మా ఆవిడ – మంగళ సూత్రంచాలాకాలమైంది కధ వ్రాసి. వ్రాసే కధలు నచ్చటం లేదు. వ్రాసే  కధలన్నీ మూస ధోరణిలోనే ఉన్నాయని అనిపించడం మొదలయింది. ప్రభావతి ప్రద్యుమ్నుల కధలు  బోరు కొట్టడం మొదలయింది. ఎంతసేపూ భార్యా భర్తల సరాగాలేనా అని మిత్రుడొకరు కోప్పడ్డారు కూడాను ఆ మధ్యన.  అయినా,  నాకు చేతనైన విధానంలోనే మరొకటి వ్రాశాను.

మా ఆవిడ – మంగళ సూత్రం  అనే కధను ఈమాట జాల పత్రిక వారు వారి జనవరి 2016 సంచికలో ప్రచురించారు. 

 

చదివి మీ అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.  

కధను  ప్రచురించినందుకు ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.


4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

ఔరా ! బులుసు వారి టపా ఎటుల గమనించక పోతిని !

బులుసు వారు !

చాలా బాగుంది !

పసిడి గొలుసు రూపమై భామవా
రి సిరినగవు కారికై వేగమై
కసిరి పతిని మంగళా భాగ్యమై
మిసిమి పసిడి భామినీ గాంచెనే

చీర్స్
జిలేబి
(జిలేబివదన)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారూ,
>>> ఔరా ! బులుసు వారి టపా ఎటుల గమనించక పోతిని !
మా బ్లాగ్ మీద శీత కన్నేసారన్న మాట......దహా.
మిసిమి పసిడి లనే భామినిలు చూస్తారు........దహా.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Itzok బ్లాగులో మొన్న మీరు వ్రాసిన "అసహనం" గురించిన టపా చదివాను, బాగుంది. మీ స్వంత బ్లాగులోనే వ్రాస్తే బాగుండేదిగా? ఏవిటో మరీ ఈ మధ్య మీ బ్లాగు మీద మీరే శీతకన్ను వేసినట్లుంది.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నరసింహా రావు గారూ,
ధన్యవాదాలు మీ కామెంటుకి.
"అసహనం" గురించి టపా నేను G+ లో వేశాను. బాగుందనిపించి FB లో కూడా వేశాను. అది పబ్లిక్ పోస్ట్ కాదు. మిత్రులతో మాత్రమే షేర్ చేశాను. అది బ్లాగు టపా కాదు. మీరు బాగుంది అన్నారు కాబట్టి వీలైతే ఇక్కడ కూడా వేస్తాను కొద్ది మార్పులతో........దహా