చాలాకాలమైంది కధ
వ్రాసి. వ్రాసే కధలు నచ్చటం లేదు. వ్రాసే
కధలన్నీ మూస ధోరణిలోనే ఉన్నాయని అనిపించడం మొదలయింది. ప్రభావతి
ప్రద్యుమ్నుల కధలు బోరు కొట్టడం
మొదలయింది. ఎంతసేపూ భార్యా భర్తల సరాగాలేనా అని మిత్రుడొకరు కోప్పడ్డారు కూడాను ఆ
మధ్యన. అయినా, నాకు చేతనైన విధానంలోనే మరొకటి వ్రాశాను.
మా ఆవిడ – మంగళ
సూత్రం అనే కధను ఈమాట జాల పత్రిక వారు
వారి జనవరి 2016 సంచికలో ప్రచురించారు.
చదివి మీ
అభిప్ర్రాయం తెలుపవలసిందిగా కోరుచున్నాను.
కధను ప్రచురించినందుకు ఈమాట సంపాదకులకు ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాను.
4 కామెంట్లు:
ఔరా ! బులుసు వారి టపా ఎటుల గమనించక పోతిని !
బులుసు వారు !
చాలా బాగుంది !
పసిడి గొలుసు రూపమై భామవా
రి సిరినగవు కారికై వేగమై
కసిరి పతిని మంగళా భాగ్యమై
మిసిమి పసిడి భామినీ గాంచెనే
చీర్స్
జిలేబి
(జిలేబివదన)
జిలేబి గారూ,
>>> ఔరా ! బులుసు వారి టపా ఎటుల గమనించక పోతిని !
మా బ్లాగ్ మీద శీత కన్నేసారన్న మాట......దహా.
మిసిమి పసిడి లనే భామినిలు చూస్తారు........దహా.
Itzok బ్లాగులో మొన్న మీరు వ్రాసిన "అసహనం" గురించిన టపా చదివాను, బాగుంది. మీ స్వంత బ్లాగులోనే వ్రాస్తే బాగుండేదిగా? ఏవిటో మరీ ఈ మధ్య మీ బ్లాగు మీద మీరే శీతకన్ను వేసినట్లుంది.
నరసింహా రావు గారూ,
ధన్యవాదాలు మీ కామెంటుకి.
"అసహనం" గురించి టపా నేను G+ లో వేశాను. బాగుందనిపించి FB లో కూడా వేశాను. అది పబ్లిక్ పోస్ట్ కాదు. మిత్రులతో మాత్రమే షేర్ చేశాను. అది బ్లాగు టపా కాదు. మీరు బాగుంది అన్నారు కాబట్టి వీలైతే ఇక్కడ కూడా వేస్తాను కొద్ది మార్పులతో........దహా
కామెంట్‌ను పోస్ట్ చేయండి