ఆంధ్రజ్యోతి సంపాదకులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు.. కానీ వారికిది భావ్యమా?


నిన్న  జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4 గంటల మధ్యన బ్లాగ్మిత్రురాలు ఒకరు ఒక మెయిల్ పంపించారు.

బులుసు గారూ మీ కధ నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా  ఆంధ్ర జ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధం లో వచ్చింది,  చూసారా అని. వెంటనే చూశాను.

కడుంగడు నానందించితిని.
మీదు మిక్కిలి సంతోషించితిని.
అమందానంద కందళిత హృదయారవిందుడ నైతిని.   
హర్షాతిరేకమున గంతులు వైచితిని
మనం వ్రాసే కాలక్షేపం కధలు పత్రికలకెక్కే స్థాయికి ఉన్నాయేమో నని మనంబు సంభ్రమానందాశ్చర్య డోలలూగినది.
ఆనందమాయే అలి నీలవేణీ అని కూడా పాడుకున్నాను మా ఆవిడకు చెప్పి.
హర్ తర్ఫ్ బజ్ నే లగీ శేఖడో షెహనాయియా అని హిందీలో  కూడా పాడుకున్నాను.

ఏలూరు రోడ్లన్నీ తిరిగి ఆంధ్రజ్యోతి దినపత్రిక కొనుక్కొచ్చాను.  కనిపించిన వాళ్ళ చేత బలవంతం గా చదివించాను. వాళ్ళు నవ్వకపోయినా నేనే నవ్వి, వాళ్ళని మొహమాట పెట్టి నవ్వించాను.

మా యావిడ కూడా చిరునవ్వుతో అందరికితో బాటు నాకు కూడా పంచదార కలిపిన కాఫీ ఇచ్చింది.

శుభం భూయాత్ అని అనుకున్నాను.  

అన్నట్టు మరిచి పోయాను.  మొదట చెప్పవలసింది ఇక్కడ చెపుతున్నాను.

ఆగస్టు 2011 లో నా బ్లాగులో పబ్లిష్ చేసుకున్న నా కధ  నాకు ప్రేమించి పెళ్లి చేసుకొనే యోగ్యత లేదా  ఆంధ్ర జ్యోతి దినపత్రిక జనవరి 1, ఆదివారం అనుబంధం లో ప్రచురించినందుకు ఆంధ్రజ్యోతి సంపాదకులకు మనఃస్ఫూర్తిగా కృతజ్ఞత లు, ధన్యవాదాలు తెలియ జేసుకుంటున్నాను.  వారికిదే నా నమస్సుమాంజలులు.

కానీ ఇంత ఆనందం లోనూ ఎక్కడో మనసులో ఒక మూల కలుక్కుమంది.

నా కధ  పత్రిక లో వచ్చిందని ఎవరో చెప్పేదాకా నాకు తెలియలేదు.
అయినా సరే  ముగాంబో ఖుష్ బహుత్ ఖుష్ అవడం  కొంచెం తేడాగా  అనిపించింది.

ఔరా మనని మాట వరసకు కూడా అడగకుండా వారి పత్రికలో మన కధ వేసుకోవడం సబబా? వారికిది భావ్యమా? అనే సందేహం వచ్చింది.

అడిగితే కాదనము కదా. డెందమానందమందగా తిరుగు టపాలో అంగీకారం తెలియ చేసుండెడి వారము కదా !  

అడుగలేదు ఫో. ఓయీ నీ కధ మా పత్రిక లో వేసుకుంటున్నామని తెలియ చేయవచ్చును కదా. ఆనందమనుభవించుము. నూతన సంవత్సరమున పండగ చేసుకొనుము అని తెలియపర్చుటకు కూడా అనర్హులమా?

ఆలోచించిన కొలది మనంబున నానందము సన్నగిల్లి,  క్రోధము ఆవహింప జొచ్చెను. ఇది ఏమి? పనీ , పాడు లేని వాడ ననుకును చుంటిని  కానీ ఇంత పనికి మాలిన వాడినా యన్న యనుమానం కలిగెను.

కాపీ రైటు, సింగినాధం జీలకర్ర  అని ఉపన్యాసం ఇవ్వను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి నమలు పరిచేటందుకు  సమయం, ధనం మన వద్ద లేవు.  

కానీ బహుళ జనాదరణ పొందిన ఒక పత్రిక,  రచయిత అనుమతి తీసుకోవాలనే కనీస మర్యాద పాటించ లేదేమో నని అనుమానం. అంతే మరేమీ లేదు.

పత్రికా స్వేచ్ఛ లో ఇది కూడా ఒక భాగమేమో. ఏమో.

నేనేం చెప్పగలను. బాధ్యతలే తప్ప హక్కులు లేని ఒక అనామకుడిని.     
     

40 కామెంట్‌లు:

పల్లా కొండల రావు చెప్పారు...

తప్పులెన్నువారు తమ తప్పులెరుగక పోవడమంటే ఇదేనండీ ! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పత్రికలే సగం రాజకీయాలు నడుపుతున్నాయి.

SHANKAR.S చెప్పారు...

గురూజీ మీరు పత్రికా స్వేచ్ఛను అవమానిస్తున్నారు. వారు ఏమైననూ చేయవచ్చు అను ప్రాధమిక సూత్రమును విస్మరిస్తున్నారు.

అజ్ఞాత చెప్పారు...

దొంగతనం చేయటం అందరూ చేసేదే కదా? మేం చేస్తే తప్పేంటంట. ఇంకా పెద్ద దొంగ తనాలు చేస్తే మా పత్రిక కు చెప్పండి. మేము గొట్టమూ కెమేరా పట్టునొని బయలు దేరటమే..! ఈ విష్యం లో సవాల్ విసురుతున్నా..మాటలు మాట్లాడటం కాదు..దమ్ముంటే చూసుకుందాం రా..బులుసు గారూ! :-)
వేమూరి రాధా కృష్ణ.

అజ్ఞాత చెప్పారు...

కనీస మర్యాదలు కూడా పాటించని రోజులొచ్చాయ్!

ఆ.సౌమ్య చెప్పారు...

అదే కదా...చెప్పి వేసుకుంటే ఇంకా సంతోషించెదము కదా..ఈ గ్రంధచౌర్యమేల?

Sravya V చెప్పారు...

బులుసు మాస్టారు బావుంది మీ పోస్టు అలాగే మీరు చెప్పిన పాయింట్ . ఇంత వివరం గా పేర్ల తో సహా ప్రచురించారు అంటె మన బ్లాగర్లే ఎవరో అయిఉండొచ్చేమో . మీ ఈ పోస్టు కన్నా రెస్పాన్స్ ఇస్తారేమో చూద్దాం . ఒకసారి అనుమతి తీసుకుని ప్రచురిస్తే అది అందరికి సంతోషం గా ఉండేది కదా కనీసం ఈ పోస్ట్ చూసాకన్నా ఈ ప్రయత్నం చేస్తారు అని ఆశిస్తున్నాను .

కృష్ణప్రియ చెప్పారు...

బులుసు వారు,

మీరు చెప్పింది సబబు గానే ఉంది. 'నమస్తే ఆంధ్ర' వారు కొన్ని నెలల క్రితం ముందస్తు గా మెయిల్ పంపి, పర్మిషన్ తీసుకుని తర్వాత ప్రింట్ అయ్యాక సాఫ్ట్ కాపీ పంపారు. 'ప్రింట్ లో ఎక్కడ దొరుకుతుంది?' అని అడిగితే, ఇండియా లో దొరకదని, అడ్రస్ ఇస్తే పోస్ట్ చేస్తామని అన్నారు. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది.

ఇక ఆంధ్రజ్యోతి విషయం లో శ్రావ్య చెప్పినట్టు ఎవరో మన బ్లాగర్లే, 'పర్వాలేదు లెమ్మని మన టపాలు తీసుకున్నట్టున్నారు. మనకి చెప్తే డెఫినెట్ గా బాగుండేది, కానీ కనీసం క్రెడిట్ ఇచ్చారు కదా ..

బహుశా ఈ టపా కి స్పందిస్తారేమో.. చూద్దాం. ఆంధ్రజ్యోతి పుణ్యమాని మా అమ్మగారింటి ముందర ట్రాఫిక్ తగ్గింది..

(ఎందుకా? వచ్చే పోయేవారికి.. మా అమ్మాయి రాసిన ఆర్టికల్ అని చదివి వినిపిస్తుంటే.... :) )

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేమూరి రాధాకృష్ణ అని పేరు పెట్టి ఒక అనానిమస్ వ్రాసిన కామెంటు పబ్లిష్ అయింది ఈ టపాలో పొరపాటున. పబ్లిష్ అయింది కదా, సంకలిని ల లోకి వెళ్ళి ఉంటుందని తీసెయ్యలేదు.

ఇక ముందు ఈ టపాలో ఇటువంటి అనానిమస్ కామెంట్లు అంగీకరించను.

PALERU చెప్పారు...

బులుసు గారు,

మీ కధలు ఆంధ్రజ్యోతి వాడు ఎంటండి ..!!!అన్ని భాషల్లో తర్జుమా చేసి ఆయా భాషా పేపర్లలో వేసుకోవాలి అంత హాస్యరస భరితంగా ఉంటాయి, అసలు నేను బ్లాగు రాయడానికే కారణం మీరు, నేను మొట్టమొదటగా చదివిన బ్లాగు మీదే, మీకు తెలియకుండా అచ్చువేసుకోవడం అనేది తప్పే ...కాని ఈ సారికి క్షమించేయండి, మీరు మీ జీవితం లో ఎన్నో దానాలు చేసిఉంటారు ఈ హాస్య దానం కుడా అలాంటిదే అనుకోండి...హిహిహి

durgeswara చెప్పారు...

ponilemdi svaami
padimamdi navvukunnaaru kadaa ! adichaalu meeprayatnam saardhakamainamduku.

సుజాత వేల్పూరి చెప్పారు...

పేర్లు చెప్పి, క్రెడిట్స్ ఇచ్చారు కాబట్టి దీన్ని చౌర్యం అని అనలేము గానీ, ప్రచురించే ముందో, కనీసం ప్రచురించాక అయినా ఆయా బ్లాగుల్లో కామెంట్ గానో,లేక ఈ మెయిల్ ద్వారానో సమాచారం ఇవ్వడమైనా కనీస ధర్మం! మన బ్లాగర్లే కదా అనేసుకోవడం భావ్యం కాదు!

కలం పేరుతో రాసుకుంటున్న వారి అసలు పేర్లను ఇవ్వడం అసలే భావ్యం కాదు.

బులుసు గారన్నట్టు అడిగితే కాదనరు కదా!

అజ్ఞాత చెప్పారు...

ఆ అనానిమస్ కామెంట్ ఆ పత్రికపై వ్యంగంగా స్పందించినట్టుంది. మీరెందుకు సీరియస్‌గా తీసుకుంటున్నారో అర్థం కావట్లేదు, పునఃపరిశీలించగలరు. ఇలా చెప్పానని, అది నాదే అనుకుంటారేమో, కాదని మనవి.

buddhamurali చెప్పారు...

బులుసు గారు నిజమే ఇది అనైతికం ( ఒక రకంగా అహంకారం కూడా కావచ్చు )

మధురవాణి చెప్పారు...

సుజాత గారి అభిప్రాయమే నాదీనూ!

రాజ్ కుమార్ చెప్పారు...

కాపీ కొడితే కొట్టారు కానీ గురువుగారూ... మంచి మంచి పోస్టులన్నీ మళ్ళీ చదివేట్టు చేశారు.. ;)

మీ కధ పేపర్లో పడినందుకు గాను అందుకోండి శుభాకాంక్షలు..

మీ పోస్ట్ చూపించాకా, మా అమ్మగారికి ఇది రాసినాయన నాకు తెలుసూ అని మీ ఫోటో చూపించి, లెవెలేశాను గురువు గారూ ;)

మీరన్నట్టూ చెప్పి చేస్తే ఇంకా బాగుండేది. ;)

సందట్లో సడేమియా లాగా మీరు షుగర్ కాఫీ తాగేశార్ కదా.. ;)

నూతన సంవత్సర శుభాకాంక్షలు..

Unknown చెప్పారు...

కొత్త సంవత్సరం లో ముందుగా మంచివిషయాల గురించి మాట్లాడుకుందాం. మీ కధ ప్రచురితం అయినందుకు శుభాకాంక్షలు.
కానీ వారు చేసినది మాత్రం సరి అయిన పని కాదు అని నా . మీకు ఒక మెయిల్ (కృష్ణప్రియ గారు చెప్పినట్టు) పంపించి మిమ్మల్ని అడిగితే సంతోహ్సంగా ఇద్దురు కదా.. అదీ పద్ధతి. కానీ చాలా సార్లు పత్రికలు/పేపర్లూ బ్లాగ్ లలోంచి వంటలూ, ఆర్టికిల్స్, ఫోటోలు అడగకుండానే తీసుకోవడం నాకు తెలుసు..
ఇంతకు ముందు సాక్షి వారు నా బ్లాగ్ పోస్ట్ చూసి వారి ఆదివారం అనుబంధంలో ప్రచురిస్తామని కామెంట్ పెట్టి ప్రచురించారు. తర్వాత పత్రికలొ వచ్చినప్పుడు ముందు జ్యొతిగారు చెప్పారు, తరవాత ఆయన చెప్పారు . వేదుల సుభద్ర

rajasekhar Dasari చెప్పారు...

కథ కాపీ కొడితే కొట్టారు , రచయిత పేరు కూడా కాపీ కొట్టారంటే ఇక వీళ్ళకి ఏమి చెప్పాలి. అయినా ఈ పత్రికల వాళ్లకి, సినిమా వాళ్లకి ఏలూరు వాళ్ళంటే లోకువ అండి. యుగంధర్ సినిమా లో ఎన్. టి . ఆర్ " నేను అసలే ఏమి ఎరుగని ఏర్రోడ్ని మరేమో ఏలూరు చిన్నోడ్ని " అని పాడాడు.

అజ్ఞాత చెప్పారు...

http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/jan/1/naku&more=2012/jan/1/sundaymain

http://www.andhrajyothyweekly.com/index.asp?page=Page24

Disp Name చెప్పారు...

ఎంత మాట ! ఎంత మాట !

ఇంత ఘోరం జరిగి పోయిందన్న మాట!

ఇది ఖచ్చితం గా ఆ జిలేబి గారి పనే అయ్యుంటుంది. ఆవిడే మీ తపా లింకు రాధ కిచ్చారట !


ఇక పాయింటు రెండు, అనానిమస్సులని మీరు అంగీకరించరా లేక అనుమతించరా ఈ విషయం వెటనే వివరణ ఇయ్యవలె !


చీర్స్

జిలేబి.

Saahitya Abhimaani చెప్పారు...

మన గోళీ సోడా గారి లుంగి కథ కూడా ఆంధ్ర జ్యోతిలో ప్రచురించారు. మరి ఆయన్ను అడిగారో లేదో. ఈ కింది లింకు పైన ఉన్న అజ్ఞాత ఇచ్చినది చూడండి

http://www.andhrajyothi-sunday.com/AJweeklyshow.asp?qry=2012/jan/1/lungi&more=2012/jan/1/సుందయ్మిన్

పత్రికల వాళ్ళు చేస్తున్నది, కల్తీ లేని అన్యాయమే. ఒక లాయర్ నోటీస్ తగిలించండి. చూస్తూ ఊరుకుంటే మీరు ఒప్పుకున్నట్టు అవుతుంది.

వాళ్ళ ఉద్దేశ్యంలో మీ కథ వాళ్ళు ప్రచురించటమే గొప్ప అన్న తెంపరితనంలో ఉన్నట్టుగా ఉన్నారు. మొగ్గలోనే తుంచకపొతే, ఇది ఎక్కడిదాకా పోతుందో తెలియదు.

కొత్తావకాయ చెప్పారు...

రాసిన వారి పేర్లు ఇచ్చారు కనుక సంతోషమే కానీ, ముందుగా అడగకపోవడం మాత్రం అంత బాగులేదు. ఇక ప్రొఫైల్ లో ఉన్న కలం పేరుకి గౌరవం ఇచ్చి ఉంటే బాగుండేది. ఇంత స్వతంత్ర్యం తీసుకున్నదెవరా అని ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. అసలు ఈ సంకలనం చేసినది ఎవరిదో తెలిస్తే బాగుండును. పాత్రికేయ మిత్రులు ఏమైనా కనుక్కోగలుగుతారా? ఒక సారి ఈ స్థాయిలో విషయం చర్చకు వచ్చింది కనుక ఇకపై ఇలాంటి పరిస్థితి రాదనే అనుకుందాం.

మీరు మీ శైలిలో హాస్యపు పూత వేసి చురకలు బాగానే అంటించారు, బులుసేంద్రా! మీరు పత్రికల్లో రాయకూడదూ! ద.హా.

Disp Name చెప్పారు...

>>>నిన్న జనవరి ఒకటవ తారీఖున సాయంకాలం 3-4 గంటల మధ్యన బ్లాగ్మిత్రురాలు ఒకరు ఒక మెయిల్ పంపించారు.

దీన్నే ఏదో అంటారండీ మాష్టారు. ఆదివారం రావాల్సిన 'యమ' గండం ఒకటిన్నర గంట ముందే వచ్చేసింది !

చీర్స్
జిలేబి.

Sujata M చెప్పారు...

బులుసు గారూ

కంగ్రాట్స్. మీ టపాలు ఏదో రకంగా జన బాహుళ్యం లోకి వెళ్ళడం భలే మంచి విషయం. హాస్య బ్లాగర్లలో మేటి వారైన తోట రాముడు గారు కూడా ఏదో పత్రికలో రాసేరు గానీ అది రెగ్యులర్ కాలేకపోయిందనుకుంటాను. మీరు మెల్లిగా ఒక 'కాలం' మొదలుపెడితే, (అధికారికంగా and in Andhra Jyoti itself) ఇంక ఈ కాపీలూ, అడగకపోవడాలూ వుండవు. మీరు ఇదే స్పూర్థి తో దూసుకుపొండి. అన్నట్టు మీకు హాపీ 2002.

శ్రీనివాస్ పప్పు చెప్పారు...

గురూజీ ముందస్తుగా అభినందనలు అందుకోండి.అంతంత బాగా రాసేస్తుంటే ఇలాగే చౌర్యం జరిగిపోతుంటుంది మరి,(అదేకదా పత్రికా స్వేచ్చ అంటే వాళ్ళకి నచ్చినవి ఎవర్నీ అడగక్కర్లేకుండానే వేసుకోవచ్చు)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

పల్లా కొండల రావు గారికి,

ధన్యవాదాలు. అవును అల్లాగే అనిపిస్తోంది.


శంకర్ గారికి,

హాహాహా. వాళ్ళు మనకా అవకాశం ఇవ్వడం లేదు. ధన్యవాదాలు.


అనానిమస్ గారికి,

మీ వ్యాఖ్య దాని వెనక వ్యంగ్యం అర్ధం అయ్యాయి. కానీ వేమూరి రాధాకృష్ణ అనే పేరు పెట్టకుండా ఉంటే ఇంకా బాగుండేది అని అనిపించింది. ఈ కారణం వలనే మీ రెండో కామెంటు(మీదే అనుకున్నాను) నేను పబ్లిష్ చేయలేదు. క్షమించండి.
పత్రికలకి, ఛానెల్స్ కి నియమాలు ఏమి లేవేమో అని పిస్తోంది. ధన్యవాదాలు.

కష్టేఫలే గారికి,

ధన్యవాదాలు. అల్లాగే ఉంది. చూస్తూ ఊరుకోవడమే తప్ప చేసేది ఏమి లేదు.

ఆ.సౌమ్య గారికి,

చెప్పలేదనే విచారిస్తున్నాను. గ్రంధ చౌర్యం అనలేమేమో ? ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రావ్య గారికి,

అనుమతి కాదు కనీసం మీ కధ వేసుకుంటున్నాము అని కూడా చెప్పలేదే అని బాధ. ఒక రోజు ఆగాను. మన తోటి బ్లాగర్స్ అయితే కనీసం + లో మురళి ధర్, కొత్తావకాయ, రాజ్ కుమార్ గార్ల పోస్ట్స్ లో అయినా చెపుతారేమో నని చూశాను. బహుశా వీరెవరు కారని అనుకున్న తరువాతే ఈ టపా వేశాను. ధన్యవాదాలు.

కృష్ణ ప్రియ గారికి,

ధన్యవాదాలు. క్రెడిట్ ఇచ్చారు. సంతోషం. కానీ ముందు సమాచారం లేదే అని విచారం. సాధారణం గా అడిగి వేసుకుంటారు.
ఇప్పుడు మీ ఇంటిముందు ట్రాఫ్ఫిక్ మామూలు గా ఉందని తలుస్తాను. ...... దహా.


raf raafsun గారికి,

ములగ చెట్టు ఎక్కించేస్తున్నారు. ధన్యవాదాలు.
ఏమీ చెయ్యలేక, నోరు మూసుకొని క్షమించెయ్యడమే అలవాటు అయింది. So be it.

దుర్గేశ్వర గారికి,
నలుగురు నవ్వితే సంతోషమే. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సుజాత గారికి,

మీరు నా బాధ సరిగ్గా అర్ధం చేసుకున్నారు. మన బ్లాగర్స్ కాదేమో నని అనుమానం. ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

అర్ధం అయిందండి. కానీ పైన చెప్పిన కారణం వల్ల అలా స్పందించాను. మిగతా అనానిమస్ కామెంట్లు పబ్లిష్ చేశాను. ధన్యవాదాలు.

బుద్ధ మురళి గారికి,

అహంకారం పాలు కూడా ఉంది అనే అనుకున్నాను. అందుకనే ఈ టపా. ధన్యవాదాలు.

మధుర వాణి గారికి,

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,

+ లో మీ టపా, కొత్తావకాయ గారి టపా చూసిన తరువాతే అనుకున్నాను. అందరికీ తెలిసిపోయింది, నాకే తెలియ లేదు నా కధ గురించి అని.
సుగర్ కాఫీ ఏమిటి, ఆవిడ చూడకుండా సున్నుండ కూడా తినేశాను. చెప్పకండే. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ప్రసీద గారికి,

అవునండీ. కనీస మర్యాద పాటించలేదనే బాధ. బ్లాగ్స్ లో కూడా అటువంటి వి జరిగాయి. ఏంచేస్తాం. విలువలు మారిపోతున్నాయి అనుకొని ఊరుకోవడమే. ధన్యవాదాలు.

రాజశేఖర్ దాసరి గారికి,

కధ వేసి మిమ్మలని ఉద్ధరిస్తుంటే సంతోషించక ఏడుస్తావేం అన్నట్టు గా అర్ధం అయింది నాకు మీ వ్యంగ్యం. అది కాక పోతే క్షమించెయ్యండి. ఇంకా కొన్ని విలువలు, మర్యాద, మన్నన, సభ్యత ఉన్నాయనే అనుకుంటున్నాం. We don’t care అంటారా. మేము తప్పుకుంటాము....... ధన్యవాదాలు.

అనానిమస్ గారికి,

ధన్యవాదాలు.

జిలేబి గారికి,

అవునండీ నేనూ అలాగే అనుకుంటున్నాను. అనానిమస్ ల సందేహం తీరిపోయిందను కుంటాను. ధన్యవాదాలు.

శివరామప్రసాదు కప్పగంతు గారికి,

ఇంతకు మించి చెయ్యడానికి నాకు టైమ్ అండ్ మనీ రెండూ లేవు. ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తావకాయ గారికి,

నిజమేనండి. కలం పేరు ఉండగా అసలు పేరు వెయ్యడం నిర్లక్ష్యమే అనుకుంటాను.
భలేవారే, నాకధ కూడా పత్రిక ల కెక్కింది. (లిటరల్ మీనింగ్ మాత్రమే) ... ధన్యవాదాలు.

జిలేబి గారికి,

మా జీవితం లో యమగండాలు, సుడిగుండాలు అన్నీ ఒక(రే)టే. అంతకన్నా చెప్పఖ్ఖర్లేదు అనుకుంటాను. ధన్యవాదాలు.

సుజాత గారికి,

మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నా టపాలు నలుగురి లోకి వెళ్ళడం నాకు మహదానందమే. నెలకి ఒకటి రెండు టపాలు వ్రాసుకోవడానికే సరుకు దొరకటం లేదు నా మట్టి బుర్రకి. ఇంకా పత్రికల కేమి వ్రాస్తాను. ధన్యవాదాలు.

శ్రీనివాస్ పప్పు గారికి,

ధన్యవాదాలు. అవును మాష్టారూ అల్లాగే ఉంది. బలమున్న వాడిదే రాజ్యం.

Sravya V చెప్పారు...

ఇంత వరకూ కూడా ఎవరూ రిప్లై చేయలేదా గురూజీ . ఇక లాభం లేదు ఇవ్వాల్టి నుంచి ఆంధ్రజ్యోతి లో నాకు నచ్చిన ఆర్టికల్స్ అన్నీ కాపీ చేసి నా బ్లాగు లో పెట్టుకొని నావే అని చెబుతా అంతే :)
ఇంకా అలాగే కొంతమంది జ్యోతి లో పని చేసే బ్లాగర్లు ఉన్నారు కదా వాళ్ళ ఆర్టికల్స్ కూడా కొట్టేస్తా అంతే దెబ్బకి దెబ్బ :P

Sandeep P చెప్పారు...

మీ కథ పత్రికలో ప్రచురించబడినందుకు సంతోషమండి. :)

malli చెప్పారు...

బులుసు గారూ,
ఇచ్చటి ఈ కోలాహలమునంతటినీ వేమన వసంతలక్ష్మిగారికి (ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధం ఎడిటర్)కి తెలియపరిచితిని.ఆమె మీతో ఒకసారి మాట్లాడుటకు గానీ మెయిల్ చేయుటకు గానీ ఉద్యుక్తులగుచున్నారు.(చూసారా మా భాషని కూడా ఎలా మార్చేస్తున్నారో!!దాని మీద యుద్ధం తర్వాత) మీ ఫోన్ నంబర్ కానీ మీ మెయిల్ ఐడి కానీ తెలీవని ఆగినట్లున్నారు.మీకు అభ్యంతరం లేనిచో ఆంధ్ర జ్యోతి మెయిల్ ఐడి కి వివరాలు తెలుపగలరు.
అంత చక్కగా డిజైన్ చేసిన ఆ అపురూప సంచికలో మీ కధ ప్రచురింపబడినందుకు అభినందనలు.
మల్లీశ్వరి.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రావ్య గారికి,

అన్నంత పని చేశారంటే మీ వెనక జై జై అంటూ నేను వస్తా. ధన్యవాదాలు.

సందీప్ గారికి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మల్లీశ్వరి గారికి,

ధన్యవాదాలు. చొరవ తీసుకొని మా మనోభావాలు ఎడిటర్ గారికి తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

నా మైల్ id,

srisubrahlaxmi@gmail.com

నాకు సెల్ లేదు. నా లాండ్ లైన్ no.,
08812 244494

సిరిసిరిమువ్వ చెప్పారు...

అడిగి వేయటం కనీస మర్యాద...వేసాక చెప్పటం వాళ్ళ ధర్మం!

మీ ఫోన్ నంబరు కానీ మెయిల్ ఐడి కానీ తెలియక తెలియపరచలేదనటం మరీ చోద్యం .ఎస్కేపిజం. అవి తెలియకపోయినా ఆ కథ ఎక్కడినుండి తిసుకొచ్చి పెట్టారొ (అంటే మీ బ్లాగు) అక్కడే ఓ మాట చెప్తే సరిపోయేది కదా!

మీ బ్లాగు లింకు కూడా తప్పిచ్చారు..చూసారా!

Chandu S చెప్పారు...

నేనూ చదివాను, మిమ్మల్ని అడక్కుండా వేసుకున్నారని అనుకోలేదు సార్. మీ పర్మిషన్ తీసుకోవడం మర్యాద కదా!

Advaitha Aanandam చెప్పారు...

ఇది మరీ అన్యాయం
మీ కథ మీకు తెలియకుండా వేయడం అదేమి ధర్మం....?

మీరు అడిగెయ్యాల్సింది....

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ వేళ మధ్యాహ్నం సుమారు ఒంటి గంట కి వసంతలక్ష్మి గారు నా తోటి మాట్లాడారు. చర్చ నాకు సంతృప్తికరం గా లేకపోయినా, ఆవిడ సారీ చెప్పారు కాబట్టి ఈ విషయం ఇంతటి తో close చేస్తున్నాను.

స్పందించిన అందరికీ ధన్యవాదములు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

సిరిసిరి మువ్వ గారికి,

చందు S గారికి,

మాధవి గారికి,

ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఈ విషయం ఇంతటితో ముగిసింది. ఈ టపాలో ఇక మీదట కామెంట్లు పబ్లిష్ చెయ్యబడవు.

అందరికీ మరొక్క మారు ధన్యవాదాలు.