సిరి రా మోకాలు అడ్డుట

భూమి గుండ్రం గా ఉందిట -- మీకు తెలుసా?   ఈ విషయం నాకు మొన్ననే తెలిసింది. ఓ శుభ ముహూర్తాన్న బ్లాగు మూసి, తాళం వేసి, తూర్పు తిరిగి దండం పెట్టి, నడక మొదలుపెట్టాను శూన్యం లోకి. చిత్రంగా సుమారు మూడు నెలల తరువాత  మళ్ళీ  బ్లాగు దగ్గరకు వచ్చాను. భూమియే కాదు, బ్లాగు కూడా గుండ్రం గానే ఉంది అని అవగతమైనది. బ్లాగు తెరిచి లోపలికి వెళ్ళి చూస్తే మూడు  ఆసక్తి (నాకే)  గల విషయాలు తెలిసాయి. 

౧. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు. బ్లాగు మూసిన డిసెంబర్ నెలలో పాఠకులు    మూడువేల నాలుగు వందల మంది బ్లాగుకి వచ్చారు. ఇది ఆల్ టైం రికార్డ్ . 

 ౨. జనవరిలో  పాఠకుల  సంఖ్య  50,000 దాటి ప్రస్తుతం ఇంకో రెండు వేల నాలుగు వందలు పైగా  పెరిగారు. రెండున్నర ఏళ్ల పైగా వ్రాస్తుంటే మొన్ననే ఏభై వేలు దాటారంటే నా బ్లాగు పరిస్థితికి నాకే జాలి వేసింది. కానీ మూసివేసిన తరువాత కూడా నెలకి 750 – 1000  దాకా వస్తున్నారని ఆనందము కలిగింది.

౩. మూసివేసిన తరువాత కూడా ఇంకో అర డజను ఫాలోయర్స్ పెరిగినందుకు ముదావహుడను కూడా అయ్యాను.

ఈ ఏడుపు ఏడవడానికి బ్లాగు తెరవాలా అని మీరు కోప్పడకండి. ఇంకో ముఖ్య విషయం మీతో పంచుకోవాలని ఈ వేళ బ్లాగు తాళాలు తీసాను.  

బ్లాగు మూసివేసిన వారం రోజులకు ఆఫ్రికా ఖండం లో ఒక చిన్న దేశంలోని పర్యాటక శాఖ ఉన్నతాధికారి (అని ఆయనే చెప్పుకున్నారు)  నుంచి టెలిఫోన్ వచ్చింది. మీకు కొద్ది రోజుల క్రితం ఒక మెయిల్ పంపాం. మీ వద్దనుండి జవాబు రాలేదు అందుకే టెలిఫోన్ చేసాను అని చెప్పాడు ఆయన. సారీ నాకు మెయిల్ రాలేదు అన్నాను. బహుశా స్పాం లోకి వెళ్ళి ఉంటుంది, చూసి జవాబు ఇవ్వండి అన్నారు.  నేను వెతికాను. మెయిల్ కనిపించింది. పర్యాటక అభివృద్ధి కోసం వారు ఒక కొత్త స్కీము  మొదలు పెట్టారుట.  ఈ స్కీములో డెవలపింగ్ దేశాలనుంచి ప్రతీ సంవత్సరం ఒక ఐదుగురు వ్యక్తులను ఎన్నిక చేసి వారికి రెండు  లక్షల డాలర్స్ బహుమతి ఇస్తారుట.  ఆ వ్యక్తి తనతో ఇంకో నలుగురిని  తీసుకుని  వాళ్ళ దేశం వెళ్ళాలిట. ఖర్చులన్నీ వారే భరిస్తారుట.  పది రోజులు వారి దేశం లో విఐపి  లాగా చూస్తారట. దేశం అంతా తిప్పి చూపిస్తారట. తిరిగి వచ్చేటప్పుడు  ఒక్కొక్కరికి  రెండు వేల డాలర్స్ విలువ చేసే బహుమతులు ఇస్తారుట,  వాళ్ళ దేశం లో తయారు చేసే హస్త కళలు, ఇతర మెమెంటోలు.  వాళ్ళ దేశం గురించి ఒక రెండు పేరాలు కూడా వ్రాసారు.  ఈ ఇరవై మంది వాళ్ళ దేశపర్యాటకానికి వారి వారి  దేశాలలో  తగు ప్రచారం కల్పిస్తారనే ఆశ వ్యక్తం చేసారు.

చూడగానే ఆసక్తి కలిగింది. కానీ ఇలాంటివి చాలానే మెయిల్ లు వస్తుంటాయి. స్పాం లోకి వెళ్ళిపోతుంటాయి. వాటిని ఎప్పుడూ పట్టించుకో లేదు. ఇది కూడా అలాగే అనుకుని ఊరుకున్నాను.  ఒక వారం రోజుల తరువాత మళ్ళీ టెలిఫోన్ చేసాడు ఆయన.  నేను ఇలాంటివి నమ్మను అని ఖరాఖండిగా చెప్పేసాను.  ఏంచేస్తే మీరు నమ్ముతారు అని అడిగాడు. ఆలోచించకుండా  “మీ గురించి, మీ సంస్థ గురించే కాదు మీ దేశం గురించి కూడా నాకు తెలియదు. మీ గురించి ఎంక్వైరి చేయాలంటే నాకో రెండు వేల డాలర్లు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టే ఉద్దేశ్యం నాకు లేదు.” అని చెప్పాను. నేను మళ్ళీ  మాట్లాడుతాను అని చెప్పేడు.  

ఇంకో వారం  రోజుల తరువాత  మళ్ళీ  టెలిఫోన్  చేసాడు. మీకు రెండు వేల డాలర్స్ ఇవ్వడానికి మా సంస్థ అంగీకరించింది. మీ బేంక్ వివరాలు చెపితే మేము పంపిస్తాము  అన్నాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.  భయం వేసింది, వీళ్ళ ఉచ్చులో పడుతున్నానా అని.  ఓ వెఱ్ఱి నవ్వు నవ్వి,  సారీ నా బాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వను. అయినా నా మీద అంత ఇంట్రెస్ట్  ఎందుకు మీకు, ఇంకోరెవరినైనా తీసుకోవచ్చు కదా అని కూడా అన్నాను. మీరు బేంక్ గురించి  ఇలా అంటారని అనుమానించాను కానీ ప్రయత్నం చేసాను,  అని నవ్వాడు. మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మాకు నాలుగు  నెలల పైన పట్టింది.  కంప్యూటర్ ద్వారా  రాండం గా ఐదు దేశాలని ఎన్నుకున్నాం. ఆ దేశంలో ప్రదేశాలను కూడా రాండం గానే ఎన్నుకున్నాం. ఆ చోట్ల లో చిన్న పట్టణాలను టార్గెట్ చేసి ఆరు అంకెల టెలిఫోన్ నంబర్లను రాండం గా జెనేరేట్ చేసాం. పెద్ద పట్టణాలలో విదేశయానాలు చేసేవారు ఎక్కువుగా ఉంటారని అనుకున్నాం. వారి కి ఇలాంటి చిన్న దేశాల మీద ఆసక్తి ఉండకపోవచ్చు. వారి వల్ల మాకు ఎక్కువ ప్రచారం జరగక పోవచ్చు.  ఆ తరువాత STD  కోడ్ కూడా రాండం గానే తీసాం. మీ నంబర్ వచ్చింది. మీ పేరు, నంబర్ ద్వారా మా ఎక్స్పర్ట్స్ మీ వివరాలు  సేకరించారు. మీ దేశం తో మాకు దౌత్య సంబంధాలు ఉన్నాయి.  డిల్లీ లో మీ  ఆఫీసు నించి, ఇతరత్రా   మీ గురించి వివరాలు  సేకరించాము,  అని సుదీర్ఘం గా ఉపన్యాసం ఇచ్చాడు. ఇది అంతా చేయడానికి మాకు నాలుగు నెలలు పట్టింది. ఇప్పుడు మళ్ళీ   మొదలు పెట్టాలంటే ఇంకో అంత టైం పడుతుంది కదా అని కూడా చెప్పాడు. మీ బేంకు పేరు చెప్పండి. మేమేదో మార్గం ఆలోచిస్తాం అన్నాడు. అది చెప్పడానికి అభ్యంతరం లేదు అని బేంక్, బ్రాంచ్ చెప్పాను.

ఇంత వివరంగా మన గురించి వివరాలు సేకరించారంటే కొంత నిజం ఉండే ఉంటుంది. ఇప్పుడు నాకు కొంత నమ్మకం కలిగింది,  అనుమానాలు పూర్తిగా తీరకపోయినా.    లెఖ్ఖలు వేయడం మొదలు పెట్టాను. ఒక కోటి రూపాయలు దాకా వచ్చే అవకాశం కనిపిస్తోంది. టాక్స్ ఓ ముఫై లక్షలు పోయినా డెబ్భై  లక్షలు  మిగులుతాయేమో.   నిజం చెప్పద్దూ ఆశ పెరగడం  మొదలయింది. ఒక పది రోజుల  తరువాత మా బేంక్ మేనేజర్ ఫోన్ చేసాడు. వెళ్లాను. వారు అడిగిన ఋజువులు అన్నీ చూపించాను. నా పాన్ కార్డ్, నా పెన్షన్ మెమో, ఆ అధికారి పేరు, టెలిఫోన్ నంబర్, ఆయన నాకు టెలిఫోన్ చేసిన తేదీలు లాంటివి అడిగి నిర్దారించుకున్నాడు. రెండు రోజుల్లో మీ అకౌంట్ లో 2000 డాలర్స్ ఆ రోజు మారకం ధరతో జమ చేయబడతాయి.  రేపు మీరు ఒక హామీ పత్రం ఒక స్యూరిటి సంతకం తో ఇవ్వాల్సి ఉంటుంది,  మీరు సరి అయిన ఖర్చు వివరాలు ఇవ్వకపోతే, డబ్బు తిరిగి ఇస్తానని. సరే నని వచ్చాను.

ఆ వేళ డాలర్స్ గురించి అడిగాను తప్ప ఎలా నిర్దారించుకోవాలో తెలియలేదు. వాళ్ళు డబ్బు పంపిన తరువాత కూడా ఇంకా అనుమానం ఎందుకు అని మనసు తొందర పెట్టింది. ఏమో ఎర వేసారేమో అనే అనుమానం కూడా వచ్చింది.  డబ్బు నా అకౌంట్ లో జమ అయిన మర్నాడు ఆయన మళ్ళీ  టెలిఫోన్ చేసాడు. ఇప్పుడు మా మీద నమ్మకం కుదిరిందా అని అడిగాడు.  పదిహేను ఇరవై రోజులలో మీ నిర్ధారణ చేసుకుని అంగీకారం తెలుపుతారని ఆశిస్తున్నాను అన్నాడు. మా దేశం తో దౌత్య సంబంధాలు ఉన్నాయంటున్నారు కదా, మా ప్రభుత్వం ద్వారా ఇది పంపించవచ్చు కదా అని అడిగాను. ఈ స్కీము ఈ సంవత్సరమే మొదలు పెడుతున్నాము. మా ప్రెసిడెంట్ దీన్ని ఆఫీషియల్ గా జూన్  చివరి వారం లో ప్రారంభిస్తారు.  అప్పుడు వారు  మీ పేర్లు వెల్లడిస్తారు. అప్పటిదాకా రహస్యం గానే ఉంచమని మనవి.  అంతదాకా మేము మా పని అనదికారికం గా చేసుకోవాలి. మీకు బహుమతి డబ్బు  కూడా ఆ తరువాతే పంపిస్తాం,  మీ ప్రభుత్వ అనుమతి తో మా రాయబార కార్యాలయం ద్వారా. మా దేశం లో మీ బృందం పర్యటన అక్టోబర్ చివరి  వారం నుంచి నవంబర్ మొదటి వారం దాకా ఉంటుంది. నవంబర్ నాలుగవ తారీఖున మా ప్రెసిడెంట్ మిమ్మలనందరిని కలుస్తారు. అని చెప్పాడు.

కిం కర్తవ్యం అనుకున్నాను. నాకు నమ్మకం కుదిరినా, వాళ్ళు డబ్బు పంపారు కాబట్టి  ఏదో విధంగా నిర్ధారణ కార్యక్రమం మొదలు పెట్టాలి. మా మిత్రుడి కుమారుడు సౌత్ ఆఫ్రికా లో ఉన్నాడు. వాడికి  టెలిఫోన్ చేసాను. విషయం వివరంగా చెప్పి ఏమైనా చేయగలవా అని అడిగాను. ప్రయత్నిస్తాను అని చెప్పాడు. ఎందుకైనా మంచిదని బ్లాగ్మిత్రులు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారిని సంప్రదించాను. వారు కూడా వారి  మిత్రులతో మాట్లాడి చేయగలిగినదంతా చేస్తానని హామీ ఇచ్చారు.  ఒక పదిరోజులు తరువాత శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు, ఇందులో అనుమానించాల్సింది ఏమీ లేదని చెప్పారు. వారి మిత్రులు ఈ విషయం చెప్పారని తెలిపారు. ఇంకో పది రోజుల  తరువాత మా మిత్రుని కుమారుడు అదే విషయం చెప్పాడు. వాళ్ళ ఆఫీసు తో లావా దేవీలు ఉన్న ఒక ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ద్వారా కనుక్కున్నాడట. ఆ అధికారిని, అతని వివరాలనీ కూడా పంపించాడు.  అంతేకాదు మిగతా నలుగురి విజేతల  పేర్లు కూడా  పంపించాడు.  విజేతలు అనవచ్చా. నేను కూడా ఒకడిని.

 నాల్గైదు రోజుల తరువాత  ఆయన  ఫోన్  చేస్తే అంగీకారం తెలిపాను. ఆయన  సంతోషించాడు.  ఒక పదిహేను  రోజుల తరువాత వారి నుంచి కొన్ని పత్రాలు వచ్చాయి.  వాటిని న్యాయపరం గా,  పరిశీలించి  పూర్తి చేసి పంపించాను.

అదీ సంగతి. ఈ శుభ వార్త  మీ తోటి పంచుకోవాలని బ్లాగుకి తాళం తెరిచాను.


అడిగిన వెంటనే స్పందించి వారి మిత్రుల ద్వారా నా అనుమానం నివృత్తి చేసినందుకు శ్రీ పప్పు శ్రీనివాస రావు గారికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 



గమనిక: - ఈ టపా మొదటి మాటు ఏప్రిల్ ఒకటవ తారీఖు 2013 న పబ్లిష్ చేయబడినది. 

50 కామెంట్‌లు:

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆగండాగండి , కామెంటు పెట్టే ముందు.

ఈ కధ మీరు నమ్మితే ఏప్రిల్ ఒకటో తారీఖు మీదే. నమ్మకపోతే నాది. ఎవరిదైనా, ఒక దరహాసం వికసించ నీయండి మీ పెదవుల మీద.

నిజాయితీ గా చెప్పండి ఒకటో తారీఖు మీదా ?నాదా ?

Sravya V చెప్పారు...

కెవ్వ్ గురువు గారు ముందు కామెంట్ పెట్టి తరవాత కథ చదువుతా :-)

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

నమ్మినా నమ్మక పోయినా మీరు మళ్ళీ బ్లాగ్ లోకి అడుగుపెట్టారు అందుకు సంతోషం. ఇకపై నవ్వులకి ఏమి కొదవ !?

:) :)

Sravya V చెప్పారు...

హ హ సూపర్బ్ ! మీకు కూడా ఉత్తుత్త శుభాకాంక్షలు. బ్లాగ్ తాళాలు ఇలా అన్న తెరిచినందుకు చాల చాల హాప్పీస్ :-)

Siva Kumar Kolanukuduru చెప్పారు...

Ha Ha Haaaaaaaaaaaa.....గురువు గారు... చాలా బాగుంది..చాలా చాలా...!!
నిజాయితీ గా చెప్పండి ఒకటో తారీఖు మీదా---ఫూల్స్(నాలాటి) కి నిజాయితీ ఉండాలంటారా.. ద.హా... ;):P

హరే కృష్ణ చెప్పారు...

మీ శిష్యులుగా ఐదో పారా వరకు అవగతం ఆకేల్డు ఏప్రిల్ ఒకటి కదా ఈరోజు అని :))
పోస్ట్ సూపర్ :)
మీ మొదటి కామెంట్ BINGO

శిశిర చెప్పారు...

>>>నిజాయితీ గా చెప్పండి ఒకటో తారీఖు మీదా ?నాదా ?<<<

నాదే గురువుగారూ. మీరు ఇంత పకడ్బందీగా చెప్పేసరికి.. :))))

Narsimha Kammadanam చెప్పారు...

నాది కూడా ఒకటో తారీకే.... ఇలాంటి ఎన్ని తారీకులైనా తీసుకుంటా మీరు బ్లాగును కొనసాగిస్తే.....

పోస్ట్ అదుర్స్....మాష్టారు

రాధిక(నాని ) చెప్పారు...

:))హ్హ హ్హ హ్హ హ్మ్ నాదే .........

sai krishna alapati చెప్పారు...

ఇలాంటి మలుపు ఒకటి ఉంటుంది అని అనుకొంటూనే చదివాను అండి . ఏది ఏమి అయితేనే మీరు మళ్ళీ మీ నిర్ణయాన్ని మార్చు కొన్నందుకు ధన్య వాదాలు తెలుపుకొంటూ ..
సాయి కృష్ణ ఆలపాటి

sai krishna alapati చెప్పారు...

ఇలాంటి మలుపు ఒకటి ఉంటుంది అని అనుకొంటూనే చదివాను అండి . ఏది ఏమి అయితేనే మీరు మళ్ళీ మీ నిర్ణయాన్ని మార్చు కొన్నందుకు ధన్య వాదాలు తెలుపుకొంటూ ..
సాయి కృష్ణ ఆలపాటి

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హమ్మో చాలా పగడ్బందీ వ్యూహంతో వచ్చారుగా :-) అసలు ఈరోజు మీ బ్లాగ్ ప్రారంభించారంటేనే కాస్త అనుమానం వచ్చింది కానీ చాలా పక్కాగా రాశారు గురూజీ :-) ఒకటోతారీఖు మీదీ నాదీ కాదు మనది :ఫ్ వెల్కం బాక్ :-))

అజ్ఞాత చెప్పారు...

అందుకే అంటారు.. ఓసారి బ్లాగువ్యసనంలో పడ్డవారికి,ప్లస్సులూ, ఫేస్ బుక్కులూ నచ్చక తిరిగి బ్లాగుల్లోకి వచ్చేస్తారు !! నల్లమందులాటిది మాస్టారూ...
పొన్లెండి ఇప్పటికైనా తెలిసికున్నారు...

మనసు పలికే చెప్పారు...

అమ్మో అమ్మో.. ఇంత కుట్రా.. మీ ఏప్రిల్ ఒకటో తారీఖు వ్యాఖ్య చదివే వరకూ నాకు ఆ అనుమానమే రాలేదు :( తారీఖులు, వారాలు మర్చిపోతున్నాలే ఇంట్లోనే ఉండి. అయినా మరీ ఇంత పకడ్బందీగానా !!!

..nagarjuna.. చెప్పారు...

పోస్ట్ వెయ్యకముందే మీతో ఫారిన్ వెళ్ళే నలుగురిలో ఒక బెర్తు నేను ముందే బుక్ చేసుకున్నానుగా గురూజీ. ఆ బెర్తు ఈ రోజు కూడా నాదే :)

శశి కళ చెప్పారు...

అరె ఇలాటివి ఉంటాయా?చక్కగా ప్రయాణం చేసి సంతోషంగా రండి

Prasanth చెప్పారు...

నాది కూడా ఒకటో తారీకే

అజ్ఞాత చెప్పారు...

హ హ హ...ఒకటో తారీఖు నాదే గురువు గారు.
చాలా రోజుల తరువాతా రాసారు, ఆ ఆనందం లో మీరు ఏం చెప్పిన తల ఆడించేసాను .
ఆఖరకి బ్లాగ్ లోకం లో ప్రసిద్దులని కూడా వదలలేదు మమ్మల్ని ఫూల్స్ చేయడానికి.
మీరు మళ్లి వ్రాస్తున్నందుకు మాత్రం సంతోషం.
:venkat

మాలా కుమార్ చెప్పారు...

క్షేమంగా వెళ్ళి లాభంగా రండి .

Zilebi చెప్పారు...

ఒక వారం తరువాయి మీ అకౌంటు నించి మొత్తం డబ్బులు గుటకాయ స్వాహా అని పారి పోక మునుపే, డబ్బులు తీసేసుకుని, ఇక్కడ కామెంటిన మా లాంటి మీ 'ఫ్యాను' లకు తలో పరకో ఇట్లా పారేయండీ !

లేకుంటే, మీకు మోకాలు జబ్బు వచ్చును !

సిరి, రా, మోకాలు అడ్డు పడకున్న, సిరి అందరికి పంచేయాలండోయ్ !

చీర్స్
జిలేబి.

Sujata M చెప్పారు...

what a coincidence ? i am .the second winner

Sag చెప్పారు...

ఒకటో తారీఖు కి సార్ధకత చేకూర్చారు ..... వండర్fullu

Sag చెప్పారు...

ఒకటో తారీఖు కి సార్ధకత చేకూర్చారు ..... వండర్fullu

Sridevi చెప్పారు...

Bulusu gaaru, itharulanu fools chesi navvukune sampradaayam kaadu kada manadi? emantaaru?

Sridevi చెప్పారు...

Bulusu gaaru, meeru kabatti ee comment vraasthunnaanu, itharulanu fools chesi navvukune sampradaayam kaadu kadaa manadi? emantaaru?

KumarN చెప్పారు...

హ హ భలే రాసారు గురువు గారు. ఇలాంటి పోస్టులకి వచ్చిన కామెంట్స్ ని వెంటనే ప్రచురించకూడదండీ. ఒకరోజన్నా ఆగితే బెటర్ ఏమో, అగ్రిగేటర్స్ లో కామెంట్స్ సెక్షన్ లో కామెంట్స్ కనపడిపోతుంతాయి కదా..అక్కణ్ణుంచి బ్లాగ్ కి వచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. సస్పెన్స్, సర్ ప్రైజ్ ఎలిమెంట్ అక్కడే పోతుంది.

కామెంట్స్ ముందే చదివినప్పటికీ కూడా నన్ను సగం పోస్టు దాకా నమ్మించగలిగారు.
ఇంతకీ మొదట రాసిన మూడు పాయింట్లు నిజమే కదా :P

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రావ్యగారికి,

మీకు నిజంగా ధన్యవాదములు. బ్లాగు తాళాలు తెరిచానా? యాక్సిడెంట్ అంతే....దహా.

వనజావనమాలి గారికి,

ధన్యవాదాలు. నవ్వించినా, నవ్వించలేక పోయినా టపాలు వ్రాసేయాలంటారా ? అలాగలాగే.

శివకుమార్ గారికి,

నిజాయతీ గా నిజం ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు.

హరేకృష్ణ గారికి,

అయిదు పేరాల లోనూ సత్యమే వచియించితిని......దహా.
ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ముందు జాగ్రత్తగా మొదట కామెంటు పెట్టాను.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శిశిర గారికి,

పకడ్బందీ గానే ఉందంటారా? పబ్లిష్ చేసిన తరువాత ఒకటి నాదే అనుకున్నాను. ధన్యవాదాలు.

నరసింహ గారికి,

మళ్ళి ఏడాది దాకా ఇలాంటివి ఉండవు లెండి. ధన్యవాదాలు.

రాధిక (నాని) గారికి,

అంత సంతోషంగా నవ్వుతూ నాదే అన్నందుకు శతధా ధన్యవాదాలు.

సాయి కృష్ణ గారికి,

అనుమానంగానే చదివారా? నా మీద నమ్మకం లేదంటారా? ఏంచేస్తాం కానీండి. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణు శ్రీకాంత్ గారికి,

మీ అందరినీ నమ్మించాలంటే పక్కా వ్యూహం కావాలి గదండి. కనీసం కొంతమంది దగ్గరైనా ఫలించినందుకు సంతోషం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరేఫాలా గారికి,

వ్యసనం అని కాదు కానీ, మీలాంటి మిత్రులను చూడకుండా ఉండలేకపోయాను. దహా.
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.

మనసు పలికే గారికి,

నిజంగా నమ్మేసారా? గురువుగారికి కోటి రూపాయలు వచ్చేసాయి గదా వెంటనే ఏలూరు వెళ్ళి మీ వాటా తెచ్చేసుకోవాలని కూడా అనుకున్నారు కదా........దహా.
ధన్యవాదాలు బిజీ గా ఉండి కూడా వచ్చి వ్యాఖ్య పెట్టినందుకు.

నాగార్జున గారికి,

ఘటికులే మీరు. లాటరీ టికెట్ కొనకుండానే నాకు వచ్చే డబ్బులికి పద్దు మీరు వ్రాసేసారన్నమాట......దహా.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శశికళ గారికి,

అలాగే, మీరు పంపిస్తానంటే........దహా.
ధన్యవాదాలు.

ప్రశాంత్ గారికి,

ధన్యవాదాలు. మీకు కూడా జై.

వెంకట్ గారికి,

మిమ్మలనందరిని నమ్మించడానికి శ్రీ పప్పు శ్రీనివాస రావు గారి పేరు ఉపయోగించాల్సి వచ్చింది. అయన పేరు ఉండడం వల్లే చాలామంది నమ్మారనుకుంటాను, నా సంగతి తెలిసి కూడా. ధన్యవాదాలు.

మాలా కుమార్ గారికి,

మీరు మొదటి కామెంటు చదవలేదు అనుకుంటాను.ఏమిటో అనుకున్నాను కానీ మీరు నిజంగానే అమాయకులే నండి........దహా.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి,

ఫ్యాన్ ల మీదకు డబ్బులు పారేస్తే ఎగిరిపోతాయండి.
అదేమిటో నా మోకాలు ఎప్పుడూ అడ్డు పడుతూనే ఉంటుందండీ.
ధన్యవాదాలు.

సుజాత గారికి,

అయితే మీకో రెండు వీర తాళ్ళు.
ధన్యవాదాలు.

సాగర్ గారికి,

ధన్యుడిని. ధన్యవాదాలు.

రహ్మానుద్దిన్ షేక్ గారికి,

రెండు దహాలు.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీదేవి గారికి,

అవహేళన చేయడం సాంప్రదాయం కాదు. కానీ laughing with & laughing at రెండిటి లోనూ తేడా ఉంది కదండీ.

ఎవరైనా అరటి పండు తొక్క మీద కాలు వేసి జారి పడితే చూసే వాళ్ళలో చాలామంది నవ్వుతారు. ఎందుకు నవ్వుతారా అని చాలా పరిశోధనలు జరిగాయి. చాలా సిద్ధాంతాలు వచ్చాయి. ఈ తొక్క విషయంలో relief theory అంటారు. పడ్డవాడికేమి కాలేదు అని ఒక ఆనందంతో నవ్వుతామట. మెదడు పొరలలో అనేక ఆలోచనలు టెన్షన్ లు ఉంటాయిట, పడుతుండగా చూస్తుంటే. పడకుండా ఆపగలిగేటంత దగ్గర లేమే, పడితే దెబ్బలు తగిలితే, ఇత్యాదులు. పడ్డ వాడు లేచి దులుపుకు పోతుంటే టెన్షన్ తగ్గి మనకి నవ్వు వస్తుందిట. అదే వాడికి దెబ్బలు తగిలితే పరిగెట్టుకు వెళ్ళి వాడికి సపర్యలు చేస్తామట. అప్పుడు నవ్వం.
ఇక్కడ అంతా సహృదయులే . మయసభలో జారిపడే దుర్యోధనులు లేరనే అనుకుంటాను.
అవకాశం వచ్చింది కదా అని అనవసర ప్రసంగం చేసినట్టున్నాను. సారీ.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

కుమార్ గారికి,

మీరే నమ్మేసారంటే జాగ్రత్తగానే వ్రాసానన్నమాట. టపా పబ్లిష్ చేసిన వెంటనే, ఒక నిముషం లోపునే నేను మొదటి కామెంటు పెట్టాను. ఏప్రిల్ ఒకటి టపా అని. కానీ వ్రాసింది కుదిరిందా లేదా చెప్పమన్నాను.
ఆ మొదటి మూడు పాయింట్లు నిజమే నండి. దహా అనకూడదు. ఏ.న.న. (ఏడ్వలేక నవ్వే నవ్వు)
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

ఆ.సౌమ్య చెప్పారు...

నేస్తం గారి ప్లస్ పోస్ట్ చూసాను కాబట్టి గ్రహించేసాను కానీ లేదంటే మీరు రాసిన విధానానికి కచ్చితంగా నమ్మేసుండేదాన్ని. ఇంత తెలిసినా పోస్ట్ సగం చదివాక నిజమేమో అని అనుమానం వచ్చింది సుమండీ...అంత నమ్మబలికారు మీరు :)) కాబట్టి ఏప్రిల్ ఒకటి సగం మీది, సగం నాది :D

Sujata M చెప్పారు...

నేనయితే మొదట చదూతుండగా భయపడ్డాను. అసలే ఈయనకి ఫాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అందునా, మూసిన బ్లాగ్ తెరిచేరు. ఇలాంటి నైజీరియా మోసాల తరహా ఊబి లో (పప్పు గారి రికమెండేషన్ కూడా - అథెంటిక్ గా) ఇంత నిఖార్సుగా కూరుకుపోతూ, దాన్నిలా బ్లాగు లో చెప్తున్నారే ! ఎంత మంది మళ్ళీ ఈ ఈ-మెయిలు మోసాల రాదారి లో దూసుకుపోతారో అని ! కానీ బుర్ర మెల్లగా వెలిగింది. ఈ లోగా మొదటి కామెంటు మీరే పెట్టడం వల్ల టైటానిక్కు షిప్పు ఐసుబెర్గ్ పక్క నుండీ వెళ్ళిపోయింది. లేపోతేనా ! .. హమ్మో హమ్మో వాహాట్ ఎ రీ-ఎంట్రీ !!!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ.సౌమ్య గారికి,

ధన్యవాదాలు. మీరే నమ్మేసారంటే కధలో పాళ్ళు సరిగ్గానే కుదిరాయన్నమాట.
మళ్ళి సగం మీకెందుకు లెండి పూర్తిగా నాదే.....దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సుజాత గారికి,

మీరేమో ఫాన్ ఫాలోయింగు అంటారు. వెనక్కి చూస్తే రెండున్నర ఏళ్ళకి ఏభై వేలు పాఠకులు మాత్రమే. (అందులో ఓ వెయ్యి హిట్స్ నావే ఉంటాయను కుంటాను)...దహా.

ఇది అనుకోకుండా వ్రాసిన టపా. ౨౪వ తారీఖున మిత్రుడు బసంత్ బారువా టెలిఫోన్ చేసాడు జోర్హాట్ నుంచి. టాపిక్ హోలీ సైటేషన్స్, ఏప్రిల్ ఒకటి మీదకు వెళ్ళింది. చేసిన అల్లరి గుర్తు తెచ్చుకుని నవ్వుకున్నాం. హోలికి ఒక ఇరవై మంది స్టాఫ్ మెంబర్స్ కి సైటేషన్స్ వ్రాసి ఎవరూ చూడకుండా ఆఫీస్ గేటు దగ్గర అతికించేసేవాళ్ళం, అర్ధరాత్రి దాటిన తరువాత. సుమారు ఒక పదిహేను ఏళ్లు నిరాటంకం గా సాగింది. ఆ తరువాత బాధ్యతలు పెరిగి మా మొహాలు సీరియస్ అయ్యాయి. ఆ జ్ఞాపకాల లోంచి వచ్చింది ఈ ఐడియా, మననే ఎందుకు ఫూల్స్ చేసుకోకూడదు అని. అందుకనే ఎవరూ నమ్మని లాటరీతో నమ్మించడానికి ప్రయత్నం చేసాను. నమ్మరనే అనుకున్నాను. శ్రీ పప్పు శ్రీనివాస రావు గారు కూడా మొదటి డ్రాఫ్ట్ చూసి అదే అన్నారు. మళ్ళి కొద్దిగా మార్చి ప్రయత్నించాను.

ఇది వన్ టైం టపా యే అనుకున్నాను కానీ మీ అందరి ప్రోత్సాహం చూస్తుంటే అప్పుడప్పుడు వ్రాయాలనే అనిపిస్తోంది....దహా.

Zilebi చెప్పారు...

వామ్మో వామ్మో,

ఇది నిజం గాదా ? ఏప్రిల్ ఫూల్ సమాచారమా ? ఏదో కామెంటు కొడితే రొక్కం గిట్టక పోదా అని కా మెంటినా నే ! నా సొమ్ములు పోయినాయే మరి !

ఉండండి , మీ భరతం పడతాం !

రాబోయే ఏప్రిల్ ఫూల్ నాడు అదేమిటో మీకు తెలిసి వస్తుంది !


చీర్స్
జిలేబి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి,
రామాయణం అంతా విని రాముడు ఎవరూ అని అడుగుతున్నారా?......దహ.

మళ్ళి ఏప్రిల్ ఒకటి కోసం ఎదురు చూస్తున్నా. ధన్యవాదాలు.

Karthik చెప్పారు...

నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు తిప్పారు...మా కొసం మీరు ఇలాగె మీ బ్లాగ్ కు తాలం వెయకుండా రాయలని కోరుకుంటూ మీ అభిమాని.. మొత్తానికి సూపర్ గా రాసారు ......

Karthik చెప్పారు...

నెను చదివిన మీ మొదటి రచన ఇదె.. ఎంతా బాగా మీ మలుపు తిప్పారు...మా కొసం మీరు ఇలాగె మీ బ్లాగ్ కు తాలం వెయకుండా రాయలని కోరుకుంటూ మీ అభిమాని.. మొత్తానికి సూపర్ గా రాసారు ......

sarma చెప్పారు...


నిఝంగానే నమ్మేశానండి :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆశ్చర్యం, sarma శర్మ గారు 2013 లోనే ఈ టపా బాధితుల జాబితాలో జేరకుండా తప్పించుకోవడం ! 🤔🙂

sarma చెప్పారు...



అప్పటిదీ ఇదే మాటండి.చెప్పలేదంతే ;)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మగారికి. ......... ధన్యవాదాలు. మీరు నమ్మారు అంటే కధ కుదిరిందనే నమ్ముతాను. ........... మహా

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. ఇంతకీ మీరు బాధితుల జాబితాలో ఉన్నారా? నన్ను జేర్చారా? ......... మహా

sarma చెప్పారు...


నిజంగానే నమ్మెశానండీ కింద కామెంట్లు చదివేదాకా ఇప్పుడు కూడా :)

హరేఫల చెప్పారు...

బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...

Lalitha చెప్పారు...

అప్పుడెప్పుడో మీ బ్లాగులు miss అయినా ఇప్పుడిలా చదవడం, నవ్వుకోవడం బావుంది :)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ బక్రాలు బలే దొరుకుతారు కదూ మీకూ...” //

బకరాలే బులుసు వారిని వెదుక్కుంటూ ఎదురెడతారు, ఫణిబాబు గారూ 😁.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శర్మ గారికి. ........ ధన్యవాదాలు. మీ అభిమానం అల్లా పలికిస్తుంది. అంతే. .............. మహా

హరేఫల గారికి. ...... ధన్యవాదాలు. అవునూ ఫణిబాబు గారూ, నా చెవి అంత మెత్తగా ఉంటుందా? వచ్చినప్పుడల్లా మెలేస్తుంటారు మీరు. .......... మహా

లలిత గారికి. ...... ధన్యవాదాలు. మళ్ళి చదివిస్తున్నాను అన్నమాట. ........... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ...... ధన్యవాదాలు. ఫణిబాబు గారికి, నాకూ ఇది అలవాటే లెండి 2010 నుంచి. వారి బ్లాగులో నేను నా బ్లాగులో వారు సరదాగా కామెంటడం. ........... మహా