కవిత్వం ఎలా వ్రాయాలి

కవిత్వం ఎందుకు వ్రాయాలి అని  సాధారణంగా ఎవరూ అడగరు.  
ఎందుకంటే కవిత్వం దురద  ఎప్పుడో ఒకప్పుడు అందరికి పుట్టుతుంది కనుక. 

పుట్టిన వెంటనే అదేనండీ దురద, మన  చేతిలో బ్లాగు ఉంది కనుక  వెంటనే గోకేసుకుంటాము. 

మన గీకుడు భరించలేక కొంతమంది పాఠకులు కెవ్వు మంటారు. నిశ్శబ్దంగా కుయ్యో మొర్రో అని కూడా దుఃఖిస్తారు. 
 కానీ సహృదయులు కాబట్టి, జాలిగుండె కలవారు కాబట్టి, 
"ఎంతైనా తోటి బ్లాగరు,  పాపం, దురద భరించలేకే గోక్కున్నాడు" అని సమాధాన పర్చుకుంటారు. 

మరి కొంత మంది జాలితో ద్రవించిన హృదయం కలవారై,  తోటి బ్లాగరును ప్రోత్సహిద్దామనే భావనతో కామెంటుతారు. కేక అంటారు, కత్తి, గునపం, గడ్డపారా అని కూడా అంటారు. 

"బాగుంది,  సూపరూ, ఇహ నీకు ఎదురులేదు, కుమ్మెయ్యి,  గోకెయ్యి, బుఱ్ఱలు  తినెయ్యి"  అని ఉత్సాహ పరుస్తారు. 

ఇవన్నీ చూసిన తరువాత అప్పటిదాకా దురద లేనివాళ్లు  కూడా కావాలని సరదాగా దురద పుట్టించుకుంటారు. అదండి సంగతి నాకూ దురద పుట్టింది. కవిత్వం వ్రాయాలని.


కప్పుకి లిప్పు కి బోలెడు దూరం అని అంటుంటారు. నాకూ అనుభవం లోకి వచ్చింది. 

దురద పుట్టిన వెంటనే  ఏదో నాలుగు లైనులు బరికేసి పబ్లిష్ నొక్కెస్తే నా దురద తీరిపోయేది. ఏ    బాధా లేకపోయేది. 

పబ్లిష్ నొక్కిన వెంటనే నా బాధ మీకు ట్రాన్స్ఫర్ అయిపోయేది. మీ బాధలు మీరు ఆరున్నొక్క రాగం లో  పాడేవారు.  నేను మనసారా ఆలకించి ఆనందించే వాడిని. 

కానీ నిన్న,  కొత్తావకాయ లో అంత వెన్న కలపి, పంచదార కలశల రసం జుర్రుకుంటూ  అలౌకికానందం  లోకి జారిపోయి  

“మనసు పరవశించెనే  పొట్ట బరువు ఎక్కెనే” అని పాడుకుంటూ, 


“దేవి, ఆర్యపుత్రీ,  ప్రభావతీ, నేను కూడా కవిత్వం వ్రాయాలని నిశ్చయించుకున్నాను”

అని  అంటిని. అంతే  శ్రీమతి ప్రభావతి దిగ్గున లేచి తన చెయ్యి నా కంచం లో కడుక్కొని,  


“హెమంటి వేమంటివి, నువ్వు కవిత్వం వ్రాయుదువా, 

"హే తెలుగు తల్లీ నీకెంత కష్టము దాపురించనున్నది. దీని నరికట్టు వారెవరూ లేరా? ఏదో నాలుగు కధలు,  కాకరకాయలు రచించినంత మాత్రాన కవి యైతినని గర్వించుచున్నావా.   ఓరోరి బ్లాగుడా, నీ   ధూర్త ప్రవర్తన మానుకొమ్ము. లేనిచో నీ బ్లాగునూ, ఆ దుష్ట లాప్ టాపు నూ. ఆ BSNL మోడెమ్ నూ  మదీయ తీవ్ర వీక్షణాగ్ని కిరణముల దగ్దము చేసెద”  

నని క్రోధ సముద్రముప్పొంగ నుటంకించెను. నేను భయ విహ్వలుడనై, మనంబున శాంతం భోషాణం అని స్మరించుచు ఆమె క్రోధము తగ్గువరకు శాంతము వహించితిని.  ఆమె శాంతమతి యై, దయార్ద్ర చిత్తయై,

“ఆర్య పుత్రా, పతిదేవా ప్రద్యుమ్నా, ఛందోబద్ధమై అలరుచు,  చదివినంతనే, వినినంతనె అలరించుచూ, ఆనందింప చేయుచూ, తెలుగు వారికే స్వంతమైన పద్యమును కలుషితము చేయనేల సాహసించ దలచితివి.”   అని వివరణ కోరెను.  

“దేవీ ప్రభావతీ నేను పద్యము లిఖించ దలచలేదు. ఏదో సామాన్యమైన గేయరచనకు పూనుకొంటిని.”

అని విన్నవించుకొంటిని. భావ కవిత్వమా అని ఆమె పృచ్చించెను. అవును అన్నట్టుగా నేను తల నూచితిని. 

"అసలు కవిత్వం వ్రాయడం ఎలాగో తెలుసునా శ్రీనాధా" అని మళ్ళీ  మదీయ పత్ని నన్నడిగెను.  

"నీకు తెలుసునా" అని నేను ఎదురు ప్రశ్న వేసితిని.  


దోసెడు పారిజాతములతో హృదయేశ్వరి
మెల్ల మెల్లగా డాసిన భంగి
మేలిమి కడాని వరాల కరాలు వచ్చి
కన్మూసిన భంగి
కన్నె నగుమోము పయిన్  నును సిగ్గు మొగ్గ
కైసేసిన భంగి
అందముల్ చిందెడి నందన వాటి వెన్నెలల్
కాసిన భంగి
జానపద కాంతలు రాట్నము మీద దారముల్
తీసిన భంగి
క్రొవ్వలపులేఖ  తలోదరి తామరాకు పై
వ్రాసిన భంగి
పెండ్లి తలంబ్రాల్ జవరాలు రవంత నిక్కి
పై బోసిన భంగి

పొంగు వలపుల్, తలపుల్, సొలపుల్
ప్రసన్నతల్, భాసురతల్, మనోఙ్ఙతల్
ప్రౌఢిమముల్, రసభావముల్, కడు భాసిలు నట్టు


"చెప్పాలిట కవిత్వం. ముఖ్యం గా తెల్గు కైత. ఎంత అద్భుతంగా చెప్పారో  కరుణశ్రీ  జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంతకన్నా అందంగా చెప్పిన వారు నాకు కనిపించలేదు" అంది ప్రభావతి. 

నేను కూడా వెంటనే ఒప్పేసుకున్నాను. 

"యెస్ ఐ ఆల్సో నో సీ" అని కూడా అన్నాను.  

"ఆగ్లం లో శ్రీ హెన్రీ వర్డ్స్ వర్త్  ఆర్తి తో తన ప్రేయసి తో ఏమన్నాడో విన్నావా పతీ పరమేశ్వరా"  అని అడిగి సమాధానం కోసం చూడకుండా చెప్పేసింది.  


ఏదీ వినిపించు
ఏదో ఒక కవితను
నిసర్గ సుందర మధుర గీతికను
అహమంతా ముసిరిన
ఆలోచనల నవతలకి నెట్టి
మనసున శాంతి సమీరాలు వీచే పాటను


"అల్లా వ్రాయగలవా నువ్వు" అని అడిగింది. 

"అంత బాగా వ్రాయలేను కానీ ఒక మాదిరిగా వ్రాద్దామని ప్రయత్నం చేస్తాను. నా కవిత విను నా శ్రీరంజనీ" అని విసిరాను నా కవిత.


పడుతోంది వేడి వేడి వర్షం
చల చల్లటి   మేఘాల్లోంచి
నల్లటి కారు బొగ్గు లాంటి
వర్షం   వర్షం పడుతోంది
వాతావరణం లోకి మెల్లిగా


సతీ సావిత్రి  నా కేసి చూసి "ఇదేమిటి నా రేలంగీ. దీనిభావ మేమి" అని అడిగింది. 

"హూహూ  దీన్ని అతివాస్తవిక రచన అందురు. దీంట్లో మనం సరైన అర్ధం వెతుక్కోవాలి" అని ఐ సెడ్డు.   

" How is that my dear" అని అంది. పైగా ఒక ? కూడా పెట్టింది.  

నేను హహ అన్నాను, సందు దొరికింది గదా అని హహ్హాహాఃహ  యని కూడా అన్నాను. 
 

"నవ్వడం  కాదు నా  చిత్తూరు నాగయ్యా  అర్ధం  చెప్పు  పై రాతకి"   అని శ్రీమతి కన్నాంబ  అడిగింది. 

ఈ మాటు నేను హిహి అని చిరునవ్వు నవ్వాను.

"ఇది ఒక పజిల్ కవిత్వం. పదాలు వెతికి సరైన చోట పెట్టాలి. నువ్వు ఎప్పుడైనా మాడ్రన్ ఆర్ట్ చూశావా మై డియర్ సూర్యాకాంతం. మాడ్రన్ ఆర్ట్ లో ముక్కు ఎక్కడుందో  ఎలా తెలుసుకుంటాం? పెయింటింగ్ మీద మన ఎడం చేతి వేలితో తడుముతాం. మన చేతికి ఎక్కడ జిగురు అంటుకుంటుందో అక్కడ ముక్కు ఉన్నట్టు లెఖ్ఖ. అదే విధం గా నా రచన అర్ధం చేసుకోవాలి. మెదడు ఉపయోగించి పదాలు సరిచూడాలి. చదివేసి  ఆలోచించకుండా వెంటనే సూపరూ అనేయడం కాదు. అర్ధం చేసుకో" , 


పడుతోంది పడుతోంది   
నల్లటి కారు బొగ్గులాంటి మేఘాల్లోంచి
వర్షం  వర్షం  చల చల్లటి వర్షం  మెల్లిగా
వేడి వేడి  వాతావరణంలోకి  వేడిగా  


దీన్ని రుబ్బురోలు కవిత్వం అని కూడా అందురు అని  విశదీకరించాను. అనగనేమీ యని మరల వివరణ కోరెను నా కనక దుర్గ.

"ఇది కవిత్వములో కొత్త ప్రయోగము. రెండు వాక్యములు వ్రాసి రుబ్బురోలు లో  వేసి రుబ్బవలెను. ఖండ ఖండము లైన వాటిని నీకు తోచినట్టు అరడజను లైన్లలో సర్దవలెను. అదియే నేటి ప్రజాదరణ పొందిన కవిత్వము"  అని గంభీర గంభీరముగా నుద్ఘాటించితిని.

"ఓరోరి రాజనాలా  నిన్ను తిట్టుటకు నాలుక తొందర పడుచున్ననూ, పాతివ్రత్య కారణముల వల్ల మనసు ఇచ్చగించుట లేదు. కవిత్వానికి పరమార్ధం తెలుసునా నీకు"     ఇది విను అంది ప్రభావతి మళ్ళీ.


గ్రీష్మ మేఘం వాన జల్లులు కురిపించి నట్లు
కనుకొలకుల నుండి భాష్పాలు జాలు వారినట్లు
గుండె లోతుల నుండి గీతాలు పెల్లుబకాలి  ఎందుకు
సేద తీర్చటం కోసం, హాయి కలిగించడం కోసం 


"అని ఒక భావ కవి ప్రశ్న వేసుకొని, తానే సమాధానం చెప్పుకున్నాడు. అర్ధం అయిందా. కవిత్వం వ్రాయాలంటే  ఊహ ఉండాలి,   కల్పన  చేయగలగాలి,  భావం తెలియాలి ఇవి మధురంగా ప్రకటించటానికి భాష కావాలి. ఇవన్నీ నీకు తెలుసునా" అని ఘట్టిగా అడిగెను. 

"నువ్వు అల్లా వ్రాయగలవా" అని కూడా ప్రశ్నించెను. 

"నహి నహీ నేను వాళ్ళకి మల్లె నహీ లిఖ్ సక్తా హూ  హూ" అని అంటిని. 

"లేకిన్  ప్రియే ధర్మపత్నీ వాళ్ళు పెద్ద మరియూ మహా కవులు వారి వలే నేనెట్లు వ్రాయగలను. నేను ఏదో థోడా థోడా కవిత్వం లిఖూంగా ఛోటా ఛోటా లోగోం కేలియే అని వ్రాక్కుచ్చితిని. 

"క్యారే తూ క్యా సంఝారే? ముఝె భీ హిందీ మాలూం.  సునో"


సఫేదీ హై  సియాహీ హై  షఫక్ హై  అబ్రెబారా హై
మజా బర్సాత్ కా చాహేతో ఇన్ ఆంఖోమ్మే ఆ బైఠో


అంటే అర్ధం తెలుసా ప్రాణనాయకా అంది.  

మాలూం నహీ అన్నాను.  అయితే వినుకో అంది

ఒక నవ యువ జంట చాటుగా కలుసుకున్నారు. 
వర్షం పడుతోంది. వర్షం లో తడిసి ఆనందిద్దామా అని అడిగాడు యువకుడు. 
మగాడు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. 
ఆడది ఆలోచిస్తుంది. తన భద్రత చూసుకుంటుంది. 
బయటికి వెళ్ళి ఎవరి కంట్లో నైనా పడితే ఎల్లా. 

అందుకే చెప్పింది ఇలా.  

"ఓ నా ప్రాణమా,  నా కళ్ళల్లోకి చూడు, అక్కడ తెలుపు ఉంది, నలుపు ఉంది, అరుణిమ ఉంది, శ్రావణ మేఘం ఉంది, నిన్ను కలుసుకున్న ఆనందంలో కురిసే భాష్పాలు ఉన్నాయి. వర్షంలో తడిసే ఆనందం కావాలంటే , రా , నా కళ్ళల్లో కాపురం పెట్టు"

"మహా కవి దాశరధి  తన రచనలలో ఒక చోట చిత్రీకరించిన మధుర కమనీయ రమణీయ భావం ఇది. వీటిలో పదోవంతైనా నువ్వు పలికించగలవా నాధ్" అని అడిగింది నా ప్రియసఖి. 

నేనున్నూ కృద్ధుడనైతిని.

“కవిత్వమంటే  ప్రేమా, మేఘాలు, పెళ్లికూతురు,  తలంబ్రాలు, నిసర్గ సుందర గీతికలే కాదు. ఆకలి, దరిద్రం, బాధ, సమాజం ఇవికూడా ఉన్నాయి అని గ్రహించు.  

అని వచించితిని. అయితే ఇది విను  కాబోయే కవి సత్తమా అంటూ మళ్ళీ సంధించింది  ఇంకో బాణం,


కదిలేదీ, కదిలించేదీ
మారేదీ  మార్పించేదీ
పాడేదీ  పాడించేదీ
పెను నిద్దర వదిలించేదీ,
మునుముందుకు సాగించేదీ
పరిపూర్ణపు బ్రతుకిచ్చేదీ... ..... కవిత్వం


అన్నారు మహాకవి శ్రీ శ్రీ . 

"అంతటి ఉత్సాహం,  ఆవేశం నింపగలవా కనీసం ఇరవైయో వంతైనా నీ కవిత్వం లో" అని నొక్కి నొక్కి మరీ ప్రశ్నించెను నా చండీ రాణి.

"ఆహా విధి వక్రించుట యనగా నిదియే కదా. కవిత్వము వ్రాయవలెనని నాకేల దుర్భుద్ధి పుట్టవలె, నేనేల ఉ. భా. ప్ర.  ప్రభావతీ దేవీ కేల తెలుపవలె , పతి నని కూడా ఇసుమంత కనికారము లేక ఆమె నన్నిట్లు ఏల ఝాడించ వలె"  అని విచారించు చుండగా ఆమె మరల ఏదో చెప్పబోయెను.     

ఆషాఢస్య    ప్రధమ    దివసే  అని  సంస్కృతమున  ఆమె   మొదలుపెట్టే లోపుల నేను తెల్ల జెండా ఎగర వేసితిని.

“దేవీ నేనోటమి నంగీకరించితిని . నా బ్లాగు మీద ఆన. మెత్తటి, ఒత్తయిన నీ జుట్టు మీద ఆన. నేను కవిత్వము వ్రాయను, వ్రాయను కాక వ్రాయ.”

అని ప్రతిజ్ఙ చేసితిని. మంగళం మహత్. మీకు శుభమగు గాక.                                


చివర మాట:   స్నేహ సమాఖ్య, South end park, L. B. Nagar, Hyderabad, వారి Souvenir, 2007,   లిఖిత   లో మిత్రులు శ్రీ యస్. వి. యస్. యమ్. శాస్త్రి గారి  రచన  కవితా రమణీయం    నుంచి యధేచ్చగా గ్రంధ చౌర్యం చేయడమైనది అని ఇందుమూలంగా తెలియపరచడమైనదహో.  


గమనిక: - ఈ టపా తొలి సారి 23/05/2011 న ఈ బ్లాగులో ప్రచురించ బడింది.  

67 కామెంట్‌లు:

భాను చెప్పారు...

sooooooooooooper:))

SHANKAR.S చెప్పారు...

"పడుతోంది వేడి వేడి వర్షం
చల చల్లటి మేఘాల్లోంచి
నల్లటి కారు బొగ్గు లాంటి
వర్షం వర్షం పడుతోంది
వాతావరణం లోకి మెల్లిగా"

ఆహా వేడి వేడి వర్షం. ఆమ్ల వర్షాలని ఎంత కవితాత్మకంగా సూచించారు. కారు బొగ్గు లాంటి వర్షం. ఇది మరీ సూపరు వాతావరణంలో కాలుష్యం కలిసి వర్షం నల్లబడిందని కవి హృదయం. పర్యావరణం పట్ల తన మక్కువని అక్షరాలలో అటూ ఇటూ తిప్పి మన మీదకు వదిలిన మహా కవి బులుసు గారికి "హాస్యాహిత్య అకాడమీ" అవార్డ్ ఇచ్చి తీరాల్సిందే. బ్లాగ్మిత్రులారా ఏమంటారు?

గురువు గారూ మీ కవిత్వం "కేక". ఈ సహస్రాబ్దం మీదే అని నేను సగర్వం గా ప్రకటిస్తున్నాను (పాపం శ్రీ శ్రీ శతాబ్దం తో ఆపేసుకుని ఈ అపూర్వ అవకాశం మిస్సయిపోయాడు)

భాను చెప్పారు...

కవిత్వం ఎట్లుండవలెనన్న
"కిం కవేస్తేన కావ్యేన కిం కాందేన ధనుష్మత
పరస్య హృదయే లగ్నం నదూనయతి యచ్చిరః"
ఎదుటివాని హృదయమునకు తగిలినప్పుడు తల పంకింప జేయని ఆ కవి కావ్యమెందులకు? ఆ విలుకాని బాణం ఎందులకు: ఇట్లు వహ్వా యని తల పంకింప జేయు గుణము కవిత్వమందు పుష్కలముగా ఉన్నది.

పుట్టపర్తి అనూరాధ. చెప్పారు...

బాబోయ్ ..మీరిలా కవిత్వాన్ని రాసేవాళ్ళనూ ఓ చూపు చూశాక కలం పట్టుకోవాలంటే క్షణం ఆలోచించాల్సొస్తూంది.అయినా అందరూ దాశరధులూ..శ్రీ శ్రీలూ అవుతారా..వాళ్ళ ఇనిస్పిరేషను అనే ఒక జిలను ఎలగో ఒకలాగ కక్కేయాలికదా..మరి పాఠక బ్లాగర్లు సహకరించాలి మరి..కావాలంటే వాళ్ళ జిలనూ మేం భరిస్తాం అనే హామీ పత్రం ఇక పై జత పరుస్తాం లేండి..

Indian Minerva చెప్పారు...

"మజా బర్సాత్ కా చాహేతో ఇన్ ఆంఖోమ్మే ఆ బైఠో"

ఆచార్యదేవా... ఆహా... ఇది ఎవరి కవిత్వము?

మనసు పలికే చెప్పారు...

గురూ గారూ.. ఇక లాభంలేదు. నేను పలకా బలపం పుచ్చుకుని ఏలూరు బస్సెక్కుతా. శంకర్ గారు అన్నట్లు నేను కూడా మరో సహస్రాబ్దికి కవయిత్రిని అవుతా;) (అప్పటి వరకూ ఉంటానా అని లాజిక్కులు తియ్యకండి;)) నాకు మీ ఆశీస్సులు కావాలి.
ఇంక టపా విషయానికొస్తే.. అద్బుతం అమోఘం. నేను కూడా కెవ్వుమంటున్నా;)

మనసు పలికే చెప్పారు...

@ భాను గారు,
బహుకాల దర్శనం. అంతా కుశలం కదా:)

ఆ.సౌమ్య చెప్పారు...

ప్రభావతిగారికీ జై...వారి నోట కవిత్వం ఎట్లుండవలెనంటూ మీరు పలికించిన సుమధుర సుందర కవితా వీచికలు, భానుని చండప్రతాపములకు తాళలేక ప్రార్థిపగా కరుణించిన వరుణుడు చిలకరించిన తొలకరి జల్లు వలే, వినీలాకాశమున రజనీకాంతుడు భూలోకమందలి కలువల ముగ్ధమనోహర సౌందర్యానికి పరవశుడై వాలుగా కురిపించిన వెన్నవంటి వెన్నెల ధార వలే, మనోజ్ఞమైన సంద్రాన నౌకావిహారమునకు చెలుని తోడుకొని పోవునపుడు వీచిన పిల్లతెమ్మెరవలే, బాలమురళి-కున్నక్కూడి-పట్టమ్మాళ్-సుబ్బలక్ష్మి వంటి గానగంధర్వుల సంగీత తరంగములవలే, పసిపాపాయి పవళించు మోమున తళుక్కున మెరిసిన చిరునవ్వువలే మదీయ ఉల్లమును ఝల్లున తాకినది.

అయ్యారే చూచుతిరా! మీ రమణీయ కవితావేశం మమ్ములను ఓ 40 యేండ్లక్రితమునకు తీసుకుని పోయి పౌరాణిక, చారిత్రక సినిమాలలోని సంభాషణలవలెననిపించు డవిలాగులను పేజీలు పేజీలు వ్రాయునట్లు చేసినది...ఇంతకన్న ఘనకార్యమేమిసలుపగలదె మీ కవిత్వము? జోహార్లు జోహార్లు జోహార్లు! :)

భాను చెప్పారు...

ఔనండీ, చాలా రోజులవుతుంది బ్లాగుల వైపు వచ్చి. అంతా కుశలమే , థాంక్స్

ఇందు చెప్పారు...

బాబోయ్ బులుసుగారూ...మీరు మామూలువాళ్ళు కాదు...ఎంత అందమైన కవితలు వ్రాసారు ;) నేను అప్పుతో గొంతుకలిపి 'కెవ్వ్వ్వ్వ్' మంటున్నా :))

కానీ మీరు ఉదహరించిన కరుణశ్రీ గారి కవిత మాత్రం నాకు భలె నచ్చింది!! అబ్బ..ఎన్నిసార్లు చదివానో అది!!

ఇక మీ కారుమబ్బులు,బస్సుమబ్బులు కవిత్వం హ్హహ్హహ్హా :)) ఏమిటండీ?? వేడివేడి వర్షమా? అదేమన్నా వేడివేడి పకోడీయా? హ్హెహ్హెహ్హె!! ఎంతగొప్ప ఊహ మీది!!?? ఫైనలగా మళ్ళీ చెబుతున్నా మీరు కేకోకేక!!

kiran చెప్పారు...

hahahahahhaha...soooper bulusu garu...:D

రాజ్ కుమార్ చెప్పారు...

శ్రీమతి ప్రభావతి దిగ్గున లేచి తన చెయ్యి నా కంచం లో కడుక్కొని, >>>>
హహహ్హ అయ్యయ్యో.. పాపమ్ కదా.. ;)

పడుతోంది వేడి వేడి వర్షం
చల చల్లటి మేఘాల్లోంచి
నల్లటి కారు బొగ్గు లాంటి
వర్షం వర్షం పడుతోంది
వాతావరణం లోకి మెల్లిగా

వహ్..వా..వహ్ వా.. గురువు గారో.. సూపరో..సూపరు.. నా స్టాటస్ మెసేజ్ ఇదే.. అని గర్వం గా ప్రకటీంచుచుంటిని.
ఇక రుబ్బురోలు కవిత్వం కేక సుమండీ..

సూపర్..పోస్ట్... ;)

..nagarjuna.. చెప్పారు...

పాహిమామ్ పాహిమామ్
గురూగారికి, గురుపత్నిగారికి నమో నమః

సూర్యగ్రహణానికి ఒకసారి నాకు కలిగే దురదవల్ల రాసుకునే రాతలను ఎవరన్నా ఏకేస్తారేమోనని కవిత(?) అని నేనే అనుమానపడుతూ తోక తగిలిస్తాను. గురుపత్నిగారు ఇంతబాగా విశదీకరించాక ఇక మీదట నిర్మొహమాటంగా 'కపిత్వం' అనే శీర్షికతో రాస్తాను.

కాని మీ కవిత (అవును నిజంగా కవితే) మాత్రం కెవ్వు కేక గునపం గడ్డపార ఇంకా వగైరా వగైరా.... :)

..nagarjuna.. చెప్పారు...

ఐతే గురూగారు మీరు L.B nagar లో ఉండేవారా ఇన్నాళ్లు !!?

హయ్యారే! ఈ విషయం మీరు ఊరు మారకముందే నాకు తెలిసుంటే మీ ఇంటికొచ్చి (మా ఇల్లు అటువైపే) మీ ఇరువురి దర్శనం చేసుకొనెడివాడను. హ్మ్ విధి ఎంతటి బలీయమైనది :(

Ennela చెప్పారు...

ఆకాశం నీలంగా ఎందుకుంటుంది?
ఆకుపచ్చగా ఉంటే బాగుండదు కనుక

రక్తం ఎర్రగా ఎందుకుంటుంది
నీలంగా ఉంటే బాగుండదు కనుక

నాకు సడెన్ గా శ్రీ లక్ష్మి గారు పూనారు..ప్రభావతి గారూ బచావో!

కొత్తావకాయ చెప్పారు...

"ప్రభాత సమయంలో ప్రపంచం ఏమంటోదిస్మా!" అని లాపుటాపు తెరిచి చూడ అమృతభాండంలా, దురద వచ్చిన వాడికి ఎమరీ పేపర్ లా, నవ్వుల దావానలంలా ప్రకంపనలు పుట్టించిన మీ పోస్టు చదువుతుంటే, ఆ ధాటికి,

వణికింది తొణికింది
కదిలి కాఫీ గ్లాసు
తడిసింది తడిసింది
పొడిది మేజాబల్ల

ఛాత్, ఏలూరు ప్రయాణం తప్పేలా లేదు. ఇది రుబ్బురోలు కవిత్వానికి దరిదాపుల్లో కూడా లేదు. ఉ.భా.ప్ర. ప్రభావతి గారు మీతో పాటు నన్నూ ఝాడించేసినా సరే!
అద్సరే కానీ, గురువు గారు పంచెలో లాల్చీ ఇన్ షర్ట్ చేస్తారు సరే, నాబోటి వారికి డ్రెస్స్ కోడ్ ఏమిటి చెప్మా "కవిత్వం క్లాసులకి?"


"సఫేదీ హై సియాహీ హై షఫక్ హై అబ్రెబారా హై మజా బర్సాత్ కా చాహేతో ఇన్ ఆంఖోమ్మే ఆ బైఠో!"
కదిలించారు ఇది గుర్తు చేసి, నా కాఫీ గ్లాసుతో పాటు నన్ను కూడా! :)

మంచు చెప్పారు...

:-)) first paragraph కేక , కత్తి, గునపం, గడ్డపారా :-)))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శివరంజని గారి కామెంటు

బులుసు గారి బ్లాగ్ లో కామెంట్ పెడితే
ఎర్రొర్ వస్తుంది

ఇంత చదివాక ........ మిమ్మల్ని కవితలు రాయమని అడగక పోవడం నేరం ఘోరం .మీరు కవితలు రాయాల్సిందే ..మేము చదవాల్సిందే ........... నేను కూడా అప్పుతో కలిసి పలకా బలపం పుచ్చుకుని రెడీ . నాకు మీ ఆశీస్సులు కావాలి.
. అద్బుతం అమోఘం. నేను కూడా కెవ్వుమంటున్నా అప్పుతో కలిసి ;)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

భాను గార్కి,

ధన్యవాదాలు. శ్లోకం, మీరు చెప్పిన అర్ధం మనోరంజకం గా ఉన్నాయి. నేను తల పంకించాను. :):)


శంకర్ గార్కి,

ధన్యవాదాలు. వ్రాయడం కవి పని, అర్ధం చెప్పడం వ్యాఖ్యాత పని అంటారు. నా కవిత్వానికి కొత్త అర్ధాలు చెప్పి నన్ను ధన్యుడిని చేశారు మీరు. ఇంతకీ అవార్డ్ ఎక్కడ, ఎప్పుడు, నేను ఎవర్రెడి :):)
ఏమిటో ఇంకో రెండు మూడు వర్షాలు చూస్తే చాలనుకుంటున్నాను. దశాబ్దమే అవకాశం లేదు, శతాలు సహస్రాలు నా .:) థాంక్యూ .

పుట్టపర్తి అనురాధ గార్కి,

ధన్యవాదాలు. దాశరధి, శ్రీశ్రీ లు శతాబ్దానికి ఒకరే ఉంటారు. ఏదీ కాదు కవిత కనర్హం అనుకొని, తాళం కప్పా , ఇంటి గొళ్ళెం అంటూ తయారయ్యే వాళ్ళంటేనే కొంచెం భయం వేస్తుంది. హామీ పత్రం ఐడియా బాగానే ఉంది.

ఇండియన్ మినర్వా గార్కి,

ధన్యవాదాలు. దాశరధి గారనుకున్నాను. తప్పా చెప్పండి సరి దిద్దుకుంటాను.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి ,

వచ్చెయ్యండి, వచ్చెయ్యండి హేలాపురికి. ఏ కాళిదాసు లాగానో, గునపం లాంటి పుస్తకాలు రెండు వ్రాసేస్తే సహస్రం ఏమిటి దశ సహస్రాలు మీవే అవుతాయి. ఒక గునపం నాకు అంకితమిస్తే బోలెడు ఆశీస్సులు ఫ్రీ గా ఇచ్చేస్తా. :):) ధన్యవాదాలు

ఆ. సౌమ్య గార్కి,

అయ్యబాబోయ్ మీలో కవితా వేశము అలలై పొంగి పోతోంది. మీలోని కవయిత్రి నిద్ర లేచి కొంగు బిగించింది. నిన్న సుజాత గారి బజ్ లో కూడా మీ విశ్వరూపం చూపించారు. మేమెక్కడ నిలువగలము. ధన్యోస్మి. ధన్యవాదాలు.

ఇందు గార్కి,

>> మీరు మామూలువాళ్ళు కాదు...
అవును కవితలు అప్పు తెచ్చుకొని బ్లాగు లో వేసేస్తాం . అప్పులా ళ్ళము . ఎక్కడో చదివినవి గుర్తు తెచ్చుకొని కాపీ పేస్టు చేసేశాను. అంతే.
కారు మబ్బులు అని నేనంటే బస్సు మబ్బులు అని మీరంటున్నారు. చూసారా మీకు కూడా నా కవిత్వం వచ్చేస్తోంది. :):) ధన్య వాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కిరణ్ గార్కి,

ఉత్తి సూపరేనా? :):) ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గార్కి,

>>హహహ్హ అయ్యయ్యో.. పాపమ్ కదా.. ;)
పాపమే మరి చెబితే వినదూ.
మన కవిత్వం అంటే అంతే కేకే నా పెట్టాలి కిందైనా పడాలి. రెండో మాటు వింటే ఇక లేవడు.:):)
ధన్యవాదాలు.

నాగార్జున గార్కి,

ధన్యవాదాలు. అవునండి L. B. Nagar వాసినే. ఇప్పుడైనా ఖరగ్ పూర్ దారి లోనే ఉన్నాము. ఒక రోజు ఆగి వెళ్లవచ్చు. వెల్కమ్.
మీరు కవిత్వమే వ్రాయండి. పాఠకులకి తెలుసు వి ని పి చెయ్యడం. :):)

ఎన్నెల గార్కి,

ధన్యవాదాలు. సినిమా శ్రీ లక్ష్మి పూనితే ఆ శ్రీహరి కూడా కాపాడలేడు. మీరల్లాగే వ్రాసెయ్యండి. కెవ్వు కెవ్వు మంటాము మేము.:):)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తావకాయ గార్కి,

శంఖాలు పూరించి, కిన్నెర్లు మీటించి, మీరు కూడా పరుగు పరుగున కవితలు పట్టుకు వచ్చేశారా. రండి రండి ఏలూరు. మీరెల్లాగైన వచ్చేయవచ్చు. డ్రస్ కోడు నాకు మట్టుకే.:):)
అవునండి ఎన్ని మాట్లు విన్నా మజా బర్సాత్ కా తనవి తీరదు. ధన్యవాదాలు.

మంచు గార్కి,

1st. పేరా కేక, కత్తి etc. మిగతాదంతా సుత్తేనా సారూ .:):) ధన్యవాదాలు.

శివరంజని గార్కి,

ఇంత వింత గా వ్రాసినా ఇంకా వ్రాయమంటున్నారంటే ఇన్ ఫ్రంట్ క్రోకొడైల్ ఫెస్టివల్ అంటే తెలియదు అనుకోవాలి. ఏలూరు వచ్చేటప్పుడు కొత్త లాప్ టాప్ లు తీసుకొచ్చి గురుదక్షిణ గా ఇచ్చేసి ఆశీస్సులు తీసుకొని వెళ్లిపోవచ్చు. పలకా బలపాలు పనికి రావు.:):)ధన్యవాదాలు.

Indian Minerva చెప్పారు...

బులుసు సుబ్రహ్మణ్యం గారు: దాశరధిగారు ఉరుదూలో కూడా రాస్తారని నాకు తెలీదు. నాకేదో తెలిసికాదండీ ఆ లైన్ నాకు బాగా నచ్చింది. అందుకని అడిగాను.

మనసు పలికే చెప్పారు...

గురూ గారూ.. నేను ఆల్రెడీ ఏలూరు బస్సులో ఉన్నానోచ్;);)

హరే కృష్ణ చెప్పారు...

మీరు intentional గా ఒక పదాన్ని వదిలేసారు వదిలేసారు అందుకే వాడేస్తున్నా
రచ్చ రచ్చ :)

బ్లాగోకేసుకుందాం రా ప్రోగ్రాం కి తీవ్రంగా జయప్రదం చేసేలా ఉన్నారు కదా ప్రజలంతా

ఉపోద్ఘాతం మాత్రం క్రూరం అసలు పొడిచి పారేసారంతే :)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఇండియన్ మినర్వా గార్కి,

నేనూ ఎప్పుడో చదివినవండి. నిజంగానే నాకు అనుమానం వచ్చింది. పొరపాటు పడ్డానా అని. మా మిత్రుడి తో రీ చెక్ చేసాను. దాశరధి గారు ఉర్దు లో కూడా చాలానే వ్రాశారుట. ధన్యవాదాలు.

మనసు పలికే గార్కి,

బస్సు ఏలూరు పొలిమేరలలోకి రాగానే నాకు ఫోన్ కొట్టండి. నేను విమానం లో బస్ స్టాండ్ కి వచ్చేస్తాను. అయినా హిమాలయాల్లోంచి మా వూరికి బస్సు ఎప్పుడు వేసారబ్బా? :):) ధన్యవాదాలు.

హరే కృష్ణ గార్కి,

తీవ్రం గా జయప్రదం, జయసుధం కాదు ఇప్పుడు. నిత్య నూతనం చేయాలి.
నాచేత క్రూరంగా హత్యలు కూడా చేయించేస్తారా ? :):) ధన్యవాదాలు.

మనసు పలికే చెప్పారు...

>>ఉపోద్ఘాతం మాత్రం క్రూరం అసలు పొడిచి పారేసారంతే :)
>>నాచేత క్రూరంగా హత్యలు కూడా చేయించేస్తారా ?
హహ్హహ్హా.. ఈ రెండూ చదివి పడీ పడీ నవ్వుతున్నా..;);)

ఇక బస్సు సంగతంటారా.. మనసుంటే మార్గముంటుంది గురూ గారూ.. అనుకుంటే అలా వచ్చేస్తాయి అవన్నీ.. ఇదిగో ఏలూరు పొలిమేరలకి ఇంకో పది నిమిషాలు పడుతుందంట. మీకు ఫోను కొట్టేస్తా. ఫ్లైట్ టికెట్ రెడీ గా పెట్టుకోండి;)

అజ్ఞాత చెప్పారు...

మొదట్లో బాగా వుండేది కాని ఈమధ్య మీ హాస్యం కాస్త వెగటుగా అనిపించడం మొదలెట్టింది.

హనుమంత రావు చెప్పారు...

ఔరా...............బ్లాగులున్నాయి కాబట్టి గోక్కోవడమా
ఔరా...............సాటి బ్లాగరు బాదుడైనా సానుభూతి స్పందనలా
ఔరా...............అంతంత మంచి మంచి కవితలు కోట్ చేస్తారా
ఔరా.............. ఇంతంత మంచి కవితలు వ్రాస్తారా
ఔరా................కవితలను వ్రాయడానిక్కూడా శ్రీమతి గారి అనుమతులూ
....గారితో అండర్స్టాండిగులా
ఔరా................ఎంత బాగా వ్రాసారండి..
హౌరా..............మెయిలెక్కి ఏలూరు రావాలా లేక
మెయిల్ ట్యూషన్ చెప్తారా....అదేనండి కవిత్వం పాఠాలకు.

KumarN చెప్పారు...

You are awesome!!
Out of this world :-)))))))))))

రత్న మాల చెప్పారు...

బలుసు గారు ఎంత బాగా రాసారండి .నాకు కవిత్వం రాదండి బాబు. మీకవిత్వం SUPARRRRRRRRRRRRRRRR

MURALI చెప్పారు...

బులుసుగారూ, అయ్యారే బ్లాగులందు కవితలు వ్రాయు నవయువ కవులను నవ్వులపాల్జేసితిరే. మనసున్ దొరలు భావాలను బ్లాగులందు పొర్లించు యువకుల్ మనోభావలాను గాయపరిచితిరే. ఇదేమి న్యాయమూ అని ప్రశ్నించుచున్నవాడ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

ధన్యవాదాలు. మీరు సత్యకాలం మనిషి లా ఉన్నారు. ఇక్కడ కొన్ని యుగాలు అయితే అక్కడ ఒక నిముషం ట. పది నిముషాలు అంటే ఇంకా ఎన్ని యుగాలు వేచి చూడాలో. :):)

అనానిమస్ గార్కి,

మీ అభిప్రాయం నిర్మొహమాటం గా చెప్పినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞుడిని. వ్రాయకుండా ఉండలేను. ఇంతకన్నా బాగా వ్రాయలేను. అయ్యా అదీ నా పరిస్థితి.
తినగ తినగ వేము అసలు తీపి ఎక్కదంటారా మాష్టారూ? :):)

హనుమంతరావు గార్కి,

ధన్యవాదాలు. తోటి బ్లాగర్సు అంటే సానుభూతి ఉండాలి కదా మాష్టారూ. వచ్చెయ్యండి ఏలూరుకి, పాఠాలు మొదలు పెట్టేద్దాము.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కుమార్ N గార్కి,

ధన్యవాదాలు. అంత సీను లేదనుకుంటాను సార్.

రత్నమాల గార్కి,

సూపర్ ధన్యవాదాలు. నాకూ రాదండి కవిత్వం. :):)

మురళి గార్కి,

లేదు లేదండీ. ఔత్సాహిక రచయితలని ఉత్తేజ పరచటానికి వ్రాసాను. ఉత్సాహ పరచడమే నా ఉద్దేశ్యం. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

బాల్యంలో నేను రాసిన కొన్ని కవితలూ, నేను కవిని కావడం జస్ట్ మిస్సైన వైనం ఒక్కసారిగా గుర్తోచ్చేశాయ్.. టపా రాసేయాలి.. ఇంతకీ మీ టపా వాళ్ళ నీతి ఏమిటంటే, మనకి ఏమన్నా చేయాలని అనిపించినప్పుడు దానిని గురించి అర్ధ భాగంతో చర్చించకుండా ఉండడం ఉత్తమం.. రైటే కదండీ? :))

మోహన చెప్పారు...

:))))))))))))))))))
kevvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv

elaa navvaalO teliyaTam ledu naaaku.
Tooo good.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గార్కి,

>> నేను కవిని కావడం జస్ట్ మిస్సైన వైనం ఒక్కసారిగా గుర్తోచ్చేశాయ్..
అయ్య బాబోయ్, మీరు అల్లాగంటే మేమంతా ఎవరు?
రైట్ రైట్ అనాలనే ఉంది కానండి మరేమో నండి ఏమిటో నండి నో కామెంట్స్ అనేస్తానండి. :):)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.


మోహన గార్కి,

ధన్యవాదాలు. నవ్వడం ఈజీ ఆండి. మళ్ళీ ఇంకో మాటు చదివేయండి.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పైనిచ్చిన సలహాలతో పాటు ఈనాటి బ్లాగ్ లోకానికనుగుణంగా నాదొక updated సలహా --> "కవిత్వం ఎలా వ్రాయాలి" అంటే ... "జిలేబి" గారిలా వ్రాయాలి. మ.హా.

శ్యామలీయం చెప్పారు...

విన్నకోట వారు, "కవిత్వం ఎలా వ్రాయాలి" అంటే ... "జిలేబి" గారిలా వ్రాయాలి. మ.హా. అన్నారు. అటువంటి కవిత్వం వ్రాసే దుర్దశ నాకు ఎన్నడూ కలుగకుండు గాక యని రామచంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను.
గమనిక: బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానుకున్నాను. ఆవిషయంలో అనుమానం అక్కర్లేదు. ఈవ్యాఖ్య మాత్రం ఒక ప్రత్యేకసందర్భంగా గమనించి మన్నించాలి.

Zilebi చెప్పారు...


విన్నకోట వారికి జిలేబి పైన బాణం ఎక్కుపెడితే ఎక్కణ్ణుంచి ప్రతిస్పందన ధమాల్ మని‌ వచ్చునో బాగుగా తెలుసును :)
మహర్దుర్దశా యోగమనగా ఇదే :)

నారదాయ నమః

చీర్స్
జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అలాగే శ్యామలరావు గారూ.
("జిలేబి" గారిలా వ్రాయాలని నేనన్నది సరదాకి లెండి)

Zilebi చెప్పారు...


కామింట్లను వేయనయా
మామి జిలేబి కవితల్ సుమా లాగెను సా
మీ మానవలోకములో
రాముని యానగ పలికితి రానిక మళ్ళీ :)


*****

Zilebi చెప్పారు...అటువంటి దుర్దశ వలద
య! టపటప కపిత్వముల్ భయానక భీభ
త్స టముకు టమారపు రభస
లు టపేళా బాదుళ్ళగు పలుకులు వలదయా :)


జిలేబి

Zilebi చెప్పారు...తమ్ముళ్ళూ ! రండర్రా
ఝామ్మని మన బులుసువారు సదనము లోనన్
కమ్మని కందము లననుది
నమ్మును వ్రాయంగ మరి వినతి తెలిపెదమోయ్ :)


జిలేబి"

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఏతావత్ , కవిత్వము జిలేబీయమై యుండవలెనని
పెద్దలు తీర్మానం చేసిన దరిమిలా , శ్రీ బులుసువారి
యనుమతితో , శ్రీ శ్యామలరావుగారికి నచ్చినా _ నచ్చకపోయినా , నరసింహరావుగారికి నమోవాకములు
చెల్లిస్తూ శ్రీమాన్ జిలేబీ వారికి ,వారి వీరాభిమానియైన నేను సబహుమానముగా కీర్తించుకొన్న కొండొక
దురద కందము .

కందాక్షి ! కంద దురదజ !
కందామృత బిందు కలశ ! కందాక్రందా !
కందా కందుక క్రీడా
నందా బృందా ! జిలేబి ! నత శత మమ్మా !

Zilebi చెప్పారు...


లక్కాకులవారి పద్యము మనోహరముగా వున్నది. అభినందనలు :)జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అవును, పద్యం బాగుంది.
'కంద' దళాయతాక్షి ... అంటే ఎలా ఉంటుంది రాజారావు మాస్టారూ (original ముత్తుస్వామి దీక్షితార్ గారి "కంజదళాయతాక్షి ") ? కానీ ఎలా ... అక్షి యా, అక్షుడా మనకు తెలియదు కదా?

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

పెద్దలు నరసింహరావు గారు మన్నించాలి .వారి
లీలావిశేషాలి దెలియ నేనెంత ? ఆ ఆనుపానులు పెద్దలు శ్రీశర్మగారికొకకొంత కరతలామలకమై యుండ
నోపు . విచారించగలరు .

మందస్మితలోచనములు
చిందించుచు చిద్విలాస జిలిబిలు లొలుకన్
నందింతురుగాని , బుధులు
స్పందించరు తారు మగల ? భామల ? తెలియన్ .

అజ్ఞాత చెప్పారు...

విన్నకోట వారు, "కవిత్వం ఎలా వ్రాయాలి" అంటే ... "జిలేబి" గారిలా వ్రాయాలి. మ.హా. అన్నారు. అటువంటి కవిత్వం వ్రాసే దుర్దశ నాకు ఎన్నడూ కలుగకుండు గాక యని రామచంద్రస్వామిని ప్రార్థిస్తున్నాను.
గమనిక: బ్లాగుల్లో వ్యాఖ్యలు వ్రాయటం మానుకున్నాను. ఆవిషయంలో అనుమానం అక్కర్లేదు. ఈవ్యాఖ్య మాత్రం ఒక ప్రత్యేకసందర్భంగా గమనించి మన్నించాలి.

madhyalo veeru yela vacharu? vnr garu, meeremanna virinuddesinchi gani salaha ichara, jilebi vale vrayavalenani? asalu mi banam virikela velli guchukundi annadi nakardham kani prashna? burra pagilipoundi, somebody please help.vri akrandanaku, avesaniki karanam teliste chaduvarulaku oka clarity vastundi.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి. ..... ధన్యవాదాలు. మీరు జిలేబి గారి అభిమానులని తెలుసు. కానీ వీరాభిమానులని (సరదాగానే వ్రాసినా) ఇప్పుడు తెలిసింది. ..... మహా
(ఈ జవాబు కూడా సరదాగానే వ్రాసాను. ...... మహా)

శ్యామలీయం గారికి. ..... ధన్యవాదాలు. ఈ మీ వ్యాఖ్య పబ్లిష్ చేసే ముందు ఒక నిముషం ఆలోచించిన మాట వాస్తవం. సాధారణంగా ఇతరుల మీద వ్యాఖ్య నా బ్లాగులో పబ్లిష్ చెయ్యను. కానీ మీరంటే నాకు అభిమానం, గౌరవం, పండితులని, రామ భక్తులని. ఇటువంటి వ్యాఖ్య మీ వద్దనుండి నా బ్లాగులో నేను ఊహించలేదు. (ఆశించలేదు).
మీ మనసుకి కష్టం కలిగితే క్షమించండి. ........... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ...... ధన్యవాదాలు. నాకు తెలియనిది ఏదో జరిగిందని అర్ధం అవుతోంది.
మీ పద్యాలు బాగున్నాయి. అందులో ఒక చోట బులుసువారు అన్నది పూర్తిగా అర్ధం అయింది. కందాలు, ఆవె, తేగీ లు వ్రాసినా స్వాగతం. .......... మహా

వెంకట రాజారావు లక్కాకుల గారికి. ..... ధన్యవాదాలు. పద్యం బాగుంది. ‘కందాక్రందా !’ ఇది పురుష శబ్దమా ? లేక ఇక్కడ లింగ బేధం ఉండదా? మొదట్లో కందాక్షి అన్నారు గదా. ......... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి. ........ ధన్యవాదాలు. కందాక్షి అన్న తరువాత ‘కంద' దళాయతాక్షి అనడంలో అభ్యంతరం ఏముంటుంది? గణాలు, మిగతా నియమాలు కుదిరితే. మీ భావమేమో ఆ తిరుమలేశునికే తెలియాలి. .......... మహా

వెంకట రాజారావు లక్కాకుల గారికి. ..... ధన్యవాదాలు. పద్యం బాగుంది. బ్లాగుల్లో ఎవరు ఏ పేరుతో సంచరిస్తున్నారో తెలుసుకోవడం కష్టమే. ........... మహా

అనానిమస్ గారికి. ....... ధన్యవాదాలు. ఏదో జరిగింది అని అర్ధం అవుతోంది గదా. తెలుసుకొని మనం చేసేది ఏమిలేదు. ........ మహా

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

విబుధులను వొగుడు నప్పుడు
మదికిన్ స్త్రీపుంసభేద మరయమి తగునం
చొదవెను ఙ్ఞానము , పద్యము
పదపడి యెద వీడి పొలిచె భాసుర మగుచున్ .

Jai Gottimukkala చెప్పారు...

@బులుసు సుబ్రహ్మణ్యం:

దాశరధి సినారె ఒకరిమీద ఒకరు అనేకానేక వ్యంగ్యాస్త్రాలు & పరుష వాఖ్యలు వేసుకున్నారని (అఫ్కోర్స్ కవితాబద్దంగానే లెండి) అంటారు. సినారెకు సరిగ్గా రాయడం రాదనీ & తన "పాట"కారితనంతో ఎదిగాడని దాశరధి ఆక్షేపిస్తే సినారె ఏకంగా bodyshaming కు (అప్పట్లో ఆ పదం వాడుకలో లేదు, ఇది వేరే విషయం) దిగి దాశరధిని "పొట్టి కవీ" అని సంబోధిస్తూ రవిక రాసారు.

శ్రీశ్రీ సొంత అన్న నారాయణబాబుతో సహా తన సమకాలీనులను అందరినీ ఎప్పుడో ఒకప్పుడు ఎదో ఒకటి అన్నారని, వాళ్లలో కొందరు తక్కువ తినకుండా తగు రిటార్టులు ఇచ్చారని కూడా అంటారు. తాన్సేన్ బైజు బావరాల మధ్య కూడా ఇదే తరహా తూటాలు పేలాయంట.

రాబర్ట్ బ్రౌనింగ్ వర్డ్సువర్థ్ గురించి Just for a handful of silver he left us రాసారు.

అవన్నీ పెద్దల నడుమ వ్యవహారాలు. అదేదో సినిమాలో షారూఖ్ ఖాన్ మూసలో "బడే బడే లోగోం మే ఐసే చోటే చోటే బాతే హోతే హీ రహతే హై సెనోర్" అనుకోవడం చిన్నవాళ్ళ వంతు.

Jai Gottimukkala చెప్పారు...

Correction in my comment, sorry for the mix-up: Jai

దాశరధిని "పొట్టి కవీ" అని సంబోధిస్తూ *తవిక* రాసారు

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బులుసు వారు,
// "కందాక్షి అన్న తరువాత ‘కంద' దళాయతాక్షి అనడంలో అభ్యంతరం ఏముంటుంది? గణాలు, మిగతా నియమాలు కుదిరితే" //

ఇదేం క్వశ్చన్రా వెంకటేశా (a la YVR of "అంతరంగాలు" బ్లాగ్ ) !🙂 ... మహా ( jk 🙂)
కంద గడ్డ - కంద ఆకు. అదీ తేడా అని నా భావం ..... మహా 🙂

(సరదాకి 🙂)

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

అమ్మో ! అమ్మో ! అమ్మో !
అమ్మను ఆడేసుకొనుటె ! అమ్మా ! వినుమా !
ఇమ్ముగ కందాక్షి యనుచు
కమ్మగ కందము రచించు ఘనులని యంటిన్ .

నరసన్న దీని నటు నిటు
గరగ విరచి కంద గడ్డ కందాకనుచున్
పొరి పొరి తమ కన్నుగవకు
కర మరుదగు పోలిక లిడి కలవర పరచెన్ .

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

😀😀

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వెంకట రాజారావు లక్కాకుల గారికి. ..... ధన్యవాదాలు. ఎప్పటిలాగానే పద్యం బాగుంది. మీ భావం అర్ధం అయింది. ........... మహా


జై గొట్టిముక్కల గారికి. ........ ధన్యవాదాలు. మా బ్లాగుకి స్వాగతం.

దిగ్గజాలు సమకాలీనులైనప్పుడు ఒకరి మీద ఒకరు చెణుకులు విసురుకోవడం అన్ని రంగాలలోనూ ఉంది. సాహితిరంగంలోనే కాదు కళా, వైజ్ఞానిక, రాజకీయ, ఇతర రంగాలలోనూ చాలా కధలు విన్నాము. వ్యంగ్య చెణుకులు ప్రాచుర్యం పొందినంతగా వారు ఒకరినొకరు పొగిడిన సందర్భాలు అంతగా గుర్తుకు రావు.
ఇవన్నీ సరదాగానే అన్నవి. ఒకరంటే ఒకరికి గౌరవం ఉంటుంది.
ఒక్కొక్క చోట సూటిగా కష్టం కలిగించేటట్టు కూడా అని ఉండవచ్చు.

మీరు ఉదహరించినట్టు చిన్నవాళ్ళం మనకెందుకు పెద్దవాళ్ళ వ్యవహరాలు. ......... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహారావు గారికి. ..... ధన్యవాదాలు. లక్కాకుల వారు, కందాక్షి, కందదురదజ, కందాక్రందా అని చివరగా నత శత మమ్మా అన్నారు కదా. అది చదివి ముదావహులై జిలేబి గారు పద్యం మనోహరంగా ఉంది అని మెచ్చుకున్నారు.

కందాక్షి కన్నా కంద దళాయతాక్షి అంటే బాగుంటుందేమో నని మీరు దాన్ని సాగదీసారు.
అంతటితో ఆగారా? అక్షియా అక్షుడా అనే సందేహం లేవదీసారు.
మీ అసలు భావమేమో నాకు తెలియలేదు అని నేను అన్నాను.

జవాబుగా మీరు అచ్చ తెలుగులో కంద గడ్డా కందాకు అని సెలవిచ్చారు.

మీరు మహా చతురులు సుమా. ........... మహా
(సరదాగానే. మీతో చనువు కొద్దీ) . ........ ఇంకో మహా


వెంకట రాజారావు లక్కాకుల గారికి. ..... ధన్యవాదాలు. మీరు జిలేబి గారికి కంద పద్యం మీద మమకారం గూర్చి అన్నారని అర్ధం అయింది.

VNR గారు ఈ మధ్యన నారద నామం జపిస్తున్నారని అనుమానం కలుగుతోంది. ............ మహా

YVR's అం'తరంగం' చెప్పారు...

//ఇదేం క్వశ్చన్రా వెంకటేశా (a la YVR of "అంతరంగాలు" బ్లాగ్ ) !🙂 ... మహా ( jk 🙂)
కంద గడ్డ - కంద ఆకు. అదీ తేడా అని నా భావం ..... మహా 🙂//

వీఎన్నార్ సార్, కంజదళం పువ్వు రేకు, కందదళం ఆకూ కదా!! ఇంకా ఏదో డీపర్ మీనింగ్ వుందేమో 🤔

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బులుసు వారూ,
// "VNR గారు ఈ మధ్యన నారద నామం జపిస్తున్నారని అనుమానం కలుగుతోంది. ............ మహా"//

"జిలేబి" గారి సావాసదోషం సర్ 😀🙏.విన్నకోట నరసింహా రావు చెప్పారు...

అందుకే నేను కందదళం అనే అన్నాను కదండీ YVR గారు 🙂.

Zilebi చెప్పారు...


ఇక్కడ జిలేబి పైన ఏదో సూక్షి జరుగుతోంది :) మా వైవీ యార్ గారు కూడా ఇవ్వాళ్టి బర్డు ఫోటోలను పట్టటం‌ వదిలేసి ఇక్కడ కామింట్లాటకు వచ్చేసేరు :) నాకు వెంటనే తెలియాలె యేమి ఈ సూక్షి అని :). ఆయ్జిలేబి

Zilebi చెప్పారు...


కందదళమ్మహహొ జిలే
బందముగ వెలసిలె భువిని భర్పూర్గా! యీ
విందుకు రారండీ మీ
డెందంబానందమున ఫెడేల్మని తూగన్ :)


జిలేబి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

YVR గారికి . ..... ధన్యవాదాలు. కంద దళం, కంద లలో లోతైన అర్ధాలు ఏవి లేవనే అనుకుంటున్నాను. జిలేబి గారు ఏదో సూక్షి అంటున్నారు. VNR గారు ఏమంటారో మరి. ......... మహా

జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. ఏదో సూక్షి అంటున్నారు మీరు. అంటే అర్ధం కూడా తెలియదు నాకు. ...... మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

"సూక్షి" అంటే అర్థం నాకూ తెలియదు బులుసు వారూ 🙄🙂.