ఉగాది శుభాకాంక్షలు 2019.


బ్లాగు మిత్రులందరికీ  వికారి నామ సంవత్సర   ఉగాది శుభాకాంక్షలు. 
 
ఈ సంవత్సరమంతా మీకు శుభప్రదంగాను, జయప్రదంగాను ఉండాలని కోరుకుంటున్నాను. మీరు అనుకొన్నవి అన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను. 

ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం మీ ఇంట్లో కనుల పండుగగా నిలిచి ఉండాలని కోరుకుంటున్నాను. చాలాకాలమైంది ఇలా బ్లాగులోకి వచ్చి మిమ్మల్ని పలకరించి.  రెండేళ్లు దాటిపోయింది ఇక్కడ ఏమైనా వ్రాసి. ఇక మీదట కనీసం నెలకొకమారైనా మిమ్మల్నందరినీ పలకరించాలని అనుకుంటున్నాను. 
 
ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ వ్రాయడం మొదలు పెట్టాలని అనుకుంటున్నాను.  ఒకమాటు అలవాటు తప్పితే మళ్ళీ వ్రాయడం కొంచెం కష్టమేననుకుంటాను. మళ్ళీ కొత్తవి వ్రాసేదాకా పాతవి కొన్ని మళ్ళీ ఇక్కడ పబ్లిష్ చేద్దామనుకుంటున్నాను, ముఖ్యంగా నాకు నచ్చినవి, 2010, 2011 లలో ఇక్కడ ప్రచురించినవి. ఇవి బ్లాగుల్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు బహుశా చదివి ఉండరనే ఉద్దేశ్యంతో. 

2010 లో కొత్తగా బ్లాగుల్లోకి వచ్చిన రోజులు. వ్రాయడం నేర్చుకుంటున్న రోజులు. 

అప్పట్లో కధలన్నీ “నేను” అనే వ్రాసేవాడిని. ఆ కధలు నా స్వీయ అనుభవాలే అని కొంతమంది అనుకున్నారని నా అనుమానం. వివరణ ఇచ్చుకున్నాను అవి కధలే, నా స్వీయ అనుభవాలు కావని. కానీ కొంత మంది నమ్మినట్టు లేరు. ఆ తరువాత కధలలో ప్రభావతి ప్రద్యుమ్నుడు లను ప్రవేశ పెట్టాను. కాబట్టి ఇప్పుడు తిరిగి ప్రచురించే కధలలో నేను, మా ఆవిడ లకు బదులుగా ప్రద్యుమ్నుడు,  ప్రభావతి ల లాగ మార్చి వ్రాస్తాను.  కధ శీర్షిక లో మార్పు ఉండదు. 

మొదటగా వేసేది  ఫిబ్రవరి 7, 2011 న వ్రాసిన “ ఈ రోజు బ్లాగులో నా 239వ దినం, వచ్చి నాలుగు అక్షంతలు వేసి వెళ్ళండి” అనే టపా. 

ఇదే మొదట  ఎందుకు అంటే ఈ టపా నా పొరపాటు వల్ల నా బ్లాగులోంచి తీసివేశాను. అది తిరిగి బ్లాగులో జేర్చుదామనే ఉద్దేశ్యం. టపాతో పాటు కామెంట్లు కూడా తీసివేయబడ్డాయి.  మొదటి మాటు 50 కామెంట్లు పైన  (61) వచ్చిన టపా. అందుచేత కామెంట్ల తో సహా ప్రచురిద్దామని అనుకుంటున్నాను. కామెంట్ల వల్ల చాలా పెద్ద టపా అవవచ్చు. ఆలోచిస్తున్నాను. వీలైతే కామెంట్లతో సహా లేకపోతే టపా మాత్రమే ప్రచురిస్తాను ఒక వారం పది  రోజుల్లో. 

మీరంతా ఎప్పటిలాగానే నా టపాలు ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 

7 కామెంట్‌లు:

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

Welcome back 🌹🌹. We missed you all these days ☝️.
మీలాంటి సీనియర్ల పునఃప్రవేశంతో బ్లాగులోకానికి కొత్త కళ వచ్చింది 🙂.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

మీకు, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలు 🌿🌱.

Zilebi చెప్పారు...వెల్కం బెక బెక !

మంచి నిర్ణయము !

మీ లాగే మరిన్ని బ్లాగ్వీడినవారలు మళ్ళీ వస్తారని ఆశిస్తో

ఉగాది శుభాకాంక్షల తో


దురదస్య దురదః దురద గొంటాకుః జిలేబి నామ్న్యా :)


జిలేబి

Lalitha చెప్పారు...

ఉగాదికి అందిన మంచి తీపి కబురు - పాతవైతేనేమి మీ పోస్టులు, అవి పంచే నవ్వులు ఎప్పుడూ సరికొత్తవే!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి ..... మీ వాఖ్యలకి ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని..... మహా (మందహాసం)

జిలేబి గారికి ...... ధన్యవాదాలు. నేనైతే వచ్చాను. చదివేవాళ్ళు ఉంటే వ్రాసేవాళ్ళు వస్తారు. వ్రాసేవాళ్ళు ఎక్కువయి చదివేవాళ్ళు తక్కువయితేనే చిక్కు........ మహా

లలితా TS గారికి .... ధన్యవాదాలు. పాతవైనా కొత్తవైనా చదివేవాళ్ళు తక్కువగానే ఉన్నారని విన్నాను. వ్రాద్దామనే ఉంది. చూడాలి ఎంతవరకు నడుస్తుందో. ...... మహా

అన్యగామి చెప్పారు...

మీరాక మాకెంతో సంతోషం సుమండీ!!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అన్యగామి గారికి....ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞుడిని. ....... మహా