అది 1967వ సంవత్సరం. అప్పటి కి, ప్రద్యుమ్నుడు అని పిలవబడే నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఎందుకు కాలేదు అంటే కాలేదు అంతే. అక్కడికీ మానాన్న గారిని అడిగాను
నాన్నగారూ నాన్నగారూ నాకింకా ఎందుకు పెళ్లి చేయలేదు అని.
వారు మా అన్నయ్య కేసి చూపించి అగ్రజుని కి కాకుండా అనుజుడికి పెళ్లి చేసే ఆచారం మన ఇంటా బయటా కూడా లేదు అని సెలవిచ్చారు.
నేను ఆగ్రహము తో కుపితుడ నై, క్రోధము తో దు:ఖితుడనై, విచార వదనుడనై ఇట్లు వ్రాక్కుచ్చితిని
“సోదరా, సహోదరా నీకును 27 ఏళ్లు వచ్చెను. అయినను బ్రహ్మచర్య వ్రతమేలా నాచరించు చుంటివి. నీకిది భావ్యమా”
మా తండ్రిగారి జ్యేష్ట పుత్రుడు మందహాసం చేసి “నువ్వు అరిచి ఏడ్చి మొత్తుకున్నా సరే, నాకు 750 రూప్యములు జీతము వచ్చు వరకు విహాహం చేసుకోను కోను కోను” అని నొక్కి వక్కాణించెను. నేను ఉండునది హైదరాబాదా మజాకానా అని కూడా అన్నాడు . మై నహీ కరూంగా అని ఎఫెక్టు కోసం హూ అని కూడా అన్నాడు.
నేను వెంటనే గుణకారం, భాగహారం కూడా చేసేసి వాడి ఇంక్రిమెంట్ 25 రూకలు, ఏడాదికి పెరుగు డి.ఏ 50-70 రూకలు వెరసి 2 వత్సరములు దాకా వీడి పెళ్లి కి అవకాశం లేదనిపించి, సంయమనం పాటించి మృదు మధుర స్వనం తో ఉద్ఘాటించితిని
“ సుబ్బావధాన్లు గారి ప్రధమ దౌహిత్రుడా, సోమయాజులు గారి ద్వితీయ పౌత్రుడా, మీ తాత గార లిరువురును 17 ఏళ్లు వచ్చుటకు ముందే వివాహము చేసికొనిరి. కుల గౌరవము, వంశ గౌరవము నిలబెట్టు నుద్దేశ్యము లేదా” అని.
లేదు అని చాలా సింపుల్ గా సమాధాన మిచ్చాడు.
అయినను ఆశ చావక నేను ఈ మారు శాంత గంభీర స్వరం తో
“ఎక్కడో 3000 కి.మీ దూరం లో అస్సాం లో తిండి తిప్పలు, కాఫి టిఫిన్లు కూడా లేకుండా నేను అవస్థ పడుతుంటే నా మీద ఇసు మంత యైన కనికరం లేదా. నా క్లాసు మేటు తిరు వెంకటాచారి గుర్తున్నాడా, ఎప్పుడూ పరీక్షలు తప్పుతూ, బి.ఏ ఇంకా చదువుతూ, నా కన్నా ఒక ఏడాది చిన్న వాడైన చారి, పెళ్లి చేసుకొని, తండ్రి గారి ని తాత ను చేసాడని విని నప్పుడు నీకేమి అనిపించలేదా? హతవిధీ బుద్ధి తెచ్చుకొనుము” అంటూ గద్గద గొంతు తో ఘోషించితిని.
అయినను వాడు చలించలేదు.
అందువల్ల నాకు ఇంకా పెళ్లి కాలేదన్న మాట. అయినను నేను నిరుత్సాహం చెందక ’ధైర్యవంతో బుద్ధిమంతః’ అని ఎవరూ అననిది నేనే అనుకొని, బుద్ధిమంతుడను కాబట్టి ధైర్యం తెచ్చుకొని సంసారం అను సాగరం లో దూకుట అను కార్యక్రమమును పోస్ట్ పోను చేసుకొన్నాను.
కానీ ’మనస్సో కోతిహి’ అని కూడా విని యుండుట వలన ఆ యొక్క చంచలమైన మనస్సు తో అలోచించి, పోనీ, ఎవరో ఒక సుందరిని లవ్వాడేసి ప్రేమించి, సుందరీ ఆమె తల్లి దండ్రులు అంగీకరిస్తే, మా నాన్నశివ తాండవం చెయ్యకపోతే, పెళ్ళాడేస్తే ఎల్లా ఉంటుంది అని కూడా సుదీర్ఘం గా చింతించితిని.
ఎందుకైనా మంచిదని ఈ విషయం నా మిత్ర మండలి లో చర్చకు పెట్టాను. నా మిత్రమండలి అనగా ఉన్నికృష్ణన్ నారాయణ మీనన్, గణపతి అయ్యర్ అను నా ఇద్దరు మితృలు. మేము ముగ్గురము చాలా మంచి మితృలము. ముగ్గురము దక్షిణ భారతీయ బ్రహ్మచారు లమగు ట చే మా బంధము ఇంకను బలపడినది. సుమారు గా ఒకే వయసు వార మగుటచే అభిరుచులు కూడా ఒకటి గా నుండెడివి.
ముగ్గురము ఏక కంఠము తో ఏక తాటిపై నడిచే వారము. ఒకే సినిమా మూడు టికెట్లు పై చూసేవారము , ఒకే బిల్లుపై మూడు ప్లేట్లు ఇడ్లి తిని ఆరు ప్లేట్ల సాంబారు తాగెడి వారము. మా ముక్కులు, కర్ణములు, కనులు చురుకుగా పనిచేసి మా కాలనీ లో ఎవరింటిలో ఇడ్లీలు, దోసలు ఇత్యాదులు చేసిరో మరు నిముషమందే కనిపెట్టేసి భిక్షకు వెళ్లి పోయేవారము. వీరు సౌత్ ఇండియన్ , వారు నార్త్ వారు, వీరు బెంగాలీ, వారు అస్సామీ అను బేధ భావము చూపక అందరి ఇళ్ళ లోను వారు పిలవక పోయినా వెళ్లి వారిని సంతోషపెట్టి వచ్చెడివారము. అంతటి దృఢమైన మితృత్వము మాది.
ఇప్పుడు మేము ఈ సమస్య పై డా. సదానంద గర్గ్ గారింట్లో కూర్చుని వారి శ్రీమతి ఇచ్చిన టీ తాగుతూ ఆలు బొండా లు తింటూ, లవ్వా, మారేజియా, లవ్వు+మారేజి యా అని సుదీర్ఘంగా చర్చించి సమాధానం దొరకక, ఖిన్నులమై, విషణ్ణ వదనులమై వారింట్లోనే ఆలూ పరోఠా తిని ఇంటికి పోయితిమి.
మరు నాడు ఆదివారమగుట చే రావు గారింట్లో పెసరట్టు ఉప్మా + కొబ్బరి చట్నీఅని సమాచారం ఉండుట వల్ల ఉదయమే 8.30 గం. రావు గారింట్లో మరల సమావేశమై తిమి. (3*4) + (2* 2) = 16 పెసరట్లకు సరిపడు పిండి రుబ్బిన రావు గారి భుజ బలమును కీర్తించి తినుటకు ఉపక్రమించితిమి.
ఇంతలో కుశాగ్ర బుద్ది గల శ్రీమతి భావనారావు అక్కయ్య గారు ప్రశ్నించారు
“ఇంతకీ ఎవరిని ప్రేమించ దలిచారు? ఎవరిని పెళ్లి చేసుకుంటారు? మన కాలనీ లో కానీ మన లాబ్ లో గాని పెళ్లీడు ఆడపిల్లలు ఎవరూ లేరను కుంటాను.”
మేము స్టన్నయి పోయాము. అవును కదా బేసిక్స్ ని పట్టించు కోకుండా ఇంత సేపు అనవసర చర్చలు చేసామా అని విచారించాము. అనుమాన నివృత్తి కొరకు మేము మా తీక్షణ వీక్షణాలు కాలనీ లోని ప్రతీ గృహంబు లోనికి పంపాము. అంకుల్ అంకుల్ అను 10 ఏళ్ళ కన్నా తక్కువ వయసు గల ఆడ పిల్లలే కనిపించారు. లాబ్ లో కూడా ఆంటీలు, పిన్నిలు, అక్కయ్యలు తప్ప ప్రేయసి కాగల వారెవరూ కాన రాలేదు.
హా హతవిధీ అనియున్ను ఔరా ఔరౌరా అనియున్ను దు:ఖించితిమి.
భావన గారే ఒక ఉపాయము సూచించినారు. అయ్యరు గారు అయ్యరిని పెళ్లి చేసు కోకపోతే ఆస్తి దక్కదు కాబట్టి గణపతి కి లవ్వు అఖ్ఖర్లేదు. ఉ. కృ. నా. మీ కి మేనరికం ఉంది కాబట్టి వారి పప్పులు ఉడకవు. ప్రద్యుమ్నుడు కూడా రెండేళ్ళ బట్టి పెళ్లి పెళ్లి అంటున్నాడు. ఇంకో రెండేళ్లు ఇల్లాగే పెళ్లి అంటూ గడిపేస్తాడు. కావున అంత దాకా ఏదో నాల్గిళ్ళలో ఇలాగే వారాలు చెప్పుకుంటూ గడిపేయండి అని సలహా ఇచ్చారు. అక్కయ్యగారూ మా మనో భావాలూ దెబ్బతిన్నాయి దీనికి మేము నిరశన వ్యక్తం చేస్తున్నాము అని గ్లాసులో కాఫీ గడగడా తాగేసి బయటకు వచ్చేసాము.
మా డైరక్టరు మీద మా చెడ్డ కోపం వచ్చేసింది. ఎంత సేపూ నా లాబ్ లో యువ శక్తి, సగటు వయస్సు 34 మాత్రమే అని డప్పాలు కొట్టు కోవడం తప్పితే, ఇంత గంభీర సమస్య పొంచి ఉన్నదని గ్రహించ లేక పోయాడు. బొత్తిగా దూరదృష్టి కానీ హ్రస్వ దృష్టి కానీ లేని వాళ్ళని డైరక్టర్లుగా ఎంపిక చేయడం వల్లే మన దేశం ముందుకు వెళ్ళ లేక పోతోందని విచారించాము. ఈ మారు అయినా పెళ్లి కాని 20 – 24 వయసు గల అందమైన అమ్మాయిలకి కాని, పెళ్లీడు కు వచ్చిన అందమైన అమ్మాయిలు ఉన్న తల్లిదండ్రులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని తీర్మానించేసాము. దురదృష్ట వశాత్తు మా లాబ్ కి రెండు మూడు కి.మీ దూరంలో గృహ సముదాయాలు ఏమీ లేవు. జోర్హాట్ టౌను కెళ్ళి ప్రయత్నిద్దామంటే 7 కి.మీ దూరం. కష్టములు ఈ విధము గా కూడా వచ్చునా అని విచారించి, విధిని బహుపరి విధముల దూరితిమి. ఈ విధంబుగా మేము దు:ఖించు చుండగా రోజులు వారములుగా, అవి నెలలుగా మారిపోవు చున్నవి.
ఒక రోజున నాకూ మా డా. శంకర్ ఘోష్ అంటే మాచిన్న బాసు కి అభిప్రాయ బేధాలు వచ్చి ఆయన నన్ను అన రాని మాటలు అన్నా, అవనత మస్తకుడనై ఆలకించి నా సీట్లోకి వచ్చి ఆసీనుడ నగుచుండగా, ధనుర్విముక్త శరం లా పరిగెట్టుకు వచ్చిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ నా ఎదుట సీట్లో కూలబడ్డాడు.
రొప్పు తున్నాడు. ఏ నాగుపామో పగపట్టి వాడి వెనకాల పడిందేమో నని అనుమానం వచ్చి, ఎందుకైనా మంచిదని నా కాళ్ళు రెండూ ఎత్తి కుర్చీలో పెట్టేసాను.
పాములు పగపట్టవు అదంతా ట్రాష్ అని తెలిసినను, పగబట్ట కూడదనే శాస్త్రం వాటికి తెలుసునో లేదో అని చిన్న అనుమానమన్న మాట.
రొప్పుతూనే ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ఉజ్వల ఉజ్వల ఉజ్వల భట్టాచార్య కి ఈ వేళ అప్పాయింట్ మెంట్ ఆర్డర్ డిస్పాచ్ అయింది. ఇప్పుడే అని చెప్పాడు.
నా కళ్ళ ముందు స్వర్గంలో ఘృతాచి నాట్యం చేస్తూ కనిపించింది. తెలుగు సినిమా లో భారీ హీరోయిన్ రారా నా సామి రారా అని పాడి నట్టనిపించింది. ఇద్దరం చేతులు పట్టుకొని కుహూ కుహూ బోలే కోఎలియా కోఎలియా కోఎలియా సనిదప సానీదాపా సస్సా రిర్రీ గగ్గా మమ్మా కోఎలియా అని పాడేము. బొత్తి గా సంగీత జ్ఞానం లేక పోయినా సంగీతం లో ఓలలాడే సాం.
ఆ తదుపరి వివరాలు చెప్పేడు. 22 యియర్స్ 4 మంత్స్, అన్ మారిడ్, M.sc. Micro biology, Gauhati, C/O శ్రీ తన్మయ భట్టాచార్య, dy. C.E, railways, maaligaon . Bio chemistry dept., joining as JRF, ఇతి వార్తః సమాప్తః
ఇంతలో మా గణపతి అయ్యర్ కూడా వచ్చేసి వీడు చెప్పిన కధే పునః ప్రసారం చేసాడు.
ఆ రోజు నించి,
రెండు రోజుల తర్వాత ముహూర్తం రానే వచ్చింది. ఉజ్వల ఉద్యోగంలో చేరే రోజు.
ఆవేళ నేను రంగు రంగుల చారల బుష్ కోటు వేసుకొని పైజామా లాంటి ఫాంటు వేసుకొని (ఆ రోజుల్లో అవే ఫాషన్), పక్కింటావిడ జర్మనీ నించి తెచ్చుకొన్న సెంటు పూసుకొని , టిప్ టాప్ గా తయారయి అరగంట ముందు ఆఫీస్ గేట్ దగ్గర కాపలా కి వెళ్లి పోయాను.
11గం. అయింది ఉజ్వల జాడలేదు.
నేను బహు చింతా క్రాంతుడనై biochemistry dept. కి వెళ్ళితిని.
అక్కడ నన్ను చూసి డా. సుర్జిత్ సేన్ గుప్తా, రా రా నీకు మా కొత్త గా చేరిన ఉజ్వల ని పరిచయం చేస్తా అని తీసుకెళ్ళి, భూమికి ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తులో , గుండ్రంగా ఉన్న ఒక మనిషి ని చూపించి
Meet Mr. ujvala Bhattacharya అన్నాడు.
నా కాళ్ళ కింద భూమి కంపించింది. కనుల ముందు అమావాస్య చీకట్లు కమ్మేసాయి. నాగుండెల మీద విధి టంగ్ టంగ్ టంగ్ అంటూ సమ్మెట దెబ్బలు కొడుతున్నాడు. ఒక్కమాటు గా విషాద సంగీతం నా చెవిలో మారు మ్రోగిపోయింది.

ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు గౌహతీ లో నా ఉజ్వలను చూసిరావా ఆఆ ఆఆ
నీలి మేఘాలలో గాలి కెరటాలలో ఉజ్వల పాటే వినిపించు నాకు
గున్ గునా తాహు వహీ గీత్ మై ఉజ్వలా కేలియే
మేరి సపనోంకి రాణి కబ్ ఆయేగీ తూ ఉజ్వలా ఓ ఉజ్వలా
అని పాటలు పాడుకుంటూ భారంగా రోజులు లెఖ్ఖ పెట్టు కుంటుండగా ఒక రోజు నా కల లోకి
“రావోయి మా ఇంటికి మావా మాటున్నది మంచి మాటున్నది” అని పాడుకుంటూ ఉజ్వల వచ్చేసింది.
నేను కంగారు పడిపోయాను. మొహం చూద్దామంటే కనిపించటం లేదు.
అయినా ఉజ్వల బెంగాలీ పాటో అస్సామీ పాటో పాడాలి కానీ “వై తెలుగు పాట పాడింగ్ “ అని కూడా అనుమానం వచ్చేసింది.
ఆహా పెళ్లి కాకుండానే తెలుగు నేర్చేసు కున్న మహా తెలుగు పతివ్రత అని ఆనందపడి పోయాను.
ఒక డ్యూయెట్ వేసుకుందా మనిపించింది. ఏ పాట పాడాలి అని ఆలోచిస్తుంటే తను సిగ్గుతో ననుకుంటాను పారిపోయింది.
అయినా నేను డూపు ని పెట్టి పాడేసుకుందా మని అనుకున్నాను. లాహిరి లాహిరి లాహిరి లో పాడాలి అనుకున్నాను. ఎల్లాగూ ఉజ్వల మొహం కనిపించ లేదు కాబట్టి, నేనూ జమున కలసి పాడేద్దామని, జమున లో ఉజ్వలని చూసు కుందామని అనుకున్నాను.
కానీ ఇంతలో మా ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ పరిగెత్తు కుంటూ వచ్చేసాడు. నా చెవిలో జమున కాదు సావిత్రి లాహిరి లాహిరి పాటలో అని సలహా కూసాడు.
నాకు మండిపోయింది కోపం ముక్కు కి ఎక్కింది.
ఓరీ దుర్మార్గ దుశ్చింత దుర్యోధనా నా కల లోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నాకే సలహాలు ఇచ్చుచుంటివా అని వాడిని మెడ పట్టుకుని నా కల ముఖ ద్వారం దాకా తీసుకెళ్ళి ఒక్క తోపు తోసాను.
మళ్ళీ నేను ఆలోచించాను. మొన్న చూసిన ఇంగ్లిష్ సినిమా లోని హీరోయిన్ ని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఆవిడను పిలిచాను. పాపం ఆవిడ వెంటనే వచ్చేసింది.
ఆవిడకు సీను చెప్పేను. ఆవిడ మేకప్పు వేసుకొని వచ్చేసింది.
నువ్వు అల్లా పది గజాల చీర కట్టుకొని ఒక్క మొహం మాత్రమే చూపిస్తే ఎల్లా? ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు నా కల్లోకి అని కోప పడ్డాను.
తెలుగు సినిమా కాబట్టి తెలుగు వేషం అంది.
ఇంతలో సినిమా డైరక్టరుగా వేషం మార్చేసుకొని ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ యాక్షన్ యాక్షన్ అని అరిచేడు.
ఆ పక్కనే కెమేరా మాన్ గా గణపతి అయ్యర్ కనిపించేడు. ఉన్నట్టుండి నేను క్లాపు బాయ్ గా మారి పోయాను. టేక్ 124 నౌకా విహారం అని అరిచేను.
ఆ ఇంగ్లిష్ ఆవిడ ఒక్కత్తే నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది.
నా కల్లోకి మళ్ళీ వచ్చి నన్ను క్లాప్ బాయ్ ని చేసిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ని నరికేద్దామని కత్తి కోసం నేను వెతుకుతూంటే మెలుకువ వచ్చేసింది.
“రావోయి మా ఇంటికి మావా మాటున్నది మంచి మాటున్నది” అని పాడుకుంటూ ఉజ్వల వచ్చేసింది.
నేను కంగారు పడిపోయాను. మొహం చూద్దామంటే కనిపించటం లేదు.
అయినా ఉజ్వల బెంగాలీ పాటో అస్సామీ పాటో పాడాలి కానీ “వై తెలుగు పాట పాడింగ్ “ అని కూడా అనుమానం వచ్చేసింది.
ఆహా పెళ్లి కాకుండానే తెలుగు నేర్చేసు కున్న మహా తెలుగు పతివ్రత అని ఆనందపడి పోయాను.
ఒక డ్యూయెట్ వేసుకుందా మనిపించింది. ఏ పాట పాడాలి అని ఆలోచిస్తుంటే తను సిగ్గుతో ననుకుంటాను పారిపోయింది.
అయినా నేను డూపు ని పెట్టి పాడేసుకుందా మని అనుకున్నాను. లాహిరి లాహిరి లాహిరి లో పాడాలి అనుకున్నాను. ఎల్లాగూ ఉజ్వల మొహం కనిపించ లేదు కాబట్టి, నేనూ జమున కలసి పాడేద్దామని, జమున లో ఉజ్వలని చూసు కుందామని అనుకున్నాను.
కానీ ఇంతలో మా ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ పరిగెత్తు కుంటూ వచ్చేసాడు. నా చెవిలో జమున కాదు సావిత్రి లాహిరి లాహిరి పాటలో అని సలహా కూసాడు.
నాకు మండిపోయింది కోపం ముక్కు కి ఎక్కింది.
ఓరీ దుర్మార్గ దుశ్చింత దుర్యోధనా నా కల లోకి నా అనుమతి లేకుండా ప్రవేశించి నాకే సలహాలు ఇచ్చుచుంటివా అని వాడిని మెడ పట్టుకుని నా కల ముఖ ద్వారం దాకా తీసుకెళ్ళి ఒక్క తోపు తోసాను.
మళ్ళీ నేను ఆలోచించాను. మొన్న చూసిన ఇంగ్లిష్ సినిమా లోని హీరోయిన్ ని పెట్టుకుంటే బాగుంటుంది కదా అనుకొని ఆవిడను పిలిచాను. పాపం ఆవిడ వెంటనే వచ్చేసింది.
ఆవిడకు సీను చెప్పేను. ఆవిడ మేకప్పు వేసుకొని వచ్చేసింది.
నువ్వు అల్లా పది గజాల చీర కట్టుకొని ఒక్క మొహం మాత్రమే చూపిస్తే ఎల్లా? ఈ మాత్రం దానికి నువ్వు ఎందుకు నా కల్లోకి అని కోప పడ్డాను.
తెలుగు సినిమా కాబట్టి తెలుగు వేషం అంది.
ఇంతలో సినిమా డైరక్టరుగా వేషం మార్చేసుకొని ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ యాక్షన్ యాక్షన్ అని అరిచేడు.
ఆ పక్కనే కెమేరా మాన్ గా గణపతి అయ్యర్ కనిపించేడు. ఉన్నట్టుండి నేను క్లాపు బాయ్ గా మారి పోయాను. టేక్ 124 నౌకా విహారం అని అరిచేను.
ఆ ఇంగ్లిష్ ఆవిడ ఒక్కత్తే నావలో కూర్చుని “లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది.
నా కల్లోకి మళ్ళీ వచ్చి నన్ను క్లాప్ బాయ్ ని చేసిన ఉన్ని కృష్ణన్ నారాయణ మీనన్ ని నరికేద్దామని కత్తి కోసం నేను వెతుకుతూంటే మెలుకువ వచ్చేసింది.
రెండు రోజుల తర్వాత ముహూర్తం రానే వచ్చింది. ఉజ్వల ఉద్యోగంలో చేరే రోజు.
ఆవేళ నేను రంగు రంగుల చారల బుష్ కోటు వేసుకొని పైజామా లాంటి ఫాంటు వేసుకొని (ఆ రోజుల్లో అవే ఫాషన్), పక్కింటావిడ జర్మనీ నించి తెచ్చుకొన్న సెంటు పూసుకొని , టిప్ టాప్ గా తయారయి అరగంట ముందు ఆఫీస్ గేట్ దగ్గర కాపలా కి వెళ్లి పోయాను.
11గం. అయింది ఉజ్వల జాడలేదు.
నేను బహు చింతా క్రాంతుడనై biochemistry dept. కి వెళ్ళితిని.
అక్కడ నన్ను చూసి డా. సుర్జిత్ సేన్ గుప్తా, రా రా నీకు మా కొత్త గా చేరిన ఉజ్వల ని పరిచయం చేస్తా అని తీసుకెళ్ళి, భూమికి ఐదు అడుగుల మూడు అంగుళాల ఎత్తులో , గుండ్రంగా ఉన్న ఒక మనిషి ని చూపించి
Meet Mr. ujvala Bhattacharya అన్నాడు.
నా కాళ్ళ కింద భూమి కంపించింది. కనుల ముందు అమావాస్య చీకట్లు కమ్మేసాయి. నాగుండెల మీద విధి టంగ్ టంగ్ టంగ్ అంటూ సమ్మెట దెబ్బలు కొడుతున్నాడు. ఒక్కమాటు గా విషాద సంగీతం నా చెవిలో మారు మ్రోగిపోయింది.
పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం, అని పాడుకుంటూ శూన్యం లోకి భారంగా బరువుగా అడుగు లేసుకుంటూ వెళ్లి పోయాను ..
60 కామెంట్లు:
హతవిధి! ఎంత దారుణం జరిగిపాయె? అప్పటి సీన్ మాకు కనిపిస్తుందిలెండి???
పక్కింటావిడ జర్మనీనుంచి తెచ్చుకున్న సెంటు?? ఈవిషయంలో కొన్ని డవుట్లు.. మీకెందుకు ఇచ్చింది? ఆ కాలంలో జర్మనీవెళ్లినావిడ ఉందా లేక కల్పనా??
శ్రీ సుబ్రహ్మణ్యం గారు,
నమస్తే...చాలా కాలమైంది....ఈ రచనలో సస్పెన్స్, హాస్యం
రెండూ బాగా పండాయి...చాలా బాగుంది రచన. అభినందిస్తూ
శలవు...దినవహి
సుబ్రహ్మణ్యం గారూ.. ఇక మీదట నేను ఒకటి డిసైడ్ అయ్యాను.. నేను మీ బ్లాగు ఆఫీసులో ఉన్నప్పుడు చదవొద్దని..:( మరే.. ఇలా ఆఫీస్లో ఉన్నప్పుడు చదివేస్తూ బిగ్గరగా నవ్వేస్తూ ఉంటే అందరూ నావంక అదోలా చూస్తున్నారు.
మీ టపా మాత్రం సూ....పర్ అండీ..
>>పాములు పగపట్టవు అదంతా ట్రాష్ అని తెలిసినను, పగబట్ట కూడదనే శాస్త్రం వాటికి తెలుసునో లేదో అని చిన్న అనుమానమన్న మాట.
>>“లాహిడ్ లాహిడ్ లాహిడ్ లూల్ జంగమే హుయాళా హుయలా” అని పాడేస్తోంది
హహ్హహ్హహ్హా..
ఐదడుగుల మూడంగుళాలంటే భారతదేశంలో మంచి ఎత్తేనండీ. గుండ్రంగా అంటే...బెంగాలీలు, అస్సామీలు అలాగే ఉంటారు మరి. ఈ మాత్రానికే మీకెందుకు పెనుచీకటి అయ్యింది లోకం?
:)))
సుబ్రహ్మణ్యం గారూ,.. సూపర్!!!
పానుగంటి వారిని గుర్తుచేశారు అక్కడక్కడా..
Nice post.. Hilarious
@ఆ.సౌమ్య ,
ఎందుకంటే వీరు పాపం శరత్ టైపు కాదు కాబట్టి :))
జ్యోతి గార్కి,
అదేంటండీ అల్లా అడిగేసారు. ఆ కాలంలో జర్మనీ వెళ్ళిన ఆవిడ ఉందా అని? మా లాబ్స్ లో చాలా మంది ఫా. రి లు ఉంటారు. ఆ కాలంలో జర్మనీ, యు.కె, ల వాళ్ళు ఎక్కువ గా ఉన్నారు మా లాబ్ లో. వాళ్ళింట్లో ఏమున్నా మనింట్లో ఉన్నట్టే అన్నమాట.
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
హనుమంత రావు గార్కి,
చాలా థాంక్స్ మీ కామెంట్ల కి. ఏదో అభిమానం కొద్దీ మీరు అల్లా అంటుంటారు.
ధన్యవాదాలు.
మనసు పలికే గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. మీరు కూడా మాకు మల్లే ఆఫీసు లోనే ఇల్లాంటివి అన్నీ చదివేస్తారన్న మాట. నేను కూడా పెద్ద సైన్స్ జర్నల్ లో నవల్లు పెట్టుకొని చదివేవాడిని.
థాంక్యూ.
ఆ.సౌమ్య గార్కి,
బెంగాలీ, అస్సామీ ముఖ్యంగా అస్సామీ అమ్మాయిలు చాలా బాగుంటారు. గుండ్రం గా ఉండే వాళ్ళు తక్కువ. కనీసం నేను చూసినంత వరకు. 30 ఏళ్ళు అస్సాంలో ఉన్నాను.
Miss. Ujvala కాస్తా Mr. Ujvala అయితే ? నయం ఇంకా, శంకరం విషాదంగా నడుచుకు వెళ్ళిపోయాడు. ఉ.కృ.నా.మీ అయితే రెండు రోజులు తేరుకోలేదు.
ధన్యవాదాలు మీ కామెంట్లకి.
ఓహో "Mr." అన్నది గమనించలేదండీ, ఇప్పుడు వెలిగింది....అలా అయితే మీకాపాటే కరక్ట్ :D
హహ్హహ్హ హ్హ....
మీరట్లు 'ఉజ్వల'హీనులై నవ్విధం బెరిగి హ నన్నిట్లు దైవంబ వంచించితివే అన్నప్పుడు కడు విచారము కలిగెను...
గురువుగారు, దౌహిత్రుడా అంటే ఏమిటి ?
నా కామెంట్ రాలేదేంటి? మళ్ళీ రాస్తున్నాను..
సుబ్రమణ్యం గారూ,.. సూపర్!!!
పానుగంటి వారిని గుర్తుచేశారు అక్కడక్కడా..
హహ్హహ్హ.. బాగుందండి.
@ నాగార్జున : దౌహిత్రుడు అంటే కూతురి కొడుకు, పౌత్రుడు అంటే కొడుకు కొడుకు :)
కృష్ణప్రియ గార్కి,
మీ కామెంటు పబ్లిష్ అయిందండి. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. పానుగంటి వారిని గుర్తు చేస్తున్నాననడం అతిశయోక్తి అనే భావిస్తాను. మీ ఆదరాభిమానాలకి కృతజ్ఞుణ్ణి. థాంక్యూ.
Weekend Politician గార్కి,
మా బ్లాగు కి స్వాగతం. మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు.
ఆ. సౌమ్య గార్కి,
అమ్మయ్య కనిపెట్టేసారు కదా మాబాధ కి కారణం. థాంక్యూ.
నాగార్జున గార్కి,
ఉజ్వల హీనమే కాదు పట్టపగలు అంధకారం కమ్మేసింది అన్నమాట.
ఎక్కడో చదివిన పదాలు అల్లా అల్లా ఉపయోగించే స్తానన్న మాట. దీని భావమేమి తిరుమలేశా అంటే నేను కొంచెం తడ బడుతానన్న మాట. దౌహిత్రుడు అంటే నాకు తెలిసిన అర్ధం కూతురి కుమారుడు అని. కాదంటే చెంపలేసుకుంటా నయ్యా.
ధన్యవాదాలు మీ కామెంట్సు కి. థాంక్యూ.
శిశిర గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్సుకి.
నాగార్జున గారి సందేహానికి జవాబు చెప్పినందుకు థాంక్యూ.
సుబ్రహ్మణ్యం గారూ ఆ కాలం లోనే కాదు, ఈ కాలంలో కూడా ఇలాగే ఎదురు చూస్తున్నారు కుర్రాళ్ళు. మీరైతే అస్సాంలోనే కాబట్టి ఫరవాలేదు, నేనిక్కడ జెర్మనీ లో తెలుగమ్మాయి కోసం ఎదురు చూసీ చూసీ విసుగెత్తి, జెర్మన్ అమ్మాయిల గురించి ఆలోచించలేక, చేసే PDF మధ్యలో వదలలేక, ఇంటికి వెళ్ళలేక ఇలాగే రోజులు వెళ్ళదీస్తున్నాం.
సుబ్రహ్మణ్యంగారు,
హ హ హ హ :-D బాగుందండి, అక్కడక్కడా చిన్న చిరునవ్వులు చిందిస్తూ ప్రశాంతంగా చదువుతూ MR ఉజ్వల చూడగానే ఒక్క సారిగా పెద్దగా నవ్వేశాను :-) అస్సలు ఊహించలేదు.
హ్హహ్హహ్హహ్హ గురువు గారూ పోస్టంతా ఒకెత్తు,కామెంట్లో విషయం "నయం ఇంకా,శంకరం విషాదంగా నడుచుకు వెళ్ళిపోయాడు.ఉ.కృ.నా.మీ అయితే రెండు రోజులు తేరుకోలేదు"ఇంకొకెత్తూ.సస్పెన్సు బాగా పండించారు.
"పానుగంటి వారిని గుర్తు చేస్తున్నాననడం అతిశయోక్తి అనే భావిస్తాను" భలేవారే ఆ కాలానికి ఆయన అనుకుంటే ఇప్పటికి మీరనుకోండి,అతిశయోక్తి కాకపోతే అతిశయుక్తి అని సరిపెట్టేసుకోండి.
సునీల్ గార్కి,
మా బ్లాగ్ కి స్వాగతం. జర్మనీ లో ఉంటూ మీరంత నిరుత్సాహంగా మాట్లాడం బాగాలేదు. నా మిత్రులు ఇద్దరు డాడ్ స్కాలర్ షిప్ మీద జర్మనీ వెళ్లి న వారు మళ్ళి తిరిగిరాలేదు. ఒకడు అక్కడే పెళ్లి చేసుకొని అక్కడినించి అమెరికా పారిపోయాడు ట. ఇంకోడు శాస్త్రి అని ఆ చుట్టుపక్కలే ఉన్నాడనుకొంటాను బెల్జియం అమ్మాయితో. వెతకండి . నేర్చుకోండి.
ధన్యవాదాలు. మీ వ్యాఖ్యలకి.
వేణు శ్రీకాంత్ గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్సు కి. Mr. అన్నది కొంతమంది మిస్ అయ్యారు. సౌమ్య గారు చాల సౌమ్యంగా రాసారు. ఒకావిడ పాపం ఆవేశ పడినా కామెంటు పెట్టకుండా, ఈమెయిలు పంపించారు. సారాంశం నీ మొహం మండా అని. బహుశా ఆ పేరు బోల్డ్ లో పెట్టి ఉండాల్సింది. థాంక్యూ.
శ్రీనివాస్ గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మీరు ఒకమాటు జంధ్యాలగారి గురించి అన్నారు. ఇప్పుడు కృష్ణప్రియ గారిలా, పానుగంటి వారు అంటున్నారు. వారి స్థాయిలో కనీసం ఓ 10-15% అందుకున్నా ధన్యుడిని అయినట్టే అనుకుంటాను. దానికే నా జీవిత కాలం సరిపోతుందా అని అనుమానం. కానీ వీరిద్దరి కన్నా నేను ముళ్ళపూడి గారిని అబిమానిస్తాను. వారు చేసే మాటల గారడీ మరెవరు చేయలేరనిపిస్తుంది నాకు. థాంక్యూ.
చాలా బాగుంది
బాగుందండీ, ముఖ్యంగా'మనస్సో కోతిః'.
నా పేరుతోకూడా కాలేజీలో, ఆఫీసులో ఇలాంటివి జనాలకు ఎదురయ్యాయి. అందుకే జేబి అని పెట్టుకుని తిరుగుతున్నా :-)
శివరాజేష్ గార్కి,
ధన్యవాదాలు మీ కామెంటు కి థాంక్యూ.
జెబి-JB గార్కి,
మీ పేరు కి కూడా ఇల్లాంటి కధ ఉందటే నేను అస్సాం దాకా వెళ్ళే వాడిని కాదు సారూ.మీపేరు మీదే ఓ టపా వేసేసుకొనే వాడిని.చెప్పేయండి నా చెవిలో మీ పేరేమిటో. మీ పేరు మీద వేసే టపా మీకే అంకితం.
థాంక్యూ మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
అబ్బబ్బాబ్బా ఏం నవ్వించారండి బాబు... చప్పట్లు
నేస్తం గార్కి,
ధన్యవాదములు మీ వ్యాఖ్యలకి థాంక్యూ
Brilliant sir, absolutely brilliant.
అప్పుడప్పుడూ బ్లాగుల్లో అంటూ ఉంటారు, టపాకంటే వ్యాఖ్యలే పసందు అని. ఈ టపాలో రెండూ బ్రహ్మాండంగా పండినాయి.
Hilarious
Good post
కొత్తపాళీ గార్కి,
థాంక్యూ మీవ్యాఖ్యలకి. మీలాంటి వారి దగ్గరనించి ఇల్లాంటి కామెంట్స్ వచ్చినప్పుడు నేను రాయగలను అన్న నమ్మకం పెరిగిపోతోంది.ధన్యవాదాలు.
ఎనానిమస్ గార్కి,
మీవ్యాఖ్యలకి ధన్యవాదాలు.
sir,
you made my day. very hilarious post.
శ్రీకాంత్ గార్కి,
ధన్యవాదాలు మీ కామెంట్స్ కి. థాంక్యూ.
:-)
హ హ హ.... భలే ఉంది ఆఖరి ట్విస్టు...
ఇంత హస్యం ...అంత అవలీలగా ఎలా రాసెస్తారండి బాబు మీరు... మిమ్మల్ని గురువుగారు అంటున్న శ్రీనివాస్ పప్పు గారిని నేను గురువుగారు అంటుంటా ... :-)
మంచు గార్కి,
నన్ను ఇప్పుడు చిక్కుల్లో పడవేసారు మీరు. ఏమనాలి మిమ్మలని. శిష్యా అనా లేక శిష్య శిష్యా అనా. ఛాయస్ మీదే.
ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి థాంక్యూ.
>>"ఒకావిడ పాపం ఆవేశ పడినా కామెంటు పెట్టకుండా, ఈమెయిలు పంపించారు. సారాంశం నీ మొహం మండా అని."<<
:-D కామెంట్లకి జవాబుల్లో కూడా ఇలా నవ్వించేస్తే మేం మీ బ్లాగు వదిలి వేరే బ్లాగులు చూడాలా వద్దా చెప్పండి :-)
అన్నట్లు శిష్యుడికి శిష్యుడిని ప్రశిష్యుడు అంటారని ఈ మధ్యే ఎక్కడో చదివానండి.
వేణూ శ్రీకాంత్ గార్కి,
ఏమిటోనండి సీరియస్ గా గంభీరంగా రాద్దామనే ప్రయత్నిస్తాను. మరి అందులో కూడా హాస్యం చూసే సహృదయులు మీరు.చాలా థాంక్స్.ధన్యవాదాలు
ప్రశిష్యా ఎక్కడున్నారు?
Chaala bagundandi... ee tapa mariyu vyakhyalu... paatha rachaithalani gurthuku thecharu :)
సుబ్రహ్మణ్యం గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)
సంపత్ గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు. నేను కూడా పురాతనమైన వాడినే కదా. కొంచెం పాత వాసన ఉండ వచ్చు. థాంక్యూ
ఈ పోస్ట్ ఇప్పుడే చూసానండి.చాలా బాగుంది.
భలే నవ్వించారు.
kottagaa cheppaedaemundi. andaroo cheppaesaaru.
ఫ్రెండు గార్కి,
ధన్యవాదాలు మీ కామెంటులకు.
సునీత గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
// "వాళ్ళింట్లో ఏమున్నా మనింట్లో ఉన్నట్టే అన్నమాట." //
You are a riot😀😀.
అవునండీ, ఈ బెంగాలీ మొగవాళ్ళ పేర్లు ... నిజంగా frustrating అండీ. లేకపోతే ఏమిటండీ .... అరవింద, ఉత్పల, ప్రాంజల, బిభూతి, సుదిప్త, శిశిర ("బిభూతి" మినహా మిగిలిన వాటి చివర అక్షరానికి "ఓ" తగిలించండి). జెండర్ మహా మహా misleading అండీ ఇతర ప్రాంతాల వారికి (మీకు జరిగినట్లుగా 😀).
అసలు బెంగాలీ మొగాళ్ళ పేర్లకు సెన్సార్ బోర్డు లాంటిదో, మరేదన్నా అప్రూవింగ్ డిపార్ట్మెంటో పెట్టాలండీ కేంద్ర ప్రభుత్వం వారు. అక్కడ ముందస్తుగా ఆమోదించిన తరువాతే బెంగాలీ తల్లిదండ్రులు తమ కొడుక్కి ఆ పేరు పెట్టుకోవాలి అన్నమాట. అన్నట్లు ఆ బోర్డ్ లోనో, డిపార్ట్మెంట్ లోనో బెంగాలీ వాళ్ళెవరూ సభ్యులుగా గానూ, ఛైర్మన్ గానూ ఉండకూడదండోయ్.
Super post. Thoroughly enjoyed.
Ramu
విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు.
// "వాళ్ళింట్లో ఏమున్నా మనింట్లో ఉన్నట్టే అన్నమాట." //
ఇది నిజంగా నిజం. ఆ చనువు ఉండేది. ఆ కాలంలో మా కాలనీలో ఒక నలభై - ఏభై ఇళ్ళు మాత్రమే ఉండేవి. ఇగోలు, బేధ భావాలూ ఉండేవి కావు.అంతా ఒక కుటుంబం లాగానే ఉండేవాళ్ళం. క్రమ క్రమంగా మారుతూ వచ్చింది. ఆఫీసు పాలిటిక్స్ కాలనీలోకి దిగుమతి అయ్యాయి. ఇంతే సంగతులు.
ఇంకో మాట మా లాబ్ లో లావణ్య రాభ అనే ఒకాయన ఉండేవారు. ............. మహా
Ramu S గారికి. ........ ధన్యవాదాలు.
ఓహో, లావణ్య అనే ఆయన కూడానా 😂? misleading పేర్లలో ఇది ultimate 🙁. నిజంగానే అప్రూవింగ్ డిపార్టమెంట్ అత్యవసరం.
నవ్వించారు బాగా :))
విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు.
బెంగాలీలు కూడా మన పేర్ల మీద ఇటువంటి అభిప్రాయాలే వెలిబుచ్చారు. "అంత పొడుగు పేర్లు ఏమిటి? మూడోవంతు ఇంగ్లిష్ అక్షరాలు పేరులోనే ఉంటాయి. అక్షరం కింద అక్షరం ఎలా వ్రాస్తారు? పైగా మేము సరిగా పలకమని ఫిర్యాదు చేస్తారు. ఆయ్" అని కోప్పడ్డాడండి ఒకాయన. ............. మహా
లలిత గారికి. ......... ధన్యవాదాలు.
వాళ్ళ ఫేస్ అండీ, వాళ్ళ ఫేస్. సరైన ఉచ్చారణ చాతకాని వాళ్ళు కూడా మన తెలుగును అనడమే? ఎంత ధైర్యం. మీ ఒకానొక టపాలో మీరన్నట్లు horrible అనే ఆంగ్ల పదాన్ని ఎన్ని రకాలుగా చిత్రవధ చెయ్యవచ్చా అని రిసెర్చ్ చేసే జనాలు వాళ్ళు. తెలివితేటలున్నవారే కానీ ("What Bengal thinks today rest of India thinks tomorrow" వగైరా వగైరా అని ఒకప్పుడు పొగిడించుకున్న వాళ్ళే అనుకోండి) బెంగాలీ వాడు నోరు తెరిస్తే మనం - at least మాలాంటి వాళ్ళు (మీరు అస్సాంలో ఉండి వచ్చారు కాబట్టి మీకు ఇబ్బంది ఉండకపోవచ్చు) - జుట్టు పీక్కోవలసిందే కదా. భై ఆర్యు భాన్‌డరిన్‌గ్ ఇన్ ది భొరొన్‌డో, బొరదోసుందరీ దేబీ (Why are you wandering in the veranda, Varadasundari Devi) అనే రకాలు. ప్రతిదానికీ "ష" పలకడమే. వీళ్ళ కన్నా హిందీ వాళ్ళే కాస్త నయం కదండీ - "ష" పలకవలసిన చోట పలకక పోయినా కాస్తో కూస్తో అర్ధం అవుతుంది. నేను చదివిన ఉత్తరభారతం లోని యూనివర్శిటీలో మా ప్రొఫెసర్ గారు "పార్సల్ డిపరెన్‌సియల్ ఈక్వేసన్స్" గురించి పాఠం చెప్పేవాడు, పాపం, అయినా ఆయన భావం అర్ధం అవుతోంది కదా :)
ఆడవాళ్ళ పేర్లు మొగవాళ్ళు పెట్టుకునే రకాలు బెంగాలీ వాళ్ళు - భావదారిద్రయం అనాలేమో? మనం పెట్టుకునే నిర్దుష్టమైన పేర్లను వాళ్ళా గేలి చేసేది? అది చూసి అదేదో బాగుందనుకున్నారేమో 1960 లు 1970 లలో మన నవలారచయిత్రులు తమ నవలల్లో పాత్రలకు ఆ పేర్లు పెట్టడం అనే ఫాషన్ ఉధృతంగా నడిచింది కదా కొన్నాళ్ళు.
మన తెలుగులో ఎంత విస్తృతమైన పదాలు ఉన్నాయో తెలుసు కదా సార్. ప్రతి దాన్నీ "తినడం" అని మాట్లాడే బెంగాలీ వాళ్ళు కూడా ఎదుటివాళ్ళకు చెప్పడం ఏమిటండి బాబూ? వాళ్ళు తిండి "ఖాబొ", నీళ్ళు / కాఫీ / టీ "ఖాబొ", ఆఖరికి సిగరెట్ కూడా "ఖాబొ". శంకరాభరణం శంకరశాస్త్రి గారు అన్నట్లు ప్రతి అనుభూతికీ మన తెలుగులో ఒక "నిర్దిష్టమైన నాదం" ఉంది (మనం ఇక్కడ "పదం" అనుకుందాం). అటువంటి మనల్ని "ఖాబొ" వాళ్ళు ఎత్తిచూపడమా, హన్నా.
సుబ్రహ్మణ్యం సార్, భలే హిలేరియస్‌గా వ్రాశారు. సెమీ-గ్రాంధికం కామెడీని పెంచింది. చదువుతూ తెగ నవ్వుకున్న ఆ సరదా మూడ్‌లోనే కొన్ని చిన్న కామెంట్లు + కొస్చెన్లు -
1. //మా మనో భావాలూ దెబ్బతిన్నాయి దీనికి మేము నిరశన వ్యక్తం చేస్తున్నాము అని గ్లాసులో కాఫీ గడగడా తాగేసి బయటకు వచ్చేసాము//
కాఫీ తాగకుండా వాకౌట్ చేసేస్తారేమోనని చాలా కంగారు పడ్డాను. కాఫీ పుచ్చుకుని మరీ వాకౌట్ చేసినందుకు నెనరులు.
2. //విధిని బహుపరి విధముల దూరితిమి//
టీవీ యాంకర్లు & ఆ భాషావర్గానికి చెందిన వాళ్ళు ఈ వాక్యం చదివితే (పొరపాటున), వాళ్ళు ఎలా అర్ధం చేసుకుంటారా అనే ఊహ వచ్చింది. రెండు సినేరియోలు కనపడ్డాయి. i)ఒక వీధిలో(విధి typo అనుకుని) దూరడానికి కూడా ఎన్నో విధాలుంటాయా అని సందేహం రావచ్చు. ii) విధి (destiny)లో మనుషులు దూరడం ఏమిటా అని తికమక పడచ్చు.
3.//ఉజ్వల ఉజ్వల ఉజ్వల భట్టాచార్య//
ఉజ్వలోజ్వలోజ్వల అని సంధి కలపకుండా విడివిడిగా ఏల వ్రాసితిరి?
4.//మేరి సపనోంకి రాణి కబ్ ఆయేగీ తూ ఉజ్వలా ఓ ఉజ్వలా//
మీ ఉజ్వలోపాఖ్యానం జరిగిన 1967లో ఈ పాట ఎలా పాడుకున్నారు. ఆరాధన సినిమా వచ్చినది 1968లో కదా!!
(సరదాగా🙏😊)
వీఎన్నార్ సర్, "Why are you wandering in the veranda.... " ఈ anecdote మొదట మా తాతగారి దగ్గర విన్నాను. ఆయన చదివిన విజయనగరం మహారాజా కాలేజీలో అనుకుంటా Bhy Benkata Bhaginee bhy are you bandering in the berandaa అని ఒక బెంగాలీ ప్రొఫెసర్ వెంకట భగిని అనే స్టూడెంటుని అడిగినట్టు చెప్పేవారు. ఎన్నో ఏళ్ళకి మళ్ళీ మీనుంచి విన్నాను. 😊😊😊😊
హెరి హెరి హెరి హొయిసె కింతు హెరి హెరి హెరి హువా నాయ్ :)
జిలేబి
YVR గారు,
👍🙂
"కింతు" ఒకటే అర్థమయింది "జిలేబి" గారూ. సర్లెండి, అదెంత కాదు గనుక మీ వ్రాతల్లో.
మొత్తం వాక్యం బులుసు వారికేమైనా అర్థమైందేమో?
విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు.
మీరు పలికిన ప్రతీ అక్షరం తోటి త్రికరణశుద్ధి గా అంగీకరిస్తున్నాను. ముఫై ఏళ్ళ పైగా జోర్హాట్ వాసం. అరడజను బెంగాలీ మిత్రులు. అందులో ముగ్గురు మా డిపార్ట్మెంట్. ఏం చెప్పమంటారు? .......... మహా
ఈ జిలేబి గారి హెరి హెరి హెరి ఏమిటో నాకూ అర్ధం కాలేదు. నాకు బెంగాలీ, అస్సామీ కూడా సరిగా అర్ధం కావు. నేర్చుకోలేదు. హొయిసే అంటే అవుతోంది లేక జరుగుతోంది అనే అర్ధం లోనే వాడేవారు అనుకుంటాను. హువా నాయ్ అంటే కాలేదు అనే. వచ్చిన కొద్ది బెంగాలీ, అస్సామీ కూడా ఇప్పుడు మరిచిపోయాను. భావం జిలేబి గారినే అడగాలి. ........ మహా
YVR గారికి. ...... ధన్యవాదాలు.
1. వెళ్ళిందే టిఫిన్, కాఫి కోసం. అవి పుచ్చుకోకుండా వచ్చే సమస్య లేదు.
2. మేము వీధి బళ్ళోనూ, తెలుగు మీడియం లోనూ చదివిన వాళ్ళమే. ఆ మాత్రం తెలుగు వ్రాయలేకపోతే మా గురువులు తగు సన్మానాలు చేసేవారు. అప్పటికీ టివిలు లేవు కాబట్టి యాంకర్స్ గురించి ఊహించలేకపోయాను.
3. ఉజ్వల అని మూడు మాట్లు పలకడంలో ఉన్న ఆనందం కలిపి పలకడంలో ఉండదు కదా. అదీ కాక ఉకృనామీ పరిగెత్తుకుంటూ వచ్చాడు కదా తడబడడం, నొక్కి వక్కాణించడం సహాజమే అనుకున్నాను.
4.పెళ్ళికి ముందు వచ్చిన సినిమా అనే గుర్తుంది కానీ సంవత్సరం గూర్చి పట్టించుకోలేదు. ముందు ముందు ఇంకొంచెం జాగ్రత్త పడతాను. ధన్యవాదాలు గుర్తు చేసినందుకు. ............... మహా
జిలేబి గారికి. ........ ధన్యవాదాలు.
మీ కామెంటు పూర్తిగా అర్ధం కాలేదు. హెరి హెరి హెరి అని మూడు మాట్లు వ్రాయడంలో భావం తెలియ పరిస్తే సంతోషిస్తాం. నాకు తెలిసినంత మటుకు హెరి అనేది as a form of address గా {నిన్నే అనే అర్ధంతో} ఉపయోగించే వారు అనుకుంటాను. (నాకు తెలిసిన బెంగాలీ/ అస్సామీ చాలా తక్కువ) వివరించ ప్రార్ధన. ............ మహా
Sir సుబ్రహ్మణ్యం గారు,
"జిలేబి" గారికి బొంగ్లా భాషతో పరిచయం ఉన్నట్లే తోస్తోందండీ. ఆ భాషలో "అమి" అంటూ ఏదో పాటను పద్యాల బ్లాగ్ లో పోస్ట్ చేసినట్లు "మాలిక"లో కనిపిస్తోంది చూశారా?
విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాలు.
మాలిక లో చూశాను. నా కంటికి కనిపించలేదు జిలేబి గారి వ్యాఖ్య. అయినా వారికి రాని భాషా, తెలియని విషయాలు ఉన్నాయంటారా? ........... మహా
అది నిజమే లెండి.
"శంకరాభరణం" పద్యాల బ్లాగ్ లో ఆగస్ట్ 10, 2019 పోస్ట్ "కలిమి దొలంగినప్పుడే కలుగు సుఖము" లో "జిలేబి" గారు ఇచ్చిన బెంగాలి పాటండి ��
అమీ యేక్ జాజాబోర్"
-----------------
Zilebi ఆగస్టు 10, 2019 3:24 PM
"అమీ యేక్ జాజాబోర్ :)
పృథ్భీ అమాకె అపోన్ కొరోచె :)
జేకే :)
జిలేబి"
------------------
http://anondogaan.blogspot.com/2014/02/aami-ek-jajabar-lyrics-translation.html
కామెంట్‌ను పోస్ట్ చేయండి