కొంతమందికి ఊత పదాలుంటాయి. కాని మాఆవిడకి ఊతవాక్యాలే ఉన్నాయి. నో పదమ్సు, ఓన్లీ వాక్యమ్స్ అన్నమాట.
మాపెళ్ళైన మరుసటి రోజు మనుగుడుపులు, మిగతా కార్యక్రమం నిమిత్తం మాఆవిడ, ఆమె బంధువులు నలుగురైదురుగురు మాఇంటికి విచ్చేసారు, రాత్రి సుమారు పది గంటలకి. భోజనాలు చేసి వెంటనే పడకలు వేసేసారు. మాఆవిడతో మాట్లాడదామని ప్రయత్నించాను కాని కుదరలేదు. నాజాతకం అల్లాంటిది లెండి. నో పెళ్ళిచూపులు. మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. పెళ్ళికి ముందు మాఆవిడ నాఫొటో చూసింది కాని నాకు ఆభాగ్యం కూడా కలుగలేదు.
పెళ్ళికి సరిగ్గా పన్నెండు రోజుల ముందు మా పితాశ్రీ గారు నాకు ఓ టెలిగ్రాము పంపారు. మారేజి ఫిక్స్డ్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ. అని. ఆటెలిగ్రాము పట్టుకొని మాబాసుగారి దగ్గరకెళ్ళి చూపించాను. శలవా కుదరదు అన్నాడు. ఇప్పటికే నువ్వు రెండు మాట్లు పెళ్ళి అని శలవు పెట్టావు అని కోప్పడ్డాడు. ఒక్కమాటే సారూ, మాఅన్నయ్య పెళ్ళికి అదీ రెండేళ్ళ క్రితం అని అన్నాను. సరే ఓ వారం తీసుకో అన్నాడు. ఆయనతోటి బేరమాడి ఎల్లాగైతేనేం, 15రోజులకి ఒప్పించాను. జోర్హాట్ నించి రావడానికి, పోవడానికి ఓవారం తీసేస్తే మిగిలేది ఓవారం అన్నమాట. .ఆవిషయం మానాన్నగార్కి కూడా తెలియపర్చాను. అందువల్ల కార్యక్రమాలన్నీ వెంటవెంటనే ఏర్పాటు చేసేరన్నమాట.
సరే అసలు కధలోకి వస్తే, తెల్లవారి నేను డాబామీద నించి కిందకి వచ్చేటప్పటికి, ఇల్లంతా హడావడిగా ఉంది. ఇంట్లోవాళ్ళంతా నన్నుజాలిగా చూసారు. మాబావ “పాపం పసివాడు” అని నవ్వాడు. నాకు అర్ధంకాలేదు. సిగరెట్టు కాల్చుకోడానికి వీధిలోకి వచ్చాను. అప్పుడు చూసాను ఓచెంబు, రెండుగ్లాసులు, ఓచాప పెట్టుకొని మాఆవిడ వీధి అరుగు మీద కూర్చుంది. పక్కనే కొంచెం దూరంగా కుర్చీలో వారిఅక్కగారు ఆసీనులయ్యారు.
అప్పుడు అర్దం అయింది నాకు. ఔరా అనుకున్నాను, కోపం వచ్చింది, దుఃఖం వచ్చింది. ఏంచెయ్యాలో తోచలేదు. అప్పుడు మాఅవిడతో అన్నాను. కొంచెం జాగ్రత్త పడవచ్చు గదా అని. వారి అక్కగారు కిసుక్కున నవ్వేరు. మాఆవిడ అక్కకేసి చూసింది, ఆకాశంకేసి చూసింది, మాఇంటి ఎదురుగా ఉన్న చెరువు కేసి చూసి, నాకేసి చూసి అంది “ మీ మొహం, మీకేం తెలుసండి” అని. ఇవి మాఆవిడ నాతో మాట్లాడిన మొదటి మాటలు, ప్రేమ సంభాషణ, తొలి పలుకులు, లవ్ నతింగ్స్, మొహబ్బతికి బాతేం. మొదటిసారి పతిదేవుడితో సతీపతివ్రత మాట్లాడిన వాక్యం విన్నప్పుడే అనుకున్నాను మదీయ కొంప కొల్లేరు అవుతుందని.
మళ్ళీ రెండునెలల దాకా ముహూర్తాలు లేవురా, మళ్ళీ రావల్సిందే అని మానాన్నగారు నిర్ణయం చెప్పేసారు. మాబావ “పాపం వీడి పునస్సంధాన ముహూర్తం లస్కుటపా అయింది” అని జాలిపడ్డాడు.
మళ్ళీ మాబాసుగారిని బతిమాలి, ప్రాధేయపడి ఆర్నెల్లతర్వాత 15రోజులు శలవు తీసుకొని, వచ్చి కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని, హనీమూన్ రైల్లోనే కానిచ్చేసి, కాపురానికి జోర్హాట్ తీసుకొచ్చేసాను.
మర్నాడు మాఆవిడ వంట మొదలు పెట్టింది. పొద్దున్నే ఉప్మా చేయడానికి ఉపక్రమించింది. నేను ఆఫీసు కి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చున్నాను ఉప్మాకోసం. మాఆవిడ వంటింట్లోంచి వచ్చి కరివేపాకు తీసుకురాలేదా అంది. నువ్వు రాసిన లిస్టులో సామాన్లన్నీ తీసుకొచ్చాను. నువ్వుకరివేపాకు రాసిఉండవు నేను తీసుకు రాలేదు అన్నాను. పెళ్ళానికి మల్లెపూవులు తీసుకురావాలని, కూరల్లోకి కరివేపాకు తీసుకురావాలని కూడా చెప్పాలటండి అంది. నాకూ గుర్తు లేదు అంటూ నేను రాజీకి వచ్చేసాను. మాఆవిడ నాకేసి చూసింది, బెడ్ రూములో వాళ్ళ గ్రూపుఫొటొకేసి చూసింది, (జొర్హాట్ వచ్చిన రోజునే బెడ్ రూములో మేకుకొట్టి వాళ్ళ ఫొటొ ఒకటి తగిల్చేసింది.) వంటింట్లో గూట్లో కూర్చున్న రమాసహిత వెంకటేశ్వరస్వామిని చూసింది, ఆకాశంలోకి చూసింది. చూసి “ఇల్లాంటి వారిని కట్టపెట్టే వేమిరా దేవుడా” అని విచారంగా అంది. ఇది నాకు అనుభవంలోకి వచ్చిన రెండో ఊతవాక్యం. గమనించారో లేదో మీరు, మాఆవిడ దేవుడిని కూడా ఏకవచనంలో సంభోదించిది, పైగా రా అనికూడా అంది, నన్నుమటుకు ‘వారి’ అనే అంది. పతివ్రతా లక్షణాలు లేకపోలేదు అనుకొని సంతోషించాను (ఇంతటి అల్ప సంతోషివి కాబట్టే అది నిన్ను అల్లా ఆడించేస్తోందిరా అని మావాళ్ళు అంటారు). సరే కరివేపాకు రహిత ఉప్మానే సేవించి నేను ఆఫీసు కెళ్ళి పోయాను.
ఆఫీసు కెళ్ళాక ఒక సందేహం వచ్చింది. ఊతవాక్యాలు అనేటప్పుడు మాఆవిడ దిక్కులు, వాళ్ళకేసి, వీళ్ళకేసి ఎందుకు చూస్తుందీ అని. ధైర్యంచేసి మాఆవిడను అడిగేసాను. సినీమాలు చూడరా అంది. నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడు కాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది. ఐ సీ అనుకున్నాను. నేను నాగేశ్వరావు వీరాభిమానిని అని కూడా చెప్పింది. నాగేశ్వరరావుకి ప్రేమలేఖ కూడా వ్రాసిందిట. ఆయన కాకపోతే ఎవడైతే ఏంటి అని నన్ను పెళ్ళి చేసుకునేందుకి ఒప్పుకుందిట.
ఓరోజున నేను ఆఫీసు నించి వచ్చేటప్పటికి చాలా సీరియస్ గా ఉంది మాఆవిడ. మద్యాహ్నం వాళ్ళ అమ్మ గారింటి నించి ఉత్తరం వచ్చింది. ఏంటి సంగతులు అని అడిగాను. “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” అంది. మాపెళ్ళి సంబందం కుదిరేముందు, ఇంకోఆయన ఈవిడని చూడ్డానికి వచ్చాడుట. హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్నాడట, ఐదారు వందలు తెచ్చుకుంటున్నాడట. నిశ్చయం చేసుకుందా మనుకుంటున్న సమయంలో మా సంబంధం తెలియడం జరిగిందిట. అప్పటికే నేను నాలుగు అంకెల జీతం తీసుకుంటున్నానని నన్ను పెళ్ళి చేసుకుందిట. ఇప్పుడు ఆ శేఖరంగారు సివిల్స్ కి సెలక్టు అయ్యాడట. రేపో మాపో IAS ట్రైనింగు కు వెడుతున్నాడట. ఏంచేస్తాం “చేసుకున్నవాళ్ళకి చేసుకున్నంత మహాదేవా” నాఖర్మ ఇలాగయింది అని అంది.
ఈ ఊతవాక్యాలు రోజుకి కనీసం ఒకటి రెండు మాట్లైనా అనకపోతే ఆవిడకు తోచదు. ఇవికాక ఇంకా కొన్ని ఉన్నాయి. కాని వీటంతటి తరుచుగా ఉపయోగించదు. భరించువాడు భర్త అంటారు. కాబట్టి ఆవిడ ఏమన్నా భరించక తప్పుతుందా.
గమనిక :- మొదటి మాటు ఈ టపా ఈ బ్లాగులో 24/08/2010 లో ప్రచురితమైనది. ప్రభావతి, ప్రద్యుమ్నుల కధలు వ్రాయడానికి ఈ టపా నాంది. స్ఫూర్తి అన్నా ఫరవాలేదు అనుకుంటాను.
ఆకాలంలో మా కాలనీని నానా రాష్ట్ర సమతి అని పిలుచుకునే వాళ్ళం. సుమారు పది పన్నెండు రాష్రాల వాళ్ళు ఉండేవారు. అక్కడ RRL మొదలు పెట్టి నేను జేరేటప్పటికి రెండు మూడు ఏళ్లు మాత్రమే అయింది. మొత్తం ఉద్యోగులు వంద మంది కంటే తక్కువే అనుకుంటాను. కాలనీ లో ఒక నలభై కుటుంబాలు, పదిమంది ఒంటరి పక్షులు ఉండేవారు. వీరిలో అత్యధికులు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. వాతావరణం చాలా స్నేహ పూర్వకం గా ఉండేది. అంతా చాలా కలసి కట్టుగా, అరమరికలు లేకుండా ఉండేవాళ్ళం. రాజకీయాలు అసలు ఆఫీసు గేటు దాటి కాలనీ లోకి వచ్చేవి కావు.ఆఫీసులో కూడా రాజకీయాలు చాలా తక్కువ.
ముఖ్యంగా రహస్యాలు చాలా తక్కువ. ఎవరింట్లో ఏం జరిగినా కాలనీ అంతా తెలిసిపోయేది. అప్పుడు కాలనీ లో జరిగిన సంఘటనల ఆధారంగా ప్రభావతి ప్రద్యుమ్నుల కధలు వ్రాయడం జరిగింది. సరదాగా ఉండే వాటినే వ్రాశాను. అందులో కూడా హాస్యం కోసం కొంత (ఎక్కువుగానే) కల్పన జోడించాను.
46 కామెంట్లు:
Hello andi,
Nenu poornima nu. Chala bagunnai mi avida muchatlu. so nice.
Good going...
Bye
gud one.......
మరే చేసుకున్నవారికి చేసుకున్నంత
:)
పూర్ణిమ గార్కి,
మీ కామెంటు కి ధన్యవాదాలు. సరదాగా కాలక్షేపానికి రాస్తున్న కధలు మీకు నచ్చినందుకు థాంక్స్.
వినయ్ చక్రవర్తి గార్కి,
కృతజ్ఞతలు మీకామెంటు కి.
Anonymous గార్కి,
అంతే సారూ, ఎవరికి ఎంత ప్రాప్తమో అంతే గదా మరి.మీ వాఖ్యలకు ధన్యవాదాలు.
కృష్ణప్రియ గార్కి,
హహ్హహా, థాంక్యూ మీ చిరునవ్వుకి.
ఇంతకీ మీ బ్లాగుని ఆవిడ చూస్తారా?
ఆ.సౌమ్య గార్కి,
ఆవిడ అంటే ఏవిడ? మా ఇంట్లో అప్పడాల కఱ్ఱలు నిండు కున్నాయి. మీరేమైనా పంపిస్తే అప్పుడు చెప్తాను ఆవిడకి నాబ్లాగు గురించి. మీ Ph.D కష్టాల కన్నా ఎక్కువే నా కష్టాలు. మళ్ళీ ’నా గురించి’ మార్చేసాను. చూసారా. థాంక్యూ.
"ఆవిడ" అంటే ఘృతాచి అనుకుని క్షణకాలం సంతోషపడిపోయారేం....అన్ని ఆశలొద్దు :)
అయినా ఈ పోస్ట్ చదివాక అప్పడాలకర్రేం పనికి వస్తుందండీ, ఏ రోకలో, పొత్రమో, గూటమో కావాలిగానీ.
అబ్బా నా PhD కష్టాలతోనే పోల్చారూ సరిపోయింది......అయితే భార్యావిధేయత చివరికి సంతోషాన్నే మిగిల్చిందన్నమాట...భేషో!...ఈనాటి కుర్రకారుచేత ఈ సూక్తిని భట్టీయం వేయించాలని నా కోరిక
ఒహో "మీ గురించి" మార్చేసారా!
హహహ ఏ ఎండకాగొడుగులాగ "ఏ టపాకాముందుమాట" అని చెప్పుకోవాలేమో ఇప్పుడు :)
ఇది నేను అజ్ఞాత రూపంగా పెడుతున్నాను. కాబట్టి తవికలు, కేసులు వేసుకున్నా నాకేమీ సంభంధం లేదు
సేమియాని నేపాలీ లో ఏమంటారో తెలియదు కానీ, బెంగాలీ లోనూ, అస్సామీ లోనూ sewai అనే అంటారనుకుంటాను
అని నాకు ఎవరూ చెప్పలేదు..
ఒక అజ్ఞాత
సుబ్రహ్మణ్యంగారు:
మీ బ్లాగులన్నీ ఇప్పుడే చదివానండీ; నాకు చాలా బాగా నచ్చాయి. కొన్ని ఉదంతాలు నా తల్లిదండ్రులమధ్య జరిగినవి గుర్తు చేసాయి.
- మిమ్మల్ని పేరుతో పలకరించినందుకు మెచ్చుకోకపోయిన (మీ పాత పోస్ట్ ప్రకారం) క్షమిస్తారనుకుంటున్నానండీ.
adirindi!
సౌమ్య గార్కి,
అన్యాయం, నన్ను ఘృతాచి దగ్గరకు పంపడానికి మీరు తొందర పడుతున్నారా?
ఇప్పుడు నాకు X-Ray ఖర్చులు తగ్గిపోయాయి. డాక్టరు దగ్గరికి జిరాక్స్ లే తీసుకెళ్ళుతున్నాను.
మాఆవిడకు కొత్త ఐడియాలు ఇవ్వకండి. రోకళ్ళు, పొత్రాలు అంటూ.
థాంక్యూ మీ కామెంట్లకి.
తార గార్కి,
మాఇంటికి సాయిబాబా వచ్చాడని మెయిలు వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. కుట్ర జరుగు తోందని.సేమియాను ఏమందురు అని ఇంకో మెయిలు వచ్చినపుడు డౌటు కన్ఫర్ము అయింది.ఇది ఇప్పుడు సి.బి.ఐ కో ఎఫ్.బి.ఐ కో ఇవ్వాల్సిందే, అజ్ఞాత ఎవరో తెలుసుకోవడానికి.
థాంక్యూ ఫర్ మీ కామెంటు కమ్ స్టేట్మెంటుకి.
జె.బి గార్కి,
మీ కామెంట్స్ కి ధన్యవాదాలు.నా పేరు బాగానే వ్రాసారు, మరి పలకడంలో ఏంచేస్తారో చూడాలి. అయినా ఎవరు ఎల్లా పిలిచినా పలికేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను.నా రచనలు మీకు నచ్చినందుకు థాంక్స్.
మాధురి గార్కి,
మీ వ్యాఖ్యలకి కృతజ్ఞతలు.థాంక్యూ.
Hello Subrahmanyam garu .....
nice narration andi chala bagundi
రఘుపతి రాజు గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యదాలు.థాంక్యూ.
చాలా బాగుందండీ మీ బ్లాగు మరియు అందులొని టపాలు.
'స్వచ్చమైన తెలుగు ' లోకం లో విహరిస్తున్నట్లు ఉంది.
శ్రీకాంత్ గార్కి,
మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.
Brillaint.
ఎవరో పేరుమోసిన కథకునిదే ఒక కథ ఉంది, ఈ మధ్యనే చదివాను. కథకుని పేరు గుర్తు రావట్లేదు. అందులోకూడా ఇలాగే తప్పిపోయిన పెళ్ళికొడుకు IAS ఐ మళ్ళి తారసపడతాడు.
Anyway, that's neither here, nor there. Your narration is in a calss by itself.
మీరు ఉద్యోగంలో ఉన్నప్పటి ముచ్చట్లు వ్రాశారు. రిటైరయినతరువాత పరిస్థితి ఎలా ఉందో వ్రాయండి !
హరేఫాలా గార్కి,
ధన్యవాదాలు. పెళ్ళైన తర్వాత ఆడువారికి జ్ఞానం పెరుగును, మగవారికి తరుగును అని ఓ సన్యాసి నాకు చెప్పాడు. కాబట్టి రిటైరయిన తరవాత కధలుండవు, వెతలు తప్ప. థాంక్యూ.
కొత్తపాళీ గార్కి,
ఈ సబ్జెక్ట్ మీద నేను ఒక నవలే చదివాను, 70 లలో.అప్పుడు బోల్డు నవలలు రాసేవారు రచయిత్రులు. గుర్తులేదు. ఆ తర్వాత నేను చదవడం కూడా తగ్గిపోయింది. ఇది చాలా కామన్ సబ్జెక్ట్ అనుకుంటాను. థాంక్యూ.
maastaru..dont add garu at end.....plz...........
అయ్యబాబోయ్ పెళ్ళి చేసుకుంటే ఇన్ని కష్టాలు ఉంటాయా? నేనేమో గారలు తినడం అనుకున్నాను......
మీరు ఫన్నీగా రాయాలని ఎంత ప్రయత్నించినా లోలోపల దాగున్న బాధంతా కనబడుతోంది పదాల్లో :)
Ultimate...
నాగేశ్వరరావు ఏంచేస్తాడు? గుమ్మడికేసి చూస్తాడు, సావిత్రికేసి చూస్తాడు, కిటికీలోంచి శూన్యంలోకి చూస్తాడు. ఆతర్వాత వాళ్ళు కూడా ఈయనకేసి చూస్తారు. అప్పుడుకాని బరువైన డైలాగు వదలడన్నమాట అంది.
// “ మారేజి లుక్స్ పెళ్ళిలో తెరతీసిన తర్వాతే నన్నమాట. ” //
హ్హ హ్హ, మా నాన్నగారికి పెళ్ళి కుదరడం ఉదంతం గుర్తుకొచ్చింది 🙂. తన ఆటోబయోగ్రఫీలో వారు వ్రాసుకున్న మాటల్లోనే చదవండి 👇:-
——————
“మా అన్నయ్య వచ్చి ఇట్లా సంబంధం స్థిరపరిచాము అని చెప్పినప్పుడు “అదేమిటి? పిల్లను చూడవద్దా” అని నేను అన్నాను. దానిమీద మా అన్నయ్య “నీ మొహం నీవు చూచేదేమిటి? అంత పెద్దమనిషి, మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి వచ్చి పిల్లనిస్తామంటే ఇంకేమీ అడగక్కరలేదు. అంచేత ఒప్పుకున్నాము” అని అన్నాడు. ఆ రోజుల్లో అట్లా ఉండేవి సంబంధాలు స్థిరపరచుకోవటం.”
——————
మీ తండ్రిగారు కూడా మా పెదనాన్నగారి తరహాయే అయ్యుండాలి బహుశః ?🙂
విన్నకోట నరసింహా రావు గారికి. .......... ధన్యవాదాలు. అబ్బే అప్పటి పరిస్థితులు అల్లా వచ్చాయి అంతే. .......మహా
మీ సతిమణి గారి ముచ్చట్లు బహు చక్కగా తెలిపారు సుబ్రమణ్యాచార్య.. నా ధర్మపత్ని గురించి చెప్పాలంటే నాకే ముచమటలు పడతాయి.. ఎపుడైనా పక్షానికోమారు గొడవ పెట్టుకోకుండా ఉండలేదు. తప్పు తనవైపున్నా నా వైపు ఉన్నట్లే బనాయిస్తు ఉంటుంది. తప్పు నావైపుంటేనా ఇక అంతే సంగతులు.. నెల ఖర్చులకని ఓ ఐదువేలు తన చేతికి మూటగడితే వారం రోజులకు మించి డబ్బు ఉంచుకోదు.. ఏమైనా అంటే ఆడవాళ్ళ షాపింగ్ ఖర్చులు మీకేమి తెలుస్తాయండని మొట్టికాయోకటి.. అది నా పైనే.. పండగకు, పబ్బానికి బట్టలు మనమే స్పాంసర్..నా మామగారు మరీ చాదస్తం.. పండక్కి రమ్మంటారు.. నా డబ్బులతో సరకులు కొని నాకే పెడ్తారు.. ఏమైనా అంటే.. ఏం మా నాన్నగారికి పెట్టలేవా అంటు మరో మొట్టికాయ.. రీచార్జ్ మనదే.. గంటల తరబడి వాగుడు తన స్నేహితురాండ్ల గణంతో.. ఇదేమిటే అంటే.. నా దగ్గర నీ దగ్గరున్నంత డబ్బు ఉంటే నిన్ను చేసుకునే దానినే కానంటు చురక.. మరోలా ఐతే.. మీకే డబ్బుందని కదా అలా మాటాడుతారు అంటది. అత్తారింటిలో సంవత్సరానికి మూడు నెలలు మాత్రమే ఉండే ఘనత మాయావిడకే చెల్లింది. పైగా వారి అమ్మ వారిది పక్కా పల్లేటూరు. మొన్న చిట్టితల్లితో పాటు నాలుగు నెలలు అక్కడే తిష్ఠ.. దాని పరిణామం.. మాయావిడకి డెలిరియం.. నా చిట్టితల్లికి సెప్టిసేమియా.. ఆసుపత్రిలో ఓ పక్షం రోజులు నేనే దగ్గరుండి చికిత్స చేయిస్తే కోలుకున్నారు ఇద్దరు. తన మాటే చెల్లాలి.. అంటారు చూడండి చింత చచ్చినా పులుపు చావదని.. పెళ్ళి చేసుకునే ముందు తన కూతురి పేరిట పది లక్షలు ఇస్తానని చెప్పి తీరా మూడు లక్షల నగదు.. చుట్టాల చదివింపుల్లో పనికిరాని సామాన్లు అరవై వేలవట (డొక్కు డిసర్ట్ కూలర్ మోటర్ కాలిపోయి మూలాన ఉంది, సొట్టు బీరువా.. తెలియకుండా తాళం వేసేస్తే జంగు పట్టి ఈ రోజు వరకు తెరవ లేకుండా ఉంది.. మిక్సి.. బానే దంచుద్ది కాని గంట దంచితే మూడు గంటలు రెస్ట్ ఇవ్వాలి.. స్టీలు సామాన్లు.. పనికొచ్చే ప్లేట్లు, స్పూన్లు, బౌల్స్ మినహాయించి తక్కిన సామగ్రి అంతా ఏ వనభోజనానికో పనికొచ్చే గంగాళం, పేద్ద తపేలా, ఇత్తడి చెంబు, పెద్ద రాతివెండి గరిటెలు.. మంచం.. నేను మాయావిడ పడుకుంటే నాలుగులో మూడు వంతులు మాత్రమే పట్టేలా సింగిల్ కాట్ మంచం.. పరుపు నేనే కొన్నా.. ఇహ ఇప్పటి దాక తక్కిన సొమ్ము మాయావిడ పేరిట జమ చేసిన దాఖలాలు లేనే లేవు.. నా ఏడిదిన్నర వయసు గల కూతురి పేరిట ఐదు లక్షల చిన్న మొత్తాల పొదుపు తెరిచి ఏడాది. ఇలా చెప్పుకుంటు పోతే చాలానే ఉంది.. కాని ఎంత నెప్పినైనా పంటికింద భరిస్తు.. భరించే వాడే భర్త అనే నానుడికి ఉదాహరణగా మెలుగుతున్నాను. ఇదంతా చూసి ఆశ్చర్యంతో కూడిన అయోమయం అనిపించినా నన్ను నేనే సముదాయించుకుని సంసార సాగరాన్ని ఈదుతున్నాను.
~శ్రీత ధరణి
ఒక యువసంసారి విలాపం 🙂.
అవునూ శ్రీధరా, ఇటువంటి వ్యధల గురించీ వ్రాయడానికి ఆవిడ అనుమతి తీసుకున్నారా మీరు? 🤔🙂
వియన్నారాచార్య.. విలాపం ఐతే కాదు.. కాని ఇటువంటి బాటల్ నెక్స్ లేని సంసారాలు లేకపోతే మజా ఉండదుగా.. పైపెచ్చు నా ధర్మపత్ని అనుమతి అక్కర లేదండి.. తాను మనిషి మంచిదే.. కాకపోతే ముక్కోపి అంతే.. ఈ ఫేస్ ప్రతి మనిషికి సహజమే.. లేకుంటే చప్ప సంకటి ఐతది సంసారం.. ఒప్పుకున్నా ఒప్పకున్నా నూటికి డెబ్బై శాతం ఇది నిజమే..! ఒక జీవితమే కదా తనది నాది.. రెండున్నర ఏళ్ళే అయ్యిందిగా.. ఇంక చాలానే ఉన్నాయి ఏళ్ళు. అంతా మన మంచికే అని సాగిపోవటమే .. నావ బాగోలేనప్పుడు నడి సంద్రం లో అమాంతం దూకేయలేము కదాచార్య.. ఏ ఎమ్ సీల్ వంటి ఎపాక్సితో సరిచేసుకుని సాగిపోవటమే.. ఇదీ అంతే..
శ్రీధరా,
// “ నడి సంద్రం లో అమాంతం దూకేయలేము కదా “ //
————-
దూకమని నేనలేదే?
అరేరే.. మీకు అలా అర్దమయ్యిందా.. మరి ఎమ్ సీల్ మాటేమిటి ఆచార్య?
శ్రీధర్ గారికి. ...... ధన్యవాదాలు. మా గురువు గారు ఒక ప్రవచనం చెప్పారు నాకు. "పెళ్ళైన ఒక నాల్గైదు ఏళ్ళ దాకా భార్యాభర్తల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఆ తరువాత మగాడు పూర్తిగా సరెండర్ అయ్యి ఇట్లు నీ పాదదాసుడు అనిపించుకోవడమో లేక నా మొగుడు కర్కోటకుడు అనిపించుకోవడమో జరుగుతుంది. మరో మార్గం లేదు. ఈ రెంటి మధ్య జీవితం కత్తిమీద సాము లాంటిది.ప్రతీ దినము ఒక గండము గానే ఉండే అవకాశాలు ఎక్కువ."
మా ఇంట్లో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది. అంతా మిధ్య అనే వేదాంతం వంటబట్టింది. అదీ సంగతి......... మహా
విన్నకోట నరసింహా రావు గారికి. ....... ధన్యవాదాలు. ఆవిడ అనుమతి తీసుకున్నారా? అని ప్రశ్నిస్తున్నారు మీరు. మీదే మార్గం స్వామీ? ........... మహా
సుబ్రహ్మణ్యం సర్,
మీ ఇంట్లో ఆధిపత్య పోరు ఇంకా కొనసాగుతూనే ఉంది అంటున్నారంటే .... మీ పోరాటపటిమ కు 👏👏 🙂.
సుబ్రహ్మణ్యం గారూ, నాకు అనుమతి అవసరం పడదండీ.
ఇల్లు నడపడం లాంటి చిన్న చిన్న విషయాలన్నీ ఆవిడ చూసుకుంటుంది. పెద్ద విషయాలు ... అంటే ట్రంప్ కు ఓటు వెయ్యాలా వద్దా, మెక్సికో సరిహద్దు దగ్గర గోడ కట్టడం, బ్రిటన్ బ్రెక్సిట్, పాకిస్థాన్ యుద్ధానికి దిగుతుందా, ఏపి కు ఒక రాజధానా మూడు రాజధానులా, రాష్ట్రాల మధ్య నదీజలాల పంపకం, అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ఎప్పుడు మొదలవ్వాలి, కరోనా కు మందు ... ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల గురించి నేను ఆలోచిస్తూ పరిష్కారాలు వెదుకుతుంటాను 😎. ఇక ఆవిడకు నా అనుమతి గానీ, నాకు ఆవిడ అనుమతి గానీ అవసరమే లేదు కదా 🙂.
మహాశయ.. మంచి విషయం తెలియజేశారు.. మీరన్నట్లు నాలుగైదేళ్ళ పాటు పోరు అన్నారు.. ఆ లెక్కన చూసుకున్నా మా విషయంలో ఇంకో నాలుగున్నర ఏళ్ళ వరకు ఇది షరామామూలే అనుకోవాలి.. అంత వరకు.. "వినవే బర్రె పిల్ల నేనేనా ఎడ్డిగొల్లా" అని పాడుకుంటూ.. ఈదుతు సాగిపోవాలి.
భలే సమట్ఖాఱి వియ్యనారాషార్యవర్య.. ఔ ఔ మల్ల.. గసొంటి వాటికి పర్మిషన్ దొరక బట్టరాది కందా.. అట్నే అందురు జజ్జనక జనాలు..
గొరటి వెంకన్న గారు, వరవరరావు గారు, గద్దర్ గారు.. మీ నైజాము సర్కరోడా నుండి ఓహో జంబియా ఒలంపెల్లి జంబియ.. నాతోని మాటాడు నామ్పెల్లి జంబియ దాక
“సుడిలో దూకి ఎదురీదక ... మునకే సుఖమనుకోవోయ్” 🤘
విన్నకోట నరసింహారావు గారికి. .......... ధన్యవాదాలు. మునిగితే మిగిలేది ఏమిటి? సమ ఉజ్జీల పోరు రసవత్తరంగా ఉంటుంది. మనకి సరదా . పక్కింటి వాళ్లకి వినోదం. ......... మహా
“పక్కింటి వాళ్ళకి వినోదం” అన్నది మాత్రం నిజమే సుమండీ 😁😁.
ఎంత ఆలుమగలమైతే సమ ఉజ్జిలం కాదు లెండి సుబ్రమణ్యమాచార్యవర్య.. తనకు నాకు షుమారు పదేళ్ళ నిడివి.. కాని సంసార పుట్టి మునగటానికి ఈ చిన్నపాటి వ్యత్యాసాలే కాదు అపుడపుడు భేదాభిప్రాయలు వచ్చినపుడు సర్దుకుపోయే తత్వాలు తెలిసుండాలి ఎవరికైనని.. అపుడే అలల తాకిళ్ళు ఎన్ని ఉన్నా తటస్థంగా సంసార నావ సాగుతూ ఉంటుంది.. "లాహిరి లాహిరి లాహిరి లో.. ఓహో జగమే మునిగేనుగా తేలేనుగా.. ఆ...!!" ....మున
అందులోను మాయావిడ "నది దాటినాక తెప్ప తగరేసె" రకం. ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా వియన్నారాచార్య. అలాగని నాకు మంచి భార్య దొరకలేదని కాదు. చాలా మంచి భార్యయే కాకపోతే అంతటి పరిపక్వత, నా-మన అనే విచక్షణరాహిత్యం అంతే.. కాకరకాయ చేదని తినకుండా ఉంటామ.. అందులోను పుష్కలంగా పోషకాలు ఉంటాయి.. మహా ఐతే చేదయ్యింది అంతెగా.. మన దగ్గర ఉన్న చింతపండు వగైరా దినుసులతో రుచికరమైన గుత్తి కాకరకాయ లేద కాకరకాయ చిప్స్ చేసుకుని ఆరోగ్యం కాపాడుకోవట్లేదా. ఇదీను అంతే.. ఈ తెప్ప తగలేయటాలు భిన్నాభిప్రాయాలు, అలకలు అన్ని ప్రెసిపిటేట్ అవ్వటానికి కటలిస్ట్ టైమ్ ఫ్యాక్టర్, పేషన్స్, పర్సీవియరెన్స్ మాత్రమే.. కాదనగలరా.. మీ మీ పెళ్ళి జరిగిన నాటి నుండి ఆలుమగల నడుమ చిన్న చితక భేదాభిప్రాయాలు ఉండేవని మీకూ తెలుసు.. అవి సద్దు మణిగి నపుడు మీరు సైతం గుండెలపై చెయ్యేసుకుని హమ్మయ్య అనుకున్న రోజులు ఉండి ఉంటాయి.. షరా మామూలే..!
శ్రీధర్ గారికి. ........ ధన్యవాదాలు. వివాహ బంధంలో కోప తాపాలు,అభిప్రాయ బేధాలు, మాట పట్టింపులు, మౌన వ్రతాలు చాలా సహజం. మీరన్నట్టు సర్దుకు పోవడం చాలా కీలకం సహజీవన సౌభాగ్యానికి. ఒకరికొకరు, ఇరువురూ సమానమే అనుకున్నప్పుడు జీవితం సాఫీగా సాగిపోతుంది. .......... మహా
నిజంగా నిజం సుబ్రమణ్యమాచార్య. ధన్యవాదాలు మీకు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి