నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా ?

నా జన్మకి ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగం లేదేమో మామయ్యా అని బాధపడ్డాడు మా మేనల్లుడు.
 
ఏమైంది నాయనా? ఏమా కధా అని అడిగింది ప్రభావతి.
ఒకమ్మాయిని నేను చాలా ఘాఢంగా ప్రేమించాను అత్తయ్యా అని చెప్పేడు వాడు.
ఎంత గాఢంగా ప్రేమించినా ఘాఢంగా అని వత్తి మరీ పలకఖ్ఖర్లేదు  అంది ప్రభావతి .
ఈ తెలుగు మాష్టారు తో 20 ఏళ్లగా ఎలా సంసారం చేస్తున్నావు మామయ్యా అని జాలి పడ్డాడు వాడు. 
విధి ఆడిన వింత నాటకం అని నేనో విషాద నవ్వు నవ్వాను.
ఇంతకీ ఎవరిని ప్రేమించావు, తరువాత ఏమైంది వివరింపుమా నీ కధా అని పాడింది  ప్రభావతి. 

ఆ అమ్మాయి మా ఆఫీసులో జాయిన్ అయ్యిన రోజునుంచే నేను ప్రేమించడం మొదలు పెట్టేను. Love at first site అనుకుంటాను  అన్నాడు . 
Site కాదురా sight  అన్నాను నేను. 
హే భగవాన్ తెలుగు మాష్టారిని, ఇంగ్లీష్ మాష్టారుని ఇలా పడేసావేమీ మా ఇంట్లో అని విలపించాడు మా మేనల్లుడు. 
సరే అసలు సంగతి అఘోరించు అన్నాను.
నాది LFS అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కదా అని  (ఎందుకైనా మంచిదని ఇంగ్లిష్,  తెలుగులో చెప్పేడు .) నేను ఆవిడను ఫాలో అవ్వడం మొదలు పెట్టాను. కాంటీన్ కి, బస్ స్టాండ్ కి, ఆ తరువాత వాళ్ళ ఇంటి దాకా నడిచి.
 
నీ బైకు ఏమైంది  అని అడిగింది మా ఆవిడ ప్రభావతి. 
త్యాగం,  అత్తయ్యా,  త్యాగం. ఆమె అంత కష్టపడి ఆఫీసు కి వస్తుంటే నేను సుఖంగా బైకు మీద ఎలా రాగలను?  ఆ విధం గా ఒక పది రోజులు కష్టపడిన తరువాత ఆమె అడిగింది నన్ను 

“మీరు నా వెనకాల ఎందుకు పడుతున్నారు”  అని.   ఆవిడ అడిగిన ప్రశ్న ఒక కొచ్చెను మార్కు, ఆవిడ ముఖం లో ఒక కొచ్చెను మార్కు అయితే  ఇంకో కొచ్చెను మార్కు ఆవిడ చేతిలో కూడా వెరసి మూడు కొచ్చెను మార్కులు  కనిపించగానే నాకు కంగారు పుట్టింది. ఆయనప్పటికి కూడా ధైర్యం గా చెప్పేశాను.
హిహిహి,  మిమ్మలని చూడాలనిపిస్తుందండి. మీతోటి మాట్లాడాలనిపిస్తుందండి. మీరో చెంప దెబ్బ కొట్టినా ఫరవా లేదనిపిస్తోందండి.
అంటే చెంప దెబ్బలు తినడం లో అనుభవం ఉందా  అని నవ్వింది. 
లేదండీ. స్కూల్లో కూడా మా మాష్టార్లు ఎప్పుడు కొట్టలేదండీ. నేను చాలా బుద్ధిమంతుడ నండి. మిమ్మల్ని, మీ నవ్వుని చూసిం తరువాత ఇలా చెడిపోయానండి అని నిజం ఒప్పేసుకున్నాను. అప్పుడు ఆమె ఘట్టిగా నవ్వింది. ఆమె నవ్వింది కదా అని నేను కూడా విజృంభించి మళ్ళీ నవ్వాను.
మీరు నాకు నచ్చితే నేను కూడా చెడిపోతానండి లేకపోతే మీరు నన్ను ఫాలో అవడం మానేయ్యాలి  అంది.  

ఆ తరువాత సెల్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాము. కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టాము. నేను బీగంపేట లో బయల్దేరి అమీర్ పేట్ బస్ స్టాండ్ లో ఆమెను ఎక్కించుకొని పంజా గుట్ట మీదుగా  బీగం పేట లో మా ఆఫీసుకి వచ్చేవాడిని.  సినిమాలు,  పోనీ కదా పాపం అని హోటళ్ళు, పార్కు లు కూడా  చెడ తిరిగాము.  అప్పుడప్పుడు బిల్లులు ఆవిడ కూడా కట్టేది. చిన్నచిన్న బహుమతులు కూడా ఇచ్చిపుచ్చుకున్నాము. 

ఈ మధ్యలో ఎప్పుడో ఐ  లవ్యూ అంటే ఐ టూ లవ్యూ అనుకోవడం మొదలు పెట్టేము. 
ఒక ఏడాది తరువాత,   ఒక శుభ ముహూర్తాన్న,  పెళ్లి చేసుకుంటే ఈ తిరుగుళ్లు తప్పుతాయేమో కదా,  ఇంట్లో కూర్చుని ప్రేమించుకోవచ్చు అనుకున్నాము.
మీరు వచ్చి మా నాన్న గారితో మాట్లాడండి. ఆతరువాత మా నాన్నగారు మీ వాళ్ళతో మాట్లాడుతారు  అని సలహా  చెప్పింది.

నేను ధైర్యం చేసి వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్ళాను. 

మీ అమ్మాయంటే నాకెంతో ఇష్టం. మీ అమ్మాయికి కూడా నేనంటే బోల్డు లవ్వు , మమ్మలని ఆశీర్వదించి మా ప్రేమ ని సఫలం చేయండి  అని వేడుకున్నాను. 

అంతా సావధానం గా విని  నీ పేరేమిటి అని అడిగారు. 

నేను చెప్పాను. 

అప్పుడు ఆయన నాకేసి చూసి  ఠాఠ్ కుదరదు.  నేనొప్పుకోను  అన్నాడు.
70 వేలు నెలకి సంపాదిస్తున్నాను.  నాకేమిటి తక్కువ  అని అడిగాను.
నీ పేరే నీ కెక్కువ,  నో మోర్ చర్చలు  అంటూ లేచి వెళ్లిపోయాడు.
మళ్ళీ ఇంకో మాటు కలసి మాట్లాడుదామని ప్రయత్నించాను కానీ ఆయన మాట్లాడటానికి ఇష్ట పడలేదు. ఆమెకి కూడా కారణం చెప్పలేదు కానీ  ఆ కుర్రాడిని  ఇక మీద కలుసుకో వద్దు అని కూడా వార్నింగ్ ఇచ్చాడుట ఆమెకి.

మామయ్యా ఇప్పుడు ఏదొవిధంగా ఆయనకి నచ్చ చెప్పి మా ప్రేమను సఫలీకృతం చేయాల్సిన బాధ్యత నీ భుజ స్కంధాల మీద పెడుతున్నాను. సేవ్ మీ అండ్ మై లవ్ అని దీనంగా ఏడ్చాడు. 
నేను జాలి పడి ఆ గురుతర బాధ్యతను నెత్తికెక్కించుకున్నాను. 

ఇద్దరిదీ ఒకటే కులం, గోత్రాలు కూడా సరిపోతాయి అని నిర్ధారించుకున్నాను.  అంతస్థులలో మనది పెద్దది అయినా  ఫరవాలేదు అనుకున్నాను. ఎందుకైనా మంచిదని ఆ అమ్మాయి తో కూడా మాట్లాడాను. 

ఐయ్యి లవ్వు హిమ్ము  అని చెప్పింది. 

అన్ని పదాలు అన్ని  మాట్లు ఎందుకు వత్తుతున్నావు  అని అడిగాను.  

నేను తెలుగు మీడియం లో గ్రాడ్యుయేషన్ చేశానండి  అని చెప్పింది.   

శుభం అనుకొని ప్రభావతీ సమేతుడనై  ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్లాము ఆయనతోటి మాట్లాడడానికి. అప్పుడు ఇంట్లో ఇంకెవరూ లేరు.  

వెళ్ళిన పని విశదీకరించి, ఇద్దరు ప్రేమికులను కలిపే గురుతర బాధ్యత ఆయనకు కూడా ఉందని ఉద్భోదించాను.

ఆయన మళ్ళీ ఠాఠ్  అన్నాడు.

నేను ఓపికగా  కుర్రాడు =SWE, 70 వేలు, బాబు=25 లక్షలు + 5 ఎకరాలు + ఫించను +plotలు +flatలు,  తల్లి = 20  కాసుల బంగారం + 3  ఎకరాల స్త్రీ ధనం + 4 బీరువాల పట్టు అండ్ నేత చీరలు  ల  ఓన్లీ సన్ను,  కులం, గోత్రం అన్నీ సరిగ్గానే ఉన్నాయి  అని చెప్పాను.
ఆయన ఠాఠ్ ఠాఠ్ అని మళ్ళీ అన్నాడు. 
నేను ఇంకా ఓపిక గా కుర్రాడు బుద్ధిమంతుడు, చీమ కి కూడా నో డూయింగ్ హాని గట్రా గట్రా అంటూ చెప్పుకొచ్చాను. 

చివరికి,  ఎందుకు కాదంటున్నారో చెప్పండి అని అడిగాను.  

ఆయన hmm అన్నాడు హుహుహుమ్  అని కూడా అని,  

ప్రతీ పేరు లోనూ ఒక శబ్దం ఉంటుంది. ప్రతీ శబ్దానికి ఒక నాదం ఉంటుంది. ప్రతీ నాదానికి ఒక రాగం ఉంటుంది.  ప్రతీ రాగానికి స్వర స్థానాలు ఉంటాయి. ప్రతీ స్వరానికి గమకాలు ఉంటాయి. ప్రతీ గమకానికి శృతి ఉంటుంది. అంత గొప్ప శృతి పక్కన భజ గోవిందం బాగుండదు,  అస్సలు బాగుండదు.  శృతి భజగోవిందం అని పిలవాలంటే చండాలం గా ఉంటుంది. వాళ్ళ పేర్లు నప్పవు అందుకే నా కంగీకారం కాదు కాదు కాదు అని ముమ్మారు వక్కాణించారు .
అంటే మా వాడి పేరు నచ్చక వద్దంటున్నారా అని ప్రభావతి అడిగింది.
రామాయణం కొంత విన్నా రాముడికి సీత ఏమౌతుందో తెలిసిపోతుంది అని గంభీరం గా అన్నారు ఆయన. 
దీనికి అర్ధం అడుగుదామని ఆనుకొని,  మళ్ళీ ఆదితాళం దగ్గర మొదలు పెట్టి నవరంధ్రాల లోంచి రక్తం కార్పించేస్తాడేమో నని భయం వేసి ఆగిపోయాను.
మా వాడి పేరు మార్పిస్తే మీకు అభ్యంతరం ఉండదా అని మళ్ళీ అడిగింది ప్రభావతి. 
అవును, మార్పించేదేదో శృతి లయలు, శృతి రాగం, శృతి తాళం లాగా కలిసిపోయేటట్టు చూడండి అని సలహా పడేశాడు . 

సమస్య తెలిసింది కాబట్టి చక్కదిద్దే పని చేయవచ్చు అంది ప్రభావతి. 

నేనో నవ్వు నవ్వాను తోడికోడళ్ళు లో ఎస్.వి. ఆర్ లా అంటే అన్నీ తెలిసినా ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో నవ్వే నవ్వు. ఆ పేరు వెనక్కాల కధ వింటే నువ్వు అంతా తేలికగా తీసెయ్యవు అన్నాను. 

ఏమా కధ అంది.

సరిగ్గా 27 ఏళ్ల క్రితం అంటే మన పెళ్ళికి 7 ఏళ్ల క్రితం అంటూ చెప్పబోయాను. 
మా మేనల్లుడు బ్రేక్ వేసేడు. మీ పెళ్ళికి 7 ఏళ్ల క్రితం అని ఎందుకు అన్నావు అని అడిగాడు. 

నేనునిట్టూర్చి విశదీకరించాను వాడికి. మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని  మా అత్తగారిని  అడిగితే ఆమె సమాధానం ఏమిటో తెలుసా?  మా ప్రభావతి పుట్టడానికి రెండేళ్ల ముందు అని జవాబు ఇస్తుంది. బంగ్లాదేశ్ ఎప్పుడు వచ్చింది అంటే మా ప్రభావతి పెళ్లి అయిన రెండేళ్ళకి అని చెబుతుంది. మీ అత్తయ్యకి అర్ధం అవాలంటే అలాగే చెప్పాలి అన్నాను.  

మా పెళ్ళికి 7 ఏళ్ల క్రితం ఒక సాయం కాలం కానురాగ్రహారం లో ఒక ఇంటి అరుగు మీద మా బావ  హడావడిగా తిరుగుతున్నాడు అటు ఇటు. నేను వీధిలో నుంచుని సిగరెట్టు కాల్చుకుంటున్నాను. పూజ గదిలో మా నాన్న జపం చేసుకుంటున్నాడు. 
నువ్వు ఇప్పుడే బయట పడుదామా ఇంకొంచెం సేపు ఆగి వద్దామా అని మా అక్కయ్య కడుపులో గింజుకుంటున్నావు. 
దొంగ సచ్చినోడు నాకు కడుపు చేసి తను హాయిగా కూర్చున్నాడు.  మళ్ళీ మాటు  నీ కొడుకునే   కడుపు చేయించుకో మనవే అత్తా  అంటూ మా అక్కయ్య , అత్తగారు అయిన మేనత్త ని తిడుతూ  అవస్థ పడుతోంది.

ఇంతలో ఇంటి పక్క గుడిలో రికార్డ్స్ పెట్టారు. సుబ్బులక్ష్మి గారు శ్రావ్యం గా పాడుతున్నారు. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ.  ఆ క్షణం లో నువ్వు కేర్ మన్నావు.

నువ్వు కేర్ మన్న క్షణం లో సుబ్బు లక్ష్మి,  భజగోవిందం భజగోవిందం కి సరిగ్గా మధ్యలో ఉంది.

ఎవరో మొగ పిల్లాడు అని అరిచారు. 
నువ్వు కేర్ మనడం,  మీ నాన్న నన్ను అరిచి పిలిచి వీడి పేరు భజగోవిందం అనే పెడతాను రా ప్రద్యుమ్నా అన్నాడు. 
ఆ తరువాత ఎవరు ఎంత చెప్పినా వినలేదు. ఆ పేరే పెట్టాడు. 

నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు. లేకపోతే నీ  పేరు మూఢమతి అయి ఉండేది అని చెప్పేను.
                           
ఈ పేరు వెనక ఇంత పెద్ద కధ ఉంది. మార్చాలంటే మీ నాన్న ఒప్పు కోడేమో రా అని నా సందేహం వెలిబుచ్చాను. భజ గోవిందం  నే ఏదో విధం గా మార్చి శృతి తో కలిసేటట్టు ఆలోచించండి  అని చెప్పాను. 
శృతి గోవిందా,   అన్నాడు మేనల్లుడు.  

చండాలం గా ఉంది అంది ప్రభావతి. 
శృతి భజం అన్నా బాగుండదు. 
ఆలోచించి,  ఆలోచించి శృతి విందం అంటే బాగానే ఉంటుందేమో నంది నా భార్యామణి.  

శృతి బి.జి విందం అంటే ఫరవాలేదు అనిపించింది.
శృతి బి.జి. దం అంటే ఒప్పుకుంటాను  అన్నాడు శృతి వాళ్ళ నాన్న గారు వీర వెంకట భీమారావు గారు టెలిఫోన్ చేస్తే. 
ఆయన మాట కాదంటే మళ్ళీ ఏమి చిక్కులు వస్తాయో యని యెస్ అనేశాము.

ఇప్పుడు మా బావ గారు శ్రీ వ్యాఘ్రేశ్వర రావు గారిని ఒప్పించాలి అంటే ఎంత కష్టమో అని భయపడ్డాను.  

కానీ మా వాడు,  వాళ్ళ అమ్మకాళ్లమీద పడి, ఏడ్చి, గోల పెట్టి, ఈ అమ్మాయి కాకపోతే అసలు పెళ్లి చేసుకోను అని బెదిరించడం వల్ల, నేను శృతి తో మా అక్కయ్య ను మాట్లాడేటట్టు చేయడం వల్ల, అమ్మాయి నచ్చి మా అక్క ఒప్పుకోవడం వల్లా, మా అక్కా , మేనల్లుడు నిరాహార దీక్ష ప్రకటించడం  వల్లా,  పెళ్ళైన 10 ఏళ్లకి పుట్టిన వాడు, ఏకైక సంతానం అవటం వల్లా    మా బావ అతికష్టం మీద ఒప్పుకున్నాడు.  

కానీ,  మన పెళ్లి శుభలేఖల్లో భజగోవిందం అనే వేయించే షరతు మీద.

లాంఛనంగా ఇరువైపు వారిని పెళ్లి చూపుల లో కూచోపెట్టి మిగతా విషయాలు అంటే పెళ్లి పద్ధతులు, ఆచార వ్యవహారాలు,  ముద్దుముచ్చట్ల తతంగాలు కూడా మళ్ళీ నేను జోర్హట్ తిరిగి వెళ్ళేలోగానే మాట్లాడుకుందామని మామేనల్లుడు పట్టు బట్టడం వల్ల మేము జోర్హట్ బయల్దేరడానికి రెండు రోజుల ముందు ఈ కార్య క్రమం పెట్టేరు భీమారావు గారింట్లో. మా కుటుంబం, మా బావ గారి కుటుంబం కలసి వెళ్లాము. భీమారావు గారి అబ్బాయి కుటుంబం కూడా వచ్చారు.

కాబోయే పెళ్లికూతురు వచ్చి కూచుంది. మా బావ  శృతి ని చూసి చిరు నవ్వు నవ్వాడు. మా బావకు కూడా అమ్మాయి నచ్చిందని  నాకు అర్ధం అయింది. 

ఏదో మాట్లాడాలి కాబట్టి మా బావ అడిగాడు  ఆ అమ్మాయిని,  నీ పేరేమిటమ్మా  అని. 
సురుతి ఆండీ అంది. 
సరిగ్గా వినలేదేమో ననుకొని మళ్ళీ చెప్పమ్మా అని అడిగాడు  శ్రీ వ్యాఘ్రేశ్వర రావు గారు. 
సుర్ర్ తి అండి అంది మళ్ళీ. 
మా బావ మొహంలో ఎరుపు రంగు వస్తోంది. 
ఇంతలో  శ్రీమతి భీమారావు కల్పించుకొని మా అమ్మాయికి  సరిగ్గా పలకదండీ. శృతి ని అల్లాగే పలుకుతుంది  అని వివరణ ఇచ్చింది.

నా గుండెల్లో రాయి  పడింది. మా మేనల్లుడి మొహంలో ఆంధోళన  కొట్టొచ్చినట్టు కనిపించింది. అనుకోకుండా కొత్త సమస్య వచ్చింది.
మా బావ అడిగాడు  శృతి ని,   నా పేరు తెలుసునా అని.  

తెలుసునండి , వయాగ్రేసర రావు గారు అంది.
  
శ్రీమతి భీమారావు మళ్ళీ ఏదో చెప్పబోయింది.
   
మా బావ మొహంలో నెత్తురు గడ్డ కట్టేసింది. మా అక్క మొహంలో నెత్తురు చుక్క కనిపించలేదు.

ఏమిటీ భీమారావు గారూ?  మీ అమ్మాయికి  తన పేరు పలకడం రాదా ? మామ గారి పేరు ఖూనీ చేస్తుందా? ఇంకానయం వయాగ్రా ఇస్వార్ రావు అనలేదు అందుకు నేను సంతోషించాలా? మీ ఆమ్మాయి పేరు పక్కన భజగోవిందం అంటే మీకు మంటా ? బుద్ధి ఉండే ఇంత అల్లరి చేశారా మీరు ?  లెండి లెండి ఇంకేమిటి ఇక్కడ. పదండి ఇంటికి అని లేచాడు. 

మరో మార్గం లేక మా బావ కోపం తెలిసిన వాళ్లవటం వల్ల,  మేము లేచాము. 

దీనం గా మొహం పెట్టి భజగోవిందం  ఇంకా  అల్లాగే కూర్చున్నాడు. 

లేరా ఏం ఇక్కడే ఉంటావా ? అయితే  నీ ఖర్మ,  మేమెవరం  లేవనుకో అంటూ బయటకు అడుగు వేశాడు మా బావ.   

అప్పుడు నేను ఊహించనిది అంటే ఆ పరిస్థితుల్లో ఊహించలేనిది జరిగింది. 

శృతి లేచి వెళ్ళి మా బావ కాళ్ళ మీద పడింది. 
రెండు కాళ్ళు పట్టుకొని, క్షమించండి మామయ్య గారూ. 'రు' పలకడం నేర్చుకుంటాను.  మీ పేరు కూడా సరిగ్గా పలకడం నేర్చుకుంటాను. అంటూ ఏడ్చేసింది.
శ్రీమతి భీమారావు గారు వచ్చి మా బావ చేతులు పట్టుకొని క్షమించండి అన్నయ్య గారూ మా ఆయన  తల తిక్క వల్ల,  తెలివి తక్కువ తనం వల్ల  ఏదో అన్నాడు.  మాకు ఆ విషయం తెలియదు నిన్నటిదాకా,  మీ అబ్బాయి మా అమ్మాయికి చెప్పేదాకా.  తెలిసినప్పటి నుంచి మీ అందరి గొప్పమనసులకి దండం పెట్టుకుంటున్నాము.  అదే మనసు తో అమ్మాయిని ఆశీర్వదించండి,  అని ఆవిడ కూడా ఆయన కాళ్ళ మీద పడ బోయింది.

కాబోయే కోడలి వినయ విధేయతలకి  కరిగిపోయిన  మా అక్క,  ఆవిడను పట్టుకొని,  రండి వదిన గారూ మనం మన పిల్లల పెళ్లి చేసేద్దాము. మగాళ్లు వచ్చినా రాకపోయినా,  ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా  ఫరవాలేదు అంది.

అప్పుడు  మా బావ,  లేవమ్మా కోడలా,  కాళ్ళు పట్టుకు లాగడమేనా,  ఇంత స్వీట్ నా నోట్లో వేసే ఉద్దేశ్యం లేదా అన్నాడు నవ్వుతూ . 
భీమారావు గారు  వచ్చి,  మా బావ చేతులు పట్టుకొని క్షమించండి. బుద్ధి తక్కువై  వెఱ్ఱి మాటలాడాను  అన్నాడు.
 
మా బావ నవ్వేసి,  పోనీలెండి  ఇప్పుడు మా కందరికి తెలిసి పోయింది గదా వాళ్ళు ఎంత ఘట్టిగా ప్రేమించుకుంటున్నారో అని అన్నాడు.

మేము  జోర్హాట్ కి  రైలు ఎక్కేటప్పుడు మా భజగోవిందం అన్నాడు,  

నాకూ ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగం ఉంది మామయ్యా.  థాంక్యూ అత్తయ్యా మామయ్యా అని.



గమనిక:- ఇది మొదటి మాటు ఆగస్ట్ 10, 2011 న ఈ బ్లాగ్ లో ప్రచురించ బడింది. 

ఇది జనవరి 2, 2012 న ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం లో కూడా ప్రచురించ బడింది.      

42 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

భలేగా రాసారండీ. పిచ్చ నవ్వు వచ్చేసింది. మొత్తానికి శుభం జరిగింది. నేను మళ్ళీ చదవాలి , వుంటాను.

మాలా కుమార్ చెప్పారు...

శుభం :)

Sravya V చెప్పారు...

హ హ బావుదండి సుర్ర్ తి & బి.జి విందం ల ప్రేమాయణం ;)))))

కృష్ణప్రియ చెప్పారు...

ఒక్క క్షణం ముందు పుట్టి ఉంటే... :)))

hilarious!

చాణక్య చెప్పారు...

వయాగ్రేసర రావు.. :D:D:D:D:D:D:D:D

చాలా చాలా చాలా బాగుంది గురువు గారు.

SHANKAR.S చెప్పారు...

గురువు గారూ ఆ అమ్మాయి ప్రభావతి గారిని ఎలా పిలుస్తుందంటారు? :)

వయాగ్రేసర రావు........ఇది కేక. ఇంకా నయం వయాగ్రా ఆసరా రావ్ అనలేదు

రాజేష్ మారం... చెప్పారు...

ఇంత బాగా కామెడీ పండించి... "నవ్వితే నవ్వండి" అంటే ఎలాగండి?
"చచ్చినట్టు నవ్వండి" అనండి... :))

సూపర్...

Ravitheja చెప్పారు...

భోజనం చేసినవెంటనే చదవడంతో
నవ్వి నవ్వి తిన్నది అరిగిపొఇన్ది
మల్లి తినాలి వెళ్లి

రవికిరణ్ పంచాగ్నుల చెప్పారు...

మీ స్టైల్లోనే అదరగొట్టేసారు గురూజీ, మూఢమతి కాబోయి తప్పించుకున్న భజగోవిందం కధని.. :D

Ruth చెప్పారు...

చలా బాగుంది ! ఫ్లాష్ బాక్ బిట్ ఇంకా బాగుంది!
@ Shankar : గురువు గారూ ఆ అమ్మాయి ప్రభావతి గారిని ఎలా పిలుస్తుందంటారు? :)
>> పిన్ని అని పిలున్స్తుంది కదా ?

అజ్ఞాత చెప్పారు...

రిటైర్ ఐపోయాక భజగోవిందం చదువుతూ, టివీలొ వచ్చే వయాగ్రా ఎడ్వర్టైజ్ మెంట్లు చూస్తూంటే ఇంతకంటే మంచి ఆలోచనలు ఎలా వస్తాయ్? అయినా అది అంతా ఏలూరు ప్రభావం లెండి మిమ్మల్ని అని ఏం ప్రయోజనం? రోజూ పొగాకు కంపు గొడౌన్ల చుట్టూ తిరుగుతూ సిగరెట్లు కాల్చుకుంటూంటే ఇలాంటి అవిడియాలే వస్తాయ్. చితక్కొట్టేసారు. ఇంతకీ ఏలూరు ఎలా ఉంది? ఎండలు మండుతున్నాయా? వర్షాకాలం అంతా ఊర్లో ఒక్క రోడ్డూ కనబడదు చూస్కోండి. ఓ సారి భద్రాచలం వెళ్ళిరండి. రాములోరు మీ తిక్క కుదురుస్తారు.

..ఒక్క క్షణం ముందు పుట్టి ఉంటే.... అదుర్స్.

అజ్ఞాత చెప్పారు...

supero...suparu

వేణూశ్రీకాంత్ చెప్పారు...

>>నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు.<<
సూపర్ గురువు గారు :) టపా బాగుంది కొన్ని చోట్ల పెద్దగా నవ్వేసుకున్నాను :)))

హరే కృష్ణ చెప్పారు...

గురూజీ సూపర్ :)))
పేర్లు కేక :)
>>ఆయన ఠాఠ్ ఠాఠ్ అని మళ్ళీ అన్నాడు.
>>ప్రతీ పేరు లోనూ ఒక శబ్దం ఉంటుంది. ప్రతీ శబ్దానికి ఒక నాదం ఉంటుంది. ప్రతీ నాదానికి ఒక రాగం ఉంటుంది. ప్రతీ రాగానికి స్వర స్థానాలు ఉంటాయి. ప్రతీ స్వరానికి గమకాలు ఉంటాయి. ప్రతీ గమకానికి శృతి ఉంటుంది. అంత గొప్ప శృతి పక్కన భజ గోవిందం బాగుండదు,

hahaha :))

కొత్తావకాయ చెప్పారు...

"భజగోవిందం.. భజగోవిందం" అని ఎం.ఎస్. పాడుతూ ఉంటే నా కోతి మనసు కాసేపు కుదురుగా ఉండేది ఇంతకు ముందు. అక్కడికి కూడా పంచెలో లాల్చీ ఇన్ షర్ట్ చేసేసుకొని చేత గొడుగు, లంక పొగాకు చుట్ట పట్టుకొని మీరు తయారయిపోతున్నారు మస్తిష్కంలో. రోజులో మూడు వందల ముఫై సార్లు మిమ్మల్ని తలుచుకుంటే పుణ్యం రాదేమో కానీ సారూ, నవ్వైతే రాక చస్తుందా! జోహార్లు!

పీ.ఎస్. నాకు ఆడపిల్ల పుడితే దానికి మాటలు వచ్చాక నత్తి లేదని కన్ ఫర్మ్ చేసుకున్నాకే పేరు పెడతాను. అంతే.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ అద్దరగొట్టేహారంతే గురూజీ.

వయాగ్రేసరావ్ హ్హహ్హహ్హహ్హహ్హ

MURALI చెప్పారు...

కెవ్వో కెవ్వు. క్షమించాలి బజ్జు బుద్దిపోలేదు.

రసజ్ఞ చెప్పారు...

నవ్వితే నవ్వండి అని కాకుండా పొట్ట చెక్కలు, బల్లలు అయ్యేలా నవ్వండి అని పెట్టండి. చాలా బాగా రాసారండి నవ్వలేక పోతున్నాం.

రాజ్ కుమార్ చెప్పారు...

గురూజీ నవ్వించారు ఎప్పటిలాగానే.... నేను భళ్ళున నవ్వేసిన
లైన్ లు..

ఒక ఏడాది తరువాత, ఒక శుభ ముహూర్తాన్న, పెళ్లి చేసుకుంటే ఈ తిరుగుళ్లు తప్పుతాయేమో కదా, ఇంట్లో కూర్చుని ప్రేమించుకోవచ్చు అనుకున్నాము.>>>

>>వయాగ్రేసర రావు>>>
ఇంకా నయం వయాగ్రా ఆసరా రావ్ అనలేదు>>

నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు. లేకపోతే నీ పేరు మూఢమతి అయి ఉండేది అని చెప్పేను>>>

బోలెడు లైక్స్...& కెవ్వ్స్....

ఇంతకీ ఇది రియల్ స్టోరీ నేనా?? లేకా మీ అధ్బుత సౄష్టా?? ;) ;)

మురళి చెప్పారు...

బాగుందండీ సుబర్ హమనయం గారూ :)) 'ఒక్క క్షణం ఆలస్యంగా పుడితే' మాత్రం బ్రహ్మాండం అసలు...

Unknown చెప్పారు...

ఆవిడ అడిగిన ప్రశ్న ఒక కొచ్చెను మార్కు, ఆవిడ ముఖం లో ఒక కొచ్చెను మార్కు అయితే ఇంకో కొచ్చెను మార్కు ఆవిడ చేతిలో కూడా వెరసి మూడు కొచ్చెను మార్కులు కనిపించగానే నాకు కంగారు పుట్టింది.

నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు

అమ్మో మీ పోస్ట్ లు చదవాలంటే ఏక బిగిన చదవడం కుదరదండి. చదవడం ...నవ్వడం ...చదివింది మర్చిపోవడం మళ్ళి చదవడం ...ఎప్పటికో పూర్తీ అయ్యింది.

kiran చెప్పారు...

హహహహః...:D ....soooopar

చాతకం చెప్పారు...

టపా హెడెర్ చూసి మీపెళ్ళి గురించి అనుకున్నా. కథ బాగుంది. వీళ్ళ పిల్లలకి ఏంపేర్లు పెడతారో?

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

తొలకరి గార్కి,
ధన్యవాదాలు. మళ్ళీ చదివి ఇంకో కామెంటు పెట్టండి. నేను ఇక్కడ వెయిటుంగు.

మాలా గార్కి,
ధన్యవాదాలు.

శ్రావ్య V. గార్కి,
ప్రేమాయణం నచ్చినందుకు ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గార్కి,
ధన్యవాదాలు. మీ పేరు మా శృతి ఎలా పలికి ఉండేదా అని ఆలోచిస్తున్నాను. .. ద.హా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ద చాణక్య గార్కి,
ధన్యవాదాలు. వయాగ్రేసర రావు ఒక్కటే బాగుందా ? .. దహా

శంకర్ గార్కి,
మరోపేరేదైనా అడగండి. నాకు మా ఇంట్లో కూడు కూడా మిగల్చరా మీరు. ధన్యవాదాలు.

రాజేష్ M. గార్కి,
>>> "చచ్చినట్టు నవ్వండి" అనండి... :))
అంటే చంపి నవ్వుతాము అంటారేమో నని భయం. ధన్యవాదాలు.

రవితేజ గార్కి,
నవ్వడం కూడా ఒక వ్యాయామమే నండి. మళ్ళీ, మళ్ళీ భోంచేసి మళ్ళీ , మళ్ళీ నవ్వండి. ధన్యవాదాలు.

హనుమంత రావు చెప్పారు...

అప్పుడెప్పుడో ఆ అస్సాం వాలా మీ సుబరమణ్యం పేరుని సాగదీస్తే ఈ తెలుగింటి ఆడపడచు ఈ విధంగా..మొత్తానికి పేర్ల మీదేకాదు పలకడం పై మంచి పరిశోధన....చాలా బాగుంది..చాలా చాలా బాగుంది.ఎందుకైనా మంచిది మీరు మీ అసలు పేరుతో కాని, వడ్డీ పేరుతో కాని--- విడి విడిగా కాని కలపి కాని కొత్త కాపురం చూడడానికి వెళ్ళే సాహసం చేయవద్దని మీ శ్రేయోభిలాషిగా నా సూచన.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రవికిరణ్ గార్కి,
ఈ టపా మీకెవరికీ నచ్చక పోతే నేనే అయేవాడిని అది (మూఢమతి). ధన్యవాదాలు.

రూత్ గార్కి,
ధన్యవాదాలు, శంకర్ గారికి తెలియక కాదండీ. నాకేదో విధం గా ఒక మొట్టికాయ ఇప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. అంత తేలిక గా దొరుకుతానా .

అనానిమస్ గార్కి,
ధన్యవాదాలు. అవునూ గురువరేణ్యా, మీరు నన్ను తిడుతున్నారా, పొగుడుతున్నారా లేక నిందా స్థుతి చేస్తున్నారా? నాకా అర్హత లేదంటారా లేక దీని భావం మరేదైనా ఉందా?

భద్రాచలం వెళ్లాలంటారా? ఇంకో రెండు కామెంట్లు ఇలా మీరు పెడితే నాకూ, నా బ్లాగుకూ కూడా తిక్క కుదురుతుందేమో? మళ్ళీ ఇంకో మాటు థాంక్యూ.

Rishi చెప్పారు...

>>..ఒక్క క్షణం ముందు పుట్టి ఉంటే....

:)))))))))))))))))))))))))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అనానిమస్ గార్కి,
ధన్యవాదాలు.

వేణూ శ్రీకాంత్ గార్కి,
ధన్యవాదాలు. మీ అందరి నవ్వులే నాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తాయి.

హరే కృష్ణ గార్కి,
ఆ డైలాగు శంకరాభరణం శంకర శాస్త్రి గారి భిక్ష. ధన్యవాదాలు.

కొత్తావకాయ గార్కి,
నా ప్రొఫైల్ లోంచి నేను తీసేసిన వాక్యాలు మీకు ఇంకా గుర్తు ఉన్నాయన్నమాట. నేను జోకర్ గానే గుర్తు వస్తానంటారా. ధన్యవాదాలు.
నాకూ నత్తి లేదు కానీ మా బాసు ఘట్టిగా తిడుతుంటే ఎక్కడాలేని నత్తి వచ్చేసేది నాకు జవాబు ఇవ్వడానికి . .. దహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీనివాస్ పప్పు గార్కి,
ధన్యవాదాలు. మా చిన్నప్పుడు ఆ పేరుతో ఒకాయన ఉండేవారు. నిజం గా. .. దహా

మురళి గార్కి,
ధన్యవాదాలు. కెవ్వు ఎక్కడైనా కేవ్వే . .. దహా

రసజ్ఞ గార్కి,
నవ్వండి నవ్వండి మీ నవ్వులు మాకే ఇవ్వండి. ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గార్కి,
ఒక ఏడాది తిరిగే టప్పటికి అయిన ఖర్చు చూసి ప్రేమించుకోవడం కన్నా పెళ్ళిచేసుకోవడమే ఖర్చు తక్కువ పని అనుకొన్నారన్న మాట. ధన్యవాదాలు.
మనకి రియల్ స్టోరీస్ ఏమి లేవండి. తిన్నామా , పడుక్కొన్నామా మళ్ళీ లేస్తామా అన్నదే రియల్. మిగతావన్నీ కల్పితాలే. .... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మురళి గార్కి,
ధన్యవాదాలు. నా పేరు ఇంత అందంగా కూడా వ్రాయవచ్చునా / పలుక వచ్చునా . .. దహా.

కల్లూరి శైలబాల గార్కి,
చెంప దెబ్బలో చెప్పు దెబ్బలో తినే ధైర్యం ఉంటేనే ప్రేమించాలని మా గురువు గారు చెప్పారండి చిన్నప్పుడు. అదన్నమాటండి చేతిలో కొచ్చెను మార్కు. ధన్యవాదాలు.
చదవడం ముఖ్యమండి కొంచెం టైమ్ తీసుకున్నా. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కిరణ్ గార్కి,
ధన్యవాదాలు.

చాతకం గార్కి,
ధన్యవాదాలు. మీరు చాలా ఫాస్ట్ మాష్టారు. ఇంకా తాంబూలాలేనా పుచ్చుకోలేదు , మీరు సోమలింగం దాకా వెళ్ళిపోయారు. ... దహా

హనుమంత రావు గార్కి,
అల్లాగే మాష్టారూ, మీ సలహా కాదంటానా .
>>>విడి విడిగా కాని కలపి కాని కొత్త కాపురం చూడడానికి......
మరి ప్రభావతి గారు ఏమంటారో కనుక్కోవాలి. ధన్యవాదాలు.

రిషి గార్కి,
ధన్యవాదాలు.

ఆ.సౌమ్య చెప్పారు...

"ఆవిడ అడిగిన ప్రశ్న ఒక కొచ్చెను మార్కు, ఆవిడ ముఖం లో ఒక కొచ్చెను మార్కు అయితే ఇంకో కొచ్చెను మార్కు ఆవిడ చేతిలో కూడా వెరసి మూడు కొచ్చెను మార్కులు కనిపించగానే నాకు కంగారు పుట్టింది."...ఇది మీ మార్కు, పక్కా మర్కు!
శృతి బి.జి. దం, వయాగ్రేసర రావు గారు....ఈ రెందూ బాగా నవ్వించాయి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ. సౌమ్య గార్కి,

నా ట్రేడ్ మార్క్ లు అంటున్నారంటే నేను వ్రాసే విధానం మార్చుకోవాల్సిన సమయం వచ్చిందనుకుంటాను... దహా.
ధన్యవాదాలు.

sai krishna alapati చెప్పారు...

గురువు గారు మీరు మళ్లీ నవ్వించారు

శ్రీధర్. దు చెప్పారు...

సుబ్రహ్మణ్యం మాస్టారు నన్నూ మీ శిష్య గణంలో చేర్చుకోండి, చాల బాగా వ్రాస్తున్నారు. ఆఫీసులో మీ బ్లాగు చదవకూడదు అని నిర్ణయించుకున్నానండి. ఎందుకంటారా!? "నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు. లేకపోతే నీ పేరు మూఢమతి అయి ఉండేది " ఇలాంటివి చదివి భళ్ళున నవ్వొస్తే నన్నోదోలా చూస్తున్నారు అందరూ. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దగ్గు-తుమ్ము కలిపి వచ్చినట్టు నటించి మంచినీళ్ళు తాగవలసి వస్తోంది.

అజ్ఞాత చెప్పారు...

Mee Katha ekkada chuttinaa aa jorhot vellanide katha kanchi ki pdanukuntaanu !!! "Ass am" gnaapakaalu anta twaragaa vadalavu !!

Manchi katha! vinayaka chaviti ki poti ki raasaara ledaa mari bulusu gaaru ?

cheers
zilebi
http://www.varudhini.tk

జేబి - JB చెప్పారు...

సూపర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్!

ముందే చదివినా ఆలస్యంగా స్పందిస్తున్నా :-(

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సాయి కృష్ణ గార్కి,
ధన్యవాదాలు.

శ్రీ గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. శిష్యగణం లో చేర్చుకోవడానికి అభ్యంతరం లేదు. గురుదక్షిణ మొదటే ఇచ్చుకోవాలి. దగ్గకండి తుమ్మకండి. హాయిగా నవ్వండి. బాసుగారు అడిగితే ఆయనకి కూడా చదివి వినిపించండి .

జిలేబి గార్కి,
ధన్యవాదాలు. అస్సాం ని ఎలా మరిచిపోతానండి? 30 ఏళ్ల అనుబంధం. I love Assam.
లేదండీ. నేను వ్రాయలేదు. పంపలేదు. మీ ప్రోత్సాహానికి మరొక్క మారు ధన్యవాదాలు.

జేబి-JB గార్కి,
ఆలస్యం గా నైనా స్పందించినందుకు ధన్యవాదాలు.

నేస్తం చెప్పారు...

>>>>>>మన దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వచ్చింది అని మా అత్తగారిని అడిగితే ఆమె సమాధానం ఏమిటో తెలుసా? మా ప్రభావతి పుట్టడానికి రెండేళ్ల ముందు అని జవాబు ఇస్తుంది. బంగ్లాదేశ్ ఎప్పుడు వచ్చింది అంటే మా ప్రభావతి పెళ్లి అయిన రెండేళ్ళకి అని చెబుతుంది. మీ అత్తయ్యకి అర్ధం అవాలంటే అలాగే చెప్పాలి అన్నాను.
>>>>>>>>>>>>
నీ అదృష్టం బాగుండి నువ్వు ఒక క్షణం ముందు పుట్టావు. లేకపోతే నీ పేరు మూఢమతి అయి ఉండేది అని చెప్పేను>>>




:))))))))))))))))))))))))అ రెండు లైన్స్ దగ్గర మాత్రం గట్టిగా పైకే నవ్వేసాను..బాగుందండి

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

నేస్తం గార్కి,

ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

guruvugaru literally navvaleka chacchanu .. pelli chupula ghattam :)