ఓర్నాయనోయ్, విషాదంగా ఆ ఫోజేమిటి మీరు. కర్చీఫు ఎందుకు తీశారు. కళ్ళు ఎందుకు తుడుచుకుంటున్నారు. జేబురుమాలు ఎందుకు తడుపుతున్నారు. దుఃఖంగా , దీనంగా, ఏడుస్తున్నట్టు నటిస్తూ శ్రద్ధాంజలి ఘటించెయ్యడానికి లైను లో వచ్చేస్తున్నారు.
వద్దు అంత శ్రమ పడకండి. చివరి క్షణాలు అంటే ఆ చివరి క్షణాలు కాదు, మామూలు చివర క్షణాలు అన్నమాట. అయోమయంగా చూడకండి. Let me explain.
ఇంకామీ బల్బ్ వెలగలేదా. మీకర్ధం అయే సినిమా భాషలో చెప్తాను. ఇనుకోండి కాదు కాదు సదూకోండి.
సినిమా లో క్లైమాక్స్ సీను వచ్చేసింది. వీరోయిన్ పరిగెడుతూ ఉంటుంది. ఆవిడెనకాల ఇలన్ పరిగెడుతుంటాడు. ఆళ్ళని తరుముతూ ఈరో పరిగెడు తుంటాడు. ఇంతలో ఇలన్ గారి గూండాలు ఈరో ని అడ్డుకుంటారు. ఈరో ఆళ్ళని కుమ్మేస్తుంటాడు.
వీరోయిన్ ఊరొదిలి పొలాల వెంబడి పరుగెడుతుంది. ఎందుకంటే, చూసేటోళ్లందరు ఎర్రిబాగులోళ్ళు కాబట్టి. ఈరో గూండాలని ఉతికి ఆరేసి ఇలన్ గాడి ఎనకాల పడతాడు. ఇప్పుడు వీరోయిన్ పొలాలు వదిలి రైలు కట్ట మీద పరిగెడుతుంది. ఎందుకంటే అది బుఱ్ఱ తక్కువది కాబట్టి. బుఱ్ఱ ఉన్నదయితే హాయిగా ఇలన్ గాడిని పెళ్లి చేసుకుంటే, దానికి ఆ పరుగు తప్పేది, మనకి తలనొప్పి తగ్గేది.
ఎక్కడో రైలు బోయ్ మంటుంది. అయినా సరే వీరోయిన్ రైలు పట్టాల మధ్యనించే పరిగెడుతుంటుంది.
మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో ఇలన్ కుమ్ముకుంటుంటారు. ధడేల్ మని సిగ్నల్ పడిపోతుంది.
వీరోయిన్ కాలు రెండు పట్టాల మధ్య ఇరుక్కుపోతుంది.
మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో సాచి ఇలన్ ని తన్నుతాడు.
రైల్ బోయి బోయ్ మంటూ ఉంటుంది.
వీరోయిన్ ఏడుస్తూ రెండో కాలు ఎత్తి డాన్సు చేస్తుంటుంది.
మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో ఇలన్ ని ఎగిరి తన్నుతాడు. రైల్ బోయి బోయ్ మంటుంది. వీరోయిన్ ఏడుస్తూ కాలు డాన్సు చేస్తుంటుంది.
మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో ఇలన్ తలని తన తలతో కుమ్ముతాడు. రైల్ బోయి బోయ్ మంటుంది. ఈ మాటు వీరోయిన్ చేతి డాన్సు మొదలు పెట్టుతుంది.
మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో ఈరోచితంగా ఇలన్ ని చితక కొట్టి పక్కన పడేసి వీరోయిన్ దిశగా పరిగెడుతాడు. రైలు ఇప్పుడు దగ్గరగా బోయ్ బోయ్ మంటుంది. వీరోయిన్ చేతి డాన్సు వదలదు.
మూజిక్ డైరట్రు సౌండ్ పెంచి దడదడ లాడించేస్తుంటాడు.
అప్పుడండి, ఇలన్ గార్కి కత్తి దొరుకుతుంది.
కత్తి ఎక్కడనించి వచ్చిందా, ఇల్లా మీరు కొచ్చెను మీద కొచ్చెను వేసేస్తే నేను కధ చెప్పనంతే. అల్లా సినిమాల్లో వచ్చేస్తాయి.
అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి, రాజనాల మాంత్రికుడు మాయం చేసేస్తాడు గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట.
ఈడు ఆ కత్తి ఇసురుతాడు. అదెల్లి ఈరో నడుం మీద గుచ్చుకుంటుంది. ఈరో కింద పడిపోతాడు. అయినా ఈరో గారు ధైరియంగా పాకడం మొదలు పెట్టుతాడు.
రైలు ఇప్పుడు మనకి కనిపిస్తుంది బోయ్ బ్బోయ్ అంటూ వచ్చేస్తుంటుంది.
వీరోయిన్ ఈ మాటు వంగొని కాలు విడిపించుకోటానికి ప్రయత్నిస్తుంది.
మూ . డై. దడదడ లాడించేస్తుంటాడు.
ఈరో గారు ఇంకా పాకుతూనే ఉంటాడు. రైలు గారు ఇంకా దగ్గరగా బోయ్ బ్బోయ్ అంటుంటుంది. వీరోయిన్ ఇంకా వంగొనే ఉంటుంది.
మూ. డై. దడదడదడ లాడించేస్తుంటాడు.
ఇప్పుడండి, ఇజిల్సే ఇజిల్సు, చివరి క్షణం లో ఈరో గారు నుంచోని, సిగ్నలు రాడ్ ముందుకు లాగి, రైలు ముందరి నించి జంప్ చేసి, వీరోయిన్ మీద పడి, ఇద్దరూ కలసి దొర్లుకుంటూ పొలాల్లో పడిపోతారు.
ఝుక్ఝుక్ ఝుక్ఝుక్ ఝుక్ అంటూ రైలు వెళ్లి పోతుందన్న మాట. చూసారా మరి చివరి క్షణం మహత్యం.
మరి చివరగా ఇంకో చివరి కధ కూడా చెప్పేస్తాను.
సత్తెపెమానికంగా నిజంగా చివరి ఇషయం.
మరేంటంటే ఈ చివరి క్షణాలే లేకపోతే ఈ దేశం ఓ గొప్ప విజ్ఞాన వేత్తని కోల్పోయేది.
నేను ఎం.ఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న రోజులు. మేము చివర మహాత్యం తెలిసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడూ చివరి రోజుల్లో చివరి క్షణాల దాకా మాత్రమే చదివే వాళ్ళం.
ఓ పరీక్ష రోజు నేను కొంచెం బద్ధకంగా, చివరి క్షణాలలో చదవకుండా, పరీక్షకి బయల్దేరాను. అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నాముందు కనిపించి
"నాయనా Morphine గురించి చదివావా" అని అడిగాడు.
అప్పుడు బుద్ధి తెచ్చుకొని నేను పుస్తకం తెరచి, నడుస్తూ చదువుతూ, చదువుతూ నడుస్తూ, పరీక్ష హాలు కి చేరి, పేపర్ తీసుకొని చూస్తే మొదటి ప్రశ్న అదే ఉంది. చక చక అది వ్రాసేశాను కాబట్టి బొటా బొటీ గా పాసు మార్కులు వచ్చి పాసు అయ్యాను.
ఆ తరువాత నేను ఆ డిగ్రీ పట్టుకొని అంచెలంచెలు గా ఈ దేశం గర్వించ దగ్గ సైంటిస్టు గా ఎదిగి పోయానన్నమాట. మీరు కూడా గర్విస్తున్నారా?
దీని నీతి ఏమిటంటే చివరి క్షణంలో పనులు చేసేవారికి ఆ శ్రీమన్నారాయణుడు కూడా చివరి క్షణం లో సహాయం చేస్తాడని.
కాబట్టి ఓ నా దేశ ప్రజలారా/ తోటి బ్లాగర్లారా/అంతర్జాల చదువర్లారా, మీరందరూ కూడా ప్రతిదీ చివరి క్షణం లోనే చేసి, ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కృప కి పాత్రులు కండి చివరాఖరికి.
ముఖ్య గమనిక : ఇది చదివిన వారికి, విన్నవారికి కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సకల సంపదలు, ఆయురారోగ్యాలు, మీరు ఏం చదివినా, చదవకపోయినా, ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగం, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆజ్ఞాను సారంగా మీ మాట వినే సద్బుద్ధి మీ ఆవిడ/ఆయన కి, ప్రసాదిస్తాడు.
మీరు ఇది చదవడమే కాదు, మీ తోటి వారితో కూడా చదివించి కృతార్ధులు కండి.
ఇంకో గమనిక: ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 16/12/2010 న పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఇంకో మారు.
వద్దు అంత శ్రమ పడకండి. చివరి క్షణాలు అంటే ఆ చివరి క్షణాలు కాదు, మామూలు చివర క్షణాలు అన్నమాట. అయోమయంగా చూడకండి. Let me explain.
నేను మా బామ్మర్ది పెళ్ళికి వెళ్ళాలి. రైలు రిజెర్వేషను అది చేయించేశాను ముందు గానే.
కానీ మా బాసాసురుడు శలవా అని ఏడ్చేడు. నన్ను టెంషను పెట్టేడు. సరిగ్గా ఓ నాలుగు రోజులు ముందు కళ్ళు తుడుచు కొని సరే ఓ పది రోజులకి వెళ్ళిరా అని దయతలచాడు.
దూరభారం వల్ల మా ఆవిడని ముందు పంపడం కుదరలేదు. బయల్దేరడానికి ఇంకోరోజు మాత్రమే ఉంది. హడావడిగా కొనాల్సిన వన్నీ కొనేశాను, క్షమించాలి అచ్చు తప్పు, కొనిపించేసింది .
బయల్దేరే రోజున మా ఆవిడవి ఓ ఏభై చీరలు, పిల్లలవి ఓ పాతిక జతలు సర్దేసిన తర్వాత పెట్టెల్లో మిగలని ఖాళీ లో నావి కూడా రెండు జతలు కుక్కి వాటి మీద డాన్స్ చేసి మూత పెట్టి ఊపిరి పీల్చుకున్నాను.
నేను సర్దుతున్నంత సేపు ఆవిడ విలాసంగా కుర్చీలో కూర్చుని కాళ్ళు ఊపుతూ, జంతికలో చేగోడీ లో కరకర నములుతూ
“గులాబీ అంచు చీర స్నాతకానికి కట్టుకోవాలి అదిపైన పెట్టండి. ఆ బ్లూ కలరు చీర భోజనాలప్పుడు కట్టుకోవాలి. అది స్నాతకం కింద పెట్టండి.”
అంటూ సలహాలు పడేస్తూ నా సహనాన్ని పరీక్షించింది.
మొత్తం మీద రెండు సూటుకేసులు, రెండు బేగులు , మంచి నీళ్ళ బాటిలు అన్నీ సర్దే టప్పటికి ముహూర్తం ముంచుకొచ్చింది.
పరిగెత్తికెళ్లి ఆటోని పిలుచు కొచ్చాను. ఆటో రాగానే పిల్లలు ఎక్కేశారు. ఆ తరవాత మా గజగమన కూడా అల్లనల్లన మెల్లమెల్లగా ఆటో ఎక్కేసింది.
నేను వీధి తలుపు తాళం వేసి రెండు మాట్లు లాగి చూసి, అటూ ఇటూ చూసి, ఎవరూ చూడటం లేదని, తాళం పట్టుకొని వేళ్ళాడి, పడిందని నిర్ధారించుకొని, ఆటో ఎక్కి బయల్దేరు, బయల్దేరు అన్నాను.
నాకున్న తొందర వాడికెందుకు ఉంటుంది. తాపీగా వారు ఆ ఇనపరాడు పైకి లాగాడు. ఆటో డుర్ మని ఊరుకుంది. వారు మళ్ళీ లాగారు. మళ్ళీ డుర్ మంది. వారు దిగి వెనక్కి వెళ్ళి ఓ తాపు తన్ని వచ్చారు. తీరుబడిగా సిగరెట్టు వెలిగించుకొని మళ్ళీ ఇనుపరాడు లాగాడు. ఈ మాటు డుర్ డుర్ డుర్ మని ఆగిపోయింది.
మా ఆవిడ నాకేసి క్రోధం గా, ఒక మంచి ఆటో కూడా తీసుకురాలేని చవట దద్దమ్మ అన్నట్టు చూసింది. నాకు చెమటలు పట్టేస్తున్నాయి. లావొక్కింతయు లేదు, ఎవనిచే జనించు, కానరార కైలాస నివాస, అంటూ పద్యాలు, పాటలు పాడుకుంటున్నాను లోలోపల.
ఇంతలో ఆటో స్టార్ట్ అయింది. నేను రైట్ రైట్ అన్నాను. వారు గేరు మార్చి స్పీడ్ అందుకొనేటప్పుడు, చివరి క్షణం లో గుర్తుకు వచ్చింది.
రైల్ టికెట్లు బీరువాలో దొంగ అర లో భద్రము గా ఉన్నాయని.

అమ్మయ్య ఇప్పటికి అర్ధం అయిందా చివరి క్షణం అంటే ఏమిటో.
ఆ చివరి క్షణా లే లేకపోతే ఈ దేశం లో ఏమి జరగదు. జరిగేదంతా చివరి క్షణం లోనే జరుగుతుంది.
మొన్న మొన్న ఢిల్లీ లో “అందరి సంపద ఆటలు” గురించి ఎంత గొడవ జరిగింది. విదేశీయులందరు ఎన్నెన్ని మాటలు అన్నారు.
పెధాన మంతిరి గారు, డిల్లీ ముక్కే మంతిరి గారు కంగారు పడి, కోప్పడిపోయారా. చివరి క్షణానికి మనల్లోందరు అన్నీ రెడీ చేసేశారా లేదా.
ఆటలు అయింతరువాత, అంతా బెమ్మాండంగా చేసేశారు అని అందరూ మెచ్చేసుకున్నారా. మరి చివరి క్షణాని కే గదా ఆళ్ళందరూ ఆ పని చేయగలిగారు.
కాబట్టి జై చివరి క్షణం జై జై అన్నమాట.
ఆ చివరి క్షణా లే లేకపోతే ఈ దేశం లో ఏమి జరగదు. జరిగేదంతా చివరి క్షణం లోనే జరుగుతుంది.
మొన్న మొన్న ఢిల్లీ లో “అందరి సంపద ఆటలు” గురించి ఎంత గొడవ జరిగింది. విదేశీయులందరు ఎన్నెన్ని మాటలు అన్నారు.
పెధాన మంతిరి గారు, డిల్లీ ముక్కే మంతిరి గారు కంగారు పడి, కోప్పడిపోయారా. చివరి క్షణానికి మనల్లోందరు అన్నీ రెడీ చేసేశారా లేదా.
ఆటలు అయింతరువాత, అంతా బెమ్మాండంగా చేసేశారు అని అందరూ మెచ్చేసుకున్నారా. మరి చివరి క్షణాని కే గదా ఆళ్ళందరూ ఆ పని చేయగలిగారు.
కాబట్టి జై చివరి క్షణం జై జై అన్నమాట.
మరి చివరగా ఇంకో చివరి కధ కూడా చెప్పేస్తాను.
సత్తెపెమానికంగా నిజంగా చివరి ఇషయం.
మరేంటంటే ఈ చివరి క్షణాలే లేకపోతే ఈ దేశం ఓ గొప్ప విజ్ఞాన వేత్తని కోల్పోయేది.
నేను ఎం.ఎస్సి ఫైనల్ ఇయర్ పరీక్షలు రాస్తున్న రోజులు. మేము చివర మహాత్యం తెలిసిన వాళ్ళం కాబట్టి ఎప్పుడూ చివరి రోజుల్లో చివరి క్షణాల దాకా మాత్రమే చదివే వాళ్ళం.
ఓ పరీక్ష రోజు నేను కొంచెం బద్ధకంగా, చివరి క్షణాలలో చదవకుండా, పరీక్షకి బయల్దేరాను. అప్పుడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు నాముందు కనిపించి
"నాయనా Morphine గురించి చదివావా" అని అడిగాడు.
అప్పుడు బుద్ధి తెచ్చుకొని నేను పుస్తకం తెరచి, నడుస్తూ చదువుతూ, చదువుతూ నడుస్తూ, పరీక్ష హాలు కి చేరి, పేపర్ తీసుకొని చూస్తే మొదటి ప్రశ్న అదే ఉంది. చక చక అది వ్రాసేశాను కాబట్టి బొటా బొటీ గా పాసు మార్కులు వచ్చి పాసు అయ్యాను.
ఆ తరువాత నేను ఆ డిగ్రీ పట్టుకొని అంచెలంచెలు గా ఈ దేశం గర్వించ దగ్గ సైంటిస్టు గా ఎదిగి పోయానన్నమాట. మీరు కూడా గర్విస్తున్నారా?
దీని నీతి ఏమిటంటే చివరి క్షణంలో పనులు చేసేవారికి ఆ శ్రీమన్నారాయణుడు కూడా చివరి క్షణం లో సహాయం చేస్తాడని.
కాబట్టి ఓ నా దేశ ప్రజలారా/ తోటి బ్లాగర్లారా/అంతర్జాల చదువర్లారా, మీరందరూ కూడా ప్రతిదీ చివరి క్షణం లోనే చేసి, ఆ యొక్క శ్రీమన్నారాయణుడి కృప కి పాత్రులు కండి చివరాఖరికి.
ముఖ్య గమనిక : ఇది చదివిన వారికి, విన్నవారికి కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణుడు సకల సంపదలు, ఆయురారోగ్యాలు, మీరు ఏం చదివినా, చదవకపోయినా, ఓ సాఫ్ట్ వేరు ఉద్యోగం, అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆజ్ఞాను సారంగా మీ మాట వినే సద్బుద్ధి మీ ఆవిడ/ఆయన కి, ప్రసాదిస్తాడు.
మీరు ఇది చదవడమే కాదు, మీ తోటి వారితో కూడా చదివించి కృతార్ధులు కండి.
ఇంకో గమనిక: ఇది మొదటి మాటు ఈ బ్లాగులో 16/12/2010 న పబ్లిష్ చేశాను. ఇప్పుడు ఇంకో మారు.
39 కామెంట్లు:
:)
:) చివరి క్షణాల్లో కోడ్ కమిట్ చేయటం, చివరి క్షణాల్లో ప్రెజెంటేషన్ దబ దబా.. ఎక్కడినుంచో లాగి పవర్ పాయింట్ లో పడేయటం,.. మేమూ చివరిక్షణ మంత్రోపాసకులమే ..
okavela nenu ma ayana iddaram chadivitee ??
నాకూ, అన్నయ్యకూ చివరి నిమిషం అలవాటు. దానికే ఇంట్లో చీవాట్లు పడతాయి - మీరు చివరి క్షణం దాకా అంటే మరి... :-)
ఇప్పుడొక నిజాయితీ అభిప్రాయం - అంటే రోజూ అబద్ధాలు చెప్తానని కాదు, ఉన్నదున్నట్లు చెప్పాలనిపించింది. ఈ వ్యాసం మీ పాతవాటి స్థాయిలో లేదు. కొంచెం కృతకంగా అనిపించింది. ఎందుకంటే ఇది రాసేటపుడు మీ మదిలో మేం, అనగా పాఠకులం మెదిలాం. దానితో కొంచెం మాకోసం అక్కడక్కడ అద్దపడింది. దీన్నే 'ప్లేయింగ్ టుది గ్యాలరీస్ ' అంటారు. సినిమా దర్శకులకీ, కథానాయకులకు ఈ సమష్యవుంది. మీరు మళ్ళీ మీ సహజమైన హాస్యాన్ని పండిస్తారని ఆశిస్తున్నా.
కొంచెం అతిగా రాశానంటే క్షమించండి. పై పేరా తీసేసి ప్రచురించండి.
హ్మ్.. ఈ చివరి క్షణాల ముచ్చట్లు దాదాపు అందరికీ ఉంటాయేమో..! అయినా ఆ మాత్రం కంగారు అదీ పడకపోతే ఏం బావుంటుంది.. పరిగెత్తుకుంటూ వెళ్ళి రైలు ఎక్కడంలో ఉన్న మజా ట్రైన్ కంటే ముందే స్టేషన్ కి చేరి ఉండడంలో ఎక్కడ ఉంటుంది...!!
కాబట్టి లైఫ్‌లో కూసింత థ్రిల్లింగ్ ఉండాలి అంటే చివరి క్షణాల ఇక్కట్లు ఉండాల్సిందే... :))
అన్నిటికన్నా ముఖ్యంగా మీ ఆజ్ఞాను సారంగా మీ మాట వినే సద్బుద్ధి మీ ఆవిడ/ఆయన కి,ప్రసాదిస్తాడు.
సుబ్రహ్మణ్యం గారు,
ధన్యవాదాలు మీ ఆశీర్వాదానికి.
అబ్బ.. సగం చదివేసరికి కళ్లల్లో నీళ్లు తిరిగినంత పని అయింది.. మీరలా భయపడకండి. నవ్వీ నవ్వీ అంత పని అయిందనమాట. కంటిన్యూ చేసి మళ్లి వ్యాఖ్య పెడతా.. ఆపాటికి నా పొట్ట ఉంటుందో చెక్కలవుతుందో మరి...
బాబోయ్.. సుబ్రహ్మణ్యం గారూ.. నవ్వు ఆపుకోలేక పోతున్నాను. అసలు చివరి క్షణాలకి ఇంత మహత్యం ఉందన్న సంగతి నాకు తెలియనే లేదు చూసారా.. సమయానికి మీరుండబట్టి సరిపోయింది. లేకపోతే నేనెంత కోల్పోయి ఉండేదాన్నో.. ఇది బాగుంది అది బాగుంది అని చెబుదామంటే ఏది కాపీ పేస్ట్ చెయ్యాలో తెలియడమే లేదు. మరీ టపా అంతా పెట్టేస్తే బాగోదు కదా.. ఏం చెయ్యమంటారు ఇప్పుడు..!!
ఆహా మేమూ చివరి క్షణంగాళ్ళమే. ఎప్పుడూ ముందే అన్నీ చెయ్యలనుకుంటాగానీ అదేమిటో అన్నీ చివరి నిముషంలోనే అవుతాయి. పరీక్షకి ముందు రోజు రాత్రి కూర్చుని నైట్ అవుట్ చెయ్యడం. సెమినార్ ఇవ్వాలంటే ఓ గంట ముందు ప్రెపేర్ అవ్వడం. పేపర్ రాయాలంటే చేతిలో ఉన్న నెల రోజులూ వదిలెసి డెడ్‌లైన్ కి రెండు రోజుల ముందు రాత్రిపగలు కూర్చుని బరికేయడం...చిన్నప్పటినుండి చివరి నిముషానికే పనులు చెయ్యడం అలవాటయిపోయింది. ఇప్పటివరకూ నేను చివరి క్షణంలో కాకుండా ముందుగానే చేసిన/చేస్తున్న పని ఫ్లైట్ కి రెండు గంటల ముందే airport చేరుకోవడం. :)
అక్కడక్కడా చెమక్కులు అదిరాయి. మొత్తానికి మళ్ళీ మాకు సినిమా చూపించీసేరు. ఊపిరి బిగపట్టుకుని క్లైమేక్సు చూసేసాను.
"అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి, రాజనాల మాంత్రికుడు మాయం చేసేస్తాడు గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట.".....ఇది మాత్రం గునపం గడ్డపార (నీవునేర్పిన విద్యయే నీరజాక్షీ...) :D
"మూజిక్ డైరట్రు దడదడ లాడించేస్తుంటాడు."....వాడేవడో గానీ సినిమా మొత్తం చితగ్గొట్టీసేడు....చచ్చాననుకోండి నవ్వలేక :)))
సౌమ్య.. మీరు కూడా మళ్లీ మళ్లీ చదువుతున్నట్లున్నారు.. నేను కూడా.. చదివి నవ్వేసుకుటున్నాను.:D:D
>>>అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి, రాజనాల మాంత్రికుడు మాయం చేసేస్తాడు గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట.
Excellent.. :D
మౌళి గార్కి,
:):):)
ఒక దరహాసానికి రెండు మందహాసాలు ఫ్రీ
కృష్ణప్రియ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
పేపర్ ప్రెజెంటేషను అంటే ముందు ప్రిపేరు అయినా చివరి నిముషము దాకా మార్పులు , చేర్పులు ఉండేవి మాకు . ఇప్పుడైతే ఈజీ అయింది కానీ అప్పుడు స్లైడ్స్, ట్రాన్స్పెరెన్సిస్ ల తోటి నానా అవస్థలు పడిపోయేవాళ్లం.
కావ్య గార్కి,
ధన్యవాదాలు. మీరు కామెంటు పెట్టేరు కాబట్టి ఇప్పుడు నా ఓటు మీకే. రేపు మీ వారు వ్యాఖ్యానిస్తే మరి నేను పార్టీ మారిపోతానన్నమాట.
జేబి.JB గార్కి,
మీవ్యాఖ్యలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు.
మీరన్నట్టు గత రెండు మూడు టపాలలో spontaneity కొంత లోపించిందేమో నని నాకూ అనిపించింది. ఎందుకో తెలియలేదు. బహుశా రచయిత గా అనుభవము లేకపోవడం వల్ల అనుకున్నాను. ఇంకా చేయి తిరగాలి కదా అని సమాధాన పరచుకున్నాను. మీరన్నట్టు subconscious లో పాఠకుల మెప్పుకోసం ప్రయత్నిస్తు న్నానేమో అర్ధం కావటం లేదు. I will try to be myself. అప్పుడప్పుడు ఎవరో ఒకరు చెప్పకపోతే ఎదగడం ఆగిపోతుందేమో. చెప్పినందుకు థాంక్యూ.
మేధ గార్కి,
చివరి నిముషం థ్రిల్ బాగానే ఉంటుంది కానీ కలకత్తా ఎయిర్ పోర్ట్ నించి ట్రాఫిక్ లో పడి హౌరా స్టేషన్ లో రైలు మిస్ అయిన సంఘటనలు రెండు ఉన్నాయి. అప్పుడు మా శ్రీమతి గారు, పిల్లలు.... ఏం చెప్పమంటారు లెండి. ధన్యవాదాలు.
నీహారిక గార్కి,
జయీభవ, విజయీభవ. ధన్యవాదాలు మీ కామెంటు కి.
మనసు పలికే గార్కి,
నవ్వాభి వందనములు . మీరంతగా నవ్వేస్తోంటే నాకూ నవ్వాగటంలేదు. నేను వ్రాసిందానికి నేను నవ్వితే బాగుండదని, ఆపుకుంటున్నానన్న మాట. చివరి క్షణాల కధలు ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా ఎప్పుడో చెప్పేస్తాను. థాంక్యూ.
ఆ. సౌమ్య గార్కి,
ధన్యవాదాలు. మానవ మాత్రులం మనమేంత . ఆయొక్క శ్రీమన్నారాయణుడు కూడా చివర నిముషం లో “సిరికిం చెప్పడు” అంటూ బయల్దేరాడు, ఆ కరి చివర నిముషం దాకా పోరాడి “లావోక్కింతయు లేదు” కుయ్యో మొర్రో అని మొర పెట్టుకుంటే .
పోనివ్వండి ఎయిర్ పోర్ట్ కైనా సకాలం లో చేరుతున్నారు. :):).
మూజిక్ డైరట్రు కొత్తవాడండి. మొన్నటిదాకా బేండు మేళం లో వాయించేవాడుట, ఒకటే శృతి లో, ఒకటే రాగం లో.
"మూజిక్ డైరట్రు కొత్తవాడండి. మొన్నటిదాకా బేండు మేళం లో వాయించేవాడుట, ఒకటే శృతి లో, ఒకటే రాగం లో"......హహహహ అలా అయితే "గట్టిమేళం", "బంగారుబొమ్మ రావేమే" ఈ రెండే వాయిస్తూ ఉండాలే! ఆ ట్రైను బొయ్ బొయ్ మని వస్తూ ఉంటే "బంగారుబొమ్మ రావేమే" పాట..ఓహొహ్హో అదరహో, సూపరు :D :)))
హ హ మూజిక్ డైరెట్రు ఏమోకానీ మీరు మాత్రం దడదడలాడించేశారు సార్ :-)
మీరు మాత్రం దడదడ లాడించారండి. మ్యూ డై ఎపిసొడ్ అదిరింది.
నేను ఇక్కడ కామెంటిన వారిలా కాకుండా అన్నిటికీ రెండు క్షణాలు ముందు ఉండటం అలవాటు (కొందరు దాన్నే రెండు గంటలు అంటారనుకొండి) . మా ఊరొచ్చే రైలు కాకినాడలొ బయలు దేరిపొయిందని నేను రైల్వే స్టెస్షన్ కి వెళ్ళిపొతానని... నాలుగు గంటలు ముందే ఎయిర్ పొర్ట్ కి వెళతానని నన్ను అందరూ ఆటపట్టిస్తుంటారు.
ఆ. సౌమ్య గార్కి,
పొరపాటు చేశానండి. నా సినిమా ఎపిసోడ్ కి బాండ్ మేళం గాడి ని కాకుండా మిమ్మల్ని అడిగుంటే బహుశా మాటలు, పాటలు ఫ్రీ గా చేసేసి ఉండేవారేమో.:)
ధన్యవాదాలు.
వేణు శ్రీకాంత్ గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. సినిమా ఎపిసోడ్ రిపీట్ అయితే కొంచెం బోర్ అంటారేమో అనుకున్నాను. కానీ చివరి నిముషంలో వేసేశాను. థాంక్యూ.
మంచు గార్కి,
అమ్మయ్య నాకు తోడు ఉన్నారన్నమాట మీరు. సామాన్లు సర్దడం అయిన వెంటనే బయల్దేరుతాను నేను. లేకపోతే చివరి క్షణాలదాకా సర్దిస్తుంది ఆవిడగారు. ఇందులో ఓ చిక్కు ఉంది. ఇంకా బోల్డు టైము ఉంది కాబట్టి అంటూ సూటుకేసులు రెండూ నెత్తిన పెట్టి ప్లాట్ ఫారాలు అన్నీ తిప్పీస్తుంది.
నాలుగు గంటల ముందు ఎయిర్ పోర్ట్ కి ఎందుకు వెళతారో అర్ధం చేసుకోగలము.:)
ధన్యవాదాలు.
అబ్బా...టపా.... అరుపులు.... మెరుపులు. దడదళ్ళాడించెహేరండీ మీ స్టైల్లో.
నేనుకూడా చివరిక్షణం పార్టీనే, ఏంటో ఏదైనా చెయ్యాలంటే నాల్రోజులు ముందే డిసైడ్ చేసేస్కుంటా ఎలా చెయ్యాలా అని. ఆతరువాత ఇంకపనేం లేదని మూడురోజులు పడుకోవడం నాలుగో రోజు అనుకున్నవి టైముకి దొరక్క ఏదోలా లాగించెయ్యడం, ఇలాగన్నమాట.
>అల్లెప్పుడో జానపద సినిమాలో కాంతారావు చేతిలో కత్తి, రాజనాల మాంత్రికుడు మాయం చేసేస్తాడు గదా అది అప్పడినించి గాలిలో తిరుగుతూ, ఇప్పుడు ఇలన్ గారి పక్కన పడిందన్నమాట.:)))హహ్హహ్హ...హహ్హహ్హ ...నేను ఓ నవ్వుతుంటే మా సాయి,వారు ఇద్దరూ నన్నే చూసేరు
చాలా చాలా బాగుందండి.నవ్వి నవ్వి రెస్ట్ తీసుకుని మళ్ళిచెబుతున్నాను.:))
3g గార్కి,
ఏదైనా చివరి నిముషం వరకు పోస్టుపోను చెయ్యడం మన జన్మ హక్కు. ఆపైన క్రైసిస్ మానేజిమెంటు, చివరకు విజయమో వీరస్వర్గమో మన పైవాళ్లు తేలుస్తారు.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
రాధిక(నాని) గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్లకి.
ఈ కధ వ్రాస్తున్నప్పుడు పక్కగదిలో మా బాసు గారు ఓ జానపద సినిమా చూస్తున్నారు. నేను అక్కడకి వెళ్ళితే మా బాసు గారు "చూడండి కాంతారావు ఎంత బాగా నటిస్తున్నాడో" అంది. నాకు తెర మీద వారు కనిపించలేదు. మా బాసు గారు వివరించారు. ఆయనెవరో కాంతారావు కత్తి మాయం చేసి, చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది, అని. దాన్ని కొద్దిగా మార్చి రాయడం జరిగింది. అదన్న మాట.
సుబ్రహ్మణ్యం గారు. సినిమా చూపించేసేరు.. నేను పెడదాం అనుకున్నా కామేన్ట్లన్నీ ఇక్కడ అందరూ పెట్టేసారు. :(
"నవ్వితే నవ్వండి ".. నవ్వుతున్నాం .. నవ్వుతున్నాం.. నవ్వి నవ్వి ఆఖరి క్షణాలు వచ్చేసేలా ఉన్నాయ్.. :) :) పోస్ట్ మాత్రం కెవ్వ్..కెవ్వ్.. :) :)
ఈ చిలక జోకు సూపరండీ. హహ్హహ్హహ్హహ్హహా.
ఇక్కడ బోస్టనులో మూడయ్యింది, పడుకుందామనుకుంటూ ఆఖరుసారి అన్ని టాబ్లు చూస్తూ ఈ వ్యాఖ్యచూసి ఆగలేక ఇటొచ్చి ఈ ఒక్క ముక్క రాసేస్తున్నానండి.
"చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది".......హహహ్హహహహ్హ
వెల్కం టు ద గ్రూప్ ...నేనూ 'తాపీ మేస్తిరినే'...కానీ మా సీతయ్యతొ అలా కుదరదు....ఆ చివరి క్షణాలేవో ప్రతి సారీ 2 గంటల ముందు వచ్చేస్తాయి....ప్రతి సారీ 1.30 బస్సు 12.30 కి అని చెప్పడం...గడియారాన్ని ముందుకి తిప్పడం వంటి విద్యా ప్రదర్శన జురుగుతుంది...మీ పోస్ట్ సూపరండీ....నవ్వాలనిపిస్తే మీ బ్లొగ్ కి వచ్చెయ్యడమే.....
"చిలక గా మార్చేశారు ట. చిలక గా వారి నటన అద్భుతంగా ఉంది"
హ్హ హ్హ హ్హ సూపరండి..... కామెంటుల్లో కూడా వదలట్లేదుగా మీరు.
వేణూరాం గార్కి,
నవ్వండి, కానీ మరీ అంత ఎక్కువగా వద్దండి. కామెంట్లు పెట్టేటప్పుడు,భోజనాల దగ్గర ముందే ఉండాలండి. ధన్యవాదాలు మీ నవ్వుకి, మీ వ్యాఖ్యలకి.
ఎన్నెల గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్లకి. మీ సీతయ్య గారి టెక్నిక్ లు బాగున్నాయండి. థాంక్యూ.
జెబి.JB గార్కి,
ఆ.సౌమ్య గార్కి,
3g గార్కి,
ధన్యవాదాలు. చిలక కధ కి అసలు హక్కుదారు మా బాసు గార్కి మీ హాహాహ్హా లు అందజేశాను. థాంక్యూ.
చాలా బాగా రాసారు
కాకపొతే రైలు టిక్కెట్టు గురించి చెప్పలేదు
మీ బ్లాగ్ నాకు చాలా బాగా నచ్చింది
అప్పారావు శాస్త్రి గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. ఏంచేస్తాం ఆటొ వెనక్కి తిప్పి ఇంటికి వెళ్ళి, తాళం తీసి, బీరువా తాళాలు వెతికి తాళం తీసి, టికెట్ట్లు తీసి జేబులో పెట్టుకొని, మళ్ళీ బీరువా తాళం వేసి,తలుపు తాళం వేసి, లాగి చూసి, ఆటొ ఎక్కి, మా ఆవిడ చూసే తీక్షణ వీక్షణాలు తట్టుకొని,మళ్ళీ బయల్దేరాం అన్నమాట రైల్వే స్టేషన్ కి.
నాబ్లాగు మీకు నచ్చినందుకు వెరీ మెనీ థాంక్స్.
.
బులుసు సుబ్రహ్మణ్యంగార్కి నమస్కారం!
"నా చివరి క్షణాల్లో" సరైన క్షణంలో చూడలేదు. ఈ రోజే చూసా. వ్రాద్దామా
వద్దా అనుకున్నాను. వద్దులే అనుకున్నాను...పైగా బ్లాగుల దగ్గిరా,భోజనాలదగ్గర
ముందేవుండాలంటున్నారు మీరు..సరే యేదైతే అదే అవుద్దని..మనసులో మాట
పెట్టేస్తున్నాను...పాతకాలపు ట్రంకుపెట్టెల్లో నిండుగా కూరి, ఇంటిల్లపాదీ దానిపై
కూర్చుని బలవంతంగా గొళ్ళెం పెట్టి, తాళం పెట్టాక చూస్తే అప్పటికే వెనుకాల
నుంచి వూడిపోయేది..ఆ పుట్టింటి పెట్టి...అది గుర్తుచేసింది మీ పెట్టెపై డాన్సు...
చాలా సందడిగావుంది మీ పోస్టు...మీరు పెట్టాక ఆ తర్వాతా కూడా...
సో ఇది కూడా బ్లాగాఫీస్ హిట్.
హాట్సాఫ్.
హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. 41 ఏళ్ల క్రితం కాపురానికి వస్తూ మా ఆవిడ తెచ్చుకున్న ట్రంకు పెట్టె మా ఇంట్లో ఇంకా ఉందండి. బెడ్ రూము లో బీరువా పైన ఆసీనురాలై ఉంది. నాల్గైదు ఏళ్ల కో మాటు కిందకు దింపడం, ఓ రంగుడబ్బా నా మెళ్ళో వేసి, ఓ బ్రష్షు నాచేతిలో పెట్టి,దానికి రంగులేయించి స్క్రూలు బిగించి మళ్ళీ బీరువా ఎక్కించేస్తుంది.ఏ పురాతన వస్తుప్రదర్శన శాల కో ఇచ్చేద్దామంటే ఒప్పుకోదు మా ఆవిడ.
మీ ఇంట్లో కూడా ఇంకా ఉందన్నమాట అటువంటి పెట్టె. సంతోషం.
ఇంతకీ ఆ రోజు ట్రెయిన్ దొరికిందా లేదా చెప్పనే లేదు.
విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. క్షమించాలి ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు. వేసవికాలం ఎఫ్ఫెక్ట్.
ట్రైన్ దొరికింది సార్. ఇది కూడా చివరి క్షణం మహాత్యమే. ....... మహా
// “ట్రైన్ దొరికింది” //
థాంక్ గాడ్ 👍 .... చి.హా 🙂.
నేను చదివాను - మీ చివరాఖరి ముఖ్యగమనిక చూపించి ఇంకొందరితో చదివిస్తాను :)
లలితా TS గారికి. ........ ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి