రైలు ప్రయాణంలో ఇంకో కధ.

నిన్న సాయంకాలం   హౌరా స్టేషన్ కి సుమారు ఐదు  గంటలకి వచ్చాను. రాత్రి 8 గంటలకి బయల్దేరే  మద్రాస్ మైల్  రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరును అని చింతిస్తూ చెప్పేడు ఎంక్వయిరీ లో. ఓ ఏజంట్ ని వెతికి వాడు నమ్మకస్తుడే అని పక్కవాళ్ళ ద్వారా నిర్ధారించుకొని, వాడికి టికెట్, రెండు వందలు ఇచ్చి, వెయిటింగ్ రూం లో సూట్కేస్, ఎయర్ బాగ్ పెట్టి కుర్చీలో కూర్చున్నాను.  పక్క కుర్చీ లో కూర్చున్న ఓ ముఫై  ఏళ్ల ప్రయాణికుడు అడిగాడు.


ఎక్కడికి వెళుతున్నారు మాష్టారూ?  
విజయవాడ వెళ్ళాలండి, రెండు గంటలు లేటుట మద్రాస్ మైల్.
అవునండి, నేనూ దానికే వెళ్ళాలి రాజమండ్రి దాకా.  శలవు మీద వెళుతున్నారా?
అవునండి ఓ పదిహేను రోజులు.

ఇలాగే పిచ్చాపాటి ఓ అరగంట మాట్లాడాము. ఏజంట్ ఇంకా రాలేదు. చికాకుగా ఉంది. ఆకలిగా ఉంది.  చెమటలు కారిపోతున్నాయి. సరే స్నానం చేసి, పక్కనే ఉన్న AC రెస్టరెంట్ లో ఓ రెండు గంటలు కూర్చుని వస్తే కొంచెం హాయిగా ఉంటుందేమో ననిపించింది. సంచి లోంచి తువాలు తీసి, లాగు చొక్కా విప్పి, సంచిలో పెట్టి,  లుంగి కట్టుకొని సబ్బు పెట్టె పట్టుకొని పక్కాయనతో చెప్పాను.

మాష్టారూ సామాను కొంచెం చూస్తూ ఉండండి. ఏజంటు వస్తే ఉండమనండి.
అలాగే మీరు స్నానం చేసి రండి. నేను ఇక్కడే ఉంటాను.

స్నానం చేసి వచ్చాను. ఆయనా లేడు, నా సూట్కేస్, సంచి కూడా లేవు.  నేను లబో దిబో మన్నాను. చుట్టూ జనాలు చేరారు. సానుభూతి ప్రకటించారు, జాలిపడ్డారు. బుద్ధిలేదా అన్నారు. క్లోక్ రూం ఉన్నదెందుకు అని కోప్పడ్డారు. ఈ కాలం పిల్లలకి బొత్తిగా లోక జ్ఞానం లేదన్నారు. అయినా అందరిని అలా నమ్మేయడమేనా అని చివాట్లు పెట్టేరు.  నేనో తెలివి తక్కువ దద్దమ్మ నని తేల్చేసి,  ఎవరి సీట్లలోకి వాళ్ళు వెళ్ళిపోయారు.

ఓ పావుగంటలో నేను కొంచెం తేరుకున్నాను.   ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను .  ఇంతలో ఏజంటు వచ్చాడు. నన్ను చూసి, కధ విని, జాలిపడి నాకు తోడుగా దుఃఖించి,  టికెట్ నా చేతిలో పెట్టాడు. స్లీపర్ S6 లో దొరికింది.  నా కమిషన్ 75, క్లర్కు గారికి   వంద  పోగా మిగిలిన  25 ఇంద అన్నాడు.  నా కమిషన్ అసలు వంద కానీ,  మీ కధ కి జాలిపడి పాతిక తగ్గించాను అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. ఇంకో పాతికేనా తగ్గించుకోమని నేను ప్రాధేయపడ్డాను. డ్రామా చూస్తున్న చుట్టుపక్కల వాళ్ళు,  పాపం ఇంకో పది రూపాయలేనా  ఇయ్యి అని సలహా ఇచ్చారు. మీరందరూ చెబుతున్నారు కాబట్టి ఇంకో ఐదు రూపాయలు ఇస్తాను అని ముఫై  రూపాయలు ఇచ్చి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. చుట్టు పక్కల వాళ్ళు గప్చుప్ గా వెళ్ళిపోయారు వాళ్ళ నేమైనా అడుగుతానేమో నని భయం కాబోలు.  తువ్వాలు పరుచుకొని కూచుంటే ఓ పదిరూపాయలు రాలకపోతాయా అని కూడా ఆలోచించాను.   కానీ ధైర్యం చేయలేకపోయాను. ముష్టి అడుక్కోవడానికి కూడా ధైర్యం ఉండాలి అని గ్రహించాను.  

ముఫై రూపాయలతో హౌరా నుంచి విజయవాడ వెళ్లడం ఎలా అని ప్లాన్ చెయ్యడం మొదలు పెట్టాను.  మద్యాహ్నం  తిన్న  తిండి స్టేషన్ కి రాకుండానే అరిగిపోయింది. ఇప్పుడు  భోజనం, రేపు పొద్దున్న కాఫీ, టిఫిన్, మద్యాహ్నం భోజనం, మళ్ళి కాఫీ టిఫిన్,  సాయంకాలం 6-7 గంటలకి కానీ చేరదు విజయవాడ,  పైగా రెండు గంటలు లేట్ ఇంకా ఎంత పెరుగుతుందో. అన్నిటికన్నా ముఖ్యం సిగరెట్లు కదా.     

ముందుగా ఒక రోజుకి  సరిపడా మూడు   సిగరెట్టు పాకెట్స్ కొనేశాను స్టేషన్ బయట. అప్పుడే తెలిసింది కాలికి చెప్పులు కూడా లేవని. వేసుకున్న బూట్లు జాగ్రత్తగా  సంచిలో పెట్టాను కదా మరి. స్టేషన్ బయట  చవకగా చెప్పులు కొనేశాను.  ప్రయాణం మొదలు కాకుండానే పదిహేను రూపాయలు ఖర్చు అయిపోయాయి.

మెదడు లో మేధోమధనం  జరుగుతుంటే తలనొప్పి వచ్చింది.   తెగించి ఓ బ్రెడ్ దానికి తోడుగా ఓ కాఫీ లాగించేసాను.  డబ్బులు  లెఖ్ఖ పెట్టడం మానేయాలని, ఉన్నవి అయిపోయిన తరువాతే నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నాను.  అప్పటికి 8–30  అయింది. ఇంకో గంట అటూ ఇటూ తిరుగుతూ , కొత్త చెప్పుల చేత కరిపించుకుంటూ,  కాలక్షేపం చేసాను. ఆ తర్వాత రైలు ఎక్కి కూర్చున్నాను.  కింద బెర్త్.   పై బెర్త్ వారికి ఈ కింద బెర్త్ అమ్మివేద్దామా ఓ పది,  పదిహేను రూపాయలకు అని అనుకున్నాను కానీ ఎవరూ అడగలేదు. ఓ అరగంటలో అందరూ పడుకున్నారు. 

పన్నెండున్నరకి ఖర్గపూర్ వచ్చింది. పాపం ఎవరో కుర్రాడు వెజ్ బిర్యాని అమ్ముతున్నాడు. వాడు అరిచిన కొద్దీ నా ఆకలి పెరుగుతోంది. ఓ పదినిముషాలు పెరగనిచ్చి కొనేశాను. తినేలోపులే బండి బయల్దేరింది. బలాసోర్ లో ఆగినప్పుడు దిగి మంచినీళ్ళు తాగాను. అప్పుడే ఓ కుర్రాడు టీ సార్ అంటూ వెంటపడ్డాడు. సరే అని తాగాను. 

తెల్లారకుండానే ఏడు గంటలకల్లా లేపేశారు, తోటి ప్రయాణికులు. టీ కాఫీ అంటూ అరుస్తున్నారు అమ్మేవాళ్ళు . తాగేశాను రెండు మాట్లు. సుమారు పది  గంటలకి పలాస చేరింది.  ఓ బ్రెడ్ మరో టీ లాగించేసాను. చివరగా రొంటిలో మిగిలింది ఏభై పైసల బిళ్ళ. శ్రీకాకుళం రాగానే ఎలుకలు నిద్ర లేచాయి. విజయనగరం లో జాగింగ్ మొదలు పెట్టాయి. వైజాగ్ వచ్చేటప్పటికి రన్నింగ్ రేస్ లో పాల్గొంటున్నాయి . వైజాగ్ ప్లాట్ఫారం మీద నా  ప్రస్థుత పరిస్థితి అది.

శ్రీకాకుళం లో ఖాళీ అయిన 5 బెర్తులు వైజాగ్ లో నిండాయి.   నేను   నా  సీటు లో కూర్చోబోతోంటే  ఒకాయన 

“బాబూ ఇది రిజర్వుడ్ కంపార్ట్మెంట్”  అన్నాడు. 

“నాకూ తెలుసు ఆ కిటికీ సీటు నాదే” అన్నాను. 

ఆయన నాకేసి అదోలా చూసాడు. నేనూ నన్ను ఒకమాటు చూసుకున్నాను. రెండు రోజుల గడ్డం, మాసిన లుంగీ, నలుపులోకి మారుతున్న బనీను, భుజం మీద ఒక తువాలు,  రొంటిలో ఒక సిగరెట్టు పాకెట్, అగ్గిపెట్టె.  ఎవరేనా ఏమనుకుంటారు? రాజనాల తమ్ముడు అని తప్ప.  పాపం అదే అనుకున్నాడు అని జాలిపడ్డాను.  పెద్దాయన, భార్య, బహుశా  కొడుకు, కోడలు, అమ్మాయి అని అనుకున్నాను .   నేను నా సీటు లో కూర్చోగానే అర్జంటుగా మగాళ్ళు  నాపక్కకి , ఆడవాళ్ళు ఎదుటి సీట్ల లోకి మారిపోయారు.  వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను బయటకు చూస్తున్నాను. బండి బయల్దేరిన పది నిముషాలకి అడిగాడు పెద్దాయన.  

ఎక్కడికి వెళ్ళుతున్నావు?
విజయవాడ
ఎక్కడినుంచి వస్తున్నావు?
అప్రయత్నంగా నా నోటి నుంచి ఖర్గపూర్ అని వచ్చేసింది.
ఖర్గపూర్ లో ఏం చేస్తుంటావు?
ఒక్క క్షణం ఆలోచించాను. కూలీ  నండి, రైల్వే కూలీ  నండి.
రైల్వే కూలీ  వా?
అవునండి.
మీకు పాస్ ఉంటుందా?
ఉంటుందండీ  (నిజంగా నాకూ తెలియదు)
రోజుకి ఏ మాత్రం సంపాదిస్తావు?
15 - 20  ఉంటుందండీ. అప్పుడప్పుడు ముఫై దాకా వస్తుందండీ.
నెలకి ఓ ఐదారు  వందలు వస్తుందన్నమాట
అవునండి
ఈ మాత్రం మీ ఉళ్ళో దొరకదా, ఇంత దూరం వెళ్ళాలా?
పొలం పనులుకి  వెళ్ళితే రోజు కూలి ఇరవై కన్నా ఎక్కువ ఇవ్వటం లేదండి. కొన్ని రోజులు పనులు  దొరకవండి. పొలం పని  చాలా కష్టం కదండీ. కామందు  అసలు కూర్చోనివ్వడండి. ఈ పనిలో అంతా కలిపి ఓ రెండు గంటల కన్నా పని ఉండదండి.  ఈ ఉద్యోగమైనా మా ఆడదాని మేనమామ అక్కడ ఉండడం వల్ల వచ్చింది.

నీకు పెళ్ళైందా? ( ఆశ్చర్యంతో కూడిన ప్రశ్న)
ఇద్దరు పిల్లలండి.
మీ ఆవిడ నీతోనే ఉంటుందా ఖర్గపూర్లో?
లేదండి, అది మా ఉళ్ళో ఉంటుందండీ. అది నాల్గు ఇళ్లలో పని చేస్తుందండి. అదీ ఓ రెండు వందలు సంపాయిస్తుందండి. 

నువ్వు ఇప్పుడు పెళ్ళాం దగ్గరికి వెళుతున్నావా?
అవునండి
సామాన్లు ఏమీ కనిపించటం లేదు.
సామాన్లు మా కెందుకండి? లుంగీ బనీను తో ఎక్కేస్తాం . ఇంటిలో బట్టలు ఉంటాయి కదా.
పిల్లలకి ఏమైనా పట్టుకెళ్ళాలి కదా
అబ్బే, ఆళ్ళమ్మ కొనేస్తుందండి. మనం వెళ్లడం నాల్గురోజులుండడం,  తిరిగి వచ్చేయడం. అంతేనండి.

ఇంక ఏం అడగాలో తెలియక ఆయన ఊరుకున్నాడు. పెద్దావిడ మొదలు పెట్టింది.

నీ వయసు ఎంత?
నేను 44 లోనో  45 లోనో  పుట్టానుటండి. నాకు 25  నిండా యనుకుంటాను.

అప్పుడే ఇద్దరు పిల్లలా అని ఆశ్చర్యపోయింది కోడలు .
నాకు 19వ ఏట పెళ్ళైంది. 20 కి అబ్బాయి పుట్టాడు  22 కి అమ్మాయి పుట్టింది.
మీ ఆవిడ వయసు ఎంత?
పెద్ద తేడా లేదండి. నాకన్నా మూడు నాలుగు నెలలు చిన్నదండి మా ఆడది.

పంతొమ్మిది ఏళ్లకే పెళ్ళా అని మళ్ళీ  ఆశ్చర్యపడింది కోడలు.
అప్పటికి మూడు నాలుగేళ్లగా  నేను బలాదూరుగా తిరుగుతుంటే, పెళ్ళైతే బాగుపడతానని చేసేసాడు మా బాబు.
బలాదూరుగా  తిరగడమా ?  ఏమీ  చదవలేదా?
అబ్బే చదువుకీ నాకు అసలు కుదరలేదండి. గొడ్లు కాయడమో చదువుకోవడమో ఒకటే చేస్తానన్నానండి,  మా బాబు తో.  పసువుల్నే మేపమన్నాడండి.  సంతకం పెట్టడం నేర్చుకున్నానండి.

22 ఏళ్ళకి ఇద్దరు పిల్లలు. ఆ తరువాత జాగ్రత్త పడ్డారా? పెద్దావిడ.
ఈ రెండేళ్ళ నుంచి దూరంగా ఉంటున్నాను కదండీ అని నవ్వాను.
ఇప్పుడు వెళుతున్నావు కదా. ఇంకొకరు వస్తారులే అన్నాడు పెద్దాయన.
మధ్యలో ఒక మాటు వచ్చి వెళ్ళానండి. ఇప్పుడు  మీ ఆశీర్వాదం వల్ల అలా జరిగితే మంచిదేనండి. మీపేరు పెట్టుకుంటాను.

ఆయన మాట్లాడలేదు. మొహం తిప్పుకున్నాడు. ఆవిడ కూడా కిటికీ లోంచి బయటకు చూడడం మొదలు పెట్టింది.   అమ్మాయి, కొడుకు, కోడలు  మాట్లాడుకుంటున్నారు.  కధ ముదిరి పాకాన పడిందని అర్ధం అయింది కాబట్టి  మాట కలపటానికి నేను సాహసించలేదు.  

నేను విజయవాడ లో దిగి రాత్రి పదింటికి మా అక్కయ్య గారింటికి వెళ్లాను. రాత్రి  కబుర్లు చెప్పుకొని,  నిద్ర పొతే, తెల్లారి 9 గంటలకి మెలుకువ వచ్చింది. మా బావగారు బయటకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మా అక్క చెప్పింది ఆయనకు,

“మేం పది గంటలకి వెళ్ళి వీడికి నాలుగు జతల బట్టలు అవీ కొనుక్కొస్తాము. మీరు వెళ్ళి వాళ్లకి చెప్పండి,  ఈ కారణం వల్ల అనుకున్నట్టుగా పదకొండు గంటలకి రాలేము. మద్యాహ్నం మూడు గంటలకి వస్తాం. ప్రోగ్రాం మారినందుకు సారీ చెప్పండి.”
అల్లాగే అంటూ ఆయన వెళ్లారు.  

 విజయవాడ వచ్చిన తరువాత తెలిసింది నాకు పెళ్లి చూపులు ప్రోగ్రాం పెట్టారు ఆ వేళ. మా వాళ్ళు చూసి  ఓకే  అనుకున్నారుట. ఇప్పుడు  నేను ఓకే  అంటే  అంతా ఓకే అన్నమాట. మూడు గంటలకి వాళ్ళ ఇంటికి వెళ్ళాం నేను, అక్కా, బావా, మా మేనల్లుడు నాల్గేళ్ళ వాడి తో సహా. 

వాళ్ళ గుమ్మం లో అడుగు పెడుతుంటే అప్రయత్నంగా నా నోటి నుండి కేక లాంటి అరుపు వచ్చింది.

అక్కోయ్  రైల్లో నేను  నిన్న కధ చెప్పింది వీరికేనే.

కోడలు  “మీ ఆడదాన్ని,  పిల్లల్ని తీసుకు రాలేదేం ”   

నాకు అయోమయం గా ఉంది.  అక్క కూడా ఖంగారుగా చూస్తోంది. 

ఈ లోపున  పెద్దావిడ చెప్పింది   

“మీ బావగారు పొద్దున్న చెప్పారు మీ సామాను పోయిన సంగతి.  మాటల సందర్భంలో  మీరు రైల్లో అల్లిన కధ గురించి కూడా. ఆ కధ  మాకే  చెప్పారు అని చెప్పాము.  మా ప్రభావతి మీ బావగారిని రిక్వెస్ట్ చేసింది,  మీకు మా గురించి చెప్పవద్దని,   ఇక్కడకు రాగానే  మీకు కూడా  షాక్ తగలాలని.”  

మా బావగారు నవ్వుతున్నారు. పెద్దాయన నవ్వుతూ ముందుకు వచ్చాడు.

ఆ తర్వాత ఏం జరింగింది అంటారా.  ప్రద్యుమ్న ప్రభావతీయం మొదలయింది.   


నా  మాట.... ఇదివరలో రైలు ప్రయాణం లో ఒక కధ  అని ఒక టపా వ్రాసాను. శ్రావ్య V గారు  కామెంట్ లో రెండు సలహాలు ఇచ్చారు. ఆ సలహాకి జవాబుగా ఈ కధ. శ్రావ్య గారికి ధన్యవాదాలతో.



గమనిక:- ఈ టపా మొదటి మాటు 22/12/2012 న ఈ బ్లాగులో ప్రచురితమైనది. 
   
                               
                

46 కామెంట్‌లు:

వనజ తాతినేని/VanajaTatineni చెప్పారు...

:) నవ్వకపోతే బాగోదని కాదండి.. హాయిగా నవ్వేసాం. మీ కల్పిత పెళ్లి కథ కన్నా మిగతా కథే.. బావుంది. నవ్వలేం . కాని మీ వ్రాతలకి నవ్వక చస్తామా!?

అజ్ఞాత చెప్పారు...

కథ సుఖాంతం.. వోర్నాయనో ఇంత కథ నడిపేరన్నమాట..

ఫోటాన్ చెప్పారు...

:))

అజ్ఞాత చెప్పారు...

అంటే చిన్నప్పటినుంచీ ఉందన మాట ఈ అకధలు చెప్పడం. చెల్లాయి అలవాటు పడిపోయింది పాపం. :)

Ramani Rao చెప్పారు...

అప్పుడే అయిపోయిందా కథ. కథ సుఖాంతం ఏంటి అసలు కష్టం అప్పుడే మొదలయితేను.. చెప్పండి బులుసు గారు తరువాత ఏమి జరిగింది ప్రద్యుమ్న ప్రభావతీయంలో ఆ తరువాత?
:) కార్తీక దీపం పెట్టి , అందరు నిద్ర పోతున్నారు సరే అని నెట్ ఓపెన్ చేస్తే నవ్వితే నవ్వండి అని ఇలా రాస్తారా? గట్టిగా నవ్వితే పొద్దున్నే ఏదో యోగా చేస్తున్నా అనుకుంటున్నారు కుటుంబ సభ్యులు.. :)

sai krishna alapati చెప్పారు...

మీరు కధ చెప్పిన తరువాత ఎవరు ఐన నవ్వ కుండా ఉంటారా ? ఐన ఏమి ఆయి పోయారు ఇన్ని రోజులు మీ పోస్ట్ లేక లేక మేము అంత ఏమి ఆయి పోవాలి .

www.apuroopam.blogspot.com చెప్పారు...

మీ కథనచమత్కృతిని గురించి తెలిసిన వాళ్లెవరైనా మీరు నిజం చెప్పినా నమ్మని పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిందా మాష్టారూ? ఉంటే అలాంటి ముచ్చట్లూ చెప్పి మమ్మల్ని ఆనందింప జేయండి.

శ్రీలలిత చెప్పారు...


నయం.. ప్రభావతిగారికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వుంది కనుక కథ సుఖాంతమైంది.

రాధిక(నాని ) చెప్పారు...

:))హాయిగా నవ్వించారు.రైలులో ప్రశ్న-సమాదానాలు చాలా నవ్వుతెప్పించాయి

Sravya V చెప్పారు...

గురువు గారు, ఎంత బాగా గుర్తు పెట్టుకున్నారో :-) So nice of you !
Very well narrated, I enjoyed thoroughly!

సుజాత వేల్పూరి చెప్పారు...

కెవ్వు! మలుపేదో ఉండి ఉంటుందనుకున్నాను కానీ ఇంత బ్లైండ్ టర్న్ అనుకోలేదు :-)))

అజ్ఞాత చెప్పారు...

హ హ.. బులుసు గారూ చంపేశారు.. :-)

Unknown చెప్పారు...

చాలా బావుంది.

Unknown చెప్పారు...

చాల బాగా వ్రాసారు...సూపర్ ... :)

రాజ్ కుమార్ చెప్పారు...

హిహిహి గురువుగారూ...
కధలు అల్లి అల్లల్లాడిస్తారు గా.. ;)
బాగుందండీ ;)

హరే కృష్ణ చెప్పారు...

సూపర్ గురూజీ :)
ట్రైన్ లో సంబాషణలు కెవ్వు కేక :D

Shiva Bandaru చెప్పారు...

:)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వనజవనమాలి గారికి,
నవ్వకపోతే వీడు ఏడుస్తాడేమో నని మొహమాటం కొద్దీ నవ్వినట్టున్నారు.......దహా.
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి.

హరేఫాలా గారికి,
అబ్బే, మనదేముంది. కధ నడుస్తూనే ఉంటుంది. మనం పాత్రధారులం. ఇది తెలుసుకునేటప్పటికి జీవితం ఇంకోళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది.......దహా.
ధన్యవాదాలు.

ఫోటాన్ గారికి,
దహా, దహా. (ఒకటికి మరొకటి ఫ్రీ). ధన్యవాదాలు.

కష్టే ఫలి గారికి,
ధన్యవాదాలు. కధలు చెప్పే నెగ్గుకొచ్చేసాను.....దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రమణి రాచపూడి గారికి,
అవునండి, మగాడి కష్టాలు అప్పుడే మొదలవుతాయి. ఆ తరువాత చెప్పడానికి ఇంకేముంటుంది. విషాద యోగం.........దహా.
ధన్యవాదాలు.

సాయికృష్ణ ఆలపాటి గారికి,
మిమ్మల్నందరిని నవ్వించడానికే ఈ నా ప్రయత్నం. ధన్యవాదాలు.

పంతుల గోపాల రావు గారికి,
నిజమేనండి. నేను నిజం చెపితే ఎవరూ నమ్మరు. అందుకనే అబద్ధాలు అలవాటు చేసుకున్నాను....దహా.
ధన్యవాదాలు.

శ్రీ లలిత గారికి,
సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇన్ని కష్టాలు తెచ్చిపెడుతుందని పాపం ప్రద్యుమ్నుడు ఉహించలేక పోయాడు....దహా.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రాధిక (నాని) గారికి,
నవ్వినందుకు ధన్యవాదాలు.
(నిన్ననే చూసాను మీ బ్లాగు. మళ్ళి వ్రాయడం మొదలు పెట్టినందుకు సంతోషం)

శ్రావ్య గారికి,
ఒక ఐడియా ఒక టపా నిస్తుంది. వాటాన్ ఐడియా మేడం జీ. మీకు మళ్ళి ఇంకోమారు ధన్యవాదాలు.

సుజాత గారికి,
బ్లైండ్ టర్న్ అంటారా. అంతే, అంతే. ఇప్పటిదాకా కూడా రైట్ టర్న్ దొరక లేదు ప్రద్యుమ్నుడికి .....దహా.
ధన్యవాదాలు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

శ్రీకాంత్ గారికి,
రాజారావు పంతుల గారికి,
శేఖర్ గారికి,

ధన్యవాదాలు.

రాజ్ కుమార్ గారికి,
ధన్యవాదాలు. కధలల్లి అల్లల్లాడింది పాపం ప్రద్యుమ్నుడే........దహా.

హరేకృష్ణ గారికి,
సంభాషణ లేనా? కధ గంట కొట్టిందా?.........దహా.
ధన్యవాదాలు.

శివ బండారు గారికి,
ధన్యవాదాలు....... దహా.

కృష్ణప్రియ చెప్పారు...

:) బాగుంది. మీకు నవ్వించటమే కాదు.. సీరియస్ గా నటించటం కూడా తెలుసన్నమాట..

శశి కళ చెప్పారు...

అంటే మాకు బనీన్ చాలండి....రోజుకు ఇరవై సంపాదిస్తామండి....పాపం ప్రభావతి గారు కాబట్టి వేగుతున్నారు...:))))))))))))
పాపం నిజంగా జరిగిందా ఇదంతా?

కొత్తావకాయ చెప్పారు...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకీ.. బావుందండీ. మొత్తానికి ప్రభావతీప్రద్యుమ్నం మొదలయిన సందర్భం ఇదన్నమాట! :)

Avineni Bhaskar / అవినేని భాస్కర్ / அவினேனி பாஸ்கர் చెప్పారు...

కి.ప్.ద్.నమ్:-)
కష్టాలొచ్చినప్పుడు నవ్వమన్నారు; మీరు నవ్వడమేకాదు అందర్నీ నవ్వించారు.

మీకు కథలల్లే టేలంట్ పెళ్ళయ్యాక వచ్చిందేమో అని భ్రమలో ఉన్నా ఇన్నాళ్ళు! పెళ్ళిచూపులప్రయాణానికే ఆ కళ వచ్చేసిందన్నమాట! ద.హ :)

Kottapali చెప్పారు...

WOW!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కృష్ణప్రియ గారికి,

నిజమేనండి. సినిమా పోస్టర్స్ మీద ఉండాల్సిన వాడిని. ఇలా బ్లాగుల్లో తిరుగుతున్నాను.... దహా.
ధన్యవాదాలు.

శశికళ గారికి,

రామాయణం అంతా విని ‘రాముడెవరు’ అంటారేమిటండి. అయినా వేగేదెవరో, వేయించే వాళ్ళు ఎవరో మీకు తెలియదా? .......దహా.
ధన్యవాదాలు.

కొత్తావకాయ గారికి,

ధన్యవాదాలు.
కధలెల్లా మొదలయినా వ్యధలు ఒకటే గదండి......దహా.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

అవినేని భాస్కర్ గారికి,

చూసారా మరి, నా కష్టాలు మిమ్మల్ని నవ్వించాయి. పెళ్ళికి ముందు థీరి, అయిన తరువాత ప్రాక్టికల్స్ అన్నమాట (కష్టాలకి).....దహా.
ధన్యవాదాలు.

నారాయణ స్వామి గారికి,

ధన్యవాదాలు.

మైత్రేయి చెప్పారు...

ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్డ్ నొక్కి వక్కానిస్తున్నాను.దహా :)

మైత్రేయి చెప్పారు...

ప్రభావతీ ప్రద్యుమ్నం అంటేనే బాగుంటుంది అని కీ బోర్డ్ నొక్కి వక్కానిస్తున్నాను.దహా :)

..nagarjuna.. చెప్పారు...

లుంగీ బనియను వేసుకొని రైలు ప్రయాణం..... కెవ్వ్వ్వ్వ్వ్వ్ కేక :)

జేబి - JB చెప్పారు...

దహా! నవ్వానండి.

ఇది ప్రద్యుముని నిజజీవితానుభవమేనా?

నాకు మటుకు ప్రయాణంలో ఎవరన్నా పలకరిస్తే బాగుండనిపిస్తుంది. కాకపోతే ఎవరన్నా నసగాళ్ళు దోరికితే వదిలించుకోవడనికి ఇంతసేపు కథలు చెప్పేంత అవసరం ఎప్పుడూ కలగల!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మైత్రేయి గారికి,

ధన్యవాదాలు. ప్రభావతీ ప్రద్యుమ్నం ఆయనెవరో వ్రాసారు కదండీ. కాపీ రైట్స్ అంటారేమో నని ప్రద్యుమ్న ప్రభావతీయం అన్నాను.
చాలా ఘట్టిగా నొక్కి వక్కాణించారు లాగుంది. కామెంటు రెండు మాట్లు వచ్చింది........దహా.

నాగార్జున గారికి,

భలేవారే, అవైనా మిగిలాయని సంతోషించాడు ప్రద్యుముడు.....దహా.
ధన్యవాదాలు.

జేబి-JB గారికి,

ప్రద్యుమ్నుడి జీవితానుభవమే. నాది కాదు. నిజమే, నస పెట్టే వాళ్ళతోనే సమస్య.
ధన్యవాదాలు.

Padmarpita చెప్పారు...

సరదాగా సాగింది.:-)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

ఆ రోజుల్లో హౌరా స్టేషన్ లో నేనూ అప్పుడప్పుడు ఇబ్బందులు పడినవాడినే, కాకపోతే మీ అంత కాదులెండి. ముళ్ళపూడి వారు ఏదో కథలో అన్నట్లు "ఎంత చేటైనా మరీ ఇంత చేటా" అన్న మాట గుర్తొచ్చింది మీర్రాసింది చదివితే 😁.

రైలు ప్రయాణంలో ఇటువంటి కథలు చెప్పి చాలా రిస్క్ తీసుకునేవారన్నమాట అయితే? పెళ్ళి సంబంధం ఓకే అయింది కాబట్టి సరిపోయింది గానీ ఆ ఆడపెళ్ళి వారు గనక తొందరపడద్దు, ఇతగాడు జోర్హాట్ లో సైంటిస్టేనా, లేకపోతే తనే చెప్పుకున్నట్లు నిజంగానే ఖరగ్ పూర్ లో రైల్వే కూలీగా పని చేస్తున్నాడా ఇంకా గట్టిగా వాకబు చెయ్యాల్సిందే అని డిసైడ్ అయిపోయుంటే అంతా తారుమారు అయ్యేది కదా? అ.హా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు. ఆ రోజుల్లో అస్సాం నుంచి డైరక్ట్ ట్రైన్ కూడా లేదు. నెలరోజుల కన్నా ముందు రిజర్వేషన్ చేసుకోవడం కుదిరేది కాదు. తిరిగి వచ్చేటప్పుడు నిడదవోలు వెళ్లి మా నాన్నగారు నేను భీమవరం రాక మునుపే రిజర్వేషన్ చేయించే వారు. అయినా హౌరా లో బెర్త్ దొరికేది కాదు. ఒక మాటు హౌరా నుంచి అన్ రిజర్వేడ్ కంపార్తమేంట్ లో గౌహతి దాకా ప్రయాణం చేయాల్సి వచ్చింది భార్యా, మూడు నెలల మా అబ్బాయితో సహా. ఇప్పుడు తలచుకుంటే ఆ ప్రయాణం ఎలా చేసాము అన్నది ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ......... మహా

ఇవన్నీ కల్పిత కధలే నండి. సరదా గానే వ్రాసినవి. స్వీయానుభావాలు కావు........... మహా

Zilebi చెప్పారు...


ఒక మాటు హౌరా నుంచి అన్ రిజర్వేడ్ కంపార్తమేంట్ లో గౌహతి దాకా ప్రయాణం చేయాల్సి వచ్చింది

మీరెవరో సత్తెకాలం సత్తెయ్య లా వున్నారే ! మేమైతే రిజర్వుడు బోగీలో యెక్కి సైడు లోయర్ బర్తు వాళ్ళని గదమాయించి,ఆపై టీ సీ ని దబాయించి, వినకుంటే కొంత "వూరడించి" ప్రయాణం " దర్జాగా" చేసే వాళ్ళము సుమండీ ! అదిన్ను టిక్కెట్టు కూడ కొన కుండా. టిక్కట్టు ఖర్చు " వూరడింపు" లెక్క లోకి ట్రాన్సఫరు స్మీ :)



జె కె:)
జిలేబి

విన్నకోట నరసింహా రావు చెప్పారు...



"జిలేబి" గారు అలాగే అంటారు లెండి, వారికి చమత్కారం ఓ పాలు ఎక్కువ కదా 😉.

మాస్టారూ, నా చదువు కొంత భాగం బెనారస్ యూనివర్సిటీలో వెలగబెట్టడం వలన వారణాసికి నా రాకపోకలు హౌరా మీద నుండే జరిగేవి (మన వైపుల నుండి వారణాసికి డైరెక్ట్ ట్రెయిన్ లేదు అప్పట్లో, హౌరాలో మారాలి). ఆరోజుల్లో మెయిల్ బండికి సామర్లకోటలో రిజర్వేషన్ కోటా లేనందున, అప్పట్లో మేముంటున్న పిఠాపురం నుండి రాజమండ్రి వెళ్ళి ప్రయత్నించేవాళ్ళం (అక్కడ రెండో మూడో బెర్తుల కోటా ఉండేది. ఆ రోజుల్లో స్లీపర్ లో కూడా చెక్క బెర్తుల 3-Tier తో పాటు కుషన్ బెర్తుల 2-Tier స్లీపర్ పెట్టె కూడా వేరే ఉండేది, తర్వాత తర్వాత 2-Tier ఎత్తేసారు, మీకు తెలుసుగా). ఆ స్టేషన్ లో సదరు గుమాస్తా గారు ఓ రిజిస్టర్ తీసి దాంట్లో మనం అడిగిన తేదీ పేజ్ తెరచి చూసేవాడు. బెర్తేమన్నా ఖాళీ ఉన్నట్లు కనిపిస్తే ... ఉన్నాయి, వెళ్ళి టికెట్ తెచ్చుకోండి అనేవాడు. మనం సాధారణ టికెట్ కౌంటర్ కు వెళ్ళి వారణాసికి టికెట్ కొనుక్కుని, తిరిగి ఈ రిజర్వేషన్ కిటికీ వద్దకు వచ్చి ఆ గుమాస్తా గారికి అందజేస్తే, వారు రిజిస్టర్ లో ఒక బెర్త్ కు మన పేరు, టికెట్ నంబర్ వ్రాసుకుని, టికెట్ వెనకాల ప్రయాణం తేదీ, మెయిల్ బండి నంబర్, బెర్త్ నంబరు వ్రాసి ఇచ్చేవాడు. మనం అడిగితే Party joining at Samalkot అని రిజిస్టర్ లో వ్రాసుకునేవాడు (వ్రాయమని అడిగేవాళ్ళం లెండి, లేకపోతే రైలు ఎక్కడానికి మళ్ళీ రాజమండ్రి ఏం వెడతాం?).

మరి హౌరా నుండి వారణాసి వరకు రిజర్వేషన్ సంగతి ఏమిటండీ అని అడిగితే ఇవ్వాళే హౌరాకు టెలెగ్రాం ఇస్తామండీ, అక్కడ నుండి టెలెగ్రాం సమాధానం వస్తుంది అని చెప్పేవాడు. తిరిగి మనం ఓ నాలుగైదు రోజుల తర్వాత రాజమండ్రి స్టేషన్ కు వెళ్ళి, ఏమన్నా తెలిసిందాండీ అని అడిగితే, పరిస్ధితి ఏమిటో చెప్పేవాడు. తమ టెలెగ్రాం కు హౌరా నుండి జవాబు వచ్చిందో లేదో, వచ్చుంటే బెర్త్ ఇచ్చారో లేదో చెప్పేవాడు. బెర్త్ వస్తే మంచిదే, రాకపోతే అదిగో మీరు వర్ణించిన ఇబ్బందులు హౌరాలో పడాల్సి వచ్చేది (ఇంకా పెళ్ళి కాకపోవడం వల్ల కొంత నయం 😎). ఆ కాలపు ఇటువంటి రిజర్వేషన్ ప్రక్రియంతా మీకూ తెలుసనుకోండి, కాకపోతే పైన మీరే చెప్పినట్లు మీ కోసం భీమవరం వెళ్ళి పాపం మీ తండ్రి గారు ఈ శ్రమంతా పడేవారన్నమాట?

(తర్వాత చాలా కాలానికి వారణాసికి డైరెక్ట్ ట్రైన్ "గంగా-కావేరి ఎక్స్ప్రెస్" వేశారు ... కాకపోతే మద్రాసు నుండి విజయవాడ మీదుగా వయా నాగపూర్ వెళ్ళే ట్రైన్. గోదావరి జిల్లాల వైపు రాదు)

మీరన్నట్లు ఇప్పుడు తలుచుకుంటే ఎలా చేసేవాళ్ళమా అనిపిస్తుంది గానీ ..... మొత్తం మీద ప్రక్రియ సాఫీగానే నడిచేదని చెప్పుకోవాలి. Those were the days. ఆ కాలం నుండి ఇప్పుడు ఇంట్లో కూర్చునే ఆన్-లైన్ లో రిజర్వేషన్ చేసుకోగలిగే వెసులుబాటు వచ్చింది. ఇప్పటి జనాలు అదృష్టవంతులు.

(మరీ పెద్ద కామెంట్ వ్రాశానా? సారీ. ఏదో ఆ రోజులు గుర్తొచ్చి ...)

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

పైన నా రెండో కామెంట్లో మూడో పేరాలో "భీమవరం" బదులు "నిడదవోలు" అని చదువుకొమ్మని మనవి 🙏.

Zilebi చెప్పారు...


వినరా వారు,

ఆ గుమాస్తా గారికి అందజేస్తే, వారు రిజిస్టర్ లో....

గట్రా వాక్యము లో గుమాస్తాగారి ఆమ్యామ్యా సంగతి విడిచిపెట్టేసారే :) లేదా లేక నామోషీ గా అనుకుని రాయలేదా:)



జిలేబి

Jai Gottimukkala చెప్పారు...

చిన్నప్పుడెప్పుడో చూసిన బబ్బన్ ఖాన్ అద్రక్ కే పంజే నాటకం నుండి బాగా గుర్తుంది పోయిన జోకు ఒకటి బులుసు, విన్నకోట & జిలేబీ గార్లకు నచ్చుతుందేమోనని పెడుతున్నా:

ఒకతను బొంబాయి నుండి హైదరాబాదు (అప్పట్లో మినార్ ఎక్సప్రెస్ అయిఉండవచ్చు) వస్తాడు. తనకు బెర్త్ ఉన్నప్పటికీ రిజర్వేషన్ లేని చిన్న పిల్లాడికి తన బెర్త్ ఇచ్చి తాను కింద పడుకొని ఆపసోపాలు పడతాడు.నాంపల్లి చేరగానే ఇంటికి క్షేమంగా చేరితిని అంటూ టెలిగ్రామ్ ఇవ్వాలని వచ్చి టెలిగ్రాఫ్ గుమస్తా బబ్బన్ ఖాన్ తోటి చెప్పిన మాట: mai theekech pahuncha par ek potteko berth diya bolke poora jism mein dard hore. yeh aap angrezi mein mere beteko telegram deke meharbani karo. ఖాన్ సాబ్ దాన్ని తర్జుమా చేసి బొంబాయిలో ఉండే ఆసామీ కొడుక్కి reached safe but my full body has pains because I gave birth to a child అని టెలిగ్రామ్ పంపిస్తాడు.


విన్నకోట నరసింహా రావు చెప్పారు...

బాగుంది జై 😁. బబ్బన్ ఖాన్ జోకులు ever green కదా.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

“జిలేబి” గారు, రైల్లో మీ “దబాయింపు” సెక్షన్ వీరంగానికి లేని నామోషీ నాకెందుకు? అయినా ఆనాటి రాజమండ్రి గుమాస్తా గారు నిజాయితీపరుడులా ఉన్నాడు లెండి (నాలాగా 😎), పాపం ఆమ్యామ్యా బాపతు కాదు 🙂.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జిలేబి గారికి. ....... ధన్యవాదాలు. అన్ని ప్రయత్నాలు చేసి ఫలించక అన్ రిజర్వుడ్ లో వెళ్ళాల్సి వచ్చింది. ...... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. ఆ రోజుల కష్టాలు తలచుకుంటే భయం వేస్తుంది ఇప్పటికీ. ఆ ప్రయాణంలో హౌరా నుంచి నిడదవోల్ కి మెసేజ్ వచ్చింది కూడా. అయినా చార్ట్ లో పేర్లు లేవు. TC గారిని అడిగితే ఇలా ఎందుకు జరిగిందో SE రైల్వే ఆఫీసు కెళ్ళి కనుక్కోమని సెలవిచ్చారు. తప్పక ప్రయాణం చెయ్యాల్సి వచ్చింది. ఆ వేళ నా దురదృష్టం కొద్దీ ఏ మంత్రము ఫలించలేదు. ......... మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

Jai Gottimukkala గారికి. ........ ధన్యవాదాలు. జోకు బాగుందండి. ముద్రా రాక్షసాల్లో ఒకటి ఇలాంటిదే విన్నాను. "TC gave birth to me" ......... మహా