టి‌ఆర్ విశ్వరూపం అన్నీ కలిసిపోయాయి.
బి‌పి మిషన్ ఫట్ మంది.
సుగర్ బియాండ్ లిమిట్స్ అంటోంది గ్లూకోమీటర్.
నా కళ్ళు మూతలు పడిపోతున్నాయి.  
గుండె ఆగిపోయింది. 

ఆర్‌ఎం‌పి  I am sorry  అనేశాడు గంభీరం గా, విషాదంగా, కళ్ళు తుడుచుకుంటూ .  

మంగళం  ప్రద్యుమ్న చరితం మంగళం అని పాడుతున్నారు భజన బృందం.  
శా. అ. కి ఏం చెయ్యాలో తోచక బిక్కమొహం వేశాడు. 
మా అమ్మాయి నిశ్చేస్ఠురాలయిపోయింది.

మా ఆవిడ నిశ్చలం గా, దృఢంగా మనస్సు ఏకీకృతం చేసి  మంగళగౌరీ నా మాంగల్యం కాపాడుమా  అంటూ తల గౌరీదేవి  ఫోటో కేసి టపా టపా కొట్టేస్కుంటోంది.
 
ధడాంగ్ ఫడాంగ్  అంటూ పెద్ద శబ్దం.   ఉన్నట్టుండి కరెంటు పోయింది.
టి‌వి ఆగిపోయింది. 

నా కనుగుడ్లు కదిలాయి. ఆర్‌ఎం‌పి  నా గుండెల మీద దభెల్ దభెల్ మని రెండు గుద్దులు గుద్దాడు. ఎందుకేనా మంచిదని ఇంకో మారు కసి తీరా కొట్టాడు.  స్టెత్ తో కూడా కొట్టాడు. కొట్టుకొంటోంది వెధవ గుండె మళ్ళీ  అని అరిచాడు. మళ్ళీ ఇన్సులిన్ ఎక్కించాడు. బి‌పి మందు కూడా గుచ్చాడు.

 సుగర్ 415 అంది గ్లూకో మీటర్.  హార్ట్ బీట్ ఎక్కువే కానీ అండర్ కంట్రోల్ అని అరిచాడు మళ్ళీ ఆర్‌ఎం‌పి. 
 
నేను కళ్ళు తెరిచాను. నీరసంగా నవ్వేను. 
 
శా. అ. మా ఆవిడ ముందు సాష్టాంగపడి “మాతా మరకత శ్యామా “ అని మొదలుపెట్టేడు.
భజన బృందం మా ఆవిడ కాళ్లమీద  పడిపోయి “మహా సాధ్వి వమ్మా,  సాధ్వీవమ్మా  ప్రభావతీ  మహా సాధ్వీవమ్మా”   అని పాడారు. 

మా ఆవిడ “గైకొనుమా హారతి, హారతి గైకొనుమా మంగళ గౌరీ గైకొనుమా” అని పాడుతూ ఆ హారతి అందరికీ చూపించి నాకళ్ళకి కూడా అద్దింది.

నాకు కొంచెం ఓపిక వచ్చి మిగిలిన మినపసున్నిఉండ అందుకొని నోట్లో వేసుకున్నాను. 

ఆరోజున మా కాలనీలో కధలు కధలు గా చెప్పుకున్నారు.   మా ఆవిడ పాతివ్రత్యమహిమ గురించి. ఆయొక్క గౌరి దేవిని ఉపాసించి ఆ యొక్క ట్రాన్స్ఫార్మర్ ని బద్దలు కొట్టించి   ఈ యొక్క కరెంటు ను ఆపీ , ఆ  యొక్క వెధవ మొగుడి ప్రాణం ఎల్లా కాపాడిందో.  ఏ  విధంగా ఆ యొక్క యమపాశాన్ని మా ఇంటి గుమ్మం ముందు ఆపిందో, ఇత్యాదులు.

ఆ సినిమా కధ గురించా  ఏమో నాకేమి తెలుసు.  కరెంటు వచ్చేటప్పటికి ఆ సినిమా అయిపోయింది.  అదీగాక మా ఆవిడ ఒట్టు పెట్టించుకుంది  నా సిగరెట్ల మీద,  మళ్ళీ అ చానెల్ చూడనని.  అది సంగతి. మిగతా కధ మీకేమైనా తెలిస్తే మా ఆవిడ వినకుండా నా చెవిలో చెప్పండి.


{అవునూ,  నేనింక సినిమా కధలు వ్రాయవచ్చంటారా(??)}               

43 కామెంట్‌లు:

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అయ్యో ఇప్పుడు ఎలా వుందండీ? కులాసాగానే వున్నారా?

భాస్కర రామిరెడ్డి చెప్పారు...

అయ్యో ఇప్పుడు ఎలా వుందండీ? కులాసాగానే వున్నారా?

Advaitha Aanandam చెప్పారు...

hope u r doing good and healthy....

Advaitha Aanandam చెప్పారు...

hope u r doing good and healthy....

Unknown చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారు .. :) సూపర్ రాసేసారు అంతే :)

ఈ ఉత్కంట భరితం అయిన సినిమా చుసేదప్పటికి .. నాకు బి ఫై 400 /400 చేరిపోయింది .:) ఇప్పుడెలా .. ప్రభావతి గారిని మాకోసం కూడా కొన్ని పూజలు చెయ్యమనండి :)

జ్యోతి చెప్పారు...

నేనూ మీలాగే ఆత్మహత్య ప్రయత్నం చేసాను. చివరలో అయోమయం మొహం పెట్టిన నన్ను చూసి చూసి మావారు నేను న్యూస్ చూడాలి లే అని లేపేసారు (టీవీ ముందునుండేనండి) ఆ సినిమా ఏమైందో తెలీదు. నయం మీరు జరిగిన విషయం రాయడానికి స్పృహలో ఉన్నారు.నేను ఇంకా తేరుకోలేదు..

SHANKAR చెప్పారు...

ఏమా తెగింపు!, ఎంత తెంపరితనం! . అసలేం ఊహించుకున్నారు మీ గురించి. మహా మహా ఆత్మాహుతి దళాలే ఇలాంటి కళా ఖండ ఖండాలని చూడటానికి భయపడతాయే, అలాంటిది మీరు ఒంటరిగా, నిర్భయంగా అందుకు సిద్ధపడ్డారా? ముందు రోజు పొరపాటున పరమవీర చక్ర సినిమా గానీ చూశారా ఏంటి? ఆ ఊపు, తెగింపు, వైరాగ్యంలో ఇందుకు సిద్ధపడ్డారా?

హమ్మ హమ్మ ఎంతలో ఎంత ప్రమాదం తప్పింది. బాబ్బాబూ మీరు ఇంకెప్పుడూ ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకుని మాలాంటి మీ బ్లాగాభిమానుల్ని కలవరపెట్టకండి. మీరు ఇలా రాస్తూనే ఉండాలి.

మనసు పలికే చెప్పారు...

గురూగారూ...ఒట్టు నేను మాత్రం రోజూ నవ్వినట్లుగా నవ్వలేదు;) కడుపు నొప్పొచ్చేసింది, అంతలా నవ్వాను. హయ్యబాబోయ్ మీకు నిజంగా ఎంత ధైర్యం సుమండీ.. దయచేసి ఇలాంటి కార్యక్రమాలు ఇక ముందు పెట్టుకోనని మాటివ్వండి మాస్టారూ.
టపా మాత్రం కెవ్వు :D:D:D

veera murthy (satya) చెప్పారు...

బులుసు నిజంగా గారు మీరు "సత్యవంతుడు" !!
కాబట్టే ప్రభావతి గారు "సావిత్రి " కాగలిగారు!!
(సావిత్రి-సత్యవంతులు పుణ్య దంపతులన్నమాట)

మిపోస్ట్ చేస్తూంటే మీ మాటలు గుర్తుకొస్తున్నాయ్...

నాకెమో పెద్ద పెద్ద పొస్ట్‌లు చదవాలంటే భయం!
మీరన్నట్టు..
మీ పొస్ట్ పెద్దదయినా అందులో _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ ఉండదు!!

కడుపుబ్బా నవ్వించారు!...ధన్యవాదాలు!

కృష్ణప్రియ చెప్పారు...

శంకర్ గారి మాటే నాదీనీ.. మాకు మళ్ళీ ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాలు చేయబోనని మీరు బ్లాగ్ముఖం గా మాట ఇచ్చి ఇచ్చి తీరాలి..

అజ్ఞాత చెప్పారు...

Keka Guruvugaru
intaki a cinema lo asalu hero evaru

Ramani Rao చెప్పారు...

సినిమా ఎలా ఉంటుందో నేను చూడలేదు కాబట్టి.. మీ ఆత్మహత్యా ప్రయత్నానికి సినిమా ఎంతవరకూ తోడ్పడిందో చెప్పలేను..... ఒక పండగలా వైభోగంలా మీరు చెక్కెర ఫ్యాక్టరీ ని మరింత చక్కరతో వృద్ధి చేద్దామనుకున్నారు చూడండి, అదిగో అక్కడ నవ్వాపుకోలేకపోయాను. నవ్వితే నవ్వండి లేకపోతే లేదని మా ఇష్టానికి వదిలిపెట్టారు కాని, పనిలో పనిగా కింద కడుపునొప్పి వస్తే నా పూచి లేదు అని ఒక టాగ్ తగిలించండి లేకపోతే నాలాంటి వాళ్ళు ఇలా డాక్టర్లని పోషిస్తూ, మిమ్మల్ని మనసారా తిట్టుకోడం బాలేదు మరి..

Sunil చెప్పారు...

ఆ హీరో కనుక ఈ బ్లాగు చూసుంటే ఉరి వేసుకుంటాడు... వేసుకోవాలి...వేసుకు తీరాలి ... అని నేను నొక్కి వక్కాణిస్తున్నాను. గురువుగారూ అదరగొట్టారు....కెవ్వు కేక....ఎన్నాళ్ళుగానో నాలో దాగి ఉన్న ఫలానా ఛానెల్ పై ఉన్న కసి, కోపం ఎలా తీర్చుకోవాలో తెలియలేదు. ఏమటండీ ...ఆ హీరో గారి బాధ....చేతిలో ఛానెల్ ఉంది కదా అని పిచ్చి పిచ్చి సీరియళ్ళు, టెలీ ఫిల్ములూ తీస్తుంటే మనం చేతకానివాళ్ళలాగ చూస్తూ కూర్చోవాలా?
మొత్తానికి సతీ ప్రభావతి గారు మా గురువుగార్ని మాకు దక్కించారు. అంతే చాలు.
సుబ్రహ్మణ్యం గారూ దయచేసి ఈ కామెంట్ Delete చేయకండి. నా కోపం ఇలా మీతో పంచుకోనివ్వండి.

అజ్ఞాత చెప్పారు...

ఆఫీసులో ఏదో తింటూ మీ బ్లాగు చదవడం మొదలెట్టేను. తినేవన్నీ నవ్వుతున్నప్పుడు స్క్రీన్ మీద పడ్డాయి. మా బాసు వచ్చి 'బుద్ధి లేదా? ఇలా ఇంకోసారి జరిగితే నిన్ను కాల్చేస్తాను (అదే ఫైర్ చేస్తాను) అన్నాడు. దీనికంతటికీ మీరే కారణం కనక మిమ్మల్ని కోర్టుకి లాగుతున్నాను. కాసుకోండి.

అన్నట్టు సినిమా కథ పూర్తిగా రాసేసి, రాయొచ్చంటారా అని అడుగుతున్నారా? తప్పు, తప్పు లెంపలు వేసుకొండి.

బై ద వే మీరు కానీ కాకినాడ/సామర్లకోట ప్రాంతం వారా? మా తెలుగు మేష్టారు బులుసు ప్రకాశంగారు మీకు తెలుసా?

..nagarjuna.. చెప్పారు...

గురూజీ..... అందరినీ నవ్వించాలని ఉన్నంతమాత్రాన మరీ మీ ప్రాణం___గురించి రాయాలా...నాకైతే ఆ సినిమాను తిట్టి తిట్టనట్టు తిట్టారు చూడండి అదొక్కటే నచ్చింది.

ఇందు చెప్పారు...

బులుసుగారూ....ఎందుకండీ ఇంత వయోలెంట్ డెసిషన్ తీసుకున్నారు!! చూడక చూడక ఈ సినిమానే చూడలా! మీ భార్య పాతివ్రత్యం మూలంగ బ్రతికిపోయారు కానీ...ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చేయకండీ!! ఇంతకీ ఇప్పుడు ఎలా ఉందీ?? మీరూ సినిమా క్లైమాక్స్ చూడలేదు..జ్యోతిగారూ చూదలేదు.అందరూ ఇలా వదిలేస్తే మాకు పూర్తి కామెడీ ఎవరు పండిస్తారు!! పోనీ కావ్యా..ఒక్కసారి నువ్వు సినిమ మొత్తం చూసి బులుసుగారికి,జ్యోతిగారికి,నాకు కథ మొత్తం చెప్పేయకూడదూ!!

జయ చెప్పారు...

ఎందుకండి ఇంతింత సాహసాలు చేస్తారు. అ హీరో వారానికో సిన్మా తీస్తాడండీ బాబూ. కాస్త అందరి మాటవిని, ఆ ఒట్లేవో తొందరగా వేసేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ బి.పి. పెంచకుండా, కొంతకాలం నేల మీద గాక మాట మీద నిలబడండి.

అజ్ఞాత చెప్పారు...

మళ్ళీ హాస్య రచనా సార్? ఇక చాలండి, ఓ 6నెల్లు హాస్యరచనలు చేయనని మాటివ్వండి. మీ హాస్య రచనలు స్టీరియో టైపుగా వుంటూ విసుగొస్తున్నాయి. దయచేసి ఓ మారు పునహ్ పరిశీలన చేసుకోండి. వెరైటీగా మీ గవర్నమెంట్ సైంటిస్ట్‌గా మీ అనుభవాలు పంచుకోండి. ఇక్కడ కామెంట్లు పెట్టిన జనాలు బాగా మొహమాటస్తుల్లా వున్నారు, కడుపుల్లో అగ్నిపర్వతాలు పేలుతున్నా నవ్వుతున్నట్టు నటిస్తున్నారనిపిస్తోంది.

హరే కృష్ణ చెప్పారు...

ఏమిటో ఈ వైపరీత్యం..
మరేం భయం లేదు defibrillator ఉంది మన దగ్గర!

Sravya V చెప్పారు...

హ హ బావుందండీ ! మీకు మిగిలిన కథ మీరు సంప్రదించవలసిన వారు నెమలి కన్ను మురళి గారు . నాకు తెలిసి వారే అంత దైర్యవంతులు బ్లాగుల్లో :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Ennela Karthika to me

Mataaru gaaru,
namaste andee....naa computer ki edo vyaadhi sokindi..no lekhini..no comments are getting posted........

please print the following comment with my name...

Ennela


inta pasa unna sinemaani evarainaa upload chesi punyam kattukoru!..maa seetayyato kooDaa..'povuchunnavaa...annaa yamadharma raajaa" ani paaDinchaalani tega aaraaTamgaa undi...please please....upload please...
Maastaaru, aa mantralu avee konchem record chesi unchandi..naaku panikostaay..maa seetayyaki avannee chadavadam raadu mari..alaagE saastri gaari abbaayinee bhajana brindaanni kudaa contract oppincheyyandi...please..monna bindedu junnupaala payasam contract cancel chesaaru kadaa..daaniki idi chellu pettukuntaa...sarenaa?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

భాస్కర రామి రెడ్డి గార్కి,

Maddy గార్కి,

ధన్యవాదాలు. ప్రస్థుతానికి ఫరవాలేదండీ.

కావ్య గార్కి,

అయ్యబాబోయ్ నిజం గానే 400/400 BP యా . ప్రభావతి గారికి చెప్పి స్పెషల్ పూజలు చేయిస్తాను లెండి. కొద్దిగా ఖరుసు అవుతుందంతే. నేను కూడా మీ BP మామూలుగా వచ్చేయాలని ప్రార్ధిస్తాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

జ్యోతి గార్కి,

నేను స్పృహ లో ఉన్నాను అంటారా. ఎంత మాట ఎంతమాట. నా కళ్ళముందు ఇంకా ఆ రీళ్లు తిరుగుతూనే ఉన్నాయి.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శంకర్ గార్కి,

బాలచంద్రులు, అభిమన్యులు వీరమరణం చెందడానికే పుట్టారు. నేను కూడా అల్లాగే, ఈ రాష్ట్రం కోసం ఏమైనా చేయాలి అనుకోని ఉద్రేక పడ్డాను అన్నమాట. అంతా మిధ్య మనమంతా నిమిత్త మాత్రులము.
నేనింకో రెండు కధలు ఇల్లాగే వ్రాస్తే , ఎవరైనా ఇల్లాంటి ప్రయత్నాలు చేస్తారేమో నని భయం.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

మనసు పలికే గారికి,

OK మీకు మాట ఇచ్చేస్తాను. ఇకమీదట ఇటువంటి ప్రయత్నాలు చెయ్యను. ఒకవేళ చేయాల్సి వస్తే అటే, ఇటు ఉండనని వాగ్దానం కూడా చేసేస్తున్నాను.:)
ధన్యవాదాలు.

సత్య గార్కి,

అమ్మయ్య నా జన్మ చరితార్ధమైంది. సత్యవంతుడు అని అన్న వారు మీరు ఒక్కరే.:)
పైగా మీ పోస్ట్ పెద్దదైనా అందులో ఏమి ఉండదు అన్నట్టుగా అనిపిస్తోంది. :):)
ధన్యవాదాలు.

కృష్ణప్రియ గార్కి,

మాటే కదా ఇచ్చేస్తాను. ఇక మీదట అయితే గియితే అటే తప్ప... ఇటు ఉండను. :)
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

1వ. అనానిమస్ గార్కి,

ఇంత రిస్కు తీసుకుని చూసిన పెద్ద హీరో ని నేనుండగా ఇంకా హీరో ఎవరూ అంటారేమిటి సారూ.:)
ధన్యవాదాలు.

రమణి గార్కి,

సినిమా చూడని వారు అదృష్టవంతులు. చూసిన వాళ్ళు నాకు మల్లె “తోలు తిత్తి ఇది తూటులు తొమ్మిది, తుస్సు మనుట ఖాయం” అని పాడుకుంటారు. మీ తిట్లు కూడా నాకు దీవెనలే. కొంచం ఘట్టిగా నాకు కూడా వినిపించేటట్టు అంటే మరి సంతోషం.:)
ధన్యవాదాలు.

సునీల్ గార్కి,

అర్ధం అయింది మీ బాధ . పాపం మీరు కూడా చూసినట్టున్నారు. ఏం చేస్తాం. విధి వక్రీస్తే ఇల్లాగే జరుగుతుంది. అవునూ చివరికేమైంది? కధ చెప్పి పుణ్యం కట్టుకోండి. :):)
ధన్యవాదాలు.

2వ. అనానిమస్ గార్కి,

అయ్యో పాపం అంతా పని జరిగిందా. మీ బాసు కి ఆ సినిమా చూపించేయ్యండి. “ఊరికి ఉత్తరాన సమాధిపురము లో కట్టె ఇల్లున్నాది చిలుకా” అని పాడుకుంటూ పారిపోతాడు.:)
ధన్య వాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నాగార్జున గార్కి,

ఏం చేస్తాం సారూ, ఎవరో ఒకరు ధైర్యం చేయాలి కదా . హా హతవిధి! ఒక్కటే నచ్చిందా?:):)
ధన్యవాదాలు.

ఇందు గార్కి,

ధన్యవాదాలు. పోగాలము దాపురించిన వారు హితోపదేశములు వినరు, కనరు, మూర్కొనరు అని ఏదో పంచతంత్ర కధలలో ఉందనుకుంటాను. మనం కొంచెం ఆల్లాంటి టైప్ అన్నమాట. ఇక ఇల్లాంటి పొరపాట్లు మళ్ళీ చేయను. పాపం కావ్య గారు కధ చెప్పే స్థితి లో ఉన్నారా? ఇంకా తేరుకోలేదేమో.

జయ గార్కి,

ధన్యవాదాలు. నేను ఒట్లు వేసేసుకున్నానండి . నేను ఫ్రీ గా వేసుకునేవి అవే నండి .

3వ. అనానిమస్ గార్కి,

మీరొక్కరే నా శ్రేయోభిలాషి గా కనిపిస్తున్నారండి. ధన్యవాదాలు. నేనూ అనుకున్నాను, మూస పద్ధతిలోనే రాస్తున్నానేమో నని. కానీ ఇల్లా తప్ప మరోలా వ్రాయడం నాకు రావటం లేదు. మానేద్దామా అంటే చేతి దురద కీ బోర్డ్ తో కానీ తీరటం లేదు.
బ్లాగోకంలో ఇంతమంది మొహమాటస్తులు, నా మూలంగా , కడుపులో అగ్నిపర్వతాలు పెట్టుకొని ఉన్నారని ఈ వేళే తెలిసింది. క్షమించేయ్యండి.
ఏమిటో, ఈ వేళ చాలా మంది మాట ఇమ్మని అడుగుతున్నారు. సరే మీకూ ఇచ్చేస్తాను. ఒక 6 నెల్లు బ్లాగు మూసేస్తాను.
నిర్మొహమాటంగా మీ అభిప్రాయం వెలిబుచ్చినందుకు మళ్ళీ ఇంకొక మారు ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హరే కృష్ణ గార్కి,

ధన్యవాదాలు. మా RMP దగ్గర ECG యే లేదు. Defibrillator కూడానా.

శ్రావ్య వట్టికూటి గార్కి,

నెమలికన్ను మురళి గారు రివ్యూ వ్రాస్తారేమో నని మూడు రోజులు ఎదురు చూశాను. సరే అని నా పద్ధ్తతి లో నేను వ్రాసేశానన్న మాట.
ధన్యవాదాలు.

ఎన్నెల గార్కి,

వద్దు వద్దు. దేశం కాని దేశం లో ఉంటూ మీరు అంత సాహసం చేయవద్దు. మేం ఒప్పుకోము. ఇల్లాంటివి అన్నీ భరించడానికి మేమున్నాము ఇక్కడ .
ప్రభావతీ గారు పేటెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. “పతివ్రత అవటానికి 10 సులభ మార్గాలు” కి పేటెంట్ రైట్స్ కి ప్రయత్నిస్తున్నారు. అందుకని ఆ మంత్రాలు అవి ఆవిడ ఇప్పుడు ఇవ్వకపోవచ్చు.
మరీ మరీ ధన్యవాదాలు మీ email ద్వారా కామెంటుకి.

Sunil చెప్పారు...

సుబ్రహ్మణ్యం గారూ ఎవరో అనానిమస్ గారు ఏదో అన్నారని మీరు మన బ్లాగు మూసేయనక్కరలేదు. మీకు నేను మాటిస్తున్నా...మా కడుపులో ఎటువంటి మంటలూ లేవు. అందరం సంతోషంతా నవ్వుకుంటున్నాము.

మైత్రేయి చెప్పారు...

హేమిటండీ? ఏమనుకుంటున్నారు మీరు.
ఇలా సహం కధ చెప్పి ఊరికుంటే ఎలా?
ఎలా? ఎలా?
మళ్ళీ ఈ సినిమా ప్రసారం చేసేదాకా మేమేమైపోవాలి?

పె.హీ, చి.హీ తో మాట్లాడాడా? చి.హీ, పె.హీ ని తిట్టాడా? ప్రేమనిండిన కళ్ళతో ఓ అరగంట చూసాడా? అసలు ఇంత మంచి పె.హీ కొడుకుని ఎందుకు వదిలాడు?
ఇలాంటి విలువైన ప్రశ్నలకు హెవరు సమాధానం చెప్తారు నాకు????
ఎవరైనా పూర్తిగా చూసి బతికి బట్ట కట్టినవాళ్ళు ఉంటే కాస్త చెప్పండీ

అజ్ఞాత చెప్పారు...

చాందస మతభావాలకు మీరు వ్యతిరేకి అని మీ వ్యంగ రచనలవల్ల స్పష్టమవుతోంది. మీరు మా క్రైస్తవంలోకి మారడానికి ఆలోచించండి. మీకోసం పరిశుద్ధాత్ముడు ద్వారములు తెరిచియే వుండును.
May God bless you.

ఆ.సౌమ్య చెప్పారు...

ఏమనుకుంటున్నారండీ మీరు...ఆహా అసలేమనుకుంటున్నారు...మీకెంత ధైర్యం...చావు అంటే అంత తెగింపా!...పోయి పోయి ఆ సినిమా...అదీ ఆ..ఆ సినిమా...హాయిగా చావాలనుకుంటే అంతకన్నా మంచి మార్గలున్నాయిగా....చావులో కూడా కష్టాలు కొనితెచ్చుకోవాలా చెప్పాండి :)

మీ ఆలోచన బలే ఉందండీ...మీకు చావడానికి రెడీ అవ్వడం, మీ వాళ్లు దానికి సహాయం...చివర్లో ప్రభావతిగారే మళ్ళీ రక్షించడం...కేకో కేకస్య కేకః :D

నాకిప్పుడు టెన్షన్ పెరిగింది....సినిమా ఏమయింది చివరికి...చీ.హీ, పె.హీ కలుసుకున్నారా?... "ఐ హేట్ యూ డాడీ" నుండి "ఐ లవ్ యూ డాడీ" దిశగా కథ ఏం జరిగింది?....నాకు తెలియాలి తెలియాలి తెలియాలి.

veera murthy (satya) చెప్పారు...

ఆ అజ్ఞాత ఏమో అన్నారని అంతపనీ చేసేరు ఆర్నెల్లు నవ్వాపుకోవడం మావల్ల కాదు...

అజ్ఞాత చెప్పారు...

ee tapaa asalu navvu raledu, mee swantha aalochanalu to chesina rachanalu baagunnayi..

అజ్ఞాత చెప్పారు...

సుభ్రమణ్యం గారు మీరు మీ కోసం ఈ బ్లాగ్ మొదలు పెట్టారు .మీ కోసం మీరు రాసుకోండి.ఇంకెవరి ఆనందం కోసమో కాదు కదా.నచ్చిన వాళ్ళు చదువుతారు లేని వాళ్ళు మానేస్తారు.ఇదేం సినిమా కాదు కదా అయ్యో డబ్బులు పెట్టి చదివాము అని ఫీల్ అవ్వడానికి.మీరు చాలా బాగా రాస్తారు.ఒకరిద్దరి కోసం మిమ్మల్ని మీరు బాధ పెట్టుకుని మిగిలిన మీ అభిమానులను బాధ పెట్టకండి.పోస్ట్ బాగా రాసారు.

జేబి - JB చెప్పారు...

బాగుందండీ - సినిమా సంగతేమోగానీ‌ మా తాతగారు (ఇంకా ఉన్నారు) గుర్తొచ్చారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సునీల్ గార్కి,

సత్య గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
కొంత కాలం మైండ్ కి కూడా విశ్రాంతి ఇస్తే బాగుంటుందేమో నని ఆలోచన.

మైత్రేయి గార్కి,

మాట్లాడాడు
తిట్టాడు
చూశాడు కానీ కోపం, కసి etc. నిండిన కళ్ళతో
ఎందుకు వదిలాడు అన్నది అర్ధం అయితే నేను అంత పని ఎందుకు చేస్తాను.
రహస్య భోగట్టా: పూర్తిగా చూసిన వాళ్ళు కూడా అది అర్ధం కాక జుట్టు పీక్కుంటున్నారట.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

4వ. అనానిమస్ గార్కి,

ఛాందస భావాలు ఏవైనా నేను వ్యతిరేకిస్తాను. But, I am a proud Hindu.
ధన్యవాదాలు.

ఆ. సౌమ్య గార్కి,

తెగింపు అప్పుడప్పుడు అల్లా వచ్చేస్తుంది. జగమే మాయా బతుకే మాయా అనుకున్నప్పుడు.
తెలియాలి తెలియాలి అని అంత ఆదుర్దా పడకండి. సగం తెలిస్తేనే నాకు ఇల్లా అయింది. పూర్తిగా తెలుసుకుంటే .......
ధన్యవాదాలు.

5వ. అనానిమస్ గార్కి,
అబ్బే, ఇప్పటి దాకా అక్కడినించి, ఇక్కడనించి కాపీ కొట్టి వ్రాసాను. ఇదొక్కటే స్వంత తెలివితేటలతో వ్రాసాను.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

6వ. అనానిమస్ గార్కి,

జేబి-JB గార్కి,

ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలకి. థాంక్యూ .

పానీపూరి123 చెప్పారు...

> కాల్చేసింది
అందరికి(ని) కాల్చేసింది ఇంటికి రప్పించారన్నమాట!

శివ చెరువు చెప్పారు...

మీకూ మీ కుటుంబ సభ్యులందరికీ .. శివ రాత్రి పర్వదిన శుభాకాంక్షలు.. శివ చెరువు

శివ చెరువు చెప్పారు...

Very nice. Read till end.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పానిపూరీ 123 గార్కి,

శివ చెరువు గార్కి,

క్షమించాలి. జవాబు ఇవ్వటంలో చాలా ఆలస్యం అయింది.
ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

man that was a good one..really

buddhamurali చెప్పారు...

bulusu gaaru miru cinima katha rayadame kaadandi yekangaa miru natinchavacchu, darshakthvam vahinchavacchu nimatha mire kaavacchu miru mohamata pedite nenu pro ga undi pedataa

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

బుద్దా మురళి గార్కి,

ధన్యవాదాలు. చిత్ర నిర్మాణ బాధ్యతలు అన్నీ నేను చూడగలను, పూర్తి అయిన తరువాత ప్రేక్షక బాధ్యతతో సహా, ఫైనాన్స్ మీరు సమకూరుస్తానంటే. అహా.