ఉపోద్ఘాతం: ఈ టపా తిరిగి వెయ్యడానికి ఒక కారణం ఉంది. కిందటి నెలలో రెండు దినాలు వచ్చాయి. ఒకటి జూన్ 14 న ఈ బ్లాగు పుట్టిన రోజు. మరిచే పోయాను. రెండవది జూన్ 28న మా ఏభై వ వివాహవార్షిక దినం. ఇది గుర్తు ఉంది. కానీ కరోనా కారణంగా హడావడి ఏమి చేయలేదు. కానీ సంగతి తెలిసిన ఒక మిత్రుడు అడిగాడు.
"ఈ ఏభై ఏళ్లలో విడాకులు తీసుకోవాలని అనుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? వివరింపుము" అని. వాడు సరదాగానే అడిగాడు. అంతే సరదాగా నేను ఈ టపా లింక్ వాడికి పంపాను.
మీరు కూడా చదివెయ్యండి.
మా ఆవిడకు విడాకులు ఇచ్చేస్తాను
ఇది ఉన్నట్టుండి తీసుకొన్న నిర్ణయం కాదు. అనేక విధాలుగా, అనేక కోణాలలో ఆలోచించి, చర్చించి, ఇంకో మార్గం ఏది తోచక తీసుకో బోతున్న నూతన సంవత్సర తీర్మానం. అయినా తీర్మానం చేసుకొనే ముందు బ్లాగు మితృలు, బ్లాగు బంధువులు, బ్లాగాప్తులు అయిన మీ అందరికీ తెలియపర్చి, మీ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలని పించింది.
జనవరి ఒకటవ తేదీన మీరందరూ ఈ బ్లాగు నించి ఆ బ్లాగు లోకి పరిగెడుతూ , నూతన శుభాకాంక్షలు అని నొక్కుతూ మధ్య మధ్యలో మీ బ్లాగులోకి వెళ్ళి, ఇంకా కాంక్షించని వారెవరా అని లెక్క చూసుకుంటూ చాలా బిజీ గా తిరుగుతుంటారని తెలుసు కాబట్టి, నాలుగు రోజులు ముందుగా నా ఈ జీవన్మరణ సమస్య మీ ముందుకు తెచ్చాను. మీరు జాగ్రత్తగా ఆలోచించి, అవసరమైతే మీ పక్కవారి బుఱ్ఱ కూడా తినేసి నాకు తగు సూచనలు చేసి, నాకు మార్గదర్శకులు కండు అని ఎలుగెత్తి నివేదించుకుంటున్నాను. మీరైతే బోల్డన్ని బ్లాగులు చదివేసి బోల్డంత జ్ఞానము సంపాదించిన, జ్ఞానము నిండుకున్న మెదడు కలవారని (అచ్చు తప్పయిన క్షమించవలెను) మీకు సవినయంగా, వినమ్రము గా విన్నవించు కుంటున్నానన్నమాట.
శాంతభూషణుడే కానీ అలుగుటయే ఎరుంగని అమాయక జీవి వాడూ
అని రాగం కూడా తీసి పాడుకొనే వాడిని. ఇల్లాగే పడుతూ లేస్తూ సర్దుకుపోతూ 40 ఏళ్ళగా ఈ సంసార రధాన్ని లాక్కువచ్చాను.
మొన్న మా బావమరిది వచ్చాడు హైదరాబాదు లో ఎవరిదో పెళ్ళికి. అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బంధువుల ఇళ్ళలో ఏవో గొడవల గురించి మాట్లాడుతూ మా ఆవిడ అంది. “ఏదోరా మీ బావ కొంచెం పొట్టి అయినా, మా సంసారం సాఫీ గా, సరదాగానే సాగిపోయింది ఇప్పటిదాకా” .
అంటే 40 ఏళ్ల తర్వాత కూడా నేను పొట్టి అన్న విషయం ఇంకా నొక్కి మరీ వక్కాణించాలా? నేను 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే ఆవిడ 5 అడుగుల ఐదున్నర అంగుళాలు. ఈ మాత్రం దానికే ఆవిడ పొడుగు నేను పొట్టి అని చాటింపు వేయాలా అని ప్రశ్నిస్తున్నాను. ఆవిడ పెద్ద పొడుగా అని నేను కొచ్చెనింగు అన్న మాట. ఇహ నే తాళ జాల, విడాకులే శరణ్యం అని మరొక్కమారు కఠిన నిర్ణయం తీసేసుకొన్నాను. కొత్త సంవత్సరం లో మంచి లాయరు ని వెతికి విడాకుల కార్యాచరణ మొదలు పెట్టేస్తాను.
నా వ్యధా భరిత కధ మీరు కూడా విన్నారు కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా నాకు పంపండి. విడాకులు ఇచ్చవలెనా?
ఇచ్చకూడదా?
గమనిక :- ఈ టపా మొదట ఈ బ్లాగులో 28/12/2010 న ప్రచురించబడింది.

ఈ నా సమస్య ఈ నాటిది కాదు. అనేక సంవత్సరముల నుండి నన్ను మానసిక క్షోభ కు గురిచేస్తున్న బృహత్తర సమస్య. జూన్ 29, 1970 నుంచి నామనస్సులో మెదలుచున్న ఆలోచన. జూన్ 28, 1970 న ప్రద్యుమ్నుడు అనబడే నాకు చి. ల. సౌ. ప్రభావతి అనబడు కన్యాకామణి తో వివాహ మహోత్సవం జరిగింది.
అసలు పెళ్లి రోజున, పెళ్లి పీటల మీద ఏం జరిగిందో మీరు ఊహించగలరా. పెళ్లి పీటల మీద నేను కూర్చుని బ్రహ్మ గారు చెప్పినవి అన్నీ బుద్ధిగా చేసేస్తున్నాను . కొంత సేపైన తరువాత కాబోయే మా ఆవిడని ఓ బుట్టలో కూర్చోపెట్టి తీసుకు వచ్చి నా ఎదురుగా కూర్చోపెట్టారు. మధ్యలో ఒక తెర. అప్పుడు ఆసీనులైన సదాసదులలో గుసగుసలు మొదలయ్యాయి. మెల్లగా మొదలైన గుస గుస లు కొద్ది సేపటికి బ్రహ్మగారి మంత్రాల స్థాయి దాటి పోయాయి. ఇంతలో కాబోయే మా ఆవిడ ని తీసుకొచ్చి పీటల మీద నాపక్కన కూర్చో పెట్టారు. ఇప్పుడు గుసగుసలు రూపాంతరం చెంది రణగొణ ధ్వనులుగా మారాయి. నేను కొంచెం ఉత్సుకత తో ఓ గుసగుస ల మాష్టారుని పిలిచి ఈ రణగొణ ధ్వనుల కారణమేమి అని అడిగితిని. ఆయన నాచెవిలో అరుస్తూ రహస్యం గా చెప్పాడు. “పెళ్లి కొడుకు కన్నా పెళ్లి కూతురు అంగుళం పైగా పొడుగు అని చెప్పు కుంటున్నారు” చెప్పిన వాడు ఊరుకోకుండా నా నెత్తి మీద వాడి వేలు పెట్టి నా కాబోయే ఆవిడ తలతో సరిచూసి కొలిచి అంగుళన్నర అని ప్రకాశముగా గుసగుస లాడి వెళ్లిపోయాడు. నాకు మండింది.
నా కాబోయే ఆవిడ కేసి చూసాను. ఆవిడ బాసిం పట్టు వేసుకొని, నిటారుగా కూర్చొని స్నేహితులతో గుసగుస లాడేస్తోంది. అప్పుడు నేను ఆవిడతో చెప్పాను. "కొంచెం తలకాయ వంచుకొని, బుద్ధిగా పెళ్లి కూతురు లాగా సిగ్గుపడుతూ కూర్చో" అని. "అల్లా నాకు చేత కాదు. నాకు ఇల్లానే బాగుంటుంది" అని అనేసిందండి. పైగా మాయాబజారు లో సావిత్రి లాగా హాహాహా అని నవ్వింది కూడా.
నాకు మళ్ళీ కాలింది. కాలదా అని అడుగు తున్నాను. ఇంకా తాళి కట్టకుండానే ఇంత మాట అనేసింది. కట్టింతరువాత ఇంకెన్ని అంటుందో, ఇంకెంత అవమానకర మాటలు వినాల్సి వస్తుందో నని అనుమానం వచ్చేసింది నాకు. అనుమానం కాస్తా పెను భూతమై విడాకులు ఇచ్చేద్దా మను కున్నాను. పెళ్లి కాకుండా విడాకులు ఇవ్వడం బాగుండదు, చట్టం కూడా ఒప్పుకోదు కాబట్టి పెళ్లి చేసుకొని వెంటనే విడాకులు ఇచ్చేద్దామను కొని పెళ్లి చేసేసు కొన్నాను. విడాకులు తీసుకోవటానికి ఇది మొదటి కారణం.

సరే పెళ్లి అయిపోయింది. భార్యామణి ని తీసుకెళ్ళి నేను ఉద్యోగం చేస్తున్న ఊరిలో కాపురం పెట్టేశాను. మా ఆవిడ పెళ్ళైన కొత్తలో కొంచెం నాజూకుగా పొడుగ్గా కనిపించేది. నేను పుష్టిగా గుండ్రం గా (అంటే లావు కాదండోయ్ ) కొంచెం పొట్టిగా కనబడే వాడిని. పొట్టి అంటే మరీ పొట్టి కాదండోయ్. 5 అడుగుల మీద ఇంకో మూడున్నర, నాలుగు అంగుళాలు ఉంటాను. ఏదో పొట్టి వెధవకి పొడుగు అమ్మాయిని కట్టబెడితే పిల్లలు పొడుగ్గా పుడతారు అనే భ్రమతో మా వాళ్ళు ఇల్లా మా ఇద్దరికీ పెళ్లి చేసేసా రన్న మాట.
తను పొడుగు అయితేనేం కొంచెం వంగి నడవ వచ్చు కదా, ఊహూ నిటారుగా గెడకఱ్ఱ లాగా నుంచొని మరీ నడిచేది. కాపురం పెట్టిన కొత్తలో మేమిద్దరం కలసి నడుస్తుంటే, చూసేవాళ్ళు కొద్దిగా చిరునవ్వు నవ్వేవాళ్లు. ఏదో మమ్మల్ని పలకరిస్తున్నారని అనుకొనే వాడిని. కానీ తెలియని వాళ్ళు కూడా నవ్వుతుంటే నాకు అనుమానం వచ్చేసింది. నవ్విన వాళ్ల పళ్లే బయట పడతాయని సరి పెట్టుకొని, మా నడక కార్యక్రమం కానిచ్చే వాడిని. కొద్ది కాలం గడిచే టప్పటికి గుసగుసలు మొదలయ్యాయి మా కాలనీ లో . మేము నడుస్తున్నప్పుడు, చిరు హాసాలు కాస్తా నవ్వులు గా మారిపోయాయి. నాకు అర్ధం కాలేదు. అప్పుడు ఓ గుసగుస మితృడిని అడిగాను. " What is this gusa gusa" అని. “ మీరు ఇద్దరూ కలిసి నడుస్తుంటే number 10 లాగా ఉన్నారు" అని అను కుంటు న్నారు అందరూ అని అట్టహాసం చేసి వెళ్ళి పోయాడు . నాకు మళ్ళీ మండింది. ఏం చేయలేక, అప్పటినించి నేను ఆవిడ వెనక్కాల, ఆవిడ అడుగు జాడల్లో కనీసం పది అడుగుల దూరం లో నడవడం మొదలు పెట్టేను. ఇది రెండవ కారణం.

అసలు పెళ్ళాం అంటే ఎల్లా ఉండాలి. వినయ విధేయతలు మూర్తీభవించాలా వద్దా ? పతివ్రతగా, పతి ఇష్టమే తన ఇష్టం గా మసలుకోవాలా వద్దా ? పతియే ప్రత్యక్ష దైవం అనుకోవాలా వద్దా ? అని అడుగుతున్నాను మిమ్మల్ని. పెళ్ళైన కొత్తలో ఇంకా ఆర్నెల్లు కూడా కాకుండా, కొంపలంటుకు పోయినట్టు మా ఆవిడ పుట్టిన రోజు వచ్చేసింది. సరే new పెళ్ళాం, new పుట్టిన రోజు, new కాపురం అని నేను new గా ఆలోచించి , మా ఆవిడ కి తెలియకుండా surprise చేద్దామని, బజారు వెళ్ళి 475 రూపాయలు పెట్టి ఒక చీర కొనుక్కువచ్చాను. ఆ కాలం లో నా జీతం నెలకి 1186రూపాయల 64పైసలు. 475 అంటే 1/3 జీతం కన్నా ఎక్కువ.
తెగించి, ధైర్యం చేసి నేనొక చీర కొని పుట్టిన రోజు ఉదయమే, Happy birth day to you అని పాడి బోల్డు నవ్వులు నవ్వుతూ, నేనే హారతి ఇచ్చి చీర ప్రెజెంట్ చేస్తే, చూసి "ఇదేం చీరండి, ఈ అంచేమిటి, అసలు ఆ రంగేమిటి, నాకు నప్పుతుందనే కొన్నారా? మీరు ఒక్కరే ఎందుకు వెళ్లారు? నన్నెందుకు తీసుకెళ్ల లేదు? చీర కూడా కొనడం చేతకాని వాళ్ళా మీరు" అంటూ కడిగేసింది.
మీరే చెప్పండి ఇదేమైనా బాగుందా? Love love గా నేనో చీర పట్టుకొస్తే, new మొగుడు అని కూడా చూడకుండా, what is this రంగు అని అంటుందా. పైగా “యే క్యా హై “ అని హిందీలో కూడా అడిగిందండి. అప్పటికప్పుడు నన్ను మళ్ళీ బజారు తీసికెళ్ళి , ఆ చీర మార్చేసి ఇంకో వంద రూపాయలు వేసి , చీర తీసుకొని, పుట్టిన రోజు ఛీరంటే ఇల్లా ఉండాలి అని నాకో క్లాసు పీకిందండి. What do i do now? అప్పుడు ఖచ్చితం గా విడాకులు తీసేసు కోవాలని డిసైడు అయిపోయాను. ఇది మూడో కారణం.

ఇల్లా చెపుతూ పోతే బోలెడు కారణాలు ఉన్నాయి. రోజు రోజు కు ఒక కారణం లిస్టు లోకి ఎక్కుతోంది. నేను మంచి వాడను, బుద్ధిమంతుడను, నోట్లో వేలు పెట్టినా కొరకలేని వాడను కాబట్టి, సహనం వహించి ఈ సంసార సాగరాన్ని ఈదుకుంటూ వస్తున్నాను ఇన్నాళ్లుగా. పెళ్ళైన దగ్గరనించి ఇప్పటి దాకా నేను స్వతంత్రించి ఏమి చేయలేక పోయాను. చివరాఖరికి నేను వేసుకొనే లాగూ చొక్కా, జేబురుమాలు దగ్గరినించి అన్నీ ఆవిడ ఇష్ట ప్రకారమే కొంటుంది. "మా ఆయనికి ఏమి తెలియదండి అన్నీ నేనే చూసుకోవాలి" అని అందరికీ చెపుతుందండి. చూసి చూసి, విసిగి వేసారి ఆవేశంతో భర్త అంటే ఎవరు అని నేనో పద్యం కూడా రాసేసాను.
శాంతభూషణుడే కానీ అలుగుటయే ఎరుంగని అమాయక జీవి వాడూ
ఔనౌను అనుటయే కానీ కాదు లేదు అని అనలేని పిరికి జీవి వాడూ
ఆఫీసులో ఉగ్ర నరసింహుడే యైనా గృహంగణమున సాధు జీవి వాడూ
మీసాలు పెంచిన రౌడీయైనా నిజసతికి దాసోహమనెడి అల్పజీవి వాడూ
ఆ ఆ ఆ ఆ అహహ్హ ఆహాహా ఆ ఆ హా హాహ హా ఆ ఆ ఆ
అని రాగం కూడా తీసి పాడుకొనే వాడిని. ఇల్లాగే పడుతూ లేస్తూ సర్దుకుపోతూ 40 ఏళ్ళగా ఈ సంసార రధాన్ని లాక్కువచ్చాను.
మొన్న మా బావమరిది వచ్చాడు హైదరాబాదు లో ఎవరిదో పెళ్ళికి. అక్కా తమ్ముళ్ళు ఇద్దరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ బంధువుల ఇళ్ళలో ఏవో గొడవల గురించి మాట్లాడుతూ మా ఆవిడ అంది. “ఏదోరా మీ బావ కొంచెం పొట్టి అయినా, మా సంసారం సాఫీ గా, సరదాగానే సాగిపోయింది ఇప్పటిదాకా” .
అంటే 40 ఏళ్ల తర్వాత కూడా నేను పొట్టి అన్న విషయం ఇంకా నొక్కి మరీ వక్కాణించాలా? నేను 5 అడుగుల 4 అంగుళాలు ఉంటే ఆవిడ 5 అడుగుల ఐదున్నర అంగుళాలు. ఈ మాత్రం దానికే ఆవిడ పొడుగు నేను పొట్టి అని చాటింపు వేయాలా అని ప్రశ్నిస్తున్నాను. ఆవిడ పెద్ద పొడుగా అని నేను కొచ్చెనింగు అన్న మాట. ఇహ నే తాళ జాల, విడాకులే శరణ్యం అని మరొక్కమారు కఠిన నిర్ణయం తీసేసుకొన్నాను. కొత్త సంవత్సరం లో మంచి లాయరు ని వెతికి విడాకుల కార్యాచరణ మొదలు పెట్టేస్తాను.
నా వ్యధా భరిత కధ మీరు కూడా విన్నారు కాబట్టి మీ సలహాలు సూచనలు కూడా నాకు పంపండి. విడాకులు ఇచ్చవలెనా?
ఇచ్చకూడదా?
గమనిక :- ఈ టపా మొదట ఈ బ్లాగులో 28/12/2010 న ప్రచురించబడింది.
61 కామెంట్లు:
bAgundi ani antE ..bAgOdu :)
ఇచ్చి, తీసేసుకోండి..!!
ఏమిటో,నాలాటివాళ్ళకు కూడా లేనిపోని అలొచనలు తెప్పిస్తున్నారు!!!
కెలకటం అంటె ఏమిటో చూపించారు :). చాలా బాగుంది.
sir,
please contact "Saratkaalam" sarat garu regarding this. He is also in the process of divorcing his wife. may be he can suggest some ideas to you.
హహ్హహ్హా. ప్రద్యుమ్నుడు గారు, అదేంటో మీ కష్టాలు వింటుంటే ఆగకుండా నవ్వొస్తుంది నాకు..:)))
>>పెళ్లి కాకుండా విడాకులు ఇవ్వడం బాగుండదు, చట్టం కూడా ఒప్పుకోదు
ఎంత గొప్ప లాజిక్కూ..;)
>>మీరు ఇద్దరూ కలిసి నడుస్తుంటే నుంబెర్ 10 లాగా ఉన్నారు
మొదట నాకు అర్థం కాలా. అర్థం అయ్యాక నవ్వు ఆగలా:))
ఇక మీ పద్యం ఉంది చూసారూ.. సూ...పర్:)
>>ఇచ్చవలెనా ఇచ్చకూడాదా..
హహ్హహ్హా...
నా సలహా ఏమో కానీ నాకైతే పొట్ట పగిలేలా ఉంది మరి.
ప్రద్యుమ్నుడుగారూ! చాలా తొందర పడుతున్నారు. క్రొత్తసంవత్సర
శుభారంభవేళ ఇలాంటి నిర్ణయం==ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి.
నిజం చెప్పాలంటే ప్రభావతిగారు పాపం మీరు తెచ్చిన చీర నచ్చక
పోయినా..కఠిన నిర్ణయాలు ఏమీ తీసుకోకుండా కనీసం ముక్కయినా
చీదుకోకుండా...మీతో వచ్చి పాపం తనకి నచ్చిన చీర తీసుకుని రాజీ
పడ్డారా లేదా? ఆలోచించండి.అదీకాక మీ హైటు 5'4"..ఆవిడ హైటు
యింకో అంగుళంన్నరయెక్కువ. కనీసం మీ హైటుకి తగ్గచీరైనా
కొనకుండా 475రూపాయల చీరా కొనేది? ఆవిడ హైటుకి తగ్గ చీర
కొనకపోవడం ఒక తెలుగింటి ఆడపడుచుని తెలుగేతరదేశంలో
అవమానం పరచడం కదండీ పాపం? ఆవిడ మంచావిడ కనుక ఇంకో
వందతో సరిపెట్టుకున్నారు...ఈ బ్లాగు ఆవిడకనుక చూస్తే మీకు
పెళ్ళవని క్రితమే ఈ దురుద్దేశ్యముంది అని ప్రూవ్ చేసినా చేయవచ్చు...
యెదురుతిరగొచ్చు కూడా నేమో?అంచేత నిదానం ప్రధానం.ఆలోచించండి.
ఆ చాల్చాలు...అదిగో వెనకాతలనుండి ప్రభావతిగారు పిలుస్తున్నారు వెళ్ళండి...కొత్త సంవత్సరానికి కేక్ ఆర్డర్ చెయ్యాలట...ఆ పని చూడండి ముందు. :)
కష్టమైన ప్రశ్నే సుమండీ !
కానీ మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ,
ధైర్యం చేసి, నాకు ఉన్న బాచ్లర్ ఎక్స్పీరియన్సు తో ఏదో ఒకటి చెపుదామనే అనుకుంటున్నాను.
మీకు రీసెంట్ గా నే పెళ్లి అయ్యింది కాబట్టి ,
పెళ్లి అయ్యి ఓ యాభయ్యేల్లు కూడా కాలేదు కాబట్టి మీకు మాటి మాటికీ ఇలా ( అదే విడాకులు , అరటాకులు అని ) అనిపించటం సహజమని నాకు అనిపిస్తుంది .
విడాకులు ఇచ్చవలెనా, ఇచ్చకూడదా ? అని నేను ఇప్పుడే చెప్పలేను .
ఎందుకంటే నాకింకా పెళ్లి కాలేదు ,
అంచేత నేను మీకు సెప్పొచ్చేదేంటంటే ..
నాకు పెళ్లి అయ్యి, వైవాహిక జీవితం లో మీ అంత ఎక్స్పీరియన్సు రాగానే , నేను ఖచ్చితం గా మీ ప్రశ్నకి సమాధానం చెప్పగలను అనే నమ్మకం ఉంది.
ఈ లోపు మీ ఈ జఠిలమైన ప్రశ్నకి నా సర్కిల్ లో ఏదైనా జవాబు దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను ..
ఏదో సెపుతానని సెప్పి , ఏటీ సెప్పకుండా నేను ఎల్లిపోతున్నాను అని మీరు అనుకోవద్దు .
నేను సేప్పొచ్చేదేంటంటే,
కొంచెం ముందుగానే అయినా ..
మీకు మీ కుటుంబ సభ్యులకు
నూతన సంవత్సర & సంక్రాంతి శుభాకాంక్షలు ..
హహ్హహ్హ..కొత్త సంవత్సరంలో విడాకులెందుకండి? హాయిగా మావిడాకులు కట్టుకోండి...
అయ్యయ్యో వద్దండి. మీకిప్పుడర్ధం కాదు గాని, చక్కగా రాధిక గారు చెప్పినట్లు చేసేయండి.
Sir,
Adi Kuda Mee avidane Adagaleka poyaaara.... :)
హ హ 10 మాత్రం సూపరండి :-) అయినా బోలెడు జంటలు 10 లానే ఉంటారు కాకపోతే మీవిషయంలో వారు వీరయ్యారు అంతే.. అయినా అందరిలా ఉంటే మన ప్రత్యేకత ఏముంది గురూగారు. కాబట్టి ఇంకోసారి ఇలా మిమ్మల్ని పొట్టి అని ఎవరిదగ్గరైనా అంటే తనకి నచ్చిన పాటని ఆరున్నొక్కరాగంలో ఖూనీ చేస్తూ పాడేస్తాను అని బెదిరించేయండి చాలు.. విడాకుల దాకా ఎందుకు రాధికగారన్నట్లు ఈసారికి మావిడాకులు చాలు ఎలాగూ పండగ సీజన్ కదా :-)
మౌళి గార్కి,
నేను విడాకులు తీసుకోవడం బాగుంది అని మీరు అంటే బాగోదు అని మిమ్మల్ని ఎవరో వెనక్కి లాగుతున్నారని అర్ధం అయింది. కొంపతీసి, మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా? పదండి ముందుకు. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
అనానిమస్ గార్కి,
మనం ఒకమాటు ఇచ్చేస్తే తిరిగి వాళ్ళు ఇస్తారని గేరంటీ లేదు కదా సారూ.
ధన్యవాదాలు.
హరేఫల గార్కి,
సాహసం చేయరా ఢింభకా, రాజకుమారి లభిస్తుంది రా అన్న S.V.రంగారావు గారి డైలాగు (పాతాళ భైరవి సినిమాలో) గుర్తు తెచ్చుకోండి. థాంక్యూ.
కృష్ణ గార్కి,
క్షమించాలి మా ఉద్దేశ్యం అదికాదు. సాదా సీదా మనిషిని నేను. థాంక్యూ.
మధుమోహన్ గార్కి,
ధన్యవాదాలు. అబ్బే ఇప్పుడప్పుడే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకోటం లేదండీ. అందుకని మీకు ఫోటో పంపించటం లేదు.
రెండో అనానిమస్ గార్కి,
ఆయన అమెరికా లో ఉంటారు. డాలర్లలో నేను ఫీజు ఇచ్చుకోలేను. ఇంకో మాట చెప్పండి. థాంక్యూ.
మనసు పలికే గార్కి,
చూసారా మరి, ప్రభావతి పాపం ప్రద్యుమ్నుడిని అలా నవ్వుల పాలు చేసింది. మీరందరూ నవ్వుతున్నారు వారిని చూసి. No. 10 మా చిన్నప్పుడు ఇది చాలా కామన్, ఒక లావు, ఒక సన్న మనుషులు కలిసి నడుస్తుంటే మేము అల్లాగే పిలిచే వాళ్ళం. సలహా ఇవ్వకుండా, నవ్వేసి తప్పించుకుంటున్నారన్న మాట. ఏంచేస్తాం. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
హనుమంత రావు గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. మిత్రులు మీరు కూడా ప్రభావతి పార్టీ లోకి మారిపోయారా? అన్యాయం. ఆ కాలం లో Rs. 475 = ఒక తులం బంగారం. పాపం ప్రద్యుమ్నుడు తల తాకట్టు పెట్టలేదు కానీ వేలి ఉంగరం పెట్టేడేమో.
ఆ.సౌమ్య గార్కి,
మీరు ఇల్లా కూడా బెదిరిస్తున్నారన్న మాట. “అదిగో పులి” అంటూ పాపం ప్రద్యుమ్నుడిని కంగారు పెట్టకండి. పాపం అసలే పిరికి జీవి వాడు. థాంక్యూ మీ కామెంట్సుకి.
స్వామి(కేశవ) గార్కి,
రామాయణం అంతా విని రాముడి కి సీత ఏమౌతుందని అంటారేమిటి మీరు. విడాకులో అని ఆయన గోల పెట్టుతుంటే పెళ్లి చేసుకొంటానంటారేమి టండీ మీరు. పెళ్లి చేసుకొంటే సలహాలే ఇస్తారో లేక రెండు చిడతలు పట్టుకొని ‘నా తరమా భవ సాగర మీదను’ అని పాడుకుంటారో? ధన్యవాదాలు.
Thank you for your good wishes.
రాధిక (నాని) గార్కి,
విడాకులు ఇచ్చేస్తే కానీ మళ్ళీ మావిడాకులు, మంగళ తోరణాలు కట్టడం కుదరదు కదండీ . అదన్నమాట సంగతి. ధన్యవాదాలు.
జయ గార్కి,
40 ఏళ్ళగా అర్ధం కాని ఆవిడ ఇప్పుడు ఇంకేం అర్ధం అవుతుందండి, మీ భ్రమ కానీ . థాంక్యూ.
మధు గార్కి,
ఆవిడ తో చెపితే ఆవిడే తలాక్ అంటుందేమో నని భయం. లేని పరువు కూడా మళ్ళీ పోతుందేమో/వస్తుందేమో నని భయం. ధన్యవాదాలు.
వేణూశ్రీకాంత్ గార్కి,
వీరు వారై పోయారు. మీలాంటి మిత్రులే “సంధి చేయగా వచ్చితి” అని పద్యం పాడుకుంటూ వచ్చేస్తే పాపం ప్రద్యుమ్నుడు ఇంకేమంటాడు. ఆయన పాడాడంటే రాగాలే ఖూనీ అయి పోతాయి. ఈ పొట్టి వాడికి చిటికెడు బుద్ధి కూడా లోపించింది కాబట్టే ఇన్ని తంటాలు. ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
//ఆ కాలం లో Rs. 475 = ఒక తులం బంగారం//
OMG అవునా, అంటే ఇప్పుడలాంటి చీర విలువ పాతికవేలా.... ఇంత కాస్ట్లీ ప్రేమను అర్ధంచేసుకోలేదంటే మీరు ఇచ్చిన చీర రంగు ఎలా ఉందో అర్ధం చేసుకోగలం. అందుకే ఈ విషయంలో మామద్దతు ప్రభావతి గారికే ఇస్తున్నాం.:):):)
ఏమైనా మీ పెళ్ళిపుస్తకంలో ఈ మూడుపేజీలు భలే ఉన్నాయండి.
mastaaru,
abbe, points yemi pedda strong gaa levandee....iddaru kalisi inko 50 yellu kalisi undi tarvaata courtiki raavalasindiga teerpu ivvadam jarigindi...yee lopu subrahmanyam gaarini seetayya gaari vaddanunnu, prabhavati gaarini ennela vadddanunnu....training ki canada pampa valasindigaa uttarvulu jaaree cheyadamayinadi..
the court is adjourned...
3g గార్కి,
ఇంట్లో Oh My Goddess అంటే కానీ చెల్లదు. అల్లా అన్నంతకాలం విడాకులు అవసరముండదు. అల్లా అనకపోతేనే తిప్పలు. అంత లావు పుస్తకం లో మూడు పేజీ లేనా. హతొస్మి. మీ వ్యాఖ్యలకి థాంక్యూ.
ఎన్నెల గార్కి,
కెనడాలో ట్రైనింగా? మీ మాల్ అనుభవం చదివిన తరువాత, రెండు గజాల చుట్టుకొలత తో దుప్పట్లు చుట్టుకొని, మీ బాసాసురుడు హీటరు కూడా ఇవ్వకపోతే, చలికి గజగజ వణుకుతూ. అబ్బే అబ్జెక్షను యువర్ ఆనర్. అయినా ఇంకో ఏభై ఏళ్ళా No way.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.
subrahmanyam గారు మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
బాసాసురుడు అక్కరలేదండీ, ట్రయినింగు మన ఇంట్లోనే...నయగరా కూడా చూసెయ్యొచ్చు...అబ్జెక్షన్ ఒవర్ రూలుడూఊ
మీకు , మీ కుటుంబానికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండీ.
మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
అదంతా సరే గాని మీకు నవ ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు
http://buzzitram.blogspot.com/
http://4rfactor.blogspot.com/
mundugaa ne cheppaanu ,
malee cheputunnanu .
మీ ఇంటిల్లిపాటికీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు ..
good... sarath gaariki chepthaa mee post gurinchi... alaanti vaalle meeku saraina dova chooputhaaru.
సూపర్ పోస్ట్ అంతే.. ఎప్పటి లాగానే బాగుందండి.. 10 మాత్రం సూపరండి.. కానీ మీకు ఎటువంటి సలహాలూ ఇవ్వలేను.. :) :)
మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
మీకూ, మీ కుటుంబసభ్యులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు.....
సుబ్రహ్మణ్యం గారూ,
ధన్యవాదములు. మీకు మీ కుటుంబసభ్యులకు కూడా నూతన ఆంగ్ల వత్సర శుభాకాంక్షలు.
మీకు మీకుటుంబానకీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.
మీ శుభాకాంక్షలకి ధన్యవాదాలు. మీకు మీ కుటుంబ సభ్యులకీ ఈ నూతన సంవత్సరం సుఖసంతోషాలతో గడవాలని కోరుకుంటున్నాను.
శివరంజని గార్కికి, జయ గార్కి, ఎన్నెల గార్కి, kannaji e గార్కి, స్వామి(కేశవ)గార్కి, mirchbajji గార్కి, వేణూ రాం గార్కి, శ్రీ లలిత గార్కి, ఊక దంపుడు గార్కి, 3g గార్కి, వేణూ శ్రీకాంత్ గార్కి,
మీ అందరికీ ధన్యవాదాలు.
mirchbajji గార్కి,
శరత్ గార్కి నాకు సలహాలిచ్చేంతటి తీరుబడి బహుశా ఉండదనుకుంటాను. మీరే ఏదో ఒకటి చెప్పండి. మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు.
వేణూ రాం గార్కి,
మీరు కూడా సలహా ఇవ్వనంటున్నారా, ఏం చేస్తాం. ధన్యవాదాలు.
ఎన్నెల గార్కి,
మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి అంతగా ఉత్సాహపడు తున్నారు కాబట్టి పాస్‌పోర్ట్ కి అఫ్లై చేస్తున్నాం. థాంక్యూ.
నూతన సంవత్సర శుభాకాంక్షలండి.
నేను నమ్మను గాక నమ్మను. శాస్త్రం చెప్పినదాని ప్రకారం మీరు గట్టి వాళ్ళై ఉండాలి. మీకు పుట్టెడు బుద్ధులు ఉండి ఉండాలి. మాటి మాటికి మిమ్మల్నీ అమరజీవి శ్రీరాములు గారిని సరిపోలుచుకుంటూ ఆవిడని మీరు సాధిస్తూండి ఉండాలి. ఔరా ఎంత గడుసుతనం! ఆవిడకి బ్లాగులేదనా మీ ధిక్కారం, ఈ విడాకులకలం!!
రాధిక(నాని)గార్కి,
ధన్యవాదాలు.
సూర్య గార్కి,
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. ప్రతీ శాస్త్ర సూత్రానికి కొన్ని సవరణలు ఉంటాయి. సర్వము తానేయైన వారలు కూడా లక్ష్మీపతులు,గౌరీనాధులు అని పిలువబడుతారు. వ్యర్ధ జీవులం మన మెంత. ఆవిడ కూడా ఓ బ్లాగు మొదలు పెట్టితే నాపని శ్రీమద్రామారమణ గోవిందో హరి:
ఆంటీ ...ఇక్కడ అంకుల్ ఏమో అంటున్నారు మీ గురించి ...
Sanju-The King గార్కి,
రాజు గారు కొంచెం ఘట్టిగా చెప్పండి. వినిపించటం లేదు.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి
హహహ్హ భలే రాసారండి కాని ఇంకో విషయం నాకు కనువిప్పు కలిగిందండి. ఎందుకంటే నేను మావారు కూడా 10 అంతే మరి.. మావారిని ఓ కంట కనిపెట్టాలన్నమాట అయితే. మనలో మన మాట మీ ప్రద్యుమ్నుడుగారు ఏ నూతన సంవత్సరం ముందు విడాకులు తీసుకోగోరుతున్నారో ముందుగా తెలియజేస్తే జంటగా ఆ జంటకి ముందు శుభాకాంక్షలు చెప్దామని. ;) మరి విడాకుల "ఆహ్వానం" మాకు రావాలి కదా కాస్త "మా "ముందస్తు ప్రిపరేషన్‌కి ;)
రమణి గార్కి,
పాపం ప్రద్యుమ్నుడు పెళ్ళిపీటల మీదే విడాకులు అనుకున్నాడు. అప్పటి నుంచి 41ఏళ్ళగా అనుకుంటూనే ఉన్నాడు. మరి ఎప్పటికి కుదురుతుందో.విధి బలీయం కదా. ఇంతకీ మీలో ఒకటి ఎవరు?:):)
ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి.
పెళ్లి కాకుండా విడాకులు ఇవ్వడం బాగుండదు, చట్టం కూడా ఒప్పుకోదు.
ఇక్కడ మొదలయిన నవ్వు పోస్ట్ ముగిసేదాకా నవ్వుతూనే ఉన్నా...
బులుసుగారూ ఇలా విడాకులు విడాకులు అని పబ్లిక్‌గా కలవరించేవారు ఎప్పుడూ విడాకులు కోరరని మీకూ తెలుసు. వ్యర్థమైన ప్రయాస ఎందుకు చెప్పండి? ఇంతకీ ప్రద్యుమ్నుడు మీరేనా? ముందర అర్థం అయేదికాదు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు కానీ ఏ నూతన సంవత్సరంలో విడాకులు తీసుకుండామనుకున్నారో చెప్పడం మరచిపోకండి మరి.
శైలబాల గారికి,
క్రి గారికి,
ధన్యవాదాలు. ఇంత ఆలస్యం గా జవాబు ఇస్తున్నందుకు క్షమించేయ్యండి.
కింపదొన..
hahaha!ippuDU avasaramanTaaraa viDaakulu?... dahaa
సుభ|Subha గారికి,
ధన్యవాదాలు.
సునీత గారికి,
అబ్బే, అప్పుడు అనుకున్నాను. ఇప్పుడు ఇంక కుదరదు లెండి. ధన్యవాదాలు.
బ్లాగ్ పుట్టిన రోజొస్తే కూడా
కొత్త కతల్ రాయి పోతే ఎలాగండి బులుసు వారు ?
సరికొత్త కత జోర్హాట్ గురించి వ్రాయండి
జోర్హాట్ లో రైనోసెరస్ :)
టాపిక్ ఇచ్చే సా:)
జిలేబి
We enjoy reading your writings.
First get the opinion of your wife whether you should seek a divorce. If she says no, there is no escape for you. Bye the bye, you may get another tongue lashing for writing this piece without her permission.
పెళ్ళయిన మర్నాడే మీకీ ఆలోచన వచ్చిందంటే మిమ్మల్ని మించిన జ్ఞానులు ఎవరుంటారు, సర్? మీరన్న “జ్ఞానము నిండుకున్న”🙂 బ్లాగు పాఠకులు మీ ముందు ఎందుకు పనికొస్తారు?
ఆలోచిస్తూ ఆలేచిస్తూనే గోల్డెన్ జుబిలీ పూర్తి చేసుకున్నారు కూడా. కాబట్టి ఈ సారికిలా పోనివ్వండి 🤘.
50 యేళ్ల వైవాహిక జీవితం సందర్భంగా అభినందనలు 💐.
ఒంటరితనం ఎంతో భయంకరం, సరదాకి కూడా ఈ ఆలోచన రానివ్వద్దు, ఆ పై మీ చిత్తం.
జిలేబి గారికి. ........... ధన్యవాదాలు. బ్లాగు జన్మదిన వేడుకలు చేసుకునే అలవాటు తప్పిపోయిందండి.
"తాంబూలాలు పుచ్చేసుకున్నాం తన్నుకు చావండి" అన్న పద్ధతిలో రైనో మీద కధ వ్రాయమని మీరు ఆజ్ణ జారీ చేశారు. నేను ప్రకృతి ప్రేమికుడను కాను. అందుచే అశక్తుడను, అటువంటి కధ వ్రాయడానికి. రైనో లాంటి వారు కూడా ఎవరూ తటస్తపడలేదు, వారి గురించి వ్రాద్దామన్నా. ................. మహా
అనానిమస్ గారికి. ........ ధన్యవాదాలు. నేను వ్రాసేవి ఏవీ మా ఆవిడ చదవరు. విడాకులు తీసుకుంటే ఆస్తి పంపకాలు జరగాలని అంటుంటారు. ఇప్పుడు అప్పులే మిగిలాయి. అందుచేత ఆమె విడాకులు అని అనదని ఓ నమ్మకం నాకు. ............ మహా
విన్నకోట నరసింహా రావు గారికి. ........... ధన్యవాదాలు. మీ అభినందనలకు మరో మారు ధన్యవాదాలు.
>>>మిమ్మల్ని మించిన జ్ఞానులు ఎవరుంటారు, సర్? ....... ఇది వీనుల విందుగా, కళ్ళకి ఇంపుగా ఉందండి. ఇంకో మారు ధన్యవాదాలు. ............ మహా
శర్మ గారికి. ........ ధన్యవాదాలు. మీ వంటి పెద్దల మాట శిరోధార్యం. ........... మహా
బులుసుగారి పులుపు పులుసులో
జీవితానికి కలుపు మలుపులో
అసరాకి అలుపు తలపులో
నవ్వటానికి సలుపు టపాలలో...
ధన్యవాదాలు... మీ తెలుగోడు.
ఇలా అనుకుంటూనే యాభై ఏళ్ళు హాయిగా గడిపేశారు. ఇంకో యాభై ఏళ్ళు గడిపేసేయ్యండి సర్ సుఖంగా.
ఇది కథే కదండీ ... హమ్మయ్య 😊!
చైతన్య గారికి. .......... ధన్యవాదాలు. స్వాగతం మా బ్లాగుకి. గీతం బాగుంది. మా పులుసు ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది. మీ ఛానల్ చూశాను ఇప్పుడే. తీరుబడిగా వినాల్సినవి ఉన్నాయి. ........... మహా
అనిల్ కుమార్ గారికి. ........... ధన్యవాదాలు. ఇంకో ఏభై ఏళ్ళు అంటే అమ్మో బాబోయ్ అనుకోవాలి, వయసు దృష్ట్యా. ............. మహా
లలిత గారికి. .......... ధన్యవాదాలు. కధేనండి. అనుమానం వద్దు. ............ మహా.
informative post and it is very good to read. Thanks a lot! and I truly love your site, - Crazy Movie Updates
కామెంట్‌ను పోస్ట్ చేయండి