నా ఇష్టం, నేనో గేయం వ్రాసేసాను....... అంతే

హెచ్చరిక, హెచ్చరిక.:-- నా ఇష్టం నా బ్లాగు కాబట్టి నేనో గేయం వ్రాసాను. నేను వ్రాసాను కాబట్టి మీరు లగెత్తు కుంటూ  వచ్చి చదివేస్తారు. అందుకని హెచ్చరిక అన్నమాట. వ్రాసింది గేయమే కదా హెచ్చరిక ఏంటని హాచ్చరియ పడిపోకండి. అంటే ఇప్పుడు ఏదైనా షాకు తగిలిందనుకోండి, మనస్సు దెబ్బ తింటుంది. అప్పుడు మనో దౌర్బల్యం కలవాళ్ళు ఏ అఘాయిత్యానికైనా పాల్పడవచ్చు. నేనో బాధ్యత గల రచయితని. అందుకని ఈ హెచ్చరిక చేస్తున్నాను. మీ మనస్సు ఘట్టిగానూ, అచంచలముగానూ, స్థిరముగానూ ఉంటుంది అనుకుంటే చదవండి. ప్రతీ చిన్న విషయానికి, ఇదైపోయి, విచారించి, బాధపడి, దు:ఖించి,కంగారుపడి, ఇది చదివిన తర్వాత ఇంకా బతికి ఉండడం అవసరమా అని తదుపరి కార్యక్రమం గురించి ఆలోచించే వాళ్ళు చదవక పోవడం మంచిదేమో అని ఇంకొక మారు ఆలోచిస్తారని ఈ హెచ్చరిక.

చెప్పానుకదా నేనో బాధ్యత గల రచయితని అని. మిమ్మల్ని హెచ్చరించడం తో నాపని అయిపోదు. నా బాధ్యత ని పూర్తి చేయడానికి నేనో రెండు ఉత్తరాలు కూడా వ్రాసాను.

మొదటి ఉత్తరం.:

గౌరవనీయులైన పోలీసు అధికారులకి,

నమస్కారం.  ప్రద్యుమ్నుడు అనబడు నేను,  చట్టమూ మరియూ రాజ్యాంగము నాకు ఇచ్చిన హక్కులను ఉపయోగించుకొని నాభావ ప్రకటన అను మహత్తర కార్య నిర్వాహము కొరకు ఒక గేయం వ్రాసాను.  వ్రాసాను కాబట్టి ప్రచురించ దలిచాను. ఆపైన వచ్చు కష్ట నష్టములకు నా బాధ్యత ఏమీ ఉండదు అని మనవి చేసు కుంటు న్నాను. తగు హెచ్చరికలు నా బ్లాగులో చేసి ఉంటిని. కానీ వద్దన్న పని చేయుట మన ప్రజల హాబీ.  వారి మనో భావములు చాలావిధములు గా దెబ్బతినుటయూ సహజముగా మారినది. అనగా ఎవరైనా చనిపోయినచో, లేక ప్రేమించనిచో, లేక ప్రేమించినచో, లేక దూషించినచో, లేక వారు అడిగినది ఇవ్వక పోయినచో, లేక వారికి నచ్చనిది ఎవరైనా చేసినచో, ఇట్లు అనేకానేక కారణములచే జీవితమును తృణ ప్రాయముగా త్యజించుచున్నారు.  అందు వలన మీ బాధ్యతలు మీరు సక్రమంగా నిర్వర్తించ వలసిందిగా కోరుచున్నాను. మీరు ఆత్మహత్యల నివారణకై తగు చర్యలు తీసుకొనెదరని, రైలు కట్టల వెంబడి, తటాకముల వద్ద, నదీనదాలు చెంత, సాగర తీరముల వద్దా, తగు కాపలా పెట్ట  గలరని కోరుచున్నాను. కొద్ది కాలం ఇళ్ళలో  తాళ్ళు,  కత్తులు,  కఠారులు,  బ్లేడులు మొదలగు పరికరముల ఉపయోగముపై నిషేధం విధించు విషయము కూడ మీరు పరిశీలించ గలరు అని కూడా విన్నవించు కొనుచున్నాను.

మీరు తగు విధంగా స్పందించి తగు చర్యలు తీసుకొందురని ఆశిస్తున్నాను.

రెండవ ఉత్తరం.:--

గౌరవనీయులైన  ముఖ్యులైన  అమాత్యుల వారికి,

మహా ముఖ్యమైన నమస్కారం,

ముందుగా నేను శ్రీ పోలీసు అధికారులకు వ్రాసిన ఉత్తరం చదువ ప్రార్ధించుచున్నాను. ఇప్పుడు నేను చెప్పు విషయమై తగు అవగాహన కలిగినది  అని తలచు చుంటిని. మీరున్నూ, మీ అధికారులున్నూ ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్ననూ జరగకూడనివి జరుగుచునే యుండును. ఈ పైన చెప్పిన విషయము వలన కూడా కొందరు త్యాగధనులు, త్యాగమయిలు తమ అమూల్యమైన జీవితములు త్యాగించు అవకాశము కలదేమో నని అనుమానించు చుంటిని. అటుల జరిగినచో తమరు వారి కుటుంబ పోషణార్ధం తగు చర్యలు తీసుకొన వలసిందిగా ముకుళిత హస్తములతో ప్రార్ధిస్తున్నాను.  ఓ పది లక్షలు, ఒక గృహం, కుటుంబములో ఒకరికి ఉద్యోగం ఇచ్చి వారిని ఆదుకొనెదరని  నమ్ముచున్నాను. ఇందులో ఏ రాజకీయ కోణం లేదని, ఇది పూర్తిగా సాహిత్య విలువలు పెంచు సదుద్దేశ్యముతోనే ఈ గేయం నేను వ్రాసితిని అని నొక్కి మరీ వక్కాణించు చుంటిని.

మీరు తగు సమయంలో తగు చర్యలు తీసుకొందురని ఆశిస్తున్నాను.

అయ్యా/అమ్మా/చెల్లీ/ తమ్ముడూ,/ అన్నా/అక్కా/వాళ్ళూ/వీళ్ళూ/ఇంకా ఎవరైనా సరే.:-

మీ అందరిని కూడా మరొక్క మారు ఆలోచించ వలసిందిగా కోరుచున్నాను.

కాదూ కూడదూ చదివే తీరుతామంటే ఇక పై మీ ఇష్టం.

చెడు కాలము దాపురించిన వారు విజ్ఞుల మాట వినరు కదా.

చదువ దలచిన వారు ఒకరి తరువాత ఒకరు వరుస గా వచ్చి దూకుడు

                                ఒకటి

                                రెండు

                                మూడు

                                దూకుము

           నేను చేత కాని వాడనా                        

అంటారు అందరూ  నన్ను చేతకానివాడనని,          వహ్వా       వహ్యా
అంటారు అందరూ  నన్ను చేతకానివాడనని,
మట్టిలో మాణిక్యాన్నని నమ్ముతాను నేను                క్యా ఖూబ్  క్యా ఖూబ్

5, 6 ఏళ్ళ వయసులొ,
ఎడమచేతి బొటనవేలు చూపుడువేలు మద్ధ్య బీడీ పట్టుకొని,
వదులుతూ పొగ నోటి ను౦చి, కుడిచేతితో  తిప్పుతూ చక్రం
అవుదామనుకున్నాను లారీడ్రయివర్,
బడిలొ వేసాడు నాలుగుతన్ని మానాన్న

13, 14, ఏళ్ళ వయసులొ,
ఎడంచేయి గాలిలో తిప్పుతూ, కుడిచేతితో పక్కవాడి తొడమీద
వేస్తూ తాళం, మధ్య మధ్య సవరించుకుంటూ గొంతుక
అవుదామనుకొన్నాను ఘంటసాల లాగ
సరిగమ అని నేను పాడితే మాయమయ్యాయి మావీధిలో గాడిదలు

17, 18, ఏళ్ల వయసులో,
కుడిచేతిలో మందు సీసా ఎడంచేతిలో సగం కాలిన సిగరెట్టు,
పక్కన ఓకుక్క, గుండె నిండా దగ్గుతో
అవుదామనుకొన్నాను దేవదాసులాగ
ఎంత ప్రయత్నించినా పార్వతి కాదుకదా దొరకలేదు చంద్రముఖి అయినా

21, 22, ఏళ్ళ వయసులో,
పడుతూలేస్తూ పూర్తిచేసి  ఎమ్.ఎస్.సి,
చేరాను ఓకాలేజిలో లెక్చరరుగా
అవుదామనుకొన్నాను సర్. సర్వేపల్లి. రాధాకృష్ణన్ లాగ,
పాఠం చెబుదామంటే కరువయ్యారు క్లాసులో కుఱ్ఱాళ్ళు

ఆపైన వయసు మీద పడుతుంటే,
పిహెచ్.డి చేసి రీసెర్చిచేస్తూ, ఉద్ధరిద్ధామనుకున్నాను దేశాన్ని,
40ఏళ్ళు ఉద్యోగం చేసినా, ఉద్ధరించలేకపోయాడు
పెళ్ళాం పిల్లలని అని అన్నారు అందరూ
ఇల్లూ లేదు వాకిలీ లేదు, బేంకు బాలన్సు అసలే లేదు,
ఏక్.నిరంజన్ గాడు నామొగుడు అని పాడుతుంది మా ఆవిడ

వయసు అయి రిటైరు అయి కూర్చుని,
ఇక లాభంలేదు, చేసెయ్యాలి ఏదో ఒకటి అని అనుకుంటుంటే
తెలిసింది వేటూరిగారు ఇంక లేరు, సినీవినీలాకాశంలో శూన్యమే శూన్యం
అని విచారిస్తున్నారని  అందరూ, బిగించేసాను నేనే నడుం
ఇది చదివి ఆహా అంటారో లేక నా వెంటబడి  కఱ్ఱలు పుచ్చుకొని
పంపుతా మంటారో నన్ను శూన్యంలోకి  తేల్చుకోవలసింది మీరే

అంటారు అందరూ నన్ను చేతకానివాడనని,
నమ్మండి మీలోఒకరయినా మట్టిలోమాణిక్యాన్ననిః


అయ్యబాబోయ్ చివరిదాకా చదివేసారా. మీ గుండె నిబ్బరానికి

              ఇదే నా జోహార్లు.

టంటటాయ్, టట్టఢాం మీ మ్యూజిక్ ఇహ మీరే కొట్టుకోండి.

గమనిక:- ఇది మొదటి మాటు ఈ  బ్లాగులో 15/11/2010 లో ప్రచురించబడింది.  

52 కామెంట్‌లు:

జ్యోతి చెప్పారు...

GGGGGRRRRRRRRRRRRRRRRRRRRR................

జేబి - JB చెప్పారు...

వహ్వా-వహ్వా!!!!
క్యా ఖూబ్ క్యా ఖూబ్ !!!

మరోసారి. వహ్వా-వహ్వా

మీరు నిజంగా బ్లాగుమట్టిలో మాణిక్యమండీ.

ఈ ఉత్తరాల ఆలోచనెలావచ్చిందండీ? అదిరిపోయింది!!

ఆ.సౌమ్య చెప్పారు...

"మహా ముఖ్యమైన నమస్కారం".....ఇది చదివే నేను కింద పడిపోయా...నవ్వలేక, మరేదో అనుకునేరు. :D
ఇహ మీ పాట మొత్తం పూర్తయాక నిజంగానే చచ్చేంత పనయింది నవ్వి నవ్వి. :) :) :D :D

ఇరగదీసారు.

astrojoyd చెప్పారు...

తలచినదే జరిగినదా..దైవం ఎందులకు?..తలచినదే జరిగినచో శాంతి లేదు నీకు...ఏదీ మన చేతిలో లేదు నాయనా.better luck in nxt.birth...

కృష్ణప్రియ చెప్పారు...

సూపర్ !! :))))

అజ్ఞాత చెప్పారు...

మొత్తం కవిత చదివితిని
తెలిసినది నాకేమీ కాలేదని
నిట్టుర్చితిని
ఒడ్డున పడిన చేప సరళిని

అజ్ఞాత చెప్పారు...

ఏదో ఫార్మాలిటీ కామెంట్లు పెట్టారు కాని, నిజంగా చెప్పాలంటే మీ పోస్ట్ లో నవ్వాతగ్గ మేటఋ నాకు కనపడలేదండి. మీరు బ్లాంక్ పోస్ట్ పెట్టినా ఇక్కడ ఇవే కామెంట్లు వస్తాయ్, కావాలంటే ట్రై చేసి చూడండి. ఇలాంటి చచ్చు పొగడ్తలద్వారా మీలో టాలెంట్ ఎదగకుండా చేసే కుట్ర కోణం వున్నా వుండవచ్చు. :)

శివరంజని చెప్పారు...

ఆహా భలేగా నవ్వించారు ...మీరు నిజంగా మట్టిలో మాణిక్యమండీ.

Padmarpita చెప్పారు...

:):)

Sunil చెప్పారు...

అద్భుతం!!!!! అమోఘం!!!! మీరు జంధ్యాల గారిని తలపిస్తున్నారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

జ్యోతి గార్కి,

ధన్యవాదాలు. మీరు మాటల్లో పొదుపు చేస్తే సరే కానీ నవ్వుల్లో పొదుపు పనికి రాదు.
GRRRRR. అవునూ అది గుర్ కాదు కదా. హహహ్హా. థాంక్యూ.

జేబి-JB గార్కి,

థాంక్యూలు మీ కామెంట్లకి. ఏదో మీ అభిమానం కొద్దీ అల్లా అంటారు. అర్హుణ్ణి కాదేమో. ధన్యవాదాలు

అప్పారావు శాస్త్రి గార్కి,

ధన్యవాదాలు మీ మందస్మితానికి. మా బ్లాగులో చిరు హాసాలు, దర హాసాలు ఒప్పుకోం, అట్ట హాసాలు తప్ప. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ. సౌమ్య గార్కి,

దెబ్బలేం తగలలేదు కదా ఫ్లోరింగ్ కి. మీ ఇంటి ఓనరో లేక ఆఫీసు మానేజరో నా మీద ఫ్లోరింగ్ నష్ట పరిహారం కేసు వెయ్యడు కదా.

ధన్యవాదాలు, మీ వ్యాఖ్యలు ఎప్పటి లాగానే శ్రవణానందకరం గా ఉన్నాయి. మీరు నవ్వులు ఇరగ పూయిస్తే మా కదే ఆనందం. చాలా థాంకులు.



అస్ట్రోజాయిడ్ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. అయినా శాంతులు చేయించటానికి నువ్వున్నావు కదా బుచ్చి బాబూ. థాంక్యూ.

కృష్ణప్రియ గార్కి,

దన్యవాదాలు. ఏమిటో మీరు చిరుహాసాలు తప్ప కొంచెం పెద్దగా నవ్వరా మా బ్లాగులో. థాంక్యూ.

ఒకటవ అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు. ఒడ్డున పడ్డ చేప అంటే బాగానే కష్టపెట్టిందన్నమాట నా గేయం. ధన్యోస్మి. అయినా గురువు గారూ, ఏదో నాలుగు గేయాలు వ్రాసుకొని బతికేద్దామను కొంటుంటే మీరు కామెంటు గేయం పెట్టి నాకు పోటీకి వస్తారా. హన్నా! థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రెండవ అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు. ఇంకా నయం, బ్లాగు మూసేసుకొని ఇంట్లో కూర్చున్నా కామెంట్లు పోస్టు చేస్తారనలేదు. ఇంకా ఏం ఎదగాలండీ, 67 ఏళ్ళగా ఎదుగుతున్నాను. నాకు ఇంకా జ్ఞానోదయం కలగలేదు. కాదం తార. మీ మందహాసానికి థాంక్యూ వెరీ మచ్చూ.

శివరంజని గార్కి,

ధన్యవాదాలు. ఇంకా మట్టిలోనే ఉన్నానంటారా! సరే ఏం చేస్తాం. మీ వ్యాఖ్యలకి థాంక్యూ.


పద్మార్పిత గార్కి,
ధన్యవాదాలు. థాంక్యూ.

సునీల్ గార్కి,

ఆహా, ఓహో ఎంత బాగా చెప్పారండీ. “తనువు పులకరించెనే” అని పాడుకున్నాను.

ధన్యవాదాలు మరియూ బోల్డు థాంకులు.

వేణు చెప్పారు...

ప్రద్యుమ్నుడి గారి గేయం ఏమంత గాయపరచలేదని చెప్పటానికి చింతిస్తున్నాను! ఇంతకంటే క్రూర, ఘోర కవిత్వాలనే తట్టుకున్నాక, నిరోధక శక్తి పెరక్కుండా ఉంటుందా? అయినా- మీరు ప్రమాద హెచ్చరికలు జారీ చేయకుండా ఉండాల్సింది; మైల్డ్ షాకులయినా తగిలుండేవి. :)

‘మహా ముఖ్యమైన నమస్కారం’ అని చదవగానే భలే నవ్వొచ్చింది.

ఓ పాత ఘట్టమూ గుర్తొచ్చింది. మా ఫ్రెండొకడు ఇన్ కం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తూ ‘మండలాధికారి గారి దివ్య సంతకానికి ’ అని రాశాడు. ‘ఇదేంటీ? దివ్య సముఖానికి’ అని రాయాలి కదా?’ అన్నాను. ‘అలాగా? మనక్కావల్సింది ఆయన సంతకం కదా, అందరూ దివ్య సంతకమనే రాస్తుంటారని ఇంతకాలం అనుకుంటూ వచ్చాను. అయితే కాదన్నమాట!’ అనేసరికి నాకు మతిపోయింది.

అజ్ఞాత చెప్పారు...

Comments ki blog lo unna matter ki ekkado link kudaratledandee..

Naku navu ravatledo lekapote veellu over react ayi comments pedtunnaro naku ardam kavatledu...

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

వేణు గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి,

>>ప్రద్యుమ్నుడి గారి గేయం ఏమంత గాయపరచలేదని చెప్పటానికి చింతిస్తున్నాను!

అంటే ఎంతో కొంత గాయపర్చిందన్న మాట.

>>ఇంతకంటే క్రూర, ఘోర కవిత్వాలనే తట్టుకున్నాక,

అంటే ఇది వాటికన్నా కొద్దిగా తక్కువ అన్నమాట,
చూసారా మరి హెచ్చరికల అవసరం అన్యాపదేశం గా చెప్పేసారు మీరే. ఏంచేస్తాం. హతోస్మి.
మీ మిత్రుడి idea బాగుంది. ఇంకా దివ్య సముఖాలు, పాద పద్మాలు ఇత్యాదులు ఉపయోగం లో ఉన్నాయా?
థాంక్యూ

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మూడవ అనానిమస్ గార్కి,
ధన్య వాదాలు మీ వ్యాఖ్యలకి,
నిజం చెప్పారు సార్ మీరు. కామెంట్లలో అతిశయోక్తులు ఎక్కువ గానే ఉన్నాయేమో అనిపిస్తోంది నాకు కూడా.

నవ్వుల్లో రెండు రకాలు ఉన్నాయి ట. నవ్వడం, నవ్విపోవడం. మీరు రెండోది చేసేయండి. థాంక్యూ.

RNP చెప్పారు...

astrojoyd గారూ, తమరు ఇలా అన్నారు

>>తలచినదే జరిగినదా..దైవం ఎందులకు?..తలచినదే జరిగినచో శాంతి లేదు నీకు...ఏదీ మన చేతిలో లేదు నాయనా.better luck in nxt.birth...

ఏమిటండీ మీరు ? అసలు ఒక్క లైన్ తప్పులేకుండా మీరు కామెంట్ రాస్తే చూసి తరించాలని ఉంది. ఏది మన చేతిలో లేకపోవచ్చు , మీరు రాసే కామెంట్లు మీ చేతిల్లోనే ఉన్నాయి, ఆ విషయం మర్చిపోకండి. better luck in your next comment.

Also, next spelling is not nxt !

తలచినదే జరిగితే దైవం ఎందుకు అంటారు.తలచినదే జరిగితే శాంతి లేదు అంటారు.అంటే దైవం ఉంది,కానీ శాంతి లేకుండా చేస్తుంది అనా మీ ఉద్దేశం ? ఏవిటో, ఎన్నో శాస్త్రాలు చదివి పుణ్యం సంపాదించాను అనుకునే మీరు ఇలాంటి మాటలు అనేసి దైవ దూషణకి పాల్పడుతున్నారు. దీనికి శిక్ష ఏంటో గరుడ పురాణంలో చూసి ధన్యులు కండి సారూ.

అసలు గేయం ఇదీ - తలచినదే జరిగినదా దైవం ఎందులకు. జరగినదే తలచితివా శాంతి లేదు నీకు. అని .

ఏంటో మరి, మీ లాంటి జర్నలిస్టులే సాహిత్యాన్ని ఖూని చేస్తే, భవిష్యత్తు జర్నలిస్టులకి మార్గ నిర్దేశం చేసేది ఎవరు ?

వేణూశ్రీకాంత్ చెప్పారు...

హ హ ఉత్తరాల ఐడియా సూపరండీ ఇలాంటి ఆలోచనలు మీకే సాథ్యం :-) గేయం కూడా సరదాగా ఉంది.

మరే మరే మీరు బ్లాగ్ మూసి ఇంట్లో కూచున్నా కామెంట్లు రాసేస్తాం త్వరగా మళ్ళీ బ్లాగు తెరిచి నవ్వులు పూయించమని.

వేణు గారు హ హ దివ్యసంతకానికి బాగుందండి మీనేస్తం ఎవరో కానీ straight to the point భలే చెప్పారు.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

RNP గార్కి,

ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి.

వేణూ శ్రీకాంత్ గార్కి,

ధన్యవాదాలు. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి.

అవును.ఈ మధ్యన వేణు గారు కామెంట్లలో జోకులు బాగానే వేస్తున్నారు. థాంక్యూ.

మనసు పలికే చెప్పారు...

సుబ్రహ్మణ్య గారూ.. ఇదన్యాయం..:( నేను లేని రోజులు చూసి ఇలాంటి మంచి మంచి టపాలు వేసేస్తారా...:(((
టపా మాత్రం భలే ఉందండీ.. అసలు ఆ ఉత్తరాల ఆలోచన ఉంది చూశారూ.. అద్దిరిపోయింది..:)))

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

మనసు పలికే గార్కి,

క్షమించాలి. ఇక మీదట ఇటువంటి పొరపాటు జరగకుండా చూస్తాను.

ఉత్తరాలు రాయడం కూడా అనుకోకుండా జరిగి పోయిందండి. ఈమధ్యన ఆత్మహత్య చేసుకొనే వారందరూ ఒక ఉత్తరం జేబులో పెట్టుకొని మరీ గోవిందా అంటున్నారు కదా. అందుకని ఇల్లా ప్రయత్నించాను.

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. థాంక్యూ.

హనుమంత రావు చెప్పారు...

మీరు అన్ని హెచ్చరికలు చేసాక యెలా చదవమనుకున్నారు. తూర్పుగది
తెరవకని రాజుగార్ల కథల్లో చెప్పినా తోటరాముడు తెరుస్తాడుగా మరి.
అందుకనే అందరూ తెరిచాసారు మీ హెచ్చరిక బేఖాతరు చేసి.. మీరు
చేతకాని వారని యెవరనగలరండీ? మీ చేతనే అవుతుంది ఇలాంటి
హాస్యం వ్రాయడం...వహవ్వా..వహవ్వా.

అజ్ఞాత చెప్పారు...

Naaku deenilo haasyam emi undo asalu ardham kaaledu. Andaru aaho ooho antunnaru. Bahusa meeru kooda valla tapala lo alaage comment chestaarani aasisthunnaremo. Nenu emi cheyyakapodunu kaani Jandhyaala gaaritho polika undi choosaaru akkada kaalindi. Mimmalni baadha pettatam naa uddesam kaadu, ee saari nijam ga baaga raayalani aasisthunna

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

హనుమంత రావు గార్కి,

ధన్యవాదాలు మీవ్యాఖ్యలకి. హెచ్చరికల వల్ల ఉపయోగం లేదు అని తేలిపోయింది కాబట్టి ఇంక కవిత్వం రాయకూడదని అనుకుంటున్నాను. థాంక్యూ.

అనానిమస్ గార్కి,

ధన్యవాదాలు మీ మేలుకొలుపు కి.ఇది వరకు ఒక మారు వ్రాసాను. మళ్ళీ వ్రాస్తున్నాను. జంధ్యాల గారు వ్రాసిన హాస్యంలో 10% వ్రాయగలిగినా ధన్యుణ్ణి అవుతాను, దానికి కూడా నా జీవిత కాలం సరిపోదేమో నని.
ఏ విషయంలోనైనా కూడా హాస్యం వెతుక్కోవడం నా అలవాటు. నాకు కనిపించిన హాస్యం మరికొందరికి కూడా కనిపించవచ్చు. కొందరికి కనిపించకపోవచ్చు.

అప్రస్థుతమైనా ఒక చిన్న ఉదాహరణ- నిన్న అద్దంలో చూసుకుంటుంటే నాకు నేనే ముద్దు వచ్చేసాను. చిన్నప్పటి NTR లా ఉన్నాను గదా అని మా ఆవిడతో అన్నాను. ఆవిడ భళ్ళున నవ్వింది.కిందపడి దొర్లి దొర్లి నవ్వింది. నాకు కాలింది. ఏంచేస్తాం perceptions differ.

Thank you for your comments.

Rakimo చెప్పారు...

<>
బ్లాగు కంటే పోస్టులు భలే ఉన్నాయి మాస్టారూ, ఏదో సామెత చెప్పినట్లు, మీరిచ్చిన ఉదాహరణ అదిరింది. హ్హ.......హ్హ.........హ్హ

హనుమంత రావు చెప్పారు...

సుబ్రహ్మణ్యంగారూ...సుబ్రహ్మణ్యంగారూ...అదేంటీ అలా అనేసారు.నా వ్రాత మీకు ఆ అభిప్రాయం ఎలా కలుగచేసింది? మీరు వ్రాయటంమానొద్దుగాక మానొద్దు...మీ చమత్కార రచనలు నలుగురినీ
నవ్విస్తున్నాయి. ఐదవ వారి సంగతి నాకు తెలియదు...నాక్కూడాఎవర్నైనా పలకరించేటప్పుడూ...ఏదైనా వ్రాసేటప్పుడూ...నవ్వుకోసం
వెదుక్కోవడం అలవాటు...ఓ సారి మా ఆపె "ఒక్కోప్పుడు వేస్తుంటే
బూరెలు చీదేస్తాయేమిటండీ" అంది.."పిండిలో విక్స్ కలిపి వెయ్యి" అన్నా.
తర్వాత స్కిట్టుగా వ్రాసి ప్రదర్శించాం కూడా...మీకు నవ్వు రాలేదా..
ఏం చేస్తాం...ఆరోజు విన్న మా ఆవిడా, ఆ తర్వాత స్కిట్ చూసిన
వారూకూడా మనసారా నవ్వారు. నిజం. అందుకేనండీ మా బులుసు సుబ్రహ్మణ్యంగారు చెప్పినట్టు...జనోఃభిన్న టేస్టః
మీరుమాత్రం వ్రాయడం మానొద్దు... వ్రాసి నలుగుర్నీ
నవ్వించక తప్పదు గాక తప్పదు.........దినవహి

ఆ.సౌమ్య చెప్పారు...

"నవ్వుల్లో రెండు రకాలు ఉన్నాయి ట. నవ్వడం, నవ్విపోవడం. మీరు రెండోది చేసేయండి.".....గురువుగారూ మీరు మాత్రం కేక అసలు....ఇరగదీస్తారు :D

అజ్ఞాత చెప్పారు...

ఆ నలుగురిలో నేనూ ఉన్నానండోయ్

Taara.

మనసు పలికే చెప్పారు...

>>ఆవిడ భళ్ళున నవ్వింది.కిందపడి దొర్లి దొర్లి నవ్వింది. నాకు కాలింది. ఏంచేస్తాం perceptions differ.
ఇది చదివి, ఆఫీసులో కింద పడి పడీ పడీ నవ్వితే బాగోదని ఊరుకున్నానండీ..:))) మీరు N.T.R. లా ఉన్నారో లేదో తెలియదు కానీ, మీ రచనలు వ్యాఖ్యలు చూస్తుంటే నాకు అల్లు రామలింగయ్య గారు గుర్తు వస్తున్నారు.. :))

మనసు పలికే చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

మీరు N.T.R. లా ఉన్నారో లేదో తెలియదు కానీ, మీ రచనలు వ్యాఖ్యలు చూస్తుంటే నాకు అల్లు రామలింగయ్య గారు గుర్తు వస్తున్నారు.. :))

---

Whats the link here? I can't get the logic here :-(

...
Taara

మనసు పలికే చెప్పారు...

తార గారూ... అల్లు రామలింగయ్య గారు తన హావభావాలతో ఎంతో చక్కటి హాస్యం పండించారు కదా.. అలాగే సుబ్రహ్మణ్యం గారి టపాలు కూడా ఎంతో చక్కటి హాస్యాన్ని పండిస్తున్నాయని..:)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

రాకిమో గార్కి,

ధన్యవాదాలు. మీరు కూడా అసలు కన్నా వడ్డీ ముద్దంటారా. సరే టపాలు మానేసి కామెంట్లు వ్రాసుకుందాము. థాంక్యూ.

హనుమంత రావు గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. కవితలు రాయడం మానేద్దామా అనుకున్నాను సార్, కానీ మిగతా రచనలు కాదు. మీరు చదువుతానంటే అల్లాగే రాద్దాము. హెచ్చరికలు తీసేద్దాం లెండి.థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

ఆ.సౌమ్య గార్కి,

ధన్యవాదాలు. ఏదో మీ అభిమానం, ప్రోత్సాహం వల్ల అల్లా వచ్చేస్తాయి అనుకుంటాను. థాంక్యూ.

తార గార్కి,
ధన్యవాదాలు. నా "ఆ నలుగురు" లో మీరు కూడా ఒకరు అన్నమాట. సరే కానివ్వండి. థాంక్యూ.

మనసు పలికే గార్కి,

నేను NTR లా ఉంటానని నేను చెప్పినా నమ్మరన్న మాట. అల్లు రామలింగయ్య గారికే మీ ఓటు అన్న మాట. ఇంకో మాట ఏదైనా చెప్పండి. పైకి వెళ్ళిపోయిన అ.రా అని మీరు అనగానే "ఆ నలుగురూ" అని పాడుతూ తార గారు వచ్చేస్తున్నారు. హా హతవిధీ. థాంక్యూ.

అజ్ఞాత చెప్పారు...

ఆరంభం బాగున్నది, ఆలోచన చాలా కొత్తగా అనిపించింది, కానీ అంతం ఐతే మరీ అంతగా నచ్చలేదు, ఆ కవిత కుడా కాస్త పలుచనైనట్టుగా ఉన్నది మరి.

అజ్ఞాత చెప్పారు...

కాన్సెప్ట్ "డింగ్ డాంగ్ డింగ్ " పాటలా వున్నది

అజ్ఞాత చెప్పారు...

పోనీలెండి .ఆ NTR తో సరిపెట్టేరు .ఇంకా నయంజూనియర్ NTR తో పోల్చుకున్నారు కాదు .అబ్బే మరేంలేదు మీకున్న fanfollowing ఎక్కడ పెరిగిపోతున్దోనని చిన్న కుళ్ళు .హంతే!

కొత్త పాళీ చెప్పారు...

గేయం కంటే ఉపోద్ఘాతాలు బాగున్ని .. ఎంతైనా ఘాతాలు కదా :)

మనసు పలికే చెప్పారు...

>>ఇంకో మాట ఏదైనా చెప్పండి. పైకి వెళ్ళిపోయిన అ.రా అని మీరు అనగానే "ఆ నలుగురూ" అని పాడుతూ తార గారు వచ్చేస్తున్నారు
అయ్యయ్యో సుబ్రహ్మణ్యం గారూ.. మీకు అలా అర్థం అయిందా..:( మీకు మీరే సాటి అండీ మిమ్మల్ని ఎవరితోనూ పోల్చలేము..:) పోస్టుల్లోనూ కామంట్లలోనూ నవ్వించి నవ్వించి మమ్మల్ని పైకి పంపించేట్లు ఉన్నారు..;)

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

తార గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. అవునండి, అంతం బాగా ఉండదని తెలుసు కాబట్టే ముందు కధనం కావాల్సి వచ్చింది.
ఇంతకీ అన్ని తారలు ఒకరేనా లేక వేరు వేరా కొంచెం confusing గా ఉంది.
తారలందరికి థాంక్యూ

మనసు పలికే గార్కి,
ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. రెండు గుండె ఎట్టాక్ లు , ఓ షుగరు కర్మాగారం , రోజుకి ఓ నాలుగు సిగరెట్టు పెట్టెలు, 67 ఏళ్ల వయసు వెనకాల ఉంటే , ఆనలుగురు అని ఎవరైనా అంటే మరేం గుర్తుకు రావాలండి. అదన్న మాట కధ. థాంక్యూ.

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

కొత్తపాళీ గార్కి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. నా కపిత్వం అంటే కాసిని ఘాతాలు ఉండాలి కదండి. థాంక్యూ .

ఇద్దరు అనానిమస్ గార్లకి,

ధన్యవాదాలు మీ వ్యాఖ్యలకి. నాకు ఫాన్ ఫాలోయింగా. మరీ అంత జోకులోద్దు సారు. థాంక్యూ.

అజ్ఞాత చెప్పారు...

>>అంతం బాగా ఉండదని తెలుసు కాబట్టే ముందు కధనం కావాల్సి వచ్చింది.

:-)

>>ఇంతకీ అన్ని తారలు ఒకరేనా

అన్ని రాతలు, అదే అదే తారలు నావే.

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

సామాన్యుడి ఆవేదన అందామా? నిజంగా బాగుందండీ 👏. మీలో చాలా టాలెంట్ ఉందండీ. కవిసమ్మేళనానికి అర్హులు మీరు, మాస్టారూ.

btw // " మాయమయ్యాయి మావీధిలో గాడిదలు" // అంటారా లేక ... ప్రత్యక్షమయ్యాయి మా వీధిలో గాడిదలు ... అంటే బాగుంటుందా? 😉

Lalitha చెప్పారు...

మీ ఇష్టమై మీర్రాసిన గేయం చేసిందో నవ్వుల తీపి గాయం - వహ్వా!

సూర్య చెప్పారు...

గేయమా.. వినిపించి గాయం చేస్తారనుకుంటే ఇక్కడేమిటి ఏమీ కాలేదు?
కొంపదీసి నా రసహృదయంలో రసం ఇంకిపోలేదు కదా?!

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ........ ధన్యవాదాలు. ఆవేదన అనడం కన్నా తిక్క అనడమే సబబు. నాలో ప్రతిభ గుర్తించిన మొదటి వారు మీరే. మరొకమారు ధన్యవాదాలు. అన్నట్టు గాడిదలు కూడా వినలేని సంగీతం అని కవి హృదయం. .......మహా

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

లలిత గారికి. ...... ధన్యవాదాలు. మనకి ఇష్టమైనది ఇతరులకు కూడా ఇష్టమవ్వాలి కదా. ......... మహా

సూర్య గారికి. ......... ధన్యవాదాలు. మీ మనసు దృఢమైనది, అచంచలమైనది అని అర్ధం అయింది. రసం ఎప్పుడూ ఊరుతూనే ఉంటుంది. సందేహం వద్దు. ............ మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “... గాడిదలు కూడా వినలేని సంగీతం అని కవి హృదయం. “ //

😁😁😁
టీవీ షోలల్లో పాటలు పాడేవారు తమ చెవి తామే మూసుకుని పాడినట్లా ??😁😁

బులుసు సుబ్రహ్మణ్యం చెప్పారు...

విన్నకోట నరసింహా రావు గారికి. ......... ధన్యవాదాలు. వారు చెవి మూసుకోగానే, విషయం అర్ధం అయి మనం టివి కట్టేస్తాం కదా............ మహా

విన్నకోట నరసింహా రావు చెప్పారు...

// “ .... మనం టివి కట్టేస్తాం కదా .... “ //

👌 అ.హా. 😁

rudraveni చెప్పారు...

nice post.. Keep it up. We have an excellent information in cinema industry. We are showing updated news that are very trendy in the film industry. For further information, please once go through our site.
latest tollywood news and gossips